అధికారం ఉంటే ఎవరైనా మాట వింటారు. నీ అంతటి వాడు లేడంటు భజన చేస్తారు. పదవులు కోసం, కాంట్రాక్టులు కోసం అధినేత దగ్గర లాబియింగ్ చేస్తారు. ఒక్కసారి అధికారం పొతే మాత్రం, అసలు రంగులు బయట పడతాయి. ఇది కేవలం నాయకులతోనే వచ్చిన సమస్య. కార్యకర్త మాత్రం, ఎప్పుడూ పార్టీకి నాయకుడికి విధేయుడిగానే ఉంటారు. ఇలాంటి ఫేజ్ నే ఇప్పుడు చంద్రబాబు ఎదుర్కుంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు కాకినాడలో పర్యటిస్తున్నారు. మొన్నటి వరకు ఉభయగోదావరి జిల్లాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నాయి. అయితే మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఫలితాలు తారుమారు అయ్యాయి. ఇక అధికారం పొతే ఏముంది, నాయకుల అసలు స్వరూపాలు బయట పడతాయి. ఇలాంటి సమయంలో కలిసికట్టుగా, నాయకుడిగా అండగా ఉండి, పార్టీని నిలబెట్టాల్సిన నేతలు డాన్స్ లు వేస్తున్నారు.

cbn 05092019 1

దీంతో జిల్లాలో టిడిపి పార్టీలో నాయకుల మధ్య ముసలం మొదలైంది. పక్క పార్టీ వైపు చూస్తూ, అటు ఏ కారణం చెప్పి వెళ్ళాలో అర్ధం కాక, సొంత పార్టీ పైనే నిందలు మోపి, పార్టీ అధిష్టానాన్ని బ్లాకు మెయిల్ చెయ్యటానికి సిద్ధం అయ్యారు. ఇదే కోవలో సీనియర్ నేత తోట త్రిమూర్తులు ఉన్నారు. తోట త్రిమూర్తులు వైసీపీలో చేరతారంటూ, గత కొంత కాలంగా జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇటీవల ఆయన జగన్‌ను కూడా కలిసినట్లు ప్రచారం జరిగింది. అయితే జిల్లాకు చంద్రబాబు వచ్చిన సందర్భంలో, ఆయనను కూడా ఆహ్వానించారు. ఆయన రాకపోవటంతో, ఏకంగా చంద్రబాబే కబురు పంపించారు. సమావేశానికి రాకుండా వెంకటాయపాలెంలోనే త్రిమూర్తులు ఉండిపోయారు.

cbn 05092019 1

అయితే తిరుముర్తులు మాత్రం, నేను పార్టీకి రాజీనామా చెయ్యలేదని, పార్టీ అధిష్టానంతో నాకు ఏ ఇబ్బంది లేదని, కొంత మంది నేతలతోనే సమస్య అని, తన వద్దకు వచ్చియన్ నేతలతో చెప్పుకొచ్చారు. వారి పై తరువాత మాట్లాడుకుందామని, అధినేత జిల్లాకు వచ్చిన సమయంలో ఇలా చెయ్యటం భావ్యం కాదని, సీనియర్ నేతగా ఉన్న మీరు, ఇలా చెయ్యకుండా, అధినాయకుడి వద్దకు రావాలని కోరారు. అయినా సరే, సమావేశానికి రాలేనని త్రిమూర్తులు తేల్చిచెప్పారు. దీంతో త్రిమూర్తులు పార్టీ మార్పు ఖాయంగా తెలుస్తుంది. గత ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. రామచంద్రాపురం నియోజవర్గం నుంచి తోట నాలుగుసార్లు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వేణుగోపాల కృష్ణ చేతిలో పారాజయం పొందారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మదిలో ఉన్న ఆందోళన, పోలవరం, అమరావతి పై జగన్ మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో అని. ఇప్పటి వరకు పోలవరం పై జగన్ ప్రభుత్వం అన్నీ ఆందోళన కలిగించే నిర్ణయాలే తీసుకుంటుంది. ఒక పక్క నవయుగ కోర్ట్ కి వెళ్ళటంతో, అది ఎప్పటికి కొలిక్కి వస్తుందో తెలియదు. ఒకసారి కోర్ట్ కు వెళ్తే, ఆ విషయం తేలటానికి ఎన్ని ఏళ్లు పడుతుందో అందిరికీ తెలుసు. ఇక మరో పక్క, కేంద్రం కూడా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. పోలవరం పై ఇష్టం వచ్చినట్టు చెయ్యవద్దు అని, మేము చెప్పినట్టే వినాలని రాష్ట్రానికి వార్నింగ్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చేత కంప్లీట్ రిపోర్ట్ తెప్పించుకుని, ఆ విషయం పై త్వరలో ఒక నిర్ణయం ప్రకటించ నుంది. ఈ నేపధ్యంలో పోలవరం ప్రాజెక్ట్ పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరి పై, అందరూ స్పందిస్తున్నారు.

jp 05092019 2

ఈ కోవలోనే, లోక్‌సత్తా వ్యవస్థాపకులు డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోవటం పై విశాఖలో స్పందించారు. పోలవరం ప్రాజెక్ట్ ని నిర్మాణం చెయ్యకుండా, నిలిపివేయటం, రాష్ట్రానికి మంచిది కాదని అన్నారు. ఒకసారి ప్రాజెక్ట్ ఆపితే, మళ్ళీ దాన్ని గాడిలో పెట్టాలంటే, ఎంతో శ్రమ పడాలని, ప్రభుత్వం పోలవరం ఆపటం రాష్ట్రానికి మంచిదికాదని జేపీ అన్నారు. విశాఖపట్నంలో, ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి స్మారకోపన్యాసం’లో జేపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి’ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ తో, ఉత్తరాంధ్ర ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పారు.

jp 05092019 3

పోలవరం ఎడమకాలువ ద్వారా నీటిని విజయనగరం జిల్లాకు తెచ్చి అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లాలో నిలిచిపోయిన ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేస్తే ఉత్తరాంధ్ర నీటితో సస్యశ్యామలం అవుతుందని జేపీ అన్నారు. గోదావరి జలాలను వాడుకునే విషయంలో, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ఆలోచన మంచిదే కాని, ఆ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్న విధానం మాత్రం సరైంది కాదని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి ఎన్నిక పై సంస్కరణలు రావాలని, ముఖ్యమంత్రులను నేరుగా ఎన్నుకోవడం ద్వారా ఎమ్మెల్యేలపై ప్రభుత్వాలు ఆధారపడే సమస్య లేకుండా వ్యవస్థ ఉండాలని అన్నారు. ఈ విధానం అప్పట్లో వైఎస్ఆర్ కి చెప్తే, దీన్ని బలపరిచి, కొంత మేర ఈ దిశాగా ఆలోచనలు జరిపారని, జేపీ గుర్తు చేసారు.

నవయుగ కంపెనీ పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టిందా అన్న రీతిలో, ప్రస్తుతం వ్యవహారాలు నడుస్తున్నయి. పోలవరం ప్రాజెక్ట్ లో, 73 శాతం పనులు కావటనికి ఎంతో కృషి చేసిన నవయుగ కంపెనీని పోలవరం ప్రాజెక్ట్ పనులు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఏరియాలో నిర్మించే పోలవరం హైడల్ ప్రాజెక్ట్ నుంచి కూడా నవయుగని తప్పించారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో, ట్రాన్స్ ట్రాయ్ నుంచి సబ్ కాంట్రాక్టు కావటంతో, నవయుగ కంపెనీ, కేవలం పోలవరం హైడల్ ప్రాజెక్ట్ మీదే కోర్ట్ కు వెళ్ళింది. అయితే వెంటనే హైకోర్ట్, ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం మాత్రం తీవ్రంగా స్పందించింది. 73 శాతం పనులతో పరుగులు పెట్టించిన నవయుగ కంపెనీని తప్పించమని ఎవరు చెప్పారు అంటూ, రాష్ట్ర ప్రభుత్వం పై ఫైర్ అయ్యింది.

navauga 05092019 1

ఇది ఇలా నడుస్తూ ఉండగానే, నిన్న ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో, నవయుగ కంపెనీకి బందర్ పోర్ట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన జీవో 66ను ‘నవయుగ మచిలీపట్నం పోర్ట్‌ లిమిటెడ్‌’ కంపెనీ హైకోర్టులో సవాల్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించిన వెంటనే, కోర్ట్ లో కేసు వేసింది. మమ్మల్ని కనీసం వివరణ అడగకుండా ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్ట్ కు చెప్పింది. నిన్న క్యాబినెట్ నిర్ణయం పైనే కాకుండా, ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఆగస్టు 8న ఏపి ప్రభుత్వం జారీచేసిన జీవో 66ను సస్పెండ్ చెయ్యాలని కోరింది.

navauga 05092019 1

ఏపి ప్రభుత్వం బందర్ పోర్ట్ విషయంలో, తరువాత చర్యలు ఏమి తీసుకోకుండా, బందర్ పోర్ట్ పనులు మరే కంపెనీకు ఇవ్వకుండా చూడాలని, నవయుగ సంస్థ తరఫున డైరెక్టర్‌ వై.రమేశ్‌ బుధవారం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. "మచిలీపట్నం పోర్టు పనుల కోసం భూములను ఎలాంటి అడ్డంకుల్లేకుండా అప్పగించడంలో ప్రభుత్వం విఫలమైంది. కొంత భూమి ఆక్రమణలో ఉంది. సౌకర్యాలు కల్పించినా నిర్మాణం పూర్తి చేసే ఉద్దేశం మాకు లేదని పేర్కొనడంలో వాస్తవం లేదు.5324 ఎకరాల్లో మాకు అప్పగించిన 412 ఎకరాలు పోగా.. 4912 ఎకరాల్ని త్వరితగతిన అప్పగించాలని కోరాం. ఈ బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నిబంధనలకు విరుద్ధంగా, అకస్మాత్తుగా ఒప్పందాన్ని రద్దు చేశారు. వివిధ పనుల కోసం రూ.436 కోట్లకు పైగా ఖర్చు చేశాం. ఈ అంశాల్ని పరిగణించి, జీవో 66ను రద్దు చేయండి" అంటూ పిటీషన్ లో కోరింది నవయుగ.

అమరావతి గురించి ఇంకా మర్చిపోవచ్చు అనుకుంటున్న ఆంధ్రులకు, మరో షాకింగ్ న్యూస్. ఇప్పటికే అమరావతి పై ప్రపంచ బ్యాంక్ నుంచి కేంద్రం దాకా అందరూ తప్పుకోగా, తాజాగా సింగపూర్ ప్రభుత్వం కూడా, అమరావతికి గుడ్ బాయ్ చెప్పేసింది. అమరావతి ప్రాంతంలో, ప్రధాన ప్రాజెక్ట్ అయిన, స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని సింగపూర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి సింగపూర్ ప్రభుత్వం డైరెక్ట్ గా చేసే ప్రాజెక్ట్ కాబట్టి, ఈ ప్రాజెక్ట్ పై అందరికీ ఆశలు ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, ఈ ప్రాజెక్ట్ పూర్తీ చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అమరావతి పై ఉన్న అనాసక్తి గమనించిన సింగపూర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. స్టార్టప్‌ ఏరియా నుంచి తప్పుకుంటున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సింగపూర్ ప్రభుత్వం కబురు పంపించింది.

singapore 05092019 2

అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ తాయారు చెయ్యటం దగ్గర నుండి, అమరావతి అభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సింగపూర్‌ దేశ ప్రభుత్వాలు, సంస్థల మధ్య చాలా ఒప్పందాలు జరిగాయి. ఇవన్నీ చెయ్యటంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంలో, సింగపూర్ పార్లిమెంట్ లో, అమరావతి గురించి చెప్తూ, సింగపూర్ ప్రభుత్వం అమరావతిలో చేపట్టబోయే స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్ట్‌ గురించి మంగళవారం సింగపూర్ పార్లమెంటులో ప్రకటన చేశారు. అమరావతిలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడున్న పరిస్తితుల్లో అమరావతిలో పెట్టుబడి పెట్టటం పై ఆలోచిస్తున్నాం అని తెలిపారు. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, అమరావతి పై చూపిస్తున్న అనాసక్తి గురించి కూడా వివరణ ఇచ్చారు.

singapore 05092019 3

అదే సమయంలో అమరావతి నుంచి ప్రపంచ బ్యాంక్ తప్పుకోవటం, అలాగే ఏఐఐబీ సైతం రూ.1500కోట్ల రుణ ప్రణాళికను పక్కనపెట్టడం వంటి పవిషయలు ఈశ్వరన్‌ ప్రస్తావించినట్లు తెలిసింది. ఈశ్వరన్ ఇచ్చిన వివరణ చూస్తే, స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రణాళిక నుంచి సింగపూర్‌ కన్సార్షియం తప్పుకోనున్నట్లు ఆయన చెప్పినట్టే అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా, సింగపూర్ ప్రతినిధులు వచ్చి ఆయన్ను కలిసి, అమరావతి పై తమ ప్రణాళికను వివరించారు కూడా. అయినా సరే జగన్ మోహన్ రెడ్డి అమరావతి పై ఆసక్తి చూపించకపోవటంతో, సింగపూర్ ప్రభుత్వం కూడా ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. మొత్తానికి, ఇక అమరావతి పరిస్థితి ఏంటో, ఆ దేవుడే చెప్పాలి.

Advertisements

Latest Articles

Most Read