పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొంత మంది చేసిన ప్రచారం పై జనసేన పార్టీ సీరియస్ అయ్యింది. దీని పై కేసు పెట్టటానికి సిద్ధమైనట్టు ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే, నిన్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా, పవన్ కళ్యాణ్ ఫాన్స్, హంగామా మాములుగా చెయ్యలేదు. సోషల్ మీడియాలో అయితే, రచ్చ రచ్చ చేసి వదిలి పెట్టారు. అయితే, పవన్ ఫాన్స్ హడావిడి చూసి, కొంత మంది పవన్ పై వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టారు. జనసేన లెటర్ హెడ్ పై, పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఆపెస్తున్నారని, ఇక నుంచి ఫుల్ టైం సినిమాల్లో నటిస్తున్నారు అంటూ, జనసేన పార్టీ లెటర్ హెడ్ పై, రాసినట్టు పెట్టి, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చూసారు. అయితే అది నిజం అనుకుని కొంత మంది పవన్ ఫాన్స్ తో పాటు, సామాన్య ప్రజలు కూడా దాన్ని వైరల్ చేసారు.

pk 03092019 2

అయితే ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ, ఈ విషయం పై తీవ్రంగా స్పందించింది. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు చ్సుఇ ఓర్వలేక, కొంత మంది పవన్ కళ్యాణ్ పేరిట ఒక తప్పుడు లేఖను సృష్టించి, వైరల్ చేసారని, ఆ లేఖ పచ్చి మోసాపూరితమైనదని, జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి అసత్య ప్రచారాలు ఎవరూ నమ్మవద్దని కోరింది. ఆ లేఖ తయారు చేసింది ఎవరో కనుక్కోమని పోలీసులకు చెప్పమని, లేఖను సర్క్యులేట్ చేస్తున్న వారి పై కేసు నమోదు చేసి, లీగల్ గా ప్రొసీడ్ అవుతమాని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి, పార్టీ లీగల్ సెల్ ఇప్పటికే పని ప్రారంభించిందని చెప్పింది. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఒక భాగం మాత్రమే అని, కాని ప్రజా సేవ ఎప్పుడూ ఉంటుదని, పవన్ కళ్యాణ్ దాన్నే నమ్ముకున్నారని ఆ ప్రకటనలో తెలిపింది.

pk 03092019 3

అయితే గత నెల రోజులుగా వైసిపీ పార్టీ, పవన్ టార్గెట్ గా నడుస్తుంది. ఇప్పటికే వైసిపీ సోషల్ మీడియా ఆఫిషియాల్ హేండిల్ ఒకటి, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు పై తప్పుడు ప్రచారం చెయ్యటంతో, జనసేన పోలీస్ కేసు పెట్టటంతో, ఆ పెట్టిన పోస్టింగ్ ను వైసీపీ డెలీట్ చేసింది. మరో పక్క నిన్న పవన్ పుట్టిన రోజున కూడా, కొంత మంది "పావలా కళ్యాణ్" అంటూ ట్వీట్ లు చేసి, దాన్ని ట్రెండ్ అయ్యేలా చూసారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ ఫాన్స్ అతి ప్రవర్తన, మరో పక్క ప్రత్యర్ధుల ట్రాప్ లో, జనసేన ఇట్టే పడిపోతుంది. తెలివిగా ఎదుర్కోవాల్సింది పోయి, అత్యుత్సాహంతో, పవన్ కి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారు. ఏది ఏమైనా, ఒక మనిషి పై తప్పుడు ప్రచారాలు చెయ్యటం మాత్రం, హేయమైన చర్య.

విజయసాయి రెడ్డి భవిష్యత్తు ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చింది. రాష్ట్రపతి సూచన మేరకు, ఎలక్షన్ కమిషన్, విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వం గురించి, తన అభిప్రాయం తెలపనుంది. అయితే విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వం, అంత తేలికగా పోతుందా ? హలో విజయ్ గారు అంటూ ఆప్యాయంగా పలకించే, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా గారి ఆశీస్సులతో రాజకీయం నడుపుతున్న విజయసాయి రెడ్డి భవిష్యత్తు ఏమిటి అనేది, మరో రెండు, మూడు రోజుల్లో తెలిసిపోతుంది. లేకపోతే ఎలక్షన్ కమిషన్ రూల్ బుక్ ప్రకారం వెళ్తే, విజయసాయి రెడ్డి భవిష్యత్తు ఎలా ఉంటుంది ? ఇవన్నీ ప్రశ్నలుగా మిగిలిపోయాయి. అసలు విషయానికి వెళ్తే, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, విజయసాయి రెడ్డికి ఉన్న ఎంపీ పదవితో పాటు, అనేక పదవులు ఇచ్చారు. అందులో ఒకటి, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా.

ec 03092019 2

అయితే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా ఉన్న పదవి, ఆఫీస్ అఫ్ ప్రాఫిట్ పదవి కింద వస్తుంది. ఎంపీగా ఉంటూ, ఇలా ఆఫీస్ అఫ్ ప్రాఫిట్ పదవి కింద ఉండ కూడదు. అలా ఉంటే, ఆయన రాజ్యసభకు అనర్హుడు అవుతారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, జూన్ 22న, విజయసాయి రెడ్డిని, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా పదవి ఇచ్చారు. అయితే, ఇది ఆఫీస్ అఫ్ ప్రాఫిట్ కింద వస్తుందని, తెలుగుదేశం గొడవ చెయ్యటంతో, జూలై 4న ఆ ఉత్తర్వులు రద్దు చేసారు. అప్పటికే విజయసాయి రెడ్డి 13 రోజుల పాటు ఆ పదవిలో ఉన్నారు. అయితే విజయసాయి రెడ్డి కోసం, రూల్స్ అన్నీ మార్చేసి, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా ఉన్న పదవి , ఆఫీస్ అఫ్ ప్రాఫిట్ కింద రాదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

ec 03092019 3

దీని ప్రకారం మళ్ళీ జూలై 6న , విజయసాయి రెడ్డిని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, అప్పటికే విజయసాయి రెడ్డి 13 రోజులుగా ఆ పదవిలో ఉన్నారని, అందుకే ఆయన్ను రాజ్యసభకు అనర్హుడిగా ప్రకటించాలని, తెలుగుదేశం పార్టీ, రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. రాష్ట్రపతి ఇప్పుడు ఆ ఫిర్యాదుని పరిశీలించమని, ఎలక్షన్ కమిషన్ కు పంపించారు. అయితే దీని పై విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, నేను ఆ 13 రోజులు పదవిలో లేను అని, అసలు నేను ఆ చార్జ్ తీసుకోలేదు అని, ఈ విషయం పై నేను కూడా ఎలక్షన్ కమిషన్ ను క్లారిటీ అడుగుతున్నాను అని, చెప్పుకొచ్చారు. మొత్తానికి, ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజ్యసభ పదవి ఉంటుందో లేదో, ఎలక్షన్ కమిషన్ మరికొద్ది రోజుల్లో చెప్పనుంది.

ఎన్నికల ముందు, జరిగిన జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య, రాష్ట్రంలో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసిందే. అప్పట్లో జగన్ కూడా ఆయన బాబాయ్ హత్య పై సిబిఐ విచారణ జరపాలని ఆందోళన కూడా చేసారు. వివేక కూతురు కూడా, తన తండ్రిని చంపిన వారు ఎవరో తెలియాలి అంటూ ఆందోళన చేసారు. అయితే జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఆయన తలుచుకుంటే, నిమిషాల మీద సిబిఐ ఎంక్వయిరీ కోరవచ్చు. ఎందుకో కాని జగన్ ఆ విషయం మర్చిపోయారు. వివేక కూతురు కూడా, ఈ విషయం పై ఎక్కడా స్పందించలేదు. అయితే పోలీస్ విచారణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో, నిన్న అర్ధరాత్రి ఒక సంచలన వార్తా బయటకు వచ్చింది. వివేకా హత్యకేసులో, ఒక నిందితుడుగా ఉన్న వ్యక్తి రాత్ర ఆత్మహత్య చేసుకున్నాడు.

viveka 03092019 2

సింహాద్రిపురం మండలం కసునూరులో నిద్రమాత్రలు మింగిన శ్రీనివాసులరెడ్డి, కడప ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. శ్రీనివాసులరెడ్డి వైఎస్ వివేక కేసులో ఒక నిందితుడుగా ఉన్నారు. ఆయన పోలీసులు పెట్టే వేధింపుల తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీనివాసులరెడ్డి సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. వివేకా హత్య సుతో తనకు సంబంధం లేదని, అయినా తనను టార్చర్ పెడుతున్నారని లేఖలో పెర్కున్నారు. శ్రీనివాసులరెడ్డి రెండు సూసైడ్ నోట్ లు రాసారు. ఒకటి సీఎం జగన్‌, వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి శ్రీనివాసులరెడ్డి వేరు వేరుగా లేఖ రాశాడు. సూసైడ్‌ నోట్‌ను గమనించిన డాక్టర్లు, వాటిని కుటుంబ సభ్యులకు అందచేసారు. సీఐ రాములు, శ్రీనివాసులరెడ్డిని తీవ్రంగా వేధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

viveka 03092019 3

శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యపై ఆయన కుమారుడు స్పందిస్తూ. ‘‘రెండ్రోజుల క్రితం పోలీసులు విచారణకు పిలిచారు. వివేకానందరెడ్డి హత్య కేసుతో సంబంధం లేకపోయినా విచారణ ఎదుర్కోవడంతో అవమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైఎస్‌ కుటుంబం అంటే మా నాన్నకు చాలా అభిమానం’’ అని శ్రీనివాసులు రెడ్డి కుమారుడు పేర్కొన్నాడు. తన బావ అయిన శ్రీనివాసులరెడ్డిని, గత నెల రోజులుగా పోలీసులు వేధిస్తున్నారని, ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న మరో నిందితుడు పరమేశ్వర్‌రెడ్డి వాపోయాడు. వైఎస్‌ కుటుంబానికి 30 ఏళ్లుగా మేము సేవ చేస్తున్నామని, ఈ కేసుతో మాకు సంబంధం లేకపోయినా, నార్కో పరీక్షల కోసం తనను గుజరాత్‌ తీసుకెళ్లారని కన్నీటి ఆవేదన వ్యక్తం చేసారు. అయితే, ఈ ఆత్మహత్య పై పలు అనుమానాలు కూడా ఉన్నాయని, అవి పోలీసులు విచారణలో బయట పెట్టాలని, పలువురు వాపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, విభజన తరువాత, తారు మారు అయిన సంగతి తెలిసిందే. అయితే విభజన అయిన తరువాత చంద్రబాబు ఉండటంతో, ఆదాయం స్థిరంగా వస్తూ ఉండేది. జీతాలకు, సంక్షేమానికి ఇబ్బంది ఉండేది కాదు. దానికి తగ్గట్టుగానే, 11 శాతం వృద్ధి రేటు స్థిరంగా ఉండేది. ఇప్పుడు అధికారం మారటంతో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. గడిచిన రెండు నెలలుగా ఆదాయం పూర్తిగా పడిపోయింది. వృద్ధి రేటు 11 శాతం నుంచి 5 శాతానికి పడిపోయింది. దీంతో ఈ నెల నుంచి, జగన మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మికంగా చేద్దాం అనుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కడ నుంచి ఫండ్స్ తేవాలో, అర్ధం కాక, అధికార యంత్రాంగం టెన్షన్ పడుతుంది. జగన్ మోహన్ రెడ్డి కూడా, ఈ విషయం పై ఆరా తీసారు. వచ్చే రెండు నెలల్లో తాను చేపట్టబోయే కార్యక్రమాలు చెప్తూ, అధికారులకు వివరించారు.

jagan 03092019 2

వచ్చే రెండు నెలల్లో ఆదాయం ఎంత రావచ్చు, ఖర్చులు ఎంత అనేవి లెక్క గడితే, దిమ్మ తిరిగే ఫిగర్ వచ్చింది. అయినా సరే, ఈ కార్యక్రమాల పై ముందుకు వెళ్ళాల్సిందే అంటూ జగన్ పట్టుబట్టటంతో, ఆదాయం ఎలా తీసుకురావాలి అనే విషయం పై అధికారులు కిందా మీద పడుతున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన ఈ మూడు నెలల్లో, ఇప్పటిదాకా ప్రభుత్వం వివిధ రంగాల్లో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు రాబడి రాలేదు. దీంతో వచ్చే రెండు నెలలు పరిస్థితి అంచనా వేస్తె, రూ.12,220 కోట్లు లోటు ఉందనే అంచనాకు అధికారులు వచ్చారు. గడిచిన మూడు నెలల్లో కేవలం 5 శాతం వృద్ధి, ఇప్పుడు రాబోయే రెండు నెలల్లో 12 వేల కోట్లు లోటు అంటే, ఇక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, ఎలా పాతాళానికి పడిపోతుందో చెప్పే పనే లేదు.

jagan 03092019 3

ప్రతి నేలా యావేరేజ్ న, 8,500 కోట్లు ఆదాయం అంచనా వేసారు. అలాగే నెలకు 3 వేల కోట్ల వరకు అప్పు తీసుకునే అవకాసం ఉంటుంది కాబట్టి, ఇది కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ రెండు కలిపి, రూ.11,500 కోట్ల వరకు ఆదాయం అంచనా వేసారు. ఇక నెలకు అయ్యే ఖర్చు, జీతాలు, ప్రతి నెలా ఇచ్చే పెన్షన్లు కలుపుకుని 10 వేల కోట్ల దాకా అవుతుంది. అయితే ఇక్కడ వరకు అయితే పరవాలేదు. కాని, ఈ రెండు నెలల్లో అనేక కొత్త సంక్షేమ పధకాల కోసం ప్రభుత్వం ఆలోచిస్తుంది. పెట్టుబడి రాయితీ, తిత్లీ సాయం, వైఎస్‌ఆర్‌ బీమా, ట్యాక్సీ డ్రైవర్లకు సాయం, రైతు భరోసా, ఇలా అనేక పధకాలు మొదలు పెడుతున్నాం అని జగన్ చెప్తున్నారు. ఇవన్నీ లెక్కేస్తే, రెండు నెలలకు అయ్యే అధిక ఖర్చు, 15,220 కోట్లు. ఇప్పటికే సామర్ధ్యానికి మించిన అప్పులు తీసుకున్నారు. కొత్త అప్పులు వచ్చే అవకాసం లేదు. కేంద్రం సాయం చేసినా ఎంతో కొంత చేస్తారు కాని, 15 వేల కోట్లు అంటే మామూలు విషయం కాదు. మరి, ఈ డబ్బులు ఎక్కడ నుంచి సర్దుబాటు చేస్తారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read