ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా ఉంటూ, ఇటీవలే కేవలం తెలంగాణా రాష్ట్రానికి మాత్రమే గవర్నర్ అయిన నరసింహన్ ఎట్టకేలకు తెలంగాణా నుంచి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో, తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదివారంనాడు నియమించింది. ఆమె మొన్నటి దాక తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా కొనసాగారు. బీజేపీని అంటిపెట్టుకుని ఉన్నందుకు, మోడీ ఆమెకు గవర్నర్ గా ప్రొమోషన్ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. ఇక మిగతా రాష్ట్రాలకు కూడా కేంద్రం కొత్త గవర్నర్లను ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను రాజస్థాన్ గవర్నర్‌గా బదిలీ చేసింది. హిమాచల్ ప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా బండారు దత్తాత్రేయను నియమించింది. కేరళ గవర్నర్‌గా ఆసిఫ్ మొహ్మద్ ఖాన్‌ నియమించింది.

narasimhan 01092019 2

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదేళ్ళ పాటు నరసింహన్ గవర్నర్ గా పని చేసారు. తరువాత ఇరు తెలుగు రాష్ట్రాలకు కలిసి కట్టుగా గవర్నర్ గా పని చేసారు. ఇటీవాలే ఆయన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి తొలగించి, కేవలం తెలంగాణా రాష్ట్రానికి మాత్రమే గవర్నర్ గా ఉంచారు. ఇప్పుడు బదిలీ సెహ్సారు. దీంతో పాటు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన గవర్నర్‌గా కూడా నరసింహన్ గుర్తింపు పొందారు. దాదాపుగా పదేళ్లుకు పైగా ఆయన తెలంగాణ గవర్నర్‌గా కొనసాగారు. మొన్నటివరకు రెండు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్‌గా ఉండగా ఇటీవలే ఏపీకి బిశ్వభూషన్ హరిచందన్‌ను కొత్త గవర్నర్‌గా నియమించారు. రెండు రోజుల క్రితమే నరసింహన్ ఆయన బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సంకేతాలు ఇచ్చారు.

narasimhan 01092019 3

రాజ్‌భవన్‌లో జరిగిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. తాను గవర్నర్‌గా ఉన్నా లేకున్నా 2020 ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధించి రాజ్ భవన్‌ రావాలని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆయన నిజంగానే బదిలీ అయ్యారు. నరింహన్ అటు సోనియా గాంధీకి, ఇటు మోడీకి కూడా సన్నిహితంగా ఉండేవారు. అందుకే ఇన్నేళ్ళ పాటు గవర్నర్ గా కొనసాగారు. అటు విభజన సమయంలో, ఇటు ప్రత్యెక హోదా ఉద్యమం అప్పుడు కూడా, తెలంగాణాకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారనే విమర్శలు ఉన్నాయి. బీజేపీ అధిష్టానానికి, చంద్రబాబుకు గ్యాప్ రావటానికి నరసింహన్ కారణం అని తెలుగుదేశం పార్టీ అనేకసార్లు బహిరంగంగా కూడా ఆరోపించింది.

కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం అంటూ, ఎన్నికలు ముందు చెప్పిన జగన్, ఇప్పుడు ఇస్తున్న నియామకాలు అన్నీ, కులం చూసే ఇస్తున్నట్టు ఉన్నారు. ఆయనకు సన్నిహితంగా ఉన్న వాళ్ళకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. తాజాగా జరిగిన ఒక నియామకం చూస్తే ఇదే అర్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ వైద్య మండలి ఛైర్మన్‌గా న్యూరోసర్జన్‌ డాక్టర్‌ బూచిపూడి సాంబశివారెడ్డి ఎన్నికయ్యారు. ఈయన ఎవరో కాదు. జగన్ మోహన్ రెడ్డికి స్వయానా చికిత్స చేసిన డాక్టర్ గారు. అందుకే ఆ కృతజ్ఞత జగన్ ఇలా చూపించారు. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్‌ పాదయాత్రలో ఉన్న సమయంలో, శుక్రవారం కోర్ట్ వాయిదాకు వెళ్తూ ఉండగా, ఎయిర్ పోర్ట్ లో ఆయన పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. విశాఖ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆయన పై శ్రీనివాస్ అనే వ్యక్తి కోడి కత్తి తో గుచ్చిన సంగతి తెలిసిందే.

jagan 3108200019 2

కోళ్లకు కట్టే కత్తిని వినియోగించి దాడి చేశాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన జగన్‌, విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. అక్కడ ఆయన హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే, ఇక్కడ జగన్‌కు చికిత్స చేసిన డాక్టర్ బూచిపూడి సాంబశివారెడ్డి అప్పట్లోనే రాజకీయాల్లోకి వస్తారనే టాక్ నడిచింది. ఈయన వైఎస్ ఫ్యామిలీకి ఆత్మీయుడు కావడంతో, వైసీపీలోకి వస్తున్నారని ప్రచారం జరిగింది. సత్తెనపల్లి నుంచి కోడెల పై పోటీ చేయాలని భావిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే సాంబశివారెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. వైద్య సేవలు అందించారు. అయితే అప్పట్లో అంతా ప్రశాంత్ కిషోర్ చూసుకుంటూ ఉండటంతో, ఈయనకు టికెట్ వద్దు అని చెప్పారు. దీంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత, జగన్ ఆయన్ను వేరే విధంగా చూసుకున్నారు.

jagan 3108200019 3

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం, చల్లగుండ్ల గ్రామానికి చెందిన సాంబశివారెడ్డి చిన్న వయసులోనే వైద్య వృత్తిలోకి ప్రవేశించారు. ఇక, సాంబశివారెడ్డి ఫ్యామిలీకి రాజకీయాలు కొత్తకాదు. ఆయన తాత బూచిపూడి సుబ్బారెడ్డి గతంలో కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా వ్యవహరించారు. 1983లో నరసరావుపేట నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కోడెల శివప్రసాద్‌పై ఓడిపోయారు. అయితే ఆయన కూడా వైద్య వృత్తిని పక్కన పెట్టి, వైసీపీలో టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే అప్పట్లో టికెట్ ఇవ్వటం కుదరని జగన్, ఇప్పుడు ఆయన్ని ఆంధ్రప్రదేశ్‌ వైద్య మండలి ఛైర్మన్‌గా నియమించారు. కోడి కత్తి గాయం నుంచి రక్షించినందుకు, జగన్ ఇచ్చిన బంపర్ ఆఫర్ తో, సాంబశివారెడ్డి ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు.

అమరావతి రైతుల సమస్యల పై ఈ రోజు జనసేన కార్యాలయంలో, పవన్ కళ్యాణ్ రైతులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి గెలిచిన విధానం పై, పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కాల మహిమో, లేక ఈవీఎంల మహిమో, జగన మోహన్ రెడ్డి గెలిచారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ మొహన్ రెడ్డి గెలిపు పై, పవన్ ఇలా స్పందించటం పై, ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎన్నికల ఫలితాలకు ముందు దేశంలోని 24 పార్టీలు, ఈవీఎంల ట్యాంపరింగ్ పై ఆందోళన చేసారు. జగన్ గెలిచిన సీట్లు చూసిన తరువాత, కొంత మంది ఈవీఎంల పై మాట్లాడినా, అది పెద్ద చర్చ ఏమి జరగలేదు. అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం, పెద్ద చర్చకు తెర లేపాయి. జగన్ క్యాంప్ వైపు నుంచి పవన్ కు ఈ విషయంలో ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి.

pk 31082019 2

ఇక అమరావతి పై పవన్ మాట్లాడుతూ " బొత్సా గారికి నా విన్నపం, ప్రజలు ఆగ్రహానికి గురయ్యే వార్తలు మీరు ఇచ్చి వారి ఆగ్రహానికి గురి కాకండి, మీరు అనుభవజ్ఞులు ఆలోచించి మాట్లాడండి. చెడు ప్రకటనలన్ని జగన్ గారు కానీ, ఆయన పక్కన ఉన్న దగ్గరి వారు కానీ ఇవ్వరు, ధ్వంసానికి సంబంధించినవి ఆయన కుటుంబ సభ్యులు కానీ, దగ్గరి వారు కానీ ఇవ్వరు, చెడు వార్తలు బొత్సా, అనిల్ యాదవ్ లాంటి వారు జగన్ మాయలో పడి ప్రకటన ఇచ్చి మాటలు పడతారు .151 ఎమ్మెల్యేల బలం ఉంది, ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దండి, శిక్షించండి, అంతేకాని అమరావతి తరలిస్తాం అనే అవకతవక ప్రకటనలు మానండి. ఒకసారి కర్నూలు వదులుకుని హైదరాబాద్ వెళ్ళాం, ఇప్పుడు అది వదులుకుని అమరావతి వచ్చాం, ఇప్పుడు మళ్లీ వదులుకోవాలి అంటే ఇది రైతు సమస్య కాదు, రాష్ట్ర ప్రజల సమస్య"

pk 31082019 3

"2014 లో వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే వారు భూములు కొనుక్కున్న దొనకొండ ప్రాంతంలో రాజధాని వచ్చి ఉండేదేమో. రాజధాని అంశం వల్ల నాకు కష్టం తప్ప సుఖం ఏమి లేదు, నా వ్యక్తిగత లాభం ఏమీ లేదు,కానీ భావితరాల వారి భవిష్యత్తు ఇబ్బందుల్లో నెట్టేస్తున్నారు అని తెలిసి, అలా జరగకుండా ఉండటానికి ఇక్కడకు వచ్చాను. రైతు నాయకులు కలవగానే నేను సమస్యను ఆలస్యం చేయకుండా వెంటనే పర్యటనకు వచ్చాను, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించాను, సమస్యలను తెలుసుకున్నాను. రైతులు భూములు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, వ్యక్తులకు కాదు, ప్రభుత్వం మాట తప్పి వెనక్కు వెళ్ళిపోతే మీకు అండగా పోరాటం చేయడానికి జనసేన ఉంది." అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు.

తమ నిర్ణయం పై వెనక్కు తగ్గేది లేదు అంటూ, జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే, కేంద్ర ప్రభుత్వం, కోర్ట్ లు, ట్రిబ్యునల్ లు మాత్రం, జగన్ దూకుడికి బ్రేక్ లు వేస్తున్నాయి. విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో, అటు కోర్ట్ లు, ఇటు కేంద్రం, చివరకు విదేశీ ప్రభుత్వాలు కూడా జగన్ వైఖరిని తాప్పుబడుతున్న సంగతి తెలిసిందే. తాజగా, విండ్, సోలార్ ఎనర్జీ కొనుగోలు ఒప్పందాల విషయంలో, గత ప్రభుత్వం చేసిన పీపీఏలను రద్దు చెయ్యాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఈ రోజు షాక్ ఇచ్చింది. విద్యుత్ ఒప్పందాల రద్దు కుదరదు అని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహించాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. పాత ఒప్పందాలనే కొనసాగించాలని ట్రైబ్యునల్‌ ఆదేశించింది.

jagan 310820019 2

గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాల సమీక్షించాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదే విషయం పై సోలార్, విండ్ ఎనర్జీ కంపెనీలకు నోటీసులు కూడా జారీ చేసింది. దీని పై కడప, అనంతపురానికి చెందిన మూడు విద్యుత్‌ కంపెనీలు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాయి. ఇప్పటికే జరిగిన విద్యుత్ పీపీఏలపై సమీక్షించడం వలన తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, భవిష్యత్‌లో అనేక పరిణామాలు ఎదుర్కోవాలని కంపెనీలు, ట్రిబ్యునల్ కు చెప్పాయి. పీపీఏలపై సమీక్షించడమంటే, తమ పై ప్రభుత్వానికి నమ్మకం లేకపోవడమేనని ట్రైబ్యునల్‌ ముందు ఈ కంపెనీలు వాదనలు వినిపించాయి. గత రెండు నెలలుగా ఈ వాదనలు సాగాయి. అందరి వాదనలు విన్న ట్రైబ్యునల్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది

jagan 310820019 3

విద్యుత్ ఒప్పందాల పీపీఏలపై సమీక్ష చెయ్యటం కాని, రద్దు చెయ్యటం కాని, చెయ్యకూడదు అని, అవి ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అలాగే ఈ విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం చేపట్ట తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ అంశం కూడా అవసరం లేదని స్పష్టంచేసింది. ఇప్పటికే చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను కొనసాగించాలని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఇదే అంశం పై ఇప్పటికే హైకోర్ట్ కూడా జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. అదే విధంగా కేంద్రం కూడా, విద్యుత్ ఒప్పందాల సమీక్ష వద్దని, ఇలా చేస్తే, దేశం మొత్తానికి పెట్టుబడుల పై ప్రభావం ఉంటుందని కేంద్రం హెచ్చరించింది. ఇక జపాన్ ప్రభుత్వం కూడా, జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది.

Advertisements

Latest Articles

Most Read