ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాశనం కోసం, హైదరాబాద్ నుంచి, జగన్ ను అడ్డు పెట్టుకుని స్కెచ్ వేసిన కేసీఆర్, అందుకు అనుగుణంగా తన ప్రయత్నాలు చేస్తున్నాడు. డైరెక్ట్ గా జగన్ తో కలిసి వస్తే, అది రాజకీయంగా దెబ్బ కొట్టి, జగనే కు అసలుకే ఎసరు వస్తుందని, డైరెక్ట్ గా కాకుండా, తెర వెనుక జగన్ కు సహాయం చేస్తున్నాడు. తెలంగాణా ఇంటెలిజెన్స్ మొత్తాన్ని ఏపి రాజకీయ నాయకుల పైనే పెట్టాడు. ఈ కోణంలోనే హైదరాబాద్ లో ఆస్థులు, వ్యాపారాలు ఉన్న తెలుగుదేశం నేతలని టార్గెట్ చేసుకుని, జగన్ పార్టీలో చేరమని, చంద్రబాబు పై తిరుగుబాటు చెయ్యమని ఒత్తిడి చేస్తున్నారు. ఈ కోవలోనే, అవంతి, మేడా, దాసరి జై రమేష్ లాంటి నేతలు ఈ ఒత్తిడి తట్టుకోలేక, జగన్ పార్టీలో చేరిపోయారు.

rayapati 25022019 2

జగన్ పార్టీలో చేరని వారిని, అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. చేతిలో అధికారం ఉండటంతో, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ, వారిని వేధిస్తున్నారు. ఐటి దాడులు చెయ్యటం, నోటీసులు పంపిచటం, పోలీసులతో బెదిరింపులు, ఇలా అన్ని రకాలుగా వేధిస్తున్నారు. ఈ కోవలోనే, తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుని టార్గెట్ చేసుకున్నారు. ఈ విషయం ఆయనే స్వయంగా మీడియాకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులను తెలంగాణ సర్కార్‌ వేధిస్తోందని రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. కేసీఆర్‌ ఒత్తిడి వల్లే కొంతమంది పార్టీ మారుతున్నారని అన్నారు. కేసీఆర్‌ నమ్మకద్రోహి అని, కేసీఆర్‌ బెదిరింపులకు లొంగేదిలేదన్నారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ కలిసినా చంద్రబాబును ఏమీ చేయలేరని ఆయన అన్నారు.

rayapati 25022019 3

ఆయన మాట్లాడుతూ, తన కంపెనీలను ఎలా వేధిస్తుంది చెప్పూర్. "జూబ్లీహిల్స్ మెట్రోరైలు ఔటర్ రింగ్ రోడ్డు అంశాలలో దాదాపు 300 కోట్లు మా కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉంది.... ఆంద్రా నేతలను బెదిరించి పార్టీలు మారమంటున్నారు...... ఆంద్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ కి హైదరాబాద్ ఫార్మా కంపెనీలు చందాలు ఇవ్వాలని కేసిఆర్ హుకుం జారీ చేసారు..... లేకపోతే కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు.... ట్రాన్స్ ట్రాయ్ కి రావాల్సిన నష్ట పరిహారం కోసం కోర్టును ఆశ్రయించిన మాట వాస్తవం... నేను ఎవరికి భయపడను ...కావాల్సిన నష్ట పరిహారం కోర్టు ద్వారా వస్తాయన్న నమ్మకం ఉంది... తన కంపెనీ కి సంబందించి మెట్రో రైలు ప్రాజెక్ట కింద పరిహారం గా రావలసిన సుమారు 120 కోట్ల రూపాయలు మరియు ఔటర్ రింగ్ రోడ్డు లో కోల్పోయిన భూముల తాలూకా రావలసిన పరిహారం 163 కోట్లు కు అడ్డుపుల్ల వేసారు. రాయపాటి వచ్చి నన్ను కలిస్తేనే ఫైల్ క్లియర్ చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయం పై కోర్టను ఆశ్రయించాం" అంటూ రాయపాటి చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డి... ఇద్దరూ ఇద్దరే.. నీచ రాజకీయాలు చెయ్యటంలో పెట్టింది పేరు. ఎవరో శ్రీరెడ్డి, రామో గోపాల్ వర్మ కలిసి, పవన్ కళ్యాణ్ ని ఎదో తిడితే, నా తల్లిని చంద్రబాబు తిట్టించాడు అంటూ, పవన్ కళ్యాణ్ ఎలాంటి రాజకీయం నడిపాడో చూసాం. అంతే కాదు, ఇప్పుడ అంటే ఎదో అందుకున్న తరువాత సైలెంట్ అయ్యాడు కాని, అంతకు ముందు వరకు బహిరంగ సభల్లో, లోకేష్ శారీరక ఆకృతి పై ఎలాంటి వ్యాఖ్యలు, వెటకారం చేసాడో చూసాం.. మరో పక్క జగన్ మోహన్ రెడ్డి రాజకీయం అయితే, ఇక చెప్పే పనే లేదు. నలుగురు నలుగురు పెళ్ళాలు, కార్లు మార్చినట్టు మారుస్తాడు అంటూ, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత కామెంట్ లు చేసారు. అప్పట్లో జనసేన నేతలు షర్మిల పెళ్ళిళ్ళు పై, మాట్లాడుతూ, ఇరు వర్గాలు నీచంగా తిట్టుకున్నాయి.

pk 25022019 2

అయితే ఇప్పుడు ఆ నలుగురు నలుగురు పెళ్ళాల్లో, ఒకటైన పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తో జగన్ మైండ్ గేమ్ మొదలు పెట్టారు. ఇప్పటికే, కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గేమ్ లో భగంగా, ఇప్పుడు అదే కర్నూల్ కు ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ ని పర్యటించేలా ప్లాన్ చేసాడు జగన్. ఇద్దరూ ఒకే జిల్లాలో పర్యటించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తినెలకొంది. పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా రైతుల సమస్యలు తెలుసుకునేందుకు కర్నూలులో పర్యటిస్తున్నారు. ఆదివారం రాత్రే ఆమె మంత్రాలయం చేరుకున్నారు. స్థానిక ఎస్‌వీబీ అతిథిగృహంలో బస చేసిన ఆమె ఉదయాన్నే.. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఆత్మహత్యకు కారణాలు, బాధిత కుటుంబాల పరిస్థితులు అడిగి తెలుసుకోనున్నారు. ఆమె.. త్వరలో రైతు సమస్యలపై సినిమా తీయనున్నారు. ఈ నేపథ్యంలో.. ఆమె ఈ పర్యటన చేస్తున్నారు.

pk 25022019 3

అయితే ఇక్కడ రేణు దేశాయ్ తో పాటు సాక్షి సిబ్బంది ఉండటమే అసలు హైలైట్. రేణు దేశాయ్ సాక్షి టీవీ లో యాంకర్ గా తన రెండవ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు అనే వార్తా బాగా ప్రచారం అవుతుంది. ఇందుకు తగ్గట్టే, సాక్షి సీనియర్ యాంకర్ స్వప్నతో కలిసి, సాక్షి టీవీ లోగోతో అక్కడి రైతులను ఇంటర్వ్యూ చేస్తూ కనిపించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ని డైవర్ట్ చేయడానికి ఇది జగన్ పన్నిన కుట్రనా.. అనే ప్రశ్న అటు కర్నూల్ జిల్లా లోనూ మరియు జనసైనికుల లోనూ మొదలయ్యింది. ఒక్కసారిగా ఆమె సాక్షి లోగోతో ప్రత్యక్షమవ్వడంతో అంతా గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ కు ధీటుగా రేణు దేశాయ్ ను రంగంలోకి దించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రేణు దేశాయ్ నిర్వహించబోయే కార్యక్రమాలను సాక్షి టీవీ లైవ్ కవరేజ్ మాత్రమే ఇస్తుందని రేణు దేశాయ్ సిబ్బంది చెప్తున్నారు. ఏది ఏమైనా, పవన్ ను రెచ్చగొట్టటానికి, జగన్ ఇలా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇద్దరూ ఇద్దరే కాబట్టి, వాళ్ళు ఎలా కొట్టుకుంటే మాకేంటి అంటూ, తెలుగుదేశం పార్టీ, జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంది. జగన్ చేస్తున్న ఇలాంటి రాజకీయం నీచమైనది అయినా, పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి రాజకీయాలే మా పై చేసారని, ఇప్పటికైనా పవన్ వాస్తవాలు గ్రహించాలని తెలుగుదేశం పార్టీ అంటుంది.

కేసీఆర్‌, దొంగ కంపెనీల సృష్టికర్త జగన్‌ ఏకమై ఆంధ్రప్రదేశ్‌పై హైదరాబాద్‌లో కుట్రలు చేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ విమర్శించారు. 26ప్రశ్నలతో ఆదివారం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. పోలవరం, ఇతర ప్రాజెక్టులపై జగన్‌ సలహాలతో కేసులు వేసిన కేసీఆర్‌ ఏపీపై కక్ష గట్టారని మండిపడ్డారు. ‘మిత్రులను బట్టి గుణం తెలిసిపోతుంది. 12 కేసుల్లో ఏ1గా ఉన్న జగన్‌తో కలిసి మీరు నవ్యాంధ్రపై చిమ్ముతున్న విషం ప్రజలకు అర్థమైంది’ అని పేర్కొన్నారు. ‘నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గురుకుల ట్రస్ట్‌, అయ్యప్ప సొసైటీ నిర్మాణాలను తొలగించిన మీరు లోటస్‌ పాండ్‌లో జగన్‌ భవంతి, జగన్‌ పత్రిక కార్యాలయం ఎందుకు తొలగించలేదు. జగన్‌ ఇంద్ర భవనంలో అక్రమాలను సీబీఐ, టౌన్‌ ప్లానింగ్‌ నిర్ధారించినా ఎందుకు చర్యల్లేవో ప్రజలకు చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

devineni 25022019

కుట్రలను తిప్పికొట్టి జగన్‌ను శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపడం తథ్యమని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో దేశ ప్రధానిని నిర్ణయించేది ముఖ్యమంత్రి చంద్రబాబేనని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇరిగేషన్‌ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో అన్నారు. రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ సీఎం కే.చంద్రశేఖరరావు, ఆయన కొడుకు కె.తారక రామారావుల పెత్తనమేంటని నిలదీశారు. కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో కూర్చొని వైసీపీ తరఫున ఏపీ లోక్‌సభ అభ్యర్థులను నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. బ్రీఫ్‌కేసు కంపెనీలు సృష్టించిన రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి భాగోతం బయటపెట్టాలని ప్రధాని మోదీని డిమాండ్‌ చేశారు. బ్రీఫ్‌ కేసు కంపెనీల ద్వారా హవాలా మార్గంలో రాష్ట్రానికి డబ్బు తరలించడానికి కుట్రలు చేస్తున్నారన్నారు.

devineni 25022019

జగన్‌ లండన్‌ వెళితే తప్పేంటని, హవాలా డబ్బు తెచ్చుకుంటే తప్పేంటని బీజేపీ అద్దె మైకు జీవీఎల్‌ అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోదీ, అమిత్‌ షా ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తారని నిలదీశారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ కలసి ఆడుతున్న నాటకాలకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్‌ చక్రవర్తి, యువరాజు కేటీఆర్‌ ద్వారా సామంత రాజుగా జగన్‌ని ప్రకటించి ఏపీ ప్రజలపై పెత్తనం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వైసీపీ, టీఆర్‌ఎ్‌సలకు కంబైన్డ్‌ గిఫ్ట్‌ ఇవ్వడానికి ఆంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్‌ జ్యోతిష్యం తెలంగాణలో పనిచేసినట్లుగా ఆంధ్రాలో పనిచేయదని మంత్రి కేఎస్‌ జవహర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని టీఆర్‌ఎస్‌ నాయకులకు ఆంధ్రా రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. జగన్‌ లండన్‌ టూర్‌కు వెళ్లేటప్పుడు ఏపీ వైసీపీ బాధ్యతలు కేటీఆర్‌కు అప్పగిస్తే మేలని సూచించారు.

 

 

కోట్ల కుటుంబం టీడీపీలో చేరిక మార్చి 2కి వాయిదా పడింది. జనవరి 19న ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఆయన సతీమణి, డోన్‌ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, తనయుడు కోట్ల రాఘ వేంద్రరెడ్డి కలిశారు. వారం పది రోజుల్లోగా కోట్ల కుటుంబం టీడీపీలో చేరుతుందని అందరూ భావించారు. అయితే కార్యకర్తల అభిప్రాయాలు తీసుకునేందుకు సమయం తీసుకున్నారు. కార్యకర్తలు సానుకూలంగా స్పదించడంతో సైకిల్‌ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. జిల్లాకు గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టు, ఎల్లెల్సీ బైపాస్‌ పైప్‌లైన్‌ కెనాల్‌ ఇస్తే టీడీపీలో చేరేందుకు సిద్ధమని కోట్ల ప్రకటించారు. ఈ మూడు ప్రాజెక్టులతో పాటు ఆర్డీఎస్‌ ప్రాజెక్టుకు కూడా ముఖ్యమంత్రి అనుమతులు, నిధులు ఇస్తూ జీవో జారీ చేశారు.

kotla 25022019

దీంతో ఈ నెల 28న కోడుమూరులో నిర్వహించే భారీ బహిరంగ సభకు సీఎం చంద్రబాబును ఆహ్వానించి ఆయన సమక్షంలోనే టీడీపీలో చేరాలని కోట్ల కుటుంబం ఏర్పాట్లు చేసుకుంది. 28న కేఈ ప్రతాప్‌ కుమారుడి పెళ్లి.. ఈ నెల 28న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్‌ టీడీపీ ఇన్‌చార్జి కేఈ ప్రతాప్‌ కుమారుడు కేఈ నితిన్‌, అక్షితల వివాహం గోవాలో జరగనుంది. పెళ్లికి రెండు మూడు రోజుల ముందే డిప్యూటీ సీఎం కేఈతో పాటు ఆయన కుటుంబ సభ్యులు గోవాకు వెళుతున్నారు. 28న కోట్ల కుటుంబం టీడీపీలో చేరాలని భావించింది. కోట్ల, కేఈ కుటుంబాల మధ్య దశాబ్దాల రాజకీ య వైరం ఉంది.

kotla 25022019

ఈ నేపథ్యంలో 28న కోడుమూరు సభకు రాలేకపోతే ప్రజలకు మరో విధంగా సంకేతం వెళ్లే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కోట్ల చేరిక సమయంలో రెండు కుటుంబాలు ఉంటేనే కార్యకర్తలకు మంచి సందేశం వెలుతుందని సీఎం భావించారు. దీంతో 28వ తేదీన నిర్వహించాల్సిన సభను మార్చి 2కి వాయిదా వేసుకోవాలని కోట్లకు సీఎం సూచించినట్లు తెలిసింది. దీంతో బహిరంగ సభ తేదీని 2వ తేదీ నిర్వహించాలని కోట్ల వర్గం నిర్ణయించింది. ఈ సభకు సీఎంను ఆహ్వానించేందుకు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సోమవారం అమరావతికి వెళుతున్నారు. సీఎంను కలిసి, కర్నూలు లోక్‌సభ స్థానంపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం.

Advertisements

Latest Articles

Most Read