దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ గ్రామసభలో చేసిన ప్రసంగం మార్ఫింగ్‌ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యవహారంలో మరో వైసీపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ పార్టీ మీడియా కో-ఆర్డినేటర్‌ కామిరెడ్డి వెంకట నరసింహారావును అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ కేసులో పెదపాడు మండలం తోటగూడెంకు చెందిన వైసీపీ నాయకుడు కత్తుల రవికుమార్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం సాయంత్రం దెందులూరు ప్రాంతంలోని శ్రీరామవరం గ్రామానికి చెందిన కామిరెడ్డి వెంకట నరసింహరావుని (నానీ) పోలీసులు.. ఆయన అత్తగారి ఇంటి దగ్గర అదుపులోకి తీసుకొన్నారు. నరసింహరావుకు ద్వారకా తిరుమల మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన యువతితో ఏలూరులో శుక్రవారం రాత్రే వివాహమైంది.

ycp 24022019

శనివారం సాయంత్రం వధువుతో కలిసి ఆయన తన అత్తవారి ఇంటికి చేరుకొన్నారు. అప్పటికే అక్కడ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఆ ఇంటికి చేరుకొన్న మరుక్షణమే పోలీసులు కామిరెడ్డిని తమతో తీసుకువెళ్లిపోయారు. ఈ సమాచారం వైసీపీ నాయకులకు తెలియడంతో, వారంతా త్రీటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌కు చేరుకున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికి కామిరెడ్డిని ఎక్కించిన వాహనం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొంది. దాన్ని అడ్డగించి వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇంతలో అక్కడకు వచ్చిన డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావుతో వాగ్వివాదానికి దిగారు. కామిరెడ్డిని వెంటనే విడుదల చేయాలని గట్టిగా డిమాండ్‌ చేశారు. వైసీపీ నాయకులతో డీఎస్పీ చర్చలు అర్ధరాత్రి దాటాకా కొనసాగాయి. మరోవైపు, వీడియో మార్ఫింగ్‌ వ్యవహారంలో కామిరెడ్డి ప్రమేయంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

 

ycp 24022019

ఇది ఇలా ఉంటే, జనసేన ప్రచార రథాలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఏటీ అగ్రహారంలో జనసేన పార్టీ నేత తోట చంద్రశేఖర్ ప్రచార రథాలపై రాళ్లు రువ్వారు. ఈ రాళ్ల దాడిలో ఇద్దరు మహిళా కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో వారిని జీజీహెచ్‌కు తరలించారు. వైసీపీ నేతల ఆక్రోశంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రచారరథాలను అడ్డుకోవాలని చూస్తే వైసీపీ నేతల ప్రచారాన్ని కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ దాడి తెలుసుకున్న లోకేష్, వైసీపీ దౌర్జన్యాలని ఎండగట్టింది.

సరిగ్గా నెల రోజుల క్రితం వరకు అభ్యర్థుల విషయంలో గందరగోళం, గెలుపు అవకాశాలపై సంశయంల మధ్య ఊగిసలాడిన జిల్లా తెలుగుదేశం ప్రభుత్వ కొత్త సంక్షేమ పథకాలతో ఊపిరి తీసుకొని, కొత్త శక్తుల సమీకరణలతో ఉత్సాహం కనిపిస్తోంది. అభ్యర్థుల విషయంలో ఒక్కో నియోజకవర్గంగా క్లారిటీ రావడం, కొత్త నేతలు పార్టీలో చేరే అవకాశాలు మెరుగుపడటం.. ఆశావహులు, అసంతృప్తుల సర్దుబాటుకు అధిష్ఠానం నేరుగా రంగంలోకి దిగడంతో తెలుగుదేశం ముఖచిత్రం మారుతోంది. పార్టీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. మొన్నటి వరకు దయనీయస్థితిలో ఉన్న నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో సీన్‌ మారిపోయింది. టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి పేరు ప్రకటించగానే ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి తిరుగులేదనుకున్న జనం ఆదాల పేరు ప్రకటనతో తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు.

nellore 24022019

మరోవైపు ఎన్నికల వ్యూహరచనలో భాగంగా మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ మద్దతు కూడగట్టుకున్నారు. రూరల్‌ నియోజకవర్గంలో బలమైన వర్గం కలిగిన మంత్రి సోమిరెడ్డిని కలిసి సాయం కోరారు. ఇక ప్రతిపక్ష పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులను ఆదాల తన వైపు తిప్పుకునే పనిని ప్రారంభించారు. కొద్ది రోజులుగా రెండు మూడు వర్గాలకు చెందిన నాయకులకు టీడీపీలోకి ఆహ్వానిస్తూ కండువాలు కప్పుతున్నారు. నగరానికి చెందిన కొంతమంది నాయకులకు పదవులు ఇవ్వడంతో అసంతృప్తి జ్వాల చల్లార్చినట్టు అయ్యింది. మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు ఎన్నికలలోపే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో అజీజ్‌తోపాటు ముస్లిం మైనారిటీ వర్గాల్లో సైతం ఉత్సాహం కనిపిస్తోంది. ఇక బీసీ వర్గానికి చెందిన జడ్‌.శివప్రసాద్‌, రెడ్డి సామాజికవర్గం నుంచి అనురాధకు కార్పొరేషన్‌ చైర్మన్ల హోదాలో రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవులు ఇచ్చారు. నగరంలో వేల కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనుల తాలూకు ప్రభావానికి తోడు ముఖ్య నాయకులను సంతృప్తి పరచడం ద్వారా నగర టీడీపీలో నూతనోత్సహం కనిపిస్తోంది.

nellore 24022019

సూళ్లూరుపేటలో వేనాటి.. టీడీపీకి కంచుకోట వంటి ఈ నియోజకవర్గం స్థానిక నాయకుల అసంతృప్తుల కారణంగా నీరసించిపోయింది. పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులకు ఇస్తున్న విలువ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న తమకు ఇవ్వడం లేదని పలువురు నాయకులు పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు. సీనియర్‌ నాయకుడు వేనాటి రామచంద్రారెడ్డికి టీటీడీ ట్రస్ట్‌ బోర్డు పదవి ఇవ్వడంతో ఆ పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కొత్తశక్తులను కూడగట్టుకునే పనిలో పడ్డారు. కలువాయి మండలం దాచూరు మత్స్యకార సొసైటీకి ఎన్నికలు నిర్వహించి టీడీపీ వర్గానికి చెందిన వ్యక్తిని గెలిపించుకున్నారు. రాపూరు మండలానికి చెందిన పాపకన్ను మధురెడ్డికి కురుగొండ్లకు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు సమక్షంలో వీరిద్దరి మధ్య సంధి కుదిరినట్లు సమాచారం. రాపూరు అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌గా మధురెడ్డిని నియమించడానికి రంగం సిద్ధమైంది. పెంచలకోన ఆలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి నియమించడానికి పావులు కదుపుతున్నారు.

 

ఏపీ సీఎం చంద్రబాబు వందశాతం ఓడిపోతారు అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం ఓటమికి కృషి చేసే కేసీఆర్, ఆయన సహచరులకు భంగపాటు తథ్యమని జోస్యం చెప్పారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ‘‘ఢిల్లీ మోడీ గారు, తెలంగాణ మోడీ కేసిఆర్ గారు, ఆంధ్రా మోడీ జగన్ గారికి కలలో కూడా చంద్రబాబు గారే గుర్తుకొస్తున్నారు అన్న విషయం ఈ రోజు కేటీఆర్ గారి మాటల్లో బయటపడింది. ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి 420 పార్టీతో జత కట్టిన కేసీఆర్ గారు తెలంగాణకే పరిమితమై చతికలపడ్డారు.

ktr 23022019

ఒక్క నాయకుడిని ఎదుర్కోలేక ముగ్గురు నాయకులు ఒక్కటై ఎన్నో కుట్రలు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమంలో పోటీ పడలేక, జగన్‌తో చేతులు కలిపి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే భారీ ప్రణాళికలతో తెరాస ముందుకొస్తున్న విషయం ఇవ్వాళ కేటీఆర్ మాటల్లో తేలిపోయింది. తెలుగుదేశం ఓటమి కోసం కృషి చేసే కేసీఆర్ ఆయన సహచరులకు భంగపాటు తప్పదు! ఇది తథ్యం!’’ అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. మరో పక్క, చంద్రబాబు నాయుడులపై కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు కౌంటర్ ఇచ్చారు.

ktr 23022019

వైసీపీ తరపున కేటీఆర్ వకాల్తా పుచ్చుకున్నారన్న నక్కా తెలంగాణలో ప్రజల సెంటిమెంటును రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన మీరు అభివృద్ధి మీద దృష్టిపెట్టాలని, గత ప్రభుత్వంలో ఇచ్చిన మ్యానిఫెస్టోలో పదిశాతం హామీలను కూడా అమలుచేయలేకపోయారని, దానిపై దృష్టి పెడితే ప్రజలకు మేలన్నారు. టీడీపీ తెలుగువాళ్ళ పార్టీ అయితే తెరాస తెలంగాణ పార్టీ అన్నారు. డబ్బు ఉందన్న అహంకారంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని, కుట్రలు జరుగుతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యలతోనే అర్ధమైపోతుందని, జగన్ లండన్ టూర్ కూడా కుట్రలో భాగమేనన్నారు.

అధికార విపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలు, నాయకుల వలసలతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన వేళ రాజకీయాలపై తెదేపా అధినేత చంద్రబాబు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఉదయం నుంచి అర్ధరాత్రి దాటేవరకూ నేతలతో ఎడతెరిపి లేని సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే దాదాపు 25 వేల మందితో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను శ్రేణులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ మార్గనిర్దేశం చేస్తున్నారు. టెలికాన్ఫరెన్స్‌ ముగిసిన తర్వాత తాజా రాజకీయాలపై వ్యూహ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీలోని కొందరు ముఖ్యనాయకులతో మంత్రాంగం సాగిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశాన్ని దెబ్బతీసేందుకు వైకాపా, భాజపా చేస్తున్న విమర్శలను దీటుగా తిప్పికొట్టేందుకు సీనియర్‌ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడైనా కుట్రకోణం దాగి ఉంటే దాన్ని వెంటనే బహిర్గతం చేసేలా సమాయత్తమవుతున్నారు.

jagan 24022019

ఇటీవల దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై వచ్చిన ఆరోపణలను తిప్పి కొట్టడమే ఇందుకు ఉదాహరణ అని పార్టీ వర్గాలు అంటున్నాయి. సదరు వీడియోను ఏమార్చిన విషయాన్ని ప్రజలకు తెలిసేలా చేయడంతో చింతమనేని సమస్య నుంచి బయటపడ్డారని పేర్కొంటున్నాయి. ఇక రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామంటూ కేసీఆర్‌ ప్రకటించడం, కేటీఆర్‌ వెళ్లి జగన్‌ను కలవడం, తెలంగాణ మంత్రి తలసాని తరచూ రాష్ట్ర పర్యటనకు రావడాన్ని నిశితంగా గమనిస్తున్న తెదేపా.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై హైదరాబాద్‌ వేదికగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్న ఆంధ్రా నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని నేతలకు వివరిస్తున్న చంద్రబాబు.. ఇటీవల పార్టీ మారిన అవంతి శ్రీనివాస్‌కు తెలంగాణలో కళాశాలలు ఉండడం, గతంలో పేపర్‌ లీకేజీ అభియోగాలు ఉండడం వంటి పరిణామాలను గుర్తు చేస్తున్నారు.

jagan 24022019

మరో ఎంపీ బంధువు ఇంట్లో ఐటీ దాడులు చేయించి అతన్ని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తుండడాన్ని టెలికాన్ఫరెన్సులో స్వయంగా లేవనెత్తుతున్న చంద్రబాబు వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. తనను ఆటోవాలాలందరూ డ్రైవర్ నంబర్ వన్ అంటున్నారని, రాష్ట్రాన్ని నడపగలిగే డ్రైవర్ చంద్రబాబేనంటున్నారని సంతోషం వ్యక్తం చేసిన సీఎం అక్కడినుంచి జగన్ పై విమర్శలు గుప్పించారు. ‘ఆటో యజమానులు అంతా నన్ను డ్రైవర్ నెంబర్ 1 అంటున్నారు. మేం ఆటోను భద్రంగా నడుపుతాం. మీరు రాష్ట్రాన్ని భద్రంగా నడిపిస్తారు అంటున్నారు. జగన్మోహన్‌రెడ్డికి డ్రైవింగ్ చేతకాదు. డ్రైవింగ్ స్కూల్ కు పోలేదు. డ్రైవింగ్ రానివాడికి వాహనం ఇస్తే యాక్సిడెంట్లే. జగన్‌మోహన్ రెడ్డికి రాష్ట్రం అప్పగిస్తే యాక్సిడెంట్లే’ అని కార్యకర్తలతో చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read