షెడ్యూలు ప్రకటించక ముందే కేంద్ర ఎన్నికల కమిషన్‌ తన అధికారులను ఏపి ప్రభుత్వం పై చూపించింది. కోడ్‌ రాకముందే ఇలా ఎందుకు దూకుడు ప్రదర్శించిందో, ఎవరి ఒత్తిడితో చేసిందో ఎవరికీ అర్ధం కాలేదు. పట్టుపట్టి మరీ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ రామారావును బదిలీ చేయించింది. జిల్లా కలెక్టర్‌గా ఆయన ఈనెల 9న బాధ్యతలు స్వీకరించారు. అంతలోనే ఆకస్మికంగా బదిలీ చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. దీనికి కారణాలేమిటని ఆరా తీసినప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. సీఈసీ సునీల్‌ అరోరా ఈనెల 12న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో విజయవాడలో సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, పోలింగ్‌ సిబ్బంది అందుబాటు, శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించారు.

ec 23022019 2

ఈ సందర్భంగా కలెక్టర్లు తమ జిల్లాల్లో పరిస్థితిపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. కానీ... శ్రీకాకుళం కలెక్టర్‌ రామారావు తన ప్రజంటేషన్‌ సరిగ్గా ఇవ్వలేకపోయారు. దీనిపై అప్పుడే ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి మూడు రోజులే అయ్యిందని, వివరాలన్నీ సమగ్రంగా తెలుసుకుంటానని రామారావు వివరణ ఇచ్చారు. అయినా ఈసీ సంతృప్తి చెందలేదు. ఢిల్లీకి వెళ్లగానే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ‘శ్రీకాకుళం కలెక్టర్‌ పని తీరు బాగలేదు. అక్కడ మరొకరిని నియమించండి’ అని సూచించింది. కొత్తగా బాధ్యతలు చేపట్టినందునే సరిగ్గా ప్రజెంటేషన్‌ ఇవ్వలేకపోయారని ప్రభుత్వం వివరించింది. అయినా... ఈసీ పట్టించుకోలేదు. ‘కలెక్టర్‌ను మార్చాల్సిందే’ అని పేర్కొంది. ఈసీతో ఘర్షణ ఎందుకనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అందుకు సమ్మతించింది.

ec 23022019 3

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేసి... ఆయన స్థానంలో మరొకరిని నియమించేందుకు ముగ్గురు పేర్లతో జాబితా పంపాలని ఈసీ కోరింది. నిజానికి... ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత కలెక్టర్‌ లేదా ఎస్పీని మార్చాల్సి వస్తేనే ఈసీకి ఇలాంటి అధికారం ఉంటుంది. కానీ... ఇప్పటి నుంచే ఈసీ ఈ అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురి పేర్లతో జాబితా పంపగా... విజయవాడ కమిషనర్‌గా ఉన్న నివా్‌సను ఈసీ ఎంపిక చేసింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) సిసోడియాను కూడా ఇటీవల ఈసీ మార్చేయడం గమనార్హం. సిసోడియా చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారని, మరొకరిని నియమించాలని ఈసీ కోరింది. దాంతో ప్రభుత్వం ద్వివేదీని సీఈవోగా నియమించింది. ఇప్పుడు... పరిస్థితిని వివరించినప్పటికీ ఈసీ ఏమాత్రం పట్టించుకోకుండా శ్రీకాకుళం కలెక్టర్‌ను మార్పించడం గమనార్హం.

పాకిస్థాన్ ప్రధానమంత్రిని నేను విశ్వసిస్తున్నానని, భారత ప్రధానిపై విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నానని బిజెపి అధ్యక్షుడు శ్రీ అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఆ వ్యాఖ్యలు నేను చేసినట్లుగా ఆధారాలు చూపించాలని సవాల్ చేస్తున్నాను. సైనికుల చావులను టిడిపి, టిఎంసి,కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నాయని అమిత్ షా అనడమే నీచ రాజకీయం. ఒకవైపు మీరు నీచ రాజకీయాలు చేస్తూ ఆ బురద మాకు అంటించాలని చూడటం అతి నీచం. మేము దేశం కోసం మాట్లాడాం..మీరు రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. పుల్వామా ఉగ్రదాడి మన గడ్డమీద జరిగింది. ఇంటలిజెన్స్ వైఫల్యం వల్ల జరిగిన దుర్ఘటన అది. 2013లో బీహార్ లో, కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడులపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోది చేసిన వ్యాఖ్యలు మీకు దేశద్రోహంగా కనిపించలేదా..? అప్పుడు నరేంద్రమోది చేసిన వ్యాఖ్యలు వీడియో క్లిప్పింగ్ లలో ఉన్నవి మీకు గుర్తు చేస్తాను.

shahletter 23022018 2

‘‘దేశ భద్రత ప్రధాని చేతుల్లో ఉన్నప్పుడు ఉగ్రవాదులకు హవాలా మార్గంలో డబ్బులు ఎలా అందుతున్నాయి..? ఉగ్రవాదులను నిలువరించే నిగ్రహం ప్రధానికి లేదా..? ఈ గడ్డ అంతా మీ చేతుల్లో, సైన్యం చేతుల్లో ఉంటే ఉగ్రదాడులు ఎలా జరుగుతున్నాయి..? అది ఇంటలిజెన్స్ వైఫల్యం కాదా.? మరి మీరెందుకు రాజీనామా చేయరు...? ’’ అని నరేంద్రమోది 5ప్రశ్నలు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు వేశారు. ఆ అంశమే నేను గుర్తు చేశాను. ఇప్పుడీ పుల్వామా ఉగ్రదాడికి బాధ్యతగా ప్రధాని పదవికి నరేంద్రమోది రాజీనామా చేస్తారా అని ప్రశ్నించాను. దానికి ఇంత ఉలికిపాటు బిజెపి నేతలకు ఎందుకో అర్ధం కావడం లేదు.నరేంద్రమోది మాట్లాడితే దేశభక్తి ఉన్నట్లు..? నేను మాట్లాడితే దేశభక్తి లేనట్లా..? మీరు చేస్తే గొప్ప రాజకీయం,మేము చేస్తే నీచ రాజకీయమా..?

shahletter 23022018 3

దేశభక్తి గురించి, దేశభద్రత గురించి అమిత్ షా ద్వారా పాఠాలు చెప్పించుకునే స్థితిలో నేను లేను. రక్తంలో దేశభక్తి అనిచెప్పేవాళ్లే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల కుంభకోణం ద్వారా దేశ ప్రతిష్టను జాతీయంగా, అంతర్జాతీయంగా దెబ్బతీశారు. ప్రతిపక్షాలపై ఈవిధమైన విమర్శల ద్వారా దానిని కప్పిపెట్టాలంటే అది దాగేది కాదు. ఒకవైపు 40మంది జవాన్ల మృతి దేశాన్ని కదిలించివేస్తే, ప్రజల హృదయాలను గాయపరిస్తే, ప్రధాని నరేంద్రమోది ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు..? తనకేమీ పట్టనట్లు డిస్కవరీ ఛానల్ షూటింగ్ లో 3గంటలు గడిపినట్లు మీడియాలో వచ్చినదానిపై జాతికి ఏం సమాధానం చెబుతారు..? నేనేమిటో, నా స్వభావం ఏమిటో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు దేశం మొత్తానికి తెలుసు. 40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఏనాడూ, ఎవరితో వేలు పెట్టి చూపించుకునే దుస్థితి నాకు రాలేదు. ఇకనైనా బిజెపి నేతలు నాపై చేస్తున్న అర్ధరహితమైన విమర్శలను, దుష్ప్రచారాన్ని కట్టిపెట్టాలి. చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని దేశానికి క్షమాపణలు చెప్పాలి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్

జాతీయ విపత్తు నివారణ సంస్థ మాజీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డికి కొందరు వైసీపీ అభిమానుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఇటీవల అమరావతి వచ్చిన ఆయన సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఏపీ సీఎం కాకుండా చూడాలంటూ చంద్రబాబుతో మర్రి అన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్‌ అభిమానులు కొందరు అమెరికాతో సహా దేశంలోని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బెదిరిస్తూ వాట్సప్‌ సందేశాలు పంపుతున్నారని శశిధర్‌రెడ్డి చెప్పారు. గురువారం ఉదయం నుంచి అపరిచిత వ్యక్తుల నుంచి నిరంతరాయంగా ఫోన్లు వస్తున్నాయని అన్నారు. వీటికి భయపడడం లేదని, నవ్వుకుంటున్నానని మర్రి వివరించారు.

gannvaarma 22022019

మంగళవారం అమరావతిలో మర్రి శశిధర్‌రెడ్డి, చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా చూడాలని సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సూచించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, ఆ నమ్మకం తమకు ఉందని వ్యాఖ్యానించారు. మంగళవారం అమరావతి వచ్చిన శశిధర్ రెడ్డి, చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికలపై ఇరువురూ చర్చించినట్టు సమాచారం. అలాగే, తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ కూటమిగా ఏర్పడినా ఆశించిన ఫలితాలు రాకపోవడానికి కారణాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. పొత్తు ఎందుకనే విషయాన్ని ప్రజలకు వివరించడంలో తెలంగాణ కాంగ్రెస్ విఫలమైందని, అందుకే ఓటమిపాలైనట్టు శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు భోగట్టా.

gannvaarma 22022019

రాష్ట్ర విభజన జరిగినప్పుడే ఏపీకి జగన్ సీఎం కాకుండా అడ్డుకోవాలని చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన మర్రి.. ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని, అరాచకం రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీడీపీయేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయని వివరించారు. తాము ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే జగన్ తాను అధికారంలోకి వచ్చాక చేస్తానని చెబుతుంటే జనాలు నవ్వుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. భేటీ అనంతరం మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుతో జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలిపారు. అయితే అప్పటి నుంచి, వైసీపీ ఆయన్ను వేధించటం మొదలు పెట్టింది.

కేరళ రాష్ట్రంలోని కొచిన్‌కు విజయవాడ నుంచి విమాన సర్వీసు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. మార్చి 1నుంచి కొచిన్‌కు విమాన సర్వీసు నడ పటానికి స్పైస్‌జెట్‌ సంస్థ ముందుకు వచ్చింది. తిరుపతి నుంచి వచ్చే ఈ సర్వీసు సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి వయా తిరుపతి మీదుగా కొచిన్‌ వెళుతుంది. తిరుగు ప్రయాణంలో మాత్రం కొచిన నుంచి బెంగ ళూరు మీదుగా విజయవాడకు తిరిగి తిరుపతికి ఈ సర్వీసు చే రుకుంటుంది. స్పైస్‌జెట్‌ సంస్థ తీసుకున్న నిర్ణయం మేరకు రెండు రాష్ర్టాలకు విమాన కనెక్టివిటీ ఏర్పడుతుంది. కొత్తగా కేరళ రాష్ర్టానికి కనెక్టివిటీ ఏర్పడుతుండడంతో శబరిమలై వెళ్ళేవారికి ఈ సర్వీసు బాగా ఉపయోగపడుతుంది. తిరుపతి, శబరిమలైలను రెండింటినీ దర్శించుకోవాలనుకునే వారికి కూడా ఈ సర్వీసు ఎంతగానో ఉపయోగపడుతుంది.

gannvaarma 22022019

మరో వైపు బెంగళూరుకు అదనపు సర్వీసు అనుసంధానమౌతుంది. బెంగళూరుకు ఇప్పటికే స్పైస్‌జెట్‌ సంస్థతో పాటు, ఇండిగో విమానయాన సంస్థ కూడా విమానాలను నడుపుతోంది. కోస్తా ప్రాంతంలో ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి కేరళకు వెళ్ళే వారి సంఖ్య అధికంగా ఉంది. ఇప్పటి వరకు ప్రైవేటు పర్యాటక సంస్థలు, ఐఆర్‌సీటీసీ వంటి సంస్థలు ప్రత్యేక ప్యాకేజీలు కల్పిస్తుండటంతో వాటికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడుతోంది. ప్రస్తుతం కొచిన్‌కు విమాన సర్వీసు ప్రారంభించటంతో ఈ సంస్థల మీద పరోక్ష ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కొచిన్‌కు ఎంత ఛార్జీ నిర్ణయిస్తారన్నది తెలియాల్సి ఉంది. అధికారికంగా త్వరలో స్పైస్‌జెట్‌ సంస్థ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

 

Advertisements

Latest Articles

Most Read