విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ పర్యటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. గత రెండు రోజులుగా ఉద్రిక్త వాతవరణం మధ్యే పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ ఉంది. జనవాణి కార్యక్రమాన్ని కూడా పవన్ రద్దు చేసుకున్నారు. మరో పక్క పోలీసులు కూడా పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇచ్చారు. ఇది ఇలా ఉంటే, పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి వెళ్లిపోతారని పోలీసులు భావించారు. పవన్ మాత్రం, ఏమి చెప్పకుండా ఇంకా విశాఖలోనే ఉన్నారు. అరెస్ట్ చేసిన వారిని వదిలి పెట్టాలని పవన్ డిమాండ్ గా ఉంది. పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగితే పరిస్థితి చేయి దాటి పోతుందని, పోలీసులు భయపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ ను బలవంతంగా తరలిస్తారని భావించారు. కొంత మంది అయితే అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం చేసారు. ఈ మొత్తం ఎపిసోడ్ నేపధ్యంలో, పవన్ కళ్యాణ్ ఇంకా నోవాటెల్ హోటల్‍లోనే ఉన్నారు. నోవాటెల్ హోటల్‍లో చుట్టూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. పవన్ స్ట్రాటజీ ఏంటో పోలీసులకు కూడా అంతుబట్టటం లేదు. నోవాటెల్ హోటల్ దగ్గర, భారీ స్థాయిలో పోలీసులను పెట్టారు. దాదాపుగా 00 మంది పోలీసులతో సిద్దంగా ఉన్నారు. ఏ క్షణం ఏమి జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది.
news
రాజమండ్రిలో వంగవీటి-పరిటాల భేటీ.. భేటీ పై ఆసక్తికర చర్చ..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న కుటుంబాలు పరిటాల - వంగవీటి. ప్రస్తుతం రెండు కుటుంబాలు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాయి. వంగవీటి రాధా, గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్నికల తరువాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గునకపోయినా, ఆయన మాత్రం ఇప్పటికీ టిడిపితోనే ఉన్నారు. వంగవీటి రాధా అమరావతి ఉద్యమానికి తమ మద్దతు తెలుపుతూ వచ్చారు. ఈ తరుణంలోనే, వంగవీటి రాధా అమరావతి పాదయాత్రలో పాల్గునటానికి, రాజమండ్రి వచ్చారు. అయితే ఇదే పాదయాత్రలో పాల్గునటానికి పరిటాల శ్రీరాం కూడా వచ్చారు. నిన్న వంగవీటి రాధా, పరిటాల శ్రీరాం కలిసి చాలా సేపు మాట్లాడుకున్నారు. ఇరువురూ ఒంటరిగా మాట్లాడుకోవటం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదటి సారి ఇరువురు నేతలు కలుసుకున్నారు. గతంలో కూడా వంగవీటి రాధాపై రెక్కీ జరిగినప్పుడు, శ్రీరాం అండగా నిలబడ్డారు.
పార్టీ మీడియా కో ఆర్డినేటర్ నరేంద్ర అరెస్టుపై డీజీపీకి లేఖ రాసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
సుప్రీం కోర్టు అదేశాలకు విరుద్దంగా సిఐడి పోలీసులు వ్యవహరించారు...వెంటనే నరేంద్రను విడుదల చేయాలి అని లేఖ. లేఖలోని అంశాలు:- టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రను సిఐడి పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. సుమారు 7 మంది వ్యక్తులు రాత్రి సమయంలో నేమ్ బ్యాడ్జ్ లు కూడా లేకుండా నరేంద్ర ఫ్లాట్‌లోకి ప్రవేశించి, తాము సిఐడికి అని చెప్పి అతన్ని తీసుకువెళ్లారు. ఆరోగ్య సమస్యలు ఉన్న నరేంద్ర ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే మొత్తం పోలీసు శాఖ బాధ్యత వహించాలి. ప్రతిపక్ష టీడీపీ నేతలు, క్యాడర్‌ను టార్గెట్ చేయడంలో సిఐడి పూర్తిగా నిమగ్నమైంది. సెక్షన్ 41A కింద నోటీసు ఇవ్వకుండా అరెస్టు చెయ్యాల్సిన అవసరం ఏముంది? ఇదే కేసులో అంకబాబును అరెస్టు చేసినందుకు కోర్టు సిఐడి పోలీసులకు షోకాజ్ నోటీసు జారీ చేసినవిషయం గుర్తులేదా? సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా రాత్రి సమయంలో నరేంద్రను అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటి? సిఐడి తనంతట తానే ఒక చట్టం అని భావిస్తుంది. వైఎస్సార్‌సీపీ ప్రతీకార రాజకీయాలకు సీఐడీ సహకారం విస్మయం కలిగిస్తోంది.అధికార పార్టీ ప్రయోజనాల కోసం సిఐడి దిగజారడం బాధాకరం. బాధితులను బెదిరించడం, కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం కోసమే పోలీసులు ఈ తరహా అరెస్టులు చేస్తున్నారు. దారపనేని నరేంద్రను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమ అరెస్టులు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాను.
అమరావతి పై, నేడు హైకోర్టులో కీలక విచారణ.. టెన్షన్ తో ఎదురు చూస్తున్న ప్రభుత్వ పెద్దలు..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు అమరావతి కేసు విచారణకు రానుంది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు, హైకోర్ట్ త్రిసభ్య ధర్మాసనం ముందుకు, అమరావతి కేసు పై వాదనలు విననున్నారు. గతంలోనే హైకోర్టు రాజధాని పై స్పష్టమైన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకసారి పార్లమెంట్ చట్టం ప్రకారం రాజధాని నిర్ణయం తీసుకున్న తరువాత, మూడు రాజధానులు అంటూ తీర్మానం చేసే అధికారం, రాష్ట్ర శాసనసభకు లేదని, ఇప్పటికే హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పు ఇస్తూనే, రాజధాని అమరావతి ప్రాంతంలో, మౌలిక వసతుల పనులు మొదలు పెట్టి, అభివృద్ధి పనులు కొనసాగించాలని సీఆర్డీఏకు స్పష్టమైన ఆదేశాలను హైకోర్టు జారీ చేసింది. అయితే ఈ తీర్పు అమలు చేయటం లేదు అంటూ, ఇప్పటికే రైతులు కోర్టు ధిక్కరణ పిటీషన్ ను హైకోర్టుఓ దాఖలు చేసారు. దీని పైన స్పందించిన హైకోర్టు, స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలి అంటూ, ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం గతంలో, తమకు 60 నెలల సమయం కావాలని అఫిడవిట్ వేసింది. అమరావతి పై రిట్ ఆఫ్ కంటిన్యూస్ మాండమస్ ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇవన్నీ పక్కన పెడితే, హైకోర్టు తీర్పుపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. వీటి అన్నిటి నేపధ్యంలో, ఈ రోజు హైకోర్ట్ ఏమి చెప్తుంది అనే విషయం పై సామాన్య ప్రజలతో పాటు, ప్రభుత్వం కూడా ఎదురు చూస్తుంది.