ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త బాదుడే బాదుడుకు  జగన్ ప్రభుత్వం సిద్దమయింది. మధ్య తరగతి గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం కరెంట్ షాక్ ఇచ్చింది. ఇళ్ళల్లో 500 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ వాడుకునేవారు  కొత్తగా ఏసీడీ ఛార్జీలు కట్టాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు అయితే  కమర్షియల్  వినియోగదారులు  మాత్రమే ఏసీడీ ఛార్జీలు ప్రభుత్వానికి చెల్లించేవారు. కాని ఇక నుంచి హౌస్ హోల్డ్ కనెక్షన్స్ నుంచి కూడా ఏసీడీ ఛార్జీల వసూలు చేయాలనీ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. దీనికి అనుగుణంగానే ఇప్పుడు వచ్చే కొత్త బిల్లులు ఏసీడీ ఛార్జీలతో కలిపి జారీ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే అపార్ట్‌మెంట్లలో కామన్ మీటర్ ఉండేవారికి అయితే భారీగా బిల్లులు వచ్చి పడుతున్నాయి. ఎవరికీ అయితే 500 యూనిట్లపై బడి విద్యుత్ వినియోగిస్తారో వారందరూ ఈ ఏసీడీ ఛార్జీలు కట్టలిందే అని ప్రభుత్వం కొత్త తరహాలో బాదుడు మొదలు పెట్టింది. ఇప్పటికే రోజురోజుకి పెరుగుతున్న  ఖర్చులతో పేద ,మధ్య  తరగతి వారు సతమతమవుతుంటే ,ప్రభుత్వం ఇలా రోజుకొక బాదుడు తో ప్రజల నెత్తిన గుదిబండ పెడుతుంది.

గత తెలుగుదేశం హయాంలో ఇంటలిజెన్స్ డిజిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాంగానే సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ ఆయన అప్పట్లో కోర్ట్ ని ఆశ్రయించారు. అయితే తాజాగా దీని పై సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది. అయన పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు, ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసి నెల అయినా ఇప్పటివరకు ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్తే ఇబ్బంది అని గ్రహించి, తాజాగా ఆయనకు ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్‍గా పోస్టింగ్ ఇచ్చింది. కాని అంత పెద్ద హోదాలో పని చేసిన ఆయనకు ఇలాంటి పోస్టింగ్ ఇవ్వటం పై, ప్రబుత్వం సర్వత్రా విమర్శలు ఎదుర్కుంటోంది.

రాజధాని రైతులు మరోసారి కోర్ట్ ని ఆశ్రయించారు. తమకు ప్రతి ఏటా ప్రభుత్వం ఇవ్వాల్సిన కౌలను ఈ ఏడాది మే 1వ ఇవ్వాల్సి ఉందని, అయితే ఈ రోజు వరకు కూడా తమ ఎకౌంటులో కౌలు జమ చేయలేదని రాజధాని రైతులు ఆందోళనలు వ్యక్త చేస్తున్నారు. గత మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఏడాది కోర్ట్ ను ఆశ్రయించిన తరువాతే వైసిపి ప్రభుత్వం తమకు కౌలు డబ్బులు ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది దాదాపుగా 34 వేల ఎకరాలు ఇచ్చిన 27 మంది రైతులకు 300 కోట్ల రూపాయల కౌలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది. ఈనెల అందరికి జమ చేస్తామని చెప్పినప్పటికీ ,ఇప్పటి వరకు ఇవ్వక పోవటంతో,రైతులు హైకోర్ట్ ను ఆశ్రయించారు. ప్రతి ఏడాది కూడా ఇదే తంతు జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేసారు. రాజధాని రైతు అయిన పోతినేని శ్రీనివాస రావు కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ ఈ రోజు విచారణకు రానుంది. ఈ పొలాల కౌలు ఆదాయం తప్పితే తమకు వేరే ఆదాయం లేదని, రాజధాని నిర్మాణం కోసమే ఈ పొలాలను ఇచ్చామని ,ఇది తప్పితే వేరే ఆదాయ మార్గం లేదని, కాని ప్రభుత్వం ఇలా ఎగ్గొట్టటం సరి కాదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ విషయం పై ఈ రోజు కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి

ఉపాధి హామీ పధకంబిల్లుల చెల్లింపులకు సంబంధించి ఈ రోజు హైకోర్ట్ లో కోర్ట్ దిక్కరణకు సంబంధించి విచారణ జరిగింది. ఈ విచారణకు సంభందించి రాష్ట్ర ఆర్ధిక శాఖ ,పంచాయితీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ , గోపాల కృష్ణ ద్వివేది తో పాటు పంచాయితీ రాజ్ కార్యదర్శి కోన శశిధర్ హైకోర్ట్ కు హాజరు అయ్యారు. అయితే పిటీషనర్ల తరుపున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.
కోర్ట్ దిక్కరణకు సంభందించి ఈ కేసుల్లో నేటి వరకు కూడా బిల్లులు ఇవలేదని ,గతంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పుకు సంభందించి బిల్లులు ఇవ్వకపోవడంతో ,మళ్ళి అదే పిటీషనర్లు ,అదే పిటీషన్లు దాఖలు చేసారని ఆయన హైకోర్ట్ దృష్టికి తీసుకోచ్చారు. ఈ సందర్భంగా హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ జ్యోక్యం చేసుకొని ,ఇటీవల కర్నూల్ లో ఇలాగే ఒక కాంట్రాక్టర్ పనులు చేయించుకొని బిల్లులు ఇవ్వక పోవడంతో ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడని ,తానూ పేపర్లో చదివానని , ఇప్పుడు వారి కుటుంబానికి ఎవరు ఆసరాగా నిలబడతారని ,హైకోర్ట్ న్యాయమూర్తి అధికారులను నిలదీసారు. వెంటనే 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చ్ వరకు CFMS ద్వారా బిల్లులు చెల్లింపులకు సంబంధించి ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ ను కోర్ట్ కు సమర్పించాలని హైకోర్ట్ ఆదేశించింది .రెండు వారాల్లోపు ఈ స్టేట్ మెంట్ ను కోర్ట్ కు అందచేయాలని హైకోర్ట్ ఆదేశించింది .

Advertisements

Latest Articles

Most Read