అంతర్గత కుమ్ములాటలు, పరస్పర అవినీతి ఆరోపణలతో సీబీఐలో చెలరేగిన సంక్షోభం పెను మలుపు తిరిగింది. మొయిన్‌ ఖురేషీ కేసును దర్యాప్తు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కొందరు అధికారుల నుంచి గుజరాత్‌కు చెందిన కేంద్ర బొగ్గు శాఖ సహాయమంత్రి హరిభాయ్‌ పార్థిభాయ్‌ చౌధురికి కోట్ల రూపాయల ముడుపులు ముట్టినట్లు సీబీఐ డీఐజీ మనీశ్‌ కుమార్‌ సిన్హా ఆరోపించారు. ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానా అవినీతి కేసులో నిందితులను రక్షించడానికి పీఎంవోను మేనేజ్‌ చేసినట్లుగా ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరిగినట్లు పేర్కొన్నారు. సంభాషణ జరిగిన రోజు రాత్రే ఆ కేసును దర్యాప్తు చేస్తున్న బృందాన్ని మార్చేసినట్లు ఆరోపించారు.

modi 20112018 2

ఇదే కేసులో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ డోభాల్‌, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సురేశ్‌ చంద్ర, గూఢచర్య సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (రా) అధికారి సామంత్‌ గోయెల్‌, ఆ సంస్థ మాజీ సంయుక్త కార్యదర్శి దినేశ్వర్‌ ప్రసాద్‌ వివిధ సందర్భాల్లో జోక్యం చేసుకున్నట్లు విచారణ సందర్భంగా తెలిసిందన్నారు. ఆయన తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సతీశ్‌ సానా సంబంధాలు సీబీఐలో చాలా లోతుగా వెళ్లినట్లు కనిపిస్తోందని మనీశ్‌ చెప్పారు. పరిస్థితులను ఇలాగే వదిలిపెడితే సీబీఐ కాస్తా ‘సెంట్రల్‌ బోగస్‌ ఇన్వెస్టిగేషన్‌’, ఈడీ కాస్త ‘ఎక్స్‌టార్షన్‌ డైరెక్టరేట్‌’గా మారిపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. అస్థానాపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌పై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరారు. పిటిషన్‌లో దిగ్భ్రాంతికర అంశాలు ఉన్నాయని సిన్హా తరఫు న్యాయవాది చెప్పారు.

modi 20112018 3

2018 అక్టోబర్‌ 20న సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదుదారు సతీశ్‌ సానాను ప్రశ్నించాం. సీబీఐ అధికారులపై తాను చేసిన ఫిర్యాదుకు కట్టుబడి ఉన్నట్లు సతీశ్‌ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలు వెల్లడించారు. అహ్మదాబాద్‌కు చెందిన విపుల్‌ అనే వ్యక్తి ద్వారా దర్యాప్తు అధికారుల నుంచి కేంద్ర మంత్రి హరిభాయ్‌ పార్థిభాయ్‌ చౌధురికి ఈ ఏడాది జూన్‌ తొలి పక్షం రోజుల్లో కొన్ని కోట్లరూపాయలు ఇచ్చినట్లు చెప్పారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా హరిభాయ్‌ సీబీఐలోని సీనియర్‌ అధికారులతో మాట్లాడారని వెల్లడించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాం. జూన్‌ తొలి పక్షం రోజుల్లో మరో కేంద్ర సంస్థ ఫోన్‌కాల్స్‌ని ట్యాప్‌చేసినట్లు మాకు సమాచారం అందింది. దాని ప్రకారం మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి, సతీశ్‌ సానా మధ్య ఒకటి, రెండుకోట్ల రూపాయలు పంపడం గురించి సంభాషణ నడిచింది.

వెలగపూడి సచివాలయం నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.11,000 వెచ్చించారని ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అజేయ కల్లం చెప్పడం ఆయన విశ్వసనీయతను పోగొట్టుకోవడమేనని ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు విమర్శించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం సాయంత్రం కుటుంబరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సచివాలయం 45 ఎకరాల్లో ఆరు భవనాలుగా నిర్మించామని, ఈపీసీ విధానంలో మొత్తం 3 ప్యాకేజీలుగా అప్పజెప్పామన్నారు. మొత్తం 6,20,000 చదరపు అడుగుల్లో నిర్మాణం చేపట్టామన్నారు. ప్రస్తుతం ఒక అంతస్తు నిర్మించినా ఏడంతస్తులకు వీలుగా పునాది వేయించామని చెప్పారు.

kutumbrao 20112018

చదరపు అడుగుకు రూ.2,312 ఖర్చుచేశామని చెప్పారు. భవనాల్లో పర్యావరణహిత ఏర్పాట్ల కారణంగా చదరపు అడుగుకు రూ.3521.61 ఖర్చయిందన్నారు. మొత్తంమీద రూ.5,834 వెచ్చించామని కుటుంబరావు చెప్పారు. మొబైల్‌ ఫోన్లు ఎక్కడ కొన్నామో, ఎవరికి పంచామో, రూ.450కోట్ల విలువైన భూములు ఎవరికి ఇచ్చేశామో ఆధారాలు చూపాలని డిమాండ్‌ చేశారు. రాజధానిలో రూ.10వేల కోట్ల పన్ను ఎగవేశారని భాజపా నేత జీవీఎల్‌ చెబుతున్నారు, మీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పన్నుల వసూళ్లకు మినహాయింపు ఇవ్వటం తెలియదా అని ప్రశ్నించారు.

kutumbrao 20112018

హాయ్‌ల్యాండ్‌ అగ్రిగోల్డ్‌ది కాదంటూ ప్రారంభమైన కొత్త నాటకంలో పాత్రధారులు ఎవరో బయటపడుతుందని, వ్యవహారం అరెస్టుల వరకు దారితీయవచ్చని కుటుంబరావు చెప్పారు. హాయ్‌ల్యాండ్‌ తనదే అంటూ బయటకొచ్చిన అలూరి వెంకటేశ్వరరావు ఆర్కాలీజర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎండీ అని చెప్పారు. అది కూడా అగ్రిగోల్డ్‌ సంబంధిత సంస్థే అని చెప్పారు. 2015 జనవరిలో ఆదాయపుపన్ను శాఖకు సమర్పించిన పత్రాల్లో రూ.146 కోట్లను ఆర్కాలీజర్‌కు బదలాయించిన విషయాన్ని ప్రస్తావించారని, అగ్రిగోల్డ్‌ ఆర్థిక వ్యవహారాలు చూసే ఉపాధ్యక్షుడు దాన్ని స్పష్టంగా పేర్కొన్నారని కుటుంబరావు వివరించారు.

జనసేన అధినేత‌ పవన్ కల్యాణ్‌ బీజేపీ పై చేసిన వ్యాఖ్యల పై ఒక టీవీ షో లో, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. బీజేపీని సమర్థిస్తున్నారా.. వ్యతిరేకిస్తున్నారా అని ముస్లిం నేతలు పవన్‌ను ప్రశ్నించగా ఎంతో పరిపక్వతతో సమాధానమిచ్చాడని గరికపాటి ప్రశంసల జల్లు కురిపించారు. ఆ వార్త పేపర్‌లో చదివినప్పుడు ఎంతో ఆనందించానన్నారు. బీజేపీని హిందూ పార్టీగా ఎందుకు చూస్తారని.. అదొక రాజకీయ పార్టీ అని.. ఈ రోజుల్లో గిరిగీసుకుని కూర్చోకూడదంటూ పవన్ చెప్పిన సమాధానం తనకు ఎంతో నచ్చిందన్నారు.

garikapati 20112018

కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలున్నప్పుడు ఏదో ఒక పార్టీతో కలిసి పనిచేయక తప్పదని పవన్ చేసిన వ్యాఖ్యలు అతడి రాజకీయ పరిపక్వతతను తెలియచేస్తున్నాయన్నారు. ఆ వ్యాఖ్యకు జోహార్ అన్నారు గరికపాటి. ఇలా అంటున్నానని తను పవన్ పార్టీని సమర్థిస్తున్నానని కానీ.. వ్యతిరేకిస్తున్నానని కానీ అర్థం కాదన్నారు. ఆ అవసరం తనకు లేదన్నారు. అయితే గరికపాటి వారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ ని తిట్టారో, పొగిడారో అర్ధం కాక పవన్ కళ్యాణ్ ఫాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. బీజేపీని వెనకేసుకుని వచ్చినందుకు, చురకలు అంటించారేమో అని అనుకుంటున్నారు.

garikapati 20112018

కాకినాడలో ముస్లింలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పవన్ మాట్లాడుతూ బీజేపీ పై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘దేశంలో ద్వితీయశ్రేణి పౌరులుగా అభద్రతాభావంతో జీవిస్తున్నాం. ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్న బీజేపీతో జనసేన బంధంపై ఒక ప్రకటన చేయాలి’ అని జవహర్‌ అలీ అనే న్యాయవాది పవన్‌ను కోరారు. దీనిపై పవన్‌ స్పందిస్తూ... ‘‘బీజేపీ అనేది హిందువుల పార్టీ కాదు.. అదొక రాజకీయపార్టీ. బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు... ఆ పార్టీ సంఘ్‌తో ఉంటుందని చాలామంది చెప్పారు. అలాగైతే ఈ దేశంలో ఎవ్వరితోనూ దోస్తీ చేయలేం. ఇదే టీడీపీ గోద్రా అల్లర్ల సమయంలో మోదీని విమర్శించింది. ఆ తర్వాత మళ్లీ చేతులు కలిపింది. ప్రాంతీయ పార్టీలు వాటిలో ఏదో ఒకదానితో కలవాల్సిందే. జనసేనను బీజేపీలో విలీనం చేస్తే మీరు భయపడాలి’’ అని తెలిపారు.

నేను వీరుడుని, సూరుడుని.. నా వల్లే చంద్రబాబు గెలిచాడు.. నా వల్లే నరేంద్ర మోడీ గెలిచాడు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మా సేన సిద్దం అని చెప్పే పవన్ కళ్యాణ్, తెలంగాణా ఎన్నికల్లో తోక ముడిచాడు. ముందస్తు ఎన్నికలు వస్తాయి అని అనుకోలేదు, అందుకే మేము పోటీకి దూరం, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతాం అని చెప్పారు. అయితే, రెండు రోజుల క్రిందట, పవన్ కళ్యాణ్ ర్ధాంతరంగా తూర్పు గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ముంబై వెళ్లారు. పవన్ ముంబై పర్యటన పై ముంబై మిర్రర్ అసిస్టెంట్ ఎడిటర్ ఒక ట్వీట్ చేసారు. పవన్ ముంబై పర్యటన తరువాత మనసు మార్చుకున్నారు, తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అంటూ, ట్వీట్ చేసారు. అయితే, పవన్ ముంబై పర్యటనకు, ఈ నిర్ణయానికి సంబంధం ఏంటో అర్ధం కాలేదు.

pk 20112018 2

తరువాత తెలిసింది ఏంటి అంటే, అవార్డుల కార్యక్రమంలో పాల్గునటానికి కేటీఆర్ కూడా ముంబై వెళ్లారు. వీరిద్దరి మధ్యా చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ప్రాధమిక సమాచారం ప్రకారం, తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో, పవన్ కళ్యాణ్ తన అభ్యర్ధులని నిలబెడతారాని, ఆంధ్రా ఓట్లు చీలిక కోసం, ఈ ప్రయత్నం చేస్తున్నారని లీక్ ఇచ్చారు. అయితే, ఇక పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణాలో పోటీ చేస్తారని, హైదరాబాద్ లో, ఆంధ్రా ప్రజలు ఎక్కువగా ఉన్న చోట్ల పోటీ చేస్తారని, అందరూ అనుకున్న టైంల, నామినేషన్ చివరి గంటలో, మేము పోటీ చెయ్యటం లేదు అంటూ, పవన్ కళ్యాణ్ నుంచి ప్రెస్ నోట్ వచ్చింది. ఇలా ఎందుకు జరిగింది అనే దాని పై, ఆరా తియ్యగా, తెరాస వర్గాలు అసలు విషయం చెప్పాయి.

pk 20112018 3

కేటీఆర్, పవన్ కళ్యాణ్ ముంబైలో జరిగిన డీల్ తరువాత, ఇదే విషయం వచ్చి కేసీఆర్ కు చెప్పటంతో, కేసీఆర్ ఈ విషయంలో విముఖంగా ఉన్నారని చెప్తున్నారు. దానికి కారణాలు కూడా చెప్తూ, పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎలాగూ మనకే ఓట్లు వేస్తారు కదా, వాళ్ళు ప్రజా కూటమికి ఓట్లు వెయ్యరు కదా, మళ్ళీ ఇప్పుడు పవన్ పోటీ చేసి, ఉపయోగం ఏంటి ? ఖర్చులు బొక్క తప్ప, అని కేసీఆర్ అన్నట్టు సమాచారం. ఎలాగూ పవన్ ఫాన్స్ అందరూ మనకు వేస్తారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే, మన ఓట్లే కదా చీలేది, ఇలాంటి పిచ్చి పనులు చెయ్యద్దు, మీ ప్రయత్నాలు మానుకోండి అంటి కేటీఆర్ కి చెప్పినట్టు తెలుస్తుంది. పవన్ పోటీ చేస్తే, మన ఓట్లే చీలిపోతాయని కేసీఆర్ చెప్పటంతో, కేటీఆర్ ఆ నిర్ణయం పవన్ కు చెప్పి, పవన్ ను పోటీ నుంచి విరమించినట్టు తెలుస్తుంది. అందుకే నామినేషన్ల చివరి నిమిషం దాకా, జనసేన ఏ నిర్ణయం ప్రకటించలేదు.

Advertisements

Latest Articles

Most Read