ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధికార చిహ్నం మారింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ కలర్‌, నీలం, నలుపు తెలుపు రంగుల్లో చిహ్నాన్ని ఖరారు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వినియోగించిన అధికారిక చిహ్నంలో పలు మార్పులు చేసి...అమరావతి శిల్ప కళ స్ఫూర్తితో దీన్ని తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధికార చిహ్నంలో ఇప్పటి వరకు ‘పూర్ణ కుంభం’ ఉండేది. అయితే, అది తప్పని ప్రభుత్వం తేల్చింది. ఎన్నో ఏళ్ళుగా అధికారులు, ప్రభుత్వాలు ఈ తప్పు చేస్తున్నాయని తెలుసుకుని, ఇప్పుడు సరిదిద్దారు. దీనిలో చుట్టూ త్రిరత్నాలు, మధ్యన అందంగా ఉన్న ఆకులు, రత్నాలతో అలంకరించిన ధమ్మ చక్క (ధర్మ చక్రం) ఉంటుంది.

ap 15112018 2

క్రీస్తు శకం ఒకటో శతాబ్దిలో ధాన్య కటక మహా చైత్యానికి విధికుడు అనే చర్మకారుడు బహూకరించిన పున్న ఘటం (పూర్ణఘటం) చిహ్నం మధ్యలో ఉంటుంది. పూర్ణఘటం చుట్టూ ఉన్న మూడు వృత్తాలు వరుసగా 48, 118, 148 ముత్యాలతో అలంకరించి ఉంటాయి. పూర్ణఘటం కింద జాతీయ చిహ్నమైన అశోక స్తంభంపై ఉన్న నాలుగు సింహాల బొమ్మ ఉంటుంది. చిహ్నం పైభాగంలో ‘ఆంధ్రప్రదేశ్‌’ అని, కింది భాగంలో ‘సత్యమేవ జయతే’ అని తెలుగులో రాసి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చిహ్నంలో ఇవి ఆంగ్లంలో రాసి ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చిహ్నం మధ్యలో ‘పూర్ణ కుంభం’ ఉండేది. కానీ ధాన్య కటక మహాచైత్యంలో ఉన్నది పూర్ణఘటమే తప్ప, పూర్ణ కుంభం కాదని...ఆ మేరకు అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని సాధారణ పరిపాలన విభాగం నిర్ణయించింది.

ap 15112018 3

ప్రముఖ స్థపతి, పురాతత్వ శాస్త్రవేత్త శివనాగిరెడ్డి తదితరులతో ఒక కమిటీని నియమించింది. వారి సూచనల మేరకు తగిన మార్పులతో అధికారిక చిహ్నాన్ని ఖరారు చేసింది. అధికారిక చిహ్నాన్ని ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదన్న విషయంలోను స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 1954నాటి నోటిఫికేషన్‌ ప్రకారం, అమరావతి సంస్కృతి నుంచి స్వీకరించిన పూర్ణఘటాన్ని తిరిగి అధికారిక చిహ్నంలో చేర్చాలని నిర్ణయించారు. దీని ప్రకారం... ధర్మచక్రంలో 64 గీతలు, పూర్ణ ఘటం చిత్రాన్ని చేర్చారు. నాలుగు సింహాల బొమ్మను అలాగే ఉంచారు. అదే సమయంలో గతంలో అధికార చిహ్నం పైభాగాన ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ అని ఆంగ్లంలో ఉండేది. ఇప్పుడు దాన్ని తెలుగులోకి మార్చారు. ఆంగ్లంలో కిందివైపు ముద్రించారు. సత్యమేవ జయతే అన్న సూక్తిని కూడా తెలుగులోకి మార్చి ముద్రించారు.

వైసీపీ టార్గెట్‌గా మరోసారి ట్వీట్ బాంబ్ పేల్చారు ఏపీ మంత్రి నారా లోకేష్. వైసీపీ-బీజేపీపై మధ్య రహస్య బంధం ఉందని.. సాక్ష్యం కూడా ఉందంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. లోకేష్ తన ట్వీట్‌లో ‘నిజమే.. రహస్య మిత్రుల బంధం బయటపడింది.. ప్రజలకు కూడా తెలిసిపోయింది. #BharatiyaJaganSamithiParty (భారతీయజగన్‌సమితిపార్టీ) అభివృద్ధికి ఎలా అడ్డుపడుతుందో’అంటూ సెటైర్ పేల్చారు. "Yeah, right! The ‘secret allies’ are spilling the beans over the ‘secret alliance’ which is ‘not a secret’ anymore! Good that people now know how #BharatiyaJaganSamithiParty are major obstacles for development."

lokesh 14112018 1

తెలుగురాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభ జన బిల్లు జగన్ వల్లే నిలిచిపోయిందని, జగన్ కోరిక మీదటే మోదీ ఈ బిల్లు రాకుండా చూశారని, దానికి ప్రత్యక్షసాక్షిని తానేనని వైసీపీకి మిత్రపక్షమైన టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ ప్రముఖ టీవీ ఛానల్ ద్వారా చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో విభేదాల కారణంగానే జగన్ అభిప్రాయానికి మోదీ పెద్దపీట వేశారని ఎంపీ వినోద్ చెప్పారు. కాపు, బోయల రిజర్వే షన్ల అంశం కేంద్రం పరిధిలో ఉంది. కేంద్ర పరిధిలో ఉన్న ఈ అంశాలు పూర్తి రిజర్వేషన్లు అమలైతే వైసీపీ కనుమరుగవుతుందన్న కార ణంతో అమలుకాకుండా చేయాలని మోదీ, జగన్ కు సహకరించారనేది అక్కడ చెప్పిన విషయం.

lokesh 14112018 3

మరో పక్క దుబాయ్ లో ఎన్నారై టీడీపీ సమావేశంలో లోకేష్ ప్రసంగించారు. తెలంగాణ ఎవరి హయాంలో అభివృద్ధి చెందిందో ఆ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు. విభజన సమయంలో తెలంగాణకు కూడా అనేక హామీలు ఇచ్చారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, అయినా కేంద్రాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క మాట కూడా అనడం లేదని విమర్శించారు. తెలుగువారంతా కలసికట్టుగా అభివృద్ధి చెందాలనేదే టీడీపీ ఆశయమని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు బీజేపీ తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే... దేశం బలంగా ఉంటుందని చెప్పారు.

ఒడిశా ముఖ్యమంత్రి, బిజద అధినేత నవీన్‌ పట్నాయక్‌ గమ్యం ఎటువైపు ! భాజపాయేతర పార్టీలన్నిటినీ ఒకే తాటిపైకి తెచ్చి 2019 ఎన్నికలను ఎదుర్కోవాలన్న ధ్యేయంతో ఆంధ్రప్రదేశ్‌ సీఎం, టీడీపీ అధినేత ఎన్‌.చంద్రబాబునాయుడు పావులు కదుపుతున్నారు. ఈ నెల 22న దిల్లీలో మహాకూటమి నేతలంతా ఒకేచోట సమావేశమయ్యేలా ఆయన ముమ్మర సన్నాహాలు చేస్తున్నారు. ఇదివరకు ఆయన ఆయా పార్టీల అగ్రనేతలతో ఈ విషయమై మాట్లాడారు. మంగళవారం ఆయన ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడి హస్తినలో ఏర్పాటయ్యే సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించారు. వీరిద్దరూ మంచిమిత్రులు.

cbn 14112018 2

ఈ కార్యక్రమంలో నవీన్‌ పాల్గొంటారా లేదా ! అన్నది అస్పష్టం. భాజపా, కాంగ్రెస్‌లకు తాము సమానదూరంలో ఉంటానని, భవిష్యత్తులో ఇదే పంథా కొనసాగిస్తానని, అదే బిజద లక్ష్యమని ఆయన పునరుద్ఘాటిస్తూ వచ్చారు. జీఎస్‌టీ, నోట్ల రద్దు తదితర నిర్ణయాలు, కీలక బిల్లులు భాజపా పార్లమెంటులో ప్రవేశపెట్టిన సమయాల్లో నవీన్‌ మద్దతుగా నిలిచారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎన్డీఏ పక్షాన ఉన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని కేంద్ర రాజకీయాల పట్ల ఆసక్తి లేదని పలుసార్లు పేర్కొన్న నవీన్‌ చంద్రబాబు అభ్యర్థన మన్నిస్తారా? అన్నదిప్పుడు చర్చనీయంగా ఉంది.

cbn 14112018 3

దీనిపై సీనియర్‌ మంత్రి, బిజద ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ పాత్ర్‌ మంగళవారం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు, నవీన్‌ ఏం మాట్లాడుకున్నారన్నది తమకు తెలియదని చెప్పారు. కాంగ్రెస్‌, భాజపాలకు సమానదూరమన్నది తమ పార్టీ విధానమని, 22న ముఖ్యమంత్రి దిల్లీ వెళతారా ! అన్నదానిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ అగ్రనేత శ్రీకాంత్‌ జెనా మాట్లాడుతూ నవీన్‌ అంతర్యం ఎవరికీ బోధపడదని, ఆయన పక్కా అవకాశవాది అని అభివర్ణించారు. స్వీయ ప్రయోజనాలకే పెద్దపీట వేసే ఆయనకు భాజపాతో లోపాయికారీ సంబంధాలున్నాయని చెప్పారు.

మోదీ సర్కారు ఐటీ, సీబీఐ, ఈడీ వంటి సంస్థలను రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటోందన్నది విపక్షాల ఆరోపణ! ఈ జాబితాలో రాజ్యాంగ సంస్థ ‘కాగ్‌’ను కూడా చేర్చారా? ఇది... 60 మంది మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర కేంద్ర సర్వీసుల మాజీ అధికారులు చేసిన అభియోగం! దేశాన్ని కుదిపేవేస్తున్న నోట్లరద్దు, రాఫెల్‌ వ్యవహారాలపై మౌనం ఎందుకు వహిస్తున్నారని 60 మంది మాజీ ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులు కంప్ట్రోలర్‌ అడిటర్‌ జనరల్‌ (కాగ్‌)ను నిలదీశారు. దేశ ప్రజలకు వాస్తవాలను వెల్లడించాల్సిన కాగ్‌ ఉద్దేశపూర్వకంగానే ఈ అంశాలపై ఆడిట్‌ నివేదికలను తయారు చేయడంలో జాప్యం చేస్తుందని విమర్శించారు.

caag 14112018 2

ఈ చర్య వెనుక బిజెపి రాజకీయ ప్రయోజనా లున్నాయని, ఎన్నికల ఏడాది కావడంతో వాస్తవాలు బయటకు వస్తే ఆ పార్టీకి నష్టం జరగుతుందనే జాప్యం చేస్తున్నారని వీరు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పలు ప్రశ్నలను లేవనెత్తుతూ వారు కాగ్‌కు ఒక లేఖ రాశారు. అదే లేఖను రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌కూ పంపుతున్నట్లు తెలిపారు. లేఖపై సంతకాలు చేసిన వారిలో పంజాబ్‌ మాజీ డిజిపి జులియో రబిరో, అరుణారారు, పుణే మాజీ పోలీస్‌ కమిషనర్‌ మీరన్‌ బుర్వాన్‌కర్‌, ప్రసారభారతి మాజీ సిఇఓ జవహర్‌ సర్కార్‌, ఇటలీలో భారత్‌ మాజీ రాయబారి కెపి ఫాబియన్‌లతో పాటు కేంద్ర ప్రభుత్వ, అఖిల భారత సర్వీసులకు చెందిన పలువురు అధికారులు సంతకాలు చేశారు.

caag 14112018 3

‘‘సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్డీయే ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా కాగ్‌ జాగ్రత్తలు తీసుకుంటోంది. అత్యంత కీలకమైన నోట్ల రద్దు, రాఫెల్‌పై నివేదికలు ఇవ్వకుండా ఉద్దేశపూర్వక జాప్యం చేస్తోంది’’ అని వీరు ఆరోపించారు. వెంటనే ఈ రెండు అంశాలపై కాగ్‌ నివేదిక సమర్పించాలని... దీనిని శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుంచాలని డిమాండ్‌ చేశారు. ‘‘నోట్ల రద్దు ప్రభావం, బ్యాంకులు ఇచ్చిన సమాచారం, కొత్త నోట్ల ముద్రణకు పెట్టిన ఖర్చు, సంచిత నిధికి ఆర్బీఐ ఇచ్చిన డివిడెండ్‌... ఈ మొత్తంపై సమగ్ర పరిశీలనాత్మక నివేదిక సమర్పిస్తామని కాగ్‌ శశికాంత్‌ శర్మ 20 నెలల కిందట ప్రకటించారు. కానీ... ఇప్పటిదాకా ఆ నివేదిక ఊసే లేదు. రాఫెల్‌పైనా ఈ ఏడాది సెప్టెంబరులోనే కాగ్‌ నివేదిక ఇస్తుందని వార్తలు వచ్చాయి. దానిపైనా ఇప్పటికీ స్పష్టత లేదు. సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్డీయేను ఇబ్బంది పెట్టకూడదనే నోట్ల రద్దు, రాఫెల్‌పై కాగ్‌ మౌనం పాటిస్తోందనే అభిప్రాయం బలపడుతోంది’’ అని మాజీ అధికారులు తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read