పోలవరం ప్రాజెక్టులో కీలకమైన గేట్ల బిగింపునకు ముహూర్తాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. డిసెంబర్ 17న గేట్ల బిగింపును మొదలుపెట్టాలని జలవనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం 60x20 మీటర్ల కొలతలతో మొత్తం 48 గేట్లను సిద్ధం చేసినట్టు అధికారులు వివరించారు. ఏప్రిల్ నెలాఖరు కల్లా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాఫర్ డ్యామ్, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్ సహా ప్రధానమైన పనులు అన్నీ పూర్తి చేస్తామని అధికారులు తెలుపగా, నెలకు 10 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు ఉత్పత్తి చేసే క్రషర్లు ఇక నుంచి వినియోగిస్తున్నామని నిర్మాణ సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. ప్రపంచ రికార్డులు అన్నీ తిరగరాసేలా అత్యంత వేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. సోమవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో పోలవరం ప్రాజెక్టుతో సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

polavaram 05112018 2

పోలవరం ప్రాజెక్టుపై 80వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించిన ముఖ్యమంత్రికి కాంక్రీట్ పనులు అత్యంత వేగంగా చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు మొత్తం 60.33% పూర్తికాగా, తవ్వకం పనులు 80.10%, కాంక్రీట్ పనులు 45.60% పూర్తయినట్టు తెలిపారు. కుడి ప్రధాన కాలువ 90%, ఎడమ ప్రధాన కాలువ 65.03%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.91% పూర్తయినట్టు పేర్కొన్నారు. గత వారం స్పిల్ చానల్, స్పిల్ వే, పైలట్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 4.47 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు, స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 52 వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు పూర్తయినట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు నిర్మిస్తున్న కాలనీలలో మొదటిదశ పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి గడువు విధించారు.

polavaram 05112018 3

గడిచిన వారంలో 12% శాతం పనులు పూర్తిచేశామని అధికారులు వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్మిస్తున్న 17 కాలనీలకు సంబంధించి 46% పనులు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మిస్తున్న 29 కాలనీలకు సంబంధించి 42% పనులు పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే రహదారి ఉబికి, కుంగి, బీటలు వారిన దృశ్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. పోలవరం ప్రాంతంలో ఎటువంటి భూప్రకంపనలు కానీ, పేలుడు వంటివి జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. రహదారి కుంగిపోవడం వల్ల దెబ్బతిన్న విద్యుత్ లైన్లు సరిజేసి సరఫరా పునరుద్ధరించామని చెప్పారు. మట్టి నమూనాలు పరిశోధనశాలకు పంపి రహదారి ఎందుకు బీటలు వారిందో తెలుసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు గోదావరి-పెన్నా మొదటిదశకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు ఈ నెలాఖరుకల్లా అన్ని ప్రాధాన్య ప్రాజెక్టులకు టెండర్లు పిలవడం పూర్తి కావాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సర్వోన్నత న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం డిసెంబర్‌ 15 నాటికి పూర్తవుతుందని ఏపీ ప్రభుత్వం చెప్పినట్లు కోర్టు తెలిపింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై హైకోర్టు న్యాయమూర్తులు కూడా సంతృప్తి చెందారని, జనవరి 1న కొత్త రాజధానిలో హైకోర్టు ప్రారంభమవుతుందని ఆశిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అతిత్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హైకోర్టు కార్యకలాపాలు కొనసాగిస్తాయని అత్యున్నత న్యాయస్థానం ఆశాభావం వ్యక్తం చేసింది.

court 05112018

అమరావతిలో జస్టిస్‌ సిటీ నిర్మాణం కొనసాగుతున్నందున జడ్జిల నివాసం అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి సూచించింది. మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యాక హైకోర్టు విభజన పూర్తిస్థాయిలో జరుగుతుందని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. మరో పక్క పోయిన వారం, అమరావతిలో నిర్మిస్తున్న, జస్టిస్‌ సిటీ విశేషాలను చాటిచెప్పడానికి సీఆర్‌డీఏ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఢిల్లీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశాయి. సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ శాంతాన గౌడార్‌, జస్టిస్‌ వినీత్‌ సరన్‌, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ ప్రతిభా, జస్టిస్‌ సురేష్‌ ఖైత్‌, ఇతర న్యాయకోవిదులు పాల్గొన్నారు. జస్టిస్‌ సిటీ అద్భుతమని, ఇలాంటి నగరం దేశంలోనే ఉండదని పలువురు న్యాయమూర్తులు కొనియాడారు. జస్టిస్‌ సిటీ కలకాలం వర్ధిల్లాలని పలు కోర్టుల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులు ఆకాంక్షించారు.

court 05112018

జస్టిస్‌ సిటీ 3డీ డిజైన్ల ద్వారా న్యాయమూర్తులకు సిటీ వివరాలను, ప్రాముఖ్యతను, నిర్మాణ శైలిని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రవీంద్ర భట్‌ మాట్లాడుతూ.. జస్టిస్‌ సిటీ తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. జస్టిస్‌ సురేష్‌ ఖైత్‌ మాట్లాడుతూ.. తాను ఈ ఏడాది ఆగస్టు 18న జస్టిస్‌ సిటీ ప్రాంతాన్ని సందర్శించానని వివరించారు. కోర్టు హాళ్లు, ఇతర గదులను విశాలంగా నిర్మిస్తున్నారని చెప్పారు. జస్టిస్‌ ప్రతిభా మాట్లాడుతూ.. ఈ సిటీ కలకాలం నిలవాలని ఆకాంక్షించారు. అమరావతి ఎప్పుడూ అమరంగా ఉంటుందని స్పష్టం చేశారు. జస్టిస్‌ సిటీ పరిశీలనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని న్యాయమూర్తుల కమిటీ తరలి వస్తోంది.

‘‘వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కోడి కత్తి గా యం ఓ డ్రామా. కోడికత్తి గాకుండా ఎవడైనా పెద్ద కత్తి తో జగన్‌కు చిన్న గాయం చేసినా మా చంద్రబాబు కొంప మునిగేది. అక్కడ కూడా వైసీపీ వాళ్ల తెలివి పనిచేయలేదు. అంత తిక్క వ్యక్తి జగన్‌ సీఎం అయితే ఇక అంతే’’ అని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు 36వ ప్యాకేజీ కాలువలపై శాసనమండలి చీఫ్‌విప్‌ పయ్యావుల కేశవ్‌ చేపట్టిన రెండు రోజుల పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం ఉరవకొండ నియోజకవర్గం బెళుగుప్ప మండలం శీర్పి చెరువులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రజలు మరచిపోతారని, అయితే సాగునీరందిస్తే మాత్రం ఏళ్లకాలం గుర్తు పెట్టుకుంటారన్నారు.

jc 05112018

‘‘మా వాడు జగన్‌.. పేరుకు రెడ్డే కానీ రెడ్లకుండే దాతృత్వం లేదు. జగన్‌..! ఇప్పుడు కూడా నేను నీ మేలు కోరేవాడినే. నీకు ఇద్దరు కూతుళ్లున్నారు. చ క్కగా ఫ్యాక్టరీలున్నాయ్‌.. లక్షణంగా బతుకు. నేనే ఎన్నికల్లో పోటీ చేయకుండా రమించుకోవాలనుకుంటున్నా. కానీ చంద్రబాబు మరో పదే ళ్లు.. కనీసం ఐదు సంవత్సరాలు సీఎంగా ఉంటేనే అనంతపురం జిల్లా సస్యశ్యామలమవుతుంది. వచ్చే ఎన్నికల్లో 30 శాతం అభ్యర్థులను మార్చకపోతే చంద్రబాబుకు అధికారం గోవిందా. ఆయన ముందుచూపు న్న నాయకుడు. సీఎం కావాలనుకునే వ్యక్తి రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని కోరుకుంటారు. జగన్‌కు కామన్‌సెన్స్‌ లేదు. పట్టిసీమను చంద్రబాబు తీసుకొస్తే దాన్ని వద్దనేవాడుంటాడా? దశాబ్దాల కిందటే నిపుణులు ఈ రాష్ట్రంలో సాగునీటి సమస్య పరిష్కారానికి నదుల అనుసంధానమే మార్గమని సూచించారు.

jc 05112018

దాన్ని అమలు చేసి చూపించిన ఏకైక నాయకుడు చంద్రబాబు. జిల్లాలో నిర్మించిన బీటీపీకి నీరెప్పుడొస్తుందిరా.. అని మా నీలం సంజీవరెడ్డి అనేవాడు. ఆయన కలను ఇప్పుడు నిజం చేయబోతున్నారు. ఎవరూ ఊహించని విధంగా గోదావరి, కృష్ణా నదులను చంద్రబాబు అనుసంధానం చేశాడు’’ అన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రంలోని రైతాంగాన్ని సాగునీటి ప్రాజెకుల ద్వారా ఆదుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బీటీపీకి నీరందించేందుకు గతనెలలో భూమిపూజ చేశారన్నారు. అంతేగాకుండా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.

ఆయన ఒక సీనియర్ ఐఏఎస్.. దేశంలో ఎంతో మందిని చూసారు.. కాని ఈ రోజు చంద్రబాబు చూపిస్తున్న చొరవ చూసి శభాష్ అంటున్నారు.. సహజంగా ఒక తుపాన్ ,వరద వచ్చినప్పుడు ప్రకటించే ప్రభుత్వ నష్ట పరిహారం మళ్ళీ తుఫాన్ వచ్చే దాకా అతిగతి ఉండదు, అదికూడా అరకొరగా ఉంటుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిత్లీ తూఫాన్ బాధితులకు మాట ఇచ్చిన ప్రకారం 447.27 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించనుంది. నష్టపోయిన రైతులకు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి చెక్కులు ఇవ్వనున్నారు. ఇంత తక్కువ సమయంలో ఇలా నష్టపోయిన రైతులను భారత దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఎన్ని కష్టాలు ఉన్నా, లోటు బడ్జెట్ ఉన్నా, ప్రభుత్వం ఈ రోజు 447.27 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తుంది.

titlei 04112018 2

ఇన్ని ఏళ్ళు ప్రభుత్వాలు నష్టపరిహారం ఇస్తాం అని చెప్పటం, ఇవ్వకుండా మొహం చాటేయటం చూసాం. మా ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన మాట మీద నిలబడే ప్రభుత్వం అని నిరూపించింది. కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద విపత్తు సంభవిస్తే, కనీసం సహాయం చేయలేదు. కేంద్రం ఏ సహాయం చేయకున్నా, ప్రతిపక్ష పార్టీలు పల్లెత్తు మాట కూడా అనలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని ముఖ్యమంత్రి గారు, ఈ పరిహారం వెంటనే చెల్లించే ఏర్పాటు చేయటం చాలా ఉపయోగకరమైన, ఆనందకరమైన ప్రయత్నం. 447.27 కోట్ల రూపాయల చెక్కులు ఈ రోజు ముఖ్యమంత్రి గారు నష్టపోయిన రైతులకు పంపిణీ చేయనున్నారు. కేవలం 20 రోజుల్లోనే నష్టాలను అంచనా వేసి.. బాధితుల జాబితాలు రూపొందించి వారి ఖాతాల్లో సొమ్ములు జమ చేయడం దేశంలోనే ఒక రికార్డుగా ప్రభుత్వం భావిస్తోంది.

titlei 04112018 3

తుపాను కారణంగా జిల్లాలో 25 మండలాల పరిధిలోని 717 గ్రామాల్లో ప్రజలు నష్టపోయారు. ఇంత వరకు 4.30లక్షల మంది బాధితులు లెక్కతేలారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖచిత్రంతో గుంటూరులో నమూనా చెక్కులు తయారు చేస్తున్నారు. సోమవారం ఉదయం వరకు గ్రామాలకు చేర్చి.. పంపిణీ ప్రారంభిస్తారు. బాధితులకు ఇచ్చేవి నమూనా చెక్కులు మాత్రమే.. నగదు మాత్రం నేరుగా ఖాతాల్లో జమవుతుంది. శనివారం రాత్రే సొమ్ములు సర్దుబాటు చేయాల్సిందిగా ట్రెజరీ నుంచి ముంబయిలోని రిజర్వు బ్యాంకును కోరారు. సోమవారం ఉదయం ఆర్బీఐ నుంచి క్లియరెన్సు వస్తుందని భావిస్తున్నారు. మధ్యాహ్నానికల్లా జమ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు తేలిన అంచనాల మేరకు తొలిదశల్లో రూ.480 కోట్ల నుంచి రూ.490కోట్ల వరకు పంపిణీ చేయాల్సి ఉంటుందని, తమ పేర్లు లేవని ఫిర్యాదులు వస్తుండటంతో.. వీటిని పరిశీలించి మరో మిగతా మొత్తాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisements

Latest Articles

Most Read