పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెడుతుందో చూస్తున్నాం. ఒక పక్క డబ్బులు ఇవ్వకపోగా, మరో పక్క కొన్ని ఆకృతుల డిజైన్లు కూడా ఆమోదించకుండా, అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటివరకు ప్రాజెక్టుకు రూ.15,013 కోట్లు ఖర్చయ్యింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రూ.9,877 కోట్లు వెచ్చించగా, కేంద్రం నుంచి రూ.6,720 కోట్లు వచ్చాయి. ఇంకా రూ.3150 కోట్లు రావాల్సి ఉంది. ఈ ఖర్చు పై, రాష్ట్రానికి వడ్డీ భారం మళ్ళీ అదనం. అయితే కేంద్రం ఇలా ఇబ్బందులు పెడుతుంటే, రాష్ట్రంలో ప్రజలు మాత్రం, తమ వంతు సహాయం చేస్తూ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి పోలవరం యాత్ర పేరుతో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం తెలిసిందే. అన్ని జిల్లాల నుంచి రైతులు, పోలవరం నిర్మాణం చూడటానికి వస్తున్నారు.

polavaram 29102018 2

ఈ క్రమంలో, గుంటూరు జిల్లా, పెదరావూరు రైతులు కూడా పోలవరం చూడటానికి వచ్చారు. ఇక్కడకు వచ్చిన తరువాత, వాళ్ళు కేంద్రం ఇబ్బంది పెడుతున్న తీరు చూసి, వారి వంతుగా సహాయం చేసి, కేంద్రం సిగ్గు పడేలా, మీరు సహాయం చెయ్యకపోతే, మేము కట్టుకుంటాం అనే మెసేజ్ ఇస్తూ, కేంద్రం చెంప చెల్లు మనేలా, ఆ ఊరి రైతులు అందరూ కలిసి విరాళం ఇచ్చారు. పోలవరం నిర్మాణం కోసం ఏకంగా రూ. 16,45,101 సీఎం చంద్రబాబును కలిసి ఇచ్చారు. తెనాలి మండలం, పెదరావూరి గ్రామానికి చెందిన రైతులు ఒకసారి ఇంత పెద్ద మొత్తాన్ని అందజేశారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంవల్ల తమ పంట పొలాలకు పంట నీరు అందుతోందని, అందుకు కృతజ్ఞతగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నామని రైతులు పేర్కొన్నారు.

polavaram 29102018 3

పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరిచ్చి ఆదుకుంది చంద్రబాబేనని రైతులు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అడుగడుగునా అడ్డుపడినా, విపక్షాలు రాద్దాంతం చేసినా తాము మాత్రం అండగా నిలుస్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ మేరకు రైతులు అమరావతి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విరాళం అందజేశారు. పోలవరం నిర్మాణాన్ని సవాలుగా తీసుకున్నామని, ఏదిఏమైనా వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేయాలనేదే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ ఏడు నెలలే కీలకమని.. ఎగువ, దిగువ కాపర్‌డ్యామ్‌లు పూర్తి చేస్తే ప్రాజెక్టునుంచి నీళ్లివ్వగలమని తెలిపారు. ‘డిసెంబరులో గేట్ల పనులను ప్రారంభిస్తాం. మే 15, 20 తేదీలనాటికి పూర్తి చేస్తాం. స్పిల్‌ఛానల్‌, స్పిల్‌వే పూర్తి చేసి కుడి, ఎడమకాల్వలకు నీళ్లందిస్తాం. ఇది పూర్తి చేయగలిగితే అటు విశాఖ, ఇటు కృష్ణా జిల్లాలు సస్యశ్యామలం కావడంతోపాటు అన్ని జిల్లాలకు లాభం చేకూరుతుంది. వంశధార నుంచి పెన్నా వరకు అన్ని నదులనూ అనుసంధానించి నీరు ఎక్కువ, తక్కువలను సరిచేసుకునే వెసులుబాటు ఉంటుంది’ అని సీఎం వివరించారు.

అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యాక హైకోర్టు విభజనకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో ఈరోజు కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా డిసెంబర్‌ 15లోగా అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక విషయం తెలిపింది. ఈ తేది పై స్పష్టత లేకపోవటంతో, హైకోర్ట్ నిర్మాణం పూర్తి అవుతుందో లేదో అని అనుకున్న టైంలో, ఏపి ప్రభుత్వం తేల్చి చెప్పింది. న్యాయాధికారుల విభజనపై ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైందని ఏపీ తరపు న్యాయవాది నారీమన్‌ వెల్లడించారు.

highcourt 29102018 2

ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు భవనాలు నిర్మాణం పూర్తయ్యేవరకు హైకోర్టును ఎందుకు విభజించకూడదంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా రెండ్రోజుల క్రితమే ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌ కోర్టుకు సమర్పించింది. హైకోర్టు తాత్కాలిక భవనాల నిర్మాణం డిసెంబరు 15లోగా పూర్తవుతుంది కాబట్టి ఆ తర్వాత నోటిపికేషన్‌ విడుదల చేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది నారీమన్‌ ఇదే విషయాన్ని ఈరోజు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ న్యాయవాది వేణుగోపాల్‌.. ఏపీ ప్రభుత్వం అంత స్పష్టంగా చెబుతున్నందున భవన నిర్మాణాలకు సంబంధించి ఫోటోలను న్యాయస్థానానికి అందజేయాలని కోరారు.

అప్పుడప్పుడు మనం ఎదో సెటైర్ గా అనుకుంటూ ఉంటాం.. "అరేయ్ నీ చరిత్ర అంతా ఎదో ఒక రోజు పాఠాలుగా చెప్పుకుంటారు" అని.. కాని మన దివంగత రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన ఆత్మ కేవీపీ రామచంద్ర రావు గారు, ఇప్పుడు నిజంగానే పాఠాలకు ఎక్కారు. ఎదో ఒక చిన్న స్కూల్ లో అనుకునేరు, ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ప్రపంచంలోనే నెంబర్ వన్ అయిన యూనివర్సిటీలో రాజశేఖర్ రెడ్డి చరిత్ర అంటే మాటలా. ప్రతి వైఎస్ఆర్ అభిమాని, ముఖ్యంగా ఆయన పుత్ర రత్నం, కోడి కత్తి దాడిలో రెస్ట్ తీసుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి గారు, గర్వంతో కాలర్ ఎగరేయల్సిన సందర్భం ఇది..

stanford 29102018 2

ఇంతకీ ఏ ఘనకార్యం చేసారని, ఇలా పాఠాలు చెప్తున్నారు అనుకుంటున్నారా ? వీళ్ళకు అవినీతి, ఫాక్షన్ చరిత్ర తప్ప ఇంకా ఏముందు చెప్పుకోవటానికి. వీళ్ళ అవినీతి చూసి, దిమ్మ తిరిగిన స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ, ఇది ఒక అవినీతి కేసు స్టడీగా, ఇంత పెద్ద అవినీతి ఎలా చేస్తారు అనే విషయం పై, వాళ్ళ పిల్లలకు పాఠాలు చెప్తుంది. వీళ్ళ అవినీతి చరిత్ర రాష్ట్రం, దేశం దాటి ఇతర ఖండాలకు కూడా వ్యాపించింది. ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో పాఠాలుగా చెప్పబడుతున్న రాజశేఖర్ రెడ్డి ,కేవీపీ రామచంద్రరావుల అవినీతి చరిత్ర ఈ కింద లింక్ లో ఉంది. http://fcpa.stanford.edu/enforcement-action.html?id=499

stanford 29102018 3

టైటానియం కేసులో భాగంగా, ఇప్పటికే వీరి పేరు అంతర్జాతీయంగా మారు మోగుతుంది. అమెరికాలో కొన్ని డొల్ల కంపెనీలు పెట్టి, వాటిద్వారా, పన్నులేని దేశాల ద్వారా, ముడుపులు తీసుకొని, ఉక్రెయిన్ డాన్ ఫిర్టాష్ కు దాసోహం చేశారని, అమెరికా ఎఫ్ బి ఐ దర్యాప్తు మొదలెట్టి, మన కెవిపి & వైఎస్ పేర్లు, చార్జ్ షీట్లో చేర్చింది. మన వైఎస్ గారి ప్రతిష్ట, అంతర్జాతీయ స్థాయిలో, గుర్తింపుకు నోచుకొంటుంది. ఇదే కేసు విషయంలో ఇప్పుడు స్టాన్ ఫోర్డ్ పాఠాలు చెప్తుంది. Period of Bribery: 2006 - 2010, Total Bribery Payments: $18,500,000, Total Revenue Generated from Bribery: $500,000,000, Third-Party Intermediary: K.V.P. Ramachandra Rao , Agent/Consultant/Broker, Officials Potentially Influenced (Name; Title; Organization): K.V.P. Ramachandra Rao; Official; State government of Andhra Pradesh, Y.S. Rajasekhara Reddy; Chief Minister; State of Andhra Pradesh.. ఇలా కేవీపీని బ్రోకర్ గా చెప్తూ, వీళ్ళు చేసిన వేల కోట్ల కుంభకోణం గురించి చెప్పింది.

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పై కోడి కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు వైసీపీ అభిమాని అని ఘటన జరిగిన రోజునే తేలినా, అతను టీడీపీ కార్యకర్త అంటూ కొన్ని టిడిపి ఐడీ కార్డులు ఆదివారం బయటకు రావడం కలకలం రేపింది. జానిపల్లి శ్రీనివాసరావు, అతని సోదరుడు సుబ్బరాజు పేర్లతో ఉన్న ఆ ఐడీ కార్డులు ఫేక్‌ గా తెలుగుదేశం నాయకులు తేల్చారు. వారిద్దరూ టీడీపీ సభ్యులుగా చిత్రీకరించేందుకు జరిగిన కుట్రను ఛేదించారు. చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజంతా హైడ్రామాకు తెరతీసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు శ్రీనివాసరావు 2016లో టీడీపీ సభ్యత్వం పొందినట్లు 05623210 నంబరుతో ఒక గుర్తింపు కార్డు, అతని సోదరుడు సుబ్బరాజు కూడా అదే ఏడాది టీడీపీ సభ్యత్వం పొందినట్లు 05623209 నంబరు కలిగిన మరోకార్డు సోషల్ మీడియాలో షికారు చేశాయి.

varla 29102018

వాస్తవానికి దాడి జరిగినప్పుడే మీడియా ముందుకు వచ్చిన సుబ్బరాజు తాము ఏ పార్టీకి చెందిన వారం కాదని, తమ్ముడికి జగన్‌, వైసీపీలంటే ప్రాణమని చెప్పాడు. కానీ, అన్నదమ్ముల పేర్లతో సభ్యత్వ కార్డులు రావడం ‘విచిత్రం. ప్రచారంలో ఉన్న సభ్యత్వ కార్డులపై నంబర్లు ఉండటంతో, అవి అసలైనవో, నకిలీవో గుర్తించడం టీడీపీ నాయకులకు సులువైంది. ఆ నంబర్ల ఆధారంగా అసలు కార్డులను మీడియాకు విడుదల చేశారు. సుబ్బరాజు పేరుతో బయటకొచ్చిన 05623209 నంబరును కార్డును వాస్తవంగా ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గానికి చెందిన మొలకలపల్లి వెంకటరమణమ్మకు టీడీపీ జారీ చేసింది. అదేవిధంగా శ్రీనివాసరావు పేరుతో ఉన్న 056232210 నంబరు కార్డును బాపట్ల నియోజకవర్గ పరిధిలోని కర్లపాలెం మండలం గణపవరానికి చెందిన అంకాలు నంబూరికి కేటాయించారు.

varla 29102018

ఈ ఒరిజినల్‌ కార్డులు తీసుకొని వెంకటరమణమ్మ ఫొటో స్థానంలో సుబ్బరాజు ఫొటోను, నంబూరి అంకాలు స్థానంలో శ్రీనివాసరావు ఫొటోను ఉంచి తప్పుడు టీడీపీ సభ్యత్వ కార్డులను సృష్టించారు. ఈ ఆధారాలతో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య.. గుంటూరులో టీడీపీ రాష్ట్ర కార్యాలయం పరిధిలో ఉన్న అరండల్‌పేట పోలీ్‌సస్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. కుట్ర, మోసం, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం, మార్ఫింగ్‌ చేసి తప్పుడు కార్డుల సరైనవేనని చూపించడం, ఆధారాలు తారుమారు చేయడం, ప్రజాశాంతికి విఘాతం కలిగించడం తదితర అభియోగాలను ఫిర్యాదులో ప్రస్తావించారు. వీటి ప్రకారం ఈ నకిలీ కార్డుల అంశం పై ఐపీసీలోని 120 (బి), 420, 468, 469, 471, 201, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెస్ట్‌ డీఎస్పీ సౌమ్యలత తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read