వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడిపందాల కత్తితో జరిగిన దాడికి సంబంధించి.. ఘటనాస్థలంలో ఉన్న 15 మంది విపక్ష నేతలకు పోలీసులు నోటీసులు జారీచేశారు. విచారణకు హాజరుకావాలని రాజన్నదొర, కరణం ధర్మశ్రీ, మళ్ల విజయప్రసాద్‌, తైనాల విజయ్‌కుమార్‌, కేకే రాజు, సుధాకర్‌, చిన్నశ్రీను, కొండా రాజీవ్‌, వైసీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కృష్ణకాంత్‌ సహా 15 మందికి సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద నోటీసులు అందజేశారు. దీనికి ఆ పార్టీ నేతలు ఎవరూ స్పందించలేదని సిట్‌ అధికారులు తెలిపారు. కృష్ణకాంత్‌ ఒక్కరే సోమవారం పోలీసుల ఎదుట హాజరై వాగ్మూలమిచ్చారు. ఇంకోవైపు దాడిచేసిన నిందితుడు శ్రీనివాసరావు ఇంటరాగేషన్‌ కొనసాగింది.

jagana 30102018 2

ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌లో సోమవారం కూడా విశాఖ పోలీసు కమిషనర్‌ మహేశ్‌చంద్ర లడ్డా, సిట్‌ అధికారులు అతడిని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో చర్చ జరగాలనే తాను దాడికి పాల్పడినట్లు అతడు పునరుద్ఘాటించాడు. శ్రీనివాసరావుకు ఎవరైనా డబ్బులిచ్చి జగన్‌పై దాడికి పురిగొల్పి ఉండొచ్చనే అనుమానంతో సిట్‌ అతడి బ్యాంకు ఖాతాలపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. అతడికి ముమ్మిడివరంలోని ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అమలాపురం విజయా బ్యాంకుల్లో ఉన్న ఖాతాల్లో ఎంత డబ్బుంది.. వాటి లావాదేవీల వివరాలు సోమవారం సేకరించారు. ఎస్‌బీఐలో మూడు నెలల క్రితం రూ.70 వేల లావాదేవీలు జరగగా.. ప్రస్తుతం రూ.320 మాత్రమే నగదు ఉన్నట్లు తెలిసింది. ఆంధ్రాబ్యాంకులో రూ.45 నిల్వ ఉంది.

 

jagana 30102018 3

అమలాపురం విజయా బ్యాంకులో కేవలం ఖాతా తెరిచినప్పుడు వేసిన రూ.1000 మాత్రమే ఉంది. మొత్తంగా మూడు ఖాతాల్లో ఉన్నది రూ.1365 మాత్రమే. కాగా.. శ్రీనివాసరావు ఎస్‌బీఐ బ్యాంకు ఖాతాలో అతడు విశాఖ విమానాశ్రయంలోని ఫ్యూజన్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌ యాజమాన్యం రూ.40 వేలు జమ చేసింది (జగన్‌పై దాడి చేయకముందు). ఆ మొత్తాన్ని అతడు అదేరోజు డ్రా చేసినట్లు తెలిసింది. ఇంకోవైపు.. ఈ రెస్టారెంట్‌లో శ్రీనివాసరావుతో పాటు పనిచేస్తున్న సిబ్బందిని, సీఐఎ్‌సఎఫ్‌ అధికారులను కూడా సిట్‌ ప్రశ్నించింది.

ఆంధ్రప్రదేశ్‌ పై బీజేపీ యాక్షన్ ప్లాన్ ఊపందుకుందా ? చంద్రబాబు టార్గెట్‌గా బీజేపీ మరింత దాడిని పెంచబోతుందా? రాబోయే ఆరు నెలల్లో ఏం జరగబోతోంది? ఏపీలో ఎన్నికల వాతావరణం ముందే వచ్చేసింది. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చినప్పటినుంచి మొదలైన రాజకీయ యుద్ధం ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకుంది. ఎన్డీయే నుంచి బయటకొచ్చాక మోదీపై టీడీపీ యుద్ధం ప్రకటించింది. హోదా ఇవ్వకుండా మోదీ ఎలా మోసం చేసింది ప్రజలకు వివరిస్తూ.. ధర్మపోరాట దీక్షలు చేసింది. అవకాశం వచ్చిన ప్రతీసారి మోదీ తీరును చంద్రబాబు ఎండగట్టారు. అంతేకాదు రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు జగన్, పవన్‌తో కలిసి కుట్రలు పన్నారని ఆరోపించారు.

bjpactionplan 30102018 2

దీంతో చంద్రబాబు టార్గెట్‌గా బీజేపీ పావులు కదపడం ప్రారంభించింది. బాబు ఇమేజ్‌ను, టీడీపీని దెబ్బతీసేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. ఇందుకు తగినట్టుగానే బీజేపీ తెరవెనుక పావులు కదిపింది. తిరుమల రమణదీక్షితుల అంశంతో టీడీపీని రాజకీయంగా దెబ్బతీయాలని బీజేపీ చూసింది. ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత పీడీ ఎకౌంట్ల అంశాన్ని తెరపైకి తెచ్చి.. చంద్రబాబుకు ఇక్కట్లు తప్పవంటూ బీజేపీ నేతలు హెచ్చరికలు చేశారు. మరోవైపు కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై టీడీపీ ధర్నాకు దిగింది. దీంతో రాయలసీమ డిక్లరేషన్ పేరుతో బీజేపీ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ప్రాంతాలవారీగా రెచ్చగొట్టేందుకు బీజేపీ కొత్తపన్నాగం పన్నిందని టీడీపీ ఎదురుదాడి చేయడంతో కమలనాథులు వెనక్కితగ్గారు.

bjpactionplan 30102018 3

దీంతో టీడీపీని దెబ్బతీసేందుకు తన ఫార్ములాను బీజేపీ బయటకు తీసింది. ఐటీ దాడులతో టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంది. అలాగే ఓటుకు నోటు కేసును బయటకులాగి చంద్రబాబును ఇరుకున పెట్టాలని అనుకుంది. తాజాగా ఐటీ దాడులు, జగన్ పై కోడి కత్తి దాడి,అగ్రిగోల్డ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. అయితే దేనికీ భయపడబోమని, ఎంతకైనా సిద్ధమని టీడీపీ నేతలు ప్రకటించారు. మరోవైపు జగన్, పవన్‌తో బీజేపీ తెరవెనుక అవగాహన కుదుర్చుకుందని టీడీపీ మొదటినుంచీ ఆరోపిస్తూ వస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. త్వరలో ప్రభుత్వం మారిపోతుందని, ప్రభుత్వం ఏర్పాటులో కీలకం కాబోతున్నామని రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే, రాబోయే రోజుల్లో, బీజేపీ వైపు నుంచి, మరిన్ని ఇబ్బందులు రావటం తధ్యంగా టిడిపి నేతలు భావిస్తూ, మానసికంగా సిద్ధమవుతున్నారు.

కోడి కత్తి గుచ్చుడు దాడిలో, చిన్న గాయం అయ్యి, హైదరాబాద్ లోటస్ పాండ్ లో రెస్ట్ తీసుకుంటున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌ గాయాన్ని వైద్యులు ఈరోజు పరిశీలించారు. గాయం ఇంకా తగ్గలేదని, పూర్తిగా నయం కావడానికి ఆరువారాల సమయం పడుతుందని చెప్పారు. లోటస్‌ పాండ్‌లో ఆయన్ను పరిశీలించిన అనంతరం సిటీ న్యూరో సెంటర్‌ డాక్టర్ శివారెడ్డి మీడియాతో మాట్లాడారు. కోడికత్తితో చేసిన గాయంపై రక్త నమూనాల నివేదిక వచ్చిందని, అందులో ఎలాంటి విష నమూనాలు లేనట్లు గుర్తించామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం తెలియటంతో, వైసీపీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

jagan 30102018 2

ఇన్నాళ్ళు అది విషం పూసిన కోడి కత్తి ఏమో అని, జగన్ అన్నకు స్లో పాయిజన్ ఎక్కుతుంది ఏమో అని, ఖంగారు పడిన వైసీపీ అభిమానులు, ఈ వార్తా విని, మా అన్న ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడని సంతోషం వ్యక్తం చేసారు. మరో పక్క, పాదయాత్రకు వెళ్లాలనే అభిప్రాయంలోనే జగన్‌ ఉన్నారని, అయితే కొన్ని జాగ్రత్తలతో కొనసాగించవచ్చని తాము చెప్పినట్లు డాక్టర్ శివారెడ్డి వివరించారు. చేతిని కదిలించేటప్పుడు జగన్ నొప్పితో బాధపడుతున్నారని పేర్కొన్నారు. నొప్పి ఇంకా తగ్గకపోవడంతో జగన్ కు యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నట్లు డాక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు.

jagan 30102018 3

త్వరలోనే మళ్లీ ఆయన ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొననున్న నేపథ్యంలో చేతికి ఎక్కువ శ్రమ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామన్నారు. చర్మంపై వేసిన కుట్లు సాధారణంగా వారంలోనే మానిపోతాయనీ, అయితే కండరాలకు వేసిన కుట్లు మానడానికి మరికొంత సమయం పడుతున్నారు. జగన్ విషయంలో గాయం పూర్తిగా మానడానికి మరో 45 రోజులు పట్టే అవకాశముందని స్పష్టం చేశారు. పాదయాత్రకు వెళతానన్న కోణంలోనే జగన్ మాట్లాడారని తెలిపారు. కాని మేము మాత్రం, గాయం మానే దాక, 45 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్తున్నామని అన్నారు.

రాష్ట్రంలో గరుడ బ్యాచ్ కు, మరో పని పడింది. ఈ శుక్రవారం, రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్ళ పండుగ డైవర్ట్ చెయ్యటనికి రెడీ అవుతున్నారు. చ్చేనెల 2న, రాష్ట్రవ్యాప్తంగా మరోమారు 2 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇంటి నిర్మాణం పూర్తయిన పట్టణ ప్రాంతాల్లోని 50 వేలు, గ్రామీణ ప్రాంతాల్లోని 1.50 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించనున్నట్లు గృహనిర్మాణశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రకటించారు. వీటితో పాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పరిధిలోని హుద్‌-హుద్‌ తుపాను బాధితులకు నిర్మించిన ఇళ్లకు కూడా గృహ ప్రవేశాలు ఉంటాయన్నారు.

housing 30102018 2

మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6.88 లక్షల ఇళ్లు పూర్తైనట్లు చెప్పారు. జనవరి నాటికి 10 లక్షల ఇళ్లు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. దేశంలోనే సొంతంగా రాష్ట్రనిధులతో లక్షలాది ఇళ్లు నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేనన్నారు. మరోమారు గ్రామీణులకు 4 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, వీటితో కలిపి ఇప్పటివరకు పునాదిపడని మరో లక్ష ఇళ్లకు డిసెంబర్‌లో ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఒకేసారి ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

housing 30102018 3

వడ్డీ రేటు అధికంగా ఉన్నందున హడ్కో నుంచి రుణ సమీకరణపై పునరాలోచిస్తున్నట్లు వెల్లడించారు. మూడు బ్యాంకులు తక్కువ వడ్డీతో రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఇంటి నిర్మాణం పూర్తయినా ఇటుకల బిల్లు రానివారికి త్వరలోనే ఆ మొత్తాన్ని చెల్లించనున్నట్టు వివరించారు. తిత్లీ తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలో 16,362 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, వీరికి రూ.2.50 లక్షలతో ఇంటి నిర్మాణం చేపడతామన్నారు. మరో 34 వేల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. నిబంధనల పేరుతో కేంద్రం కావాలనే కొర్రీలు వేస్తూ గ్రామీణ ప్రాంతాలకు ఇళ్లను మంజూరు చేయడం లేదని విమర్శించారు.

Advertisements

Latest Articles

Most Read