తెలంగాణా ఎన్నికల నోటిఫికేషన్ రాగానే, చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి తెలంగాణా తెలుగుదేశం నేతలతో సమావేశం అయ్యి ఒక విషయం చెప్పారు. ఇక్కడ విషయాల్లో మీరే నిర్ణయాలు తీసుకోండి, నేను పెద్దగా పట్టించుకోను, తెలంగాణా బాగు కోసం, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, మీకు మద్దతు ఇస్తా అని చెప్పి వెళ్లారు. నిజానికి చంద్రబాబు ప్రచారానికి రాకపోతే, కేసీఆర్ ఎగితి గంతేయాలి. కాని, చంద్రబాబు ఏమి అనడులే, ఆయన స్వభావమే అంత అని అలుసుగా తీసుకుని, చంద్రబాబుని మళ్ళీ ఆంధ్రా ద్రోహిగా చూపించి, బూతు పురాణం మొదలు పెట్టాడు కేసీఆర్. చంద్రబాబుని ప్రతి మీటింగ్ లో టార్గెట్ చేస్తూ, తన పరిపాలన పై కాకుండా, కేవలం చంద్రబాబుని బూచిగా చూపి, ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ పసిగట్టిన చంద్రబాబు, ఇక ఏ మాత్రం ఉపేక్షించకూడదని డిసైడ్ అయ్యారు.

kcr 23102018 2

కేసిఆర్ కుయుక్తులు తిప్పి కొట్టాలని నిర్ణయించారు. ఇందు కోసం, తానే స్వయంగా రంగంలోకి దిగనున్నారు. కేసిఆర్ చెప్తున్నా అబద్ధాలకు, బూతు పురాణాలకు సరైన సమాధానంగా, తెలంగాణా ప్రజల వద్దకే వచ్చి, వారికే చెప్పటానికి నిర్ణయం తీసుకున్నారు. నాలుగు నుంచి అయుదు పబ్లిక్ మీటింగ్ లలో పాల్గుని ప్రచారం చేస్తానని, తెలంగాణా టిడిపి నేతలకు చెప్పారు. కేసీఆర్‌ నన్ను దూషిస్తూ మాట్లాడేదాన్ని ప్రజలే హర్షించడం లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘‘గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్‌ అభివృద్ధికి నేనెంతో కష్టపడ్డాను. అనేక ఐటీ పరిశ్రమలు తేవడంతో సైబరాబాద్‌ అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించి తొలుత ఇక్కడి నుంచి ఎమిరేట్స్‌కు తొలి విమానం నడిపేందుకు ఎంతో కష్టపడ్డాను. ప్రస్తుతం విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమానం నడిపేందుకు కష్టపడుతున్నాను"

kcr 23102018 3

ఇప్పుడు తెలంగాణలో తెదేపా ఉండొద్దు అన్నట్లుగా తెరాస పనిచేస్తోంది. తెదేపాకు వ్యతిరేకంగా తెరాస చేపడుతున్న చర్యలు, మాట్లాడుతున్న మాటలపై ప్రజలు ఆలోచిస్తున్నారు. కేంద్రంలో భాజపా పూర్తిగా విఫలమైంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇతర పార్టీలతో మాట్లాడి దానికి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నాలకు తెలంగాణలో ఇప్పుడు ఏర్పాటు చేసిన మహాకూటమి నాంది. ఇలాగే లోక్‌సభ ఎన్నికల్లోనూ కలసికట్టుగా భాజపాపై పోరాడాలని యోచిస్తున్నాం. తెరాస ఓటమే లక్ష్యంగా తెదేపా శ్రేణులన్నీ పని చేయాలి. తెలంగాణలో ప్రచారానికి నేను సైతం వస్తాను’’ అని వాఖ్యానించారు. మొత్తానికి సైలెంట్ గా అమరావతి, పోలవరం అంటూ తన పని తాను చేసుకుపోతున్న చంద్రబాబుని కెలికి మరీ, కేసీఆర్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు కేసీఆర్ బూతులని, చంద్రబాబు వివరణని చూసి, తెలంగాణా ప్రజలే నిర్ణయం తీసుకుంటారు.

కుండబద్దలు కొట్టేసి మాట్లాడే అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి, ఈ సారి కొంత మంది సొంత పార్టీ నేతలకే ఎర్త్ పెట్టారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పై ప్రజల్లో వ్యతిరేకత లేదని, ఆయనే ఎంతో కష్టపడుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉందని అన్నారు. అయితే పార్టీ ఎమ్మెల్యేల్లో 35-40 శాతం మంది పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వారిని కనుక మార్చితే మళ్లీ చంద్రబాబు గెలుపును దేవుడు కూడా ఆపలేరని తేల్చిచెప్పారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రజలకు చంద్రబాబుపై వ్య తిరేకత లేదు. మా జాతి చరిత్ర బాగోలేదు.. మా జాతి అంటే.. ఎమ్మెల్యేలు.. ఎంపీలం. బాగుండేవాళ్లను తెచ్చిపెట్టుకుంటే బాబే మళ్లీ సీఎం. నేను ఎప్పుడూ ఏ ఎమ్మెల్యే గురించీ అట్లా, ఇట్లా అని ఆ యనకు చెప్పలేదు’ అని వ్యాఖ్యానించారు.

jc 23102018 2

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, వైసీసీ అధ్యక్షుడు జగన్‌ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా వ్యక్తిగతంగా గెలుస్తారని, కానీ వారు నిలబెట్టిన అభ్యర్థులు గెలుస్తారని చెప్పడం అబద్ధమే అవుతుందని అన్నారు. జగన్‌, పవన్‌ భిన్న ధ్రువాలని, కలిసి పని చేయడం కష్టమని చెప్పారు. ‘‘జగన్‌ ముఖ్యమంత్రి అయితే డీజీపీని పిలిచి, ముందువెళ్లి జేసీ దివాకరరెడ్డిని అరెస్ట్‌ చేసి వచ్చి మాట్లాడు అంటారు.. జేసీపై కేసులేం లేవు కదా?.. అని డీజీపీ అంటే గంజాయి కేసు పెట్టయినా అరెస్టు చేయండని జగన్‌ చెబుతారు, తనకు ఎవరిపై కోపం ఉంటే వారందరినీ ఇలాగే అరెస్టు చేయిస్తారు, మోదీలాగే జగన్‌దీ ఫ్యాక్షన్‌ మనస్తత్వమే’’అని జేసీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ దాడుల విషయంలో ప్రధాని మోదీ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని జేసీ ఆరోపించారు. మోదీ తానొక్కడే బతకాలనుకుంటారని.. చం ద్రబాబు అందరూ బతకాలని కోరుకుంటారని అన్నారు.

jc 23102018 3

ప్రధాని, జగన్‌ది ఒకటే మనస్తత్వమని, ఇద్దరూ ఫ్యాక్షనిస్టుల్లా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా దెబ్బతింటే నేటి వరకూ ప్రధాని ఆ ఊసే ఎత్తక పోవడం, గుంటూరు వచ్చిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కనీసం బాధితులను పరామర్శించేందుకు శ్రీకాకుళం వెళ్లకపోవడం విచారకరమన్నారు. చంద్రబాబు పై కక్షతోనే రాష్ట్రానికి నిధుల కేటాయింపులో ప్రధాని వివక్ష చూపుతున్నారన్నారు. రాష్ట్రంలో ఐటీ దాడులు మరిన్ని జరుగుతాయన్నారు. జగన్‌ సీఎం అయితే తొలుత అరెస్టు చేసేది తననేనని చె ప్పారు. వచ్చే ఎన్నికల్లో తన కొడుక్కి టీడీపీ టికెట్‌ ఇవ్వాలని అడుగుతానని, నిర్ణయం చంద్రబాబు ఇ ష్టమన్నారు. బాబా ప్రభోదానంద మోసగాడని కలెక్టర్‌ నివేదిక ఇచ్చారని... దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో డీజీపీని అడగనున్నట్లు తెలిపారు.

జగన్ మోహన్ రెడ్డి అప్పుడే ఎన్నికలు గేలిచేసినట్టు, ముఖ్యమంత్రి అయిపోయినట్టు, క్యాబినెట్ మంత్రులని నియమించినట్టు కలలు కంటున్నారు. మర్రి రాజశేఖర్‌తో వచ్చిన గొడవలో జగన్ ఇలా ఫీల్ అయిపోతున్నారు. అసలు కధ ఏంటో తెలుసుకుందాం.. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్‌తో ఆ పార్టీ నాయకులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఆదివారం ఇక్కడ సమావేశమయ్యారు. వైసీపీ అధినేత జగన్‌ సూచన మేరకు చిలకలూరిపేటలోని మర్రి రాజశేఖర్‌ నివాసగృహానికి చేరుకున్న ఆళ్ల ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ నివాసం వద్దకు పెద్దఎత్తున చేరుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అనుచరులతో అయోధ్యరామిరెడ్డి మాట్లాడారు.

jagan 22102018 1

మర్రి రాజశేఖర్‌ సేవలను పార్టీ ఎప్పటికీ మరచిపోదని.. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన రాజశేఖర్‌ను గౌరవించుకోవడం తన బాధ్యత అని జగన్‌ చెప్పారని అయోధ్యరామిరెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, మర్రికి మంత్రి పదవి ఇస్తామని జగన్‌ తన మాటగా చెప్పమన్నారన్నారు. రాజశేఖర్‌ అన్నా, ఆయన కుటుంబం అన్నా జగన్‌కు ఎంతో గౌరవం ఉందన్నారు. రాజశేఖర్‌ నాయకత్వం గురించి కూడా జగన్‌కు తెలుసన్నారు. చిలకలూరిపేటలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా జగన్‌ అసెంబ్లీ సీటు విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

jagan 22102018 1

వచ్చే ఎన్నికలలో చిలకలూరిపేట నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో రాజశేఖర్‌ ఆలోచనలతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని జగన్‌ కోరారన్నారు. కొంతమంది కార్యకర్తలు మాత్రం మర్రికి అన్యాయం చేశారని వాపోయారు. రాజకీయాలలో సహనం, త్యాగం అవసరమని కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయోధ్యరామిరెడ్డి కోరారు. అనంతరం మర్రి రాజశేఖర్‌ కలుగజేసుకుని కార్యకర్తలకు సర్ది చెప్పారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు ఆయన నాయకత్వంలో పనిచేసి చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ గెలుపే లక్ష్యంగా కృషిచేస్తానన్నారు. అయితే కార్యకర్తలు మాత్రం, ఆయన ముఖ్యమంత్రి అవ్వకపోతే, మీకు కనీసం ఎమ్మల్యే కూడా ఉండదని, ఈ మాటలు నమ్మకుండా, టికెట్ కోసం ఒత్తిడి తేవాలని కోరారు..

మొన్నటి మొన్న సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తులు, మీడియా ముందుకు వచ్చి ప్రధాన న్యాయమూర్తి వ్యవహార శైలి పై చేసిన విమర్శలు మరువక ముందే, ఇప్పుడు సిబిఐలో టాప్ బాస్లు ఒకరి పై ఒకరు విమర్శలు చేసి, అరెస్ట్ లు దాకా వెళ్లారు. సీబీఐలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. దేశంలోనే అవినీతి వ్యహరాలను దర్యాప్తు చేసే అత్యున్నత సంస్థ సీబీఐ అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం, సీబీఐలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న అధికారులిద్దరూ ఒకరిపై ఒకరు 'ముడుపులు' తీసుకున్నారంటూ అవినీతి ఆరోపణలకు దిగడంతో కేసులు నమోదు వరకూ పరిస్థితి వెళ్లింది. సోమవారంనాడు వేగంగా మరికొన్ని పరిణామాలు చోటుచేసుకోవడంతో ప్రధాన మంత్రి కార్యాలయం తక్షణ చర్యలకు దిగింది. సీబీఐ చీఫ్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలకు సమన్లు పంపింది.

cbi 221020182

మాంసం వ్యాపారి మెయిన్ ఖురేషికి సంబంధించిన కేసులో ఆయనకు ఉపశమనం కలిగించేందుకు మధ్యవర్తి మనోజ్ ప్రసాద్ ద్వారా లంచం తీసుకున్నాడన్న ఆరోపణలపై స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాపై సీబీఐ ఆదివారంనాడు లంచం కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆస్థానాతో పాటు, అలోక్ వర్మకు పీఎంఓ సమన్లు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, సోమవారం ఉదయం సీబీఐ మరింత దూకుడుగా ముందుకు వెళ్లింది. ఆస్థానాపై ఉన్న లంచం ఆరోపణలకు సంబంధించి సిట్ సీబీఐ డిప్యూటీ ఎస్‌పీ దేవేంద్ర కుమార్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మనీలాండరింగ్, అవినీతి ఆరోపణలతో సహా పలు కేసులు ఎదుర్కొంటున్న ఖురేషి కేసులో ఆస్థానాతో కలిసి కుమార్ పనిచేస్తున్నారు.

cbi 22102018 3

అయితే ఇదే కేసు విషయంలో, సియం రమేష్ ను కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు బయటకు రావటం, మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాసం ఉండటంతో, రాజకీయ దుమారానికి తెరలేపడంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోక్యం చేసుకోలేక తప్పలేదు. సీబీఐలో టాప్‌ 2 స్థానాల్లో ఉన్న డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాకు ప్రధాని మోదీ సమన్లు జారీ చేసినట్లు సమాచారం. ఆస్థానా కేసు వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించింది. మోదీ నాయకత్వంలో రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు సీబీఐను ఆయుధంలా వాడుకున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు.

Advertisements

Latest Articles

Most Read