దేశంలో ఎవరికి వారు పెట్రోల్‌, డీజిల్‌ వినియోగంలో స్వీయ నియంత్రణ విధించుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రజల్ని చైతన్యం చేయాలని కేంద్రం భావిస్తోంది. అలాగే నిర్దిష్ట కాలపరిమితి చెల్లిన వాహ నాలు కాలుష్యంతో పాటు అధిక ఇంధన వినియోగానికి కారణమౌతున్నందున వాటిని వది లించుకోవాలని కూడా సూచించేందుకు సిద్దమౌతోంది. వ్యక్తిగత వాహ నాల వినియోగాన్ని వీలైనంతగా తగ్గించి ప్రజారవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని కూడా ప్రజల్ని కోరనుంది. ఇందుక్కారణం దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం వేగంగా పెరుగుతోంది. అదే స్థాయిలో వీటి దిగుమతికి కేంద్రంపై ఆర్ధిక భారం భారీగా పడు తోంది. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసే పరిస్థితి ఏర్పడుతుంది.

petrol 21102018 2

ఈ ఏడాది ఆగస్టులో దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు 17.98 మిలి యన్‌ టన్నులు జరిగాయి. గతేడాది ఆగస్టులో ఇది 16.91 మిలియన్‌ టన్నులు మాత్రమే. సరిగ్గా గతేడాది ఆగస్టుతో పోలిస్తే సుమారు ఐదుశాతం పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాల్లో వృద్ది చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌ వినియోగం 26మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు లేదా 35.36 బిలియన్‌ లీటర్లకు చేరుకుంది. దేశ జనాభా 132 కోట్లు కాగా సగటున ఏడాదికి ప్రతి వ్యక్తి 26.78 లీటర్ల పెట్రోల్‌ వినియోగిస్తున్నాడు. అలాగే డీజిల్‌ వినియోగం 82మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు లేదా 98.40బిలియన్‌ లీటర్లకు పెరిగింది. ప్రతి వ్యక్తి ఏటా సగటున 74.54లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నాడు. చైనాలో ఇందన సగటు వినియోగం 476లీటర్లుగా ఉంటే భారత్‌లో 175.3లీటర్లే. అయితే చైనాలో వినియోగిస్తున్న పెట్రోలియం ఉత్పత్తుల్లో 49.48శాతం మాత్రమే దిగుమతులు. అదే భారత్‌ కొచ్చేసరికి 78.35శాతం దిగుమతులపైనే ఆధాపడాల్సొస్తోంది.

petrol 21102018 3

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం వేగంగా పెరుగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ దిగజారిపోతోంది. ఈ రెండింటి కారణంగా పెట్రోల్‌పై చెల్లించాల్సిన విదేశీ మారకద్రవ్యం పెద్దెత్తున ఖర్చైపోతోంది. ఇది భారత ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పిజిల విక్రయాలపై సబ్సిడీల్ని తొలగించిన ప్రభుత్వం ఇకముందు వీటి వినియోగానికి రేషన్‌ విధానాన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్లు స్పష్టమౌతోంది. పెట్రో భారాన్ని తగ్గించుకునేందుకు ఇప్పటికే ప్రధాని సంబంధిత మంత్రులు, అధికారులు, నిపుణుల్తో పలుమార్లు సమావేశాలు జరిపారు. తక్షణం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్ని అందుబాటులోకి తెచే ఆలోచన చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని వీలైనంత తగ్గించే మార్గాలపై చర్చలు జరిపారు. ప్రత్యామ్నాయంగా విద్యుత్‌ వాహక వాహనాల్ని పెద్దసంఖ్యలో అందుబాటులో తేవాలని ప్రతిపాదించారు.

ఈ దశలో ప్రజల్ని పెట్రోల్‌, డీజిల్‌ వినియోగంలో స్వీయ నియంత్రణ పాటించే విధంగా చైతన్యపర్చాలని కేంద్రం నిర్ణయించింది. పెట్రోల్‌, డీజిల్‌లకు రేషన్‌ విధానం పెట్టాలని కూడా ప్రతిపాదించింది. స్కూటర్లు, కార్లు, లారీలు, ఇలా వాహనాన్ని బట్టి నిర్ధిష్ట పరిమాణాన్ని మాత్రమే వినియోగానికి అనుమతించాలని భావిస్తోంది. అలాగే కాలపరిమితి తీరిన వాహనాలు కాలుష్యంతో పాటు ఇంధనాన్ని అధికంగా వినియోగిస్తున్నందున నిర్దిష్ట కాలపరిమితి దాటిన వాహన వినియోగాన్ని కఠినంగా కట్టడి చేయాలని కూడా నిర్ణయించింది. వీటితో పాటు ప్రజారవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చి ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలన్న వ్యూహాలక్కూడా పదునెడుతోంది. ఎన్నికల ముందు లేదా ఎన్నికల తర్వాత ఏదో సమయంలో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగంపై ఆంక్షలు, రేషన్‌ విధానం అమల్లోకి తేవాలన్న కృతనిశ్చయంతో ఉంది.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను తిత్లి తుపాను అతలాకుతలం చేసిన నేపధ్యంలో ఆ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన సహాయ పునరావాస చర్యలు, చంద్రబాబు కష్టం పట్ల ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ మూడు రోజుల క్రిందట సంతృప్తి వ్యక్తం చేస్తూ, చంద్రబాబుని అభినందించిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతాల్లో చంద్రబాబునాయుడు ముందు చూపును ప్రదర్శించి సహాయ, పునరావాస కార్యక్రమాల నిర్వహణలో అధికార యంత్రాంగంతో చురుకుగా పనిచేయించారని అభినందించారు. ఈ మేరకు గవర్నర్‌ నరసింహన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అభినందన లేఖ రాసిన సంగతి తెలిసిందే.

pk 21102018 2

అయితే ఇప్పుడు ఇదే పాపం పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందిగా మారింది. స్పెషల్ ఫ్లైట్లలో తిరిగి, గోదావరి వచ్చి, కారులో కవాతు చేసి, ఆరు రోజుల తరువాత శ్రీకాకుళం వచ్చి, ఇంకా కరెంటు ఎందుకు ఇవ్వలేదు, అదెందుకు అవ్వలేదు, ఇది ఎందుకు చెయ్యలేదు అంటూ, పవన్ కొడుతున్న ఫోజులు చూస్తున్నాం. నిన్నటితో ఆ కాల్ షీట్లు అయిపోయాయి అనుకోండి, అది వేరే విషయం. అయితే, నేను ఇన్ని తిట్లు తిడుతుంటే, ఇప్పుడు గవర్నర్, చంద్రబాబుని పొగడటం ఏంటి అంతో పవన్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుని ఎవరూ పొగడకూడదని, తనలా అనవసరంగా తిట్టాలి అనే సంకేతాలు ఇస్తున్నారు.

pk 21102018 3

గవర్నర్ విషయంలో చంద్రబాబు మాట్లాడుతూ "చంద్రబాబు ఏం మేజిక్ చేశారో కానీ గవర్నర్ గారు కూడా సహాయక చర్యలు బాగున్నాయని పొగిడారని ఎద్దేవా చేశారు. సీఎంకు, గవర్నర్‌కు పడదని, కానీ అదే గవర్నర్‌తో పొగిడించుకున్నారని చెప్పారు". మరో పక్క రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ లోని అధికారులని కూడా పవన్ ఎద్దేవా చేసారు. తుఫాను ముందు రోజు, చంద్రబాబుతో పాటు, రియల్ టైం గవర్నెన్స్ లోని అధికారులు పని చేసారు. తుఫాను హెచ్చరికల కేంద్రం ఒరిస్సాలో తీరం దాటుతుంది అని చెప్తే, కాదు శ్రీకాకుళంలోనే తీరం దాటుతుంది అని కచ్చితంగా రియల్ టైం గవర్నెన్స్ ఉద్యోగులు చెప్పి, ముందే ప్రజలను అప్రమత్తం చేసారు. అయితే వీరిని కూడా పవన్ ఎద్దేవా చేస్తున్నారు. అన్నీ ల్యాప్‌టాప్‌లలో తెలుసుకునే ముఖ్యమంత్రికి టిట్లీ తుఫాను గురించి తెలియదా అని ప్రశ్నించారు. ఇదండీ పవన్ కళ్యాణ్ తెలివి..

ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ద్వారా పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో వచ్చే నెల నుండి రేషన్ దుకాణాల ద్వారా రూపాయికే కిలో రాగులు, జొన్నలు సరఫరా చేయ్యనుంది రాష్ట్ర ప్రభుత్వం. పేదలకు పౌష్టిక విలువలు ఎక్కువుగా లభ్యమయ్యే చిరుధాన్యాలను ప్రభుత్వం కారుచౌకగా అందించాలని నిర్ణయించింది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులు, జొన్నలను కేజీ రూపాయికే పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధం అయింది. వచ్చే నెల నుంచి జిల్లాలోని అన్ని చౌక డిపోల్లో తెల్లకార్డుదారులకు ప్రయోగాత్మకంగా అందించేందుకు సర్వం సిద్ధం చేశారు. 150 టన్నుల రాగులు, మరో 150 టన్నుల జొన్నలను జిల్లాలోని 16 సివిల్‌ సప్లై స్టాక్‌ గొడౌన్లకు పంపిణీ చేశారు.

ration 21102018 2

అయితే వీటి పంపిణీలో ఓ నిబంధన విధించింది. 2కేజీలు రాగులు, జొన్నలు తీసుకుంటే కార్డుదారునికి 2కేజీల బియ్యన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. జిల్లాలో 2217 చౌకడిపోలున్నాయి. దాదాపు 11లక్షల 10వేల మందికి పైగా తెల్లకార్డుదారులు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం ప్రతి నెల రూపాయికే కేజీ బియ్యం పంపిణీ చేస్తున్నది. ఇంటిలోని జనాభకు అనుగుణంగా 15 నుంచి 25 కేజీల చొప్పున బియ్యం అందిస్తుంది. అయితే రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువ మంది జొన్నలు, రాగులు తినడం ఆనవాయితీ. రాగిసంకటి, జొన్న రొట్టెలను అక్కడి ప్రజలు ఎక్కువుగా తింటారు. ప్రస్తుతం వీటి ధర మార్కెట్‌లో ఎక్కువుగా ఉండడంతో వీటిని కారుచౌకగా పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ration 21102018 3

ప్రస్తుతం నాణ్యత కలిగిన రాగులు కేజీ రూ.25 పలుకుతుంది. ఆదే రెండో రకమైతే రూ.15 నుంచి రూ.20 వరకు ఉన్నాయి. ఇక జొన్నలు మొదటి రకం కేజీ రూ.20 ఉండగా.. రెండో రకం రూ.15 నుంచి రూ 18 మధ్య ఉంది. ఈ ధరలు పేదలకు భారం కావడంతో బియ్యాన్ని తగ్గించి వాటి స్థానంలో రాగులు, జొన్నలు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దీన్ని నవంబర్‌ నెల నుంచి అమలు చేసేందుకు సిద్ధమైంది. వినియోగాన్ని బట్టి డిసెంబర్‌, జనవరి నుంచి బియ్యాన్ని తగ్గించి వీటిని ఎక్కువ మొత్తంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. మరోవైపు వీటి వినియోగం వల్ల అరోగ్యానికి కలిగే ఉపయోగాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని కూడా నిర్ణయించింది.

వైసీపీ నేత ఇంటి ఆవరణలోని గడ్డివాములో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చి పరిశీలించగా పెయింట్స్ బకెట్స్ లో పెట్టి గడ్డివాములో దాచిన నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామంలోని వైసీపీ నేత అనంతరెడ్డికి చెందిన నివాసంలోని పెరటిలో వున్న గడ్డివాములో నాలుగు నాటు బాంబులు లభ్యమయ్యాయి. క్లూస్ టీమ్, బాంబ్ స్వ్కాడ్ సహకారంతో పోలీసులు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ బాంబులు నివాసపు ఆవరణలో దాచి పెట్టి వుంచటానికి గల కారణాలేమిటి?

ycp 21102018 2

ఫ్యాక్షన్ గొడవలా? లేక రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుండే బాంబులను దాచి వుంచారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టుగా సీఐ తెలిపారు. పక్కా సమాచారంతో అనంతరెడ్డి పొలాల్లో తనిఖీలు చేపట్టామనీ, ఈ సందర్భంగా ఓ ప్లాస్టిక్ పెయింట్ డబ్బాలో దాచిన నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నామని సీఐ రాజగోపాల్ నాయుడు తెలిపారు. గత నాలుగు రోజులుగా అనంతరెడ్డి ఊరిలో లేడనీ, ఆయనపై పాత కేసులు చాలా ఉన్నాయని వెల్లడించారు. ప్రత్యర్థులను హతమార్చడానికే అనంతరెడ్డి ఈ బాంబులను దాచిపెట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. బాంబులు బయటపడ్డ నేపథ్యంలో పోలీసులు అనంతరెడ్డి కోసం గాలింపును ముమ్మరం చేశారు.

Advertisements

Latest Articles

Most Read