ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. తితలీ తుపాన్‌‌ ప్రభావంపై ఆరా తీశారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మోదీ. కాగా సీఎం చంద్రబాబుఅమరావతి నుంచి శ్రీకాకుళం వెళ్లారు. తొలుత విశాఖకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డుమార్గాన శ్రీకాకుళానికి చేరుకున్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా వాసులను పరామర్శించనున్నారు. సహాయ, పునరావాస చర్యలను పర్యవేక్షించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు నారాయణ, పితాని సత్యనారాయణ శ్రీకాకుళం చేరుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తితలీ తుపాను బీభత్సం సృష్టించింది.

cbn 12102018 2

బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం దాకా శ్రీకాకుళం జిల్లావాసులు ఊపిరి బిగబట్టుకొని గడిపారు. తుఫాను మిగిల్చిన బీభత్స ఛాయలు ఉద్దానంలో అడుగడుగునా కనిపించాయి. ఉద్దానంలో లక్షల ఎకరాల్లో కొబ్బరి చెట్లు సాగుచేశారు. పెను గాలులు, భారీ వర్షాలకు ఒక్కో ఎకరానికి 30శాతం చెట్లు నేలకూలి ఉంటాయని అంచనా. ఊపేసిన గాలులకు ఈ జిల్లాలో లక్షలాది చెట్లు, వేలాది విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. మొత్తం 12 మండలాల్లో తుఫాను గాలుల తీవ్రతకు పెను విధ్వంసం చోటుచేసుకుంది. కొబ్బరితోటలు లక్షలాది ఎకరాల్లో ధ్వంసం అయ్యాయి. 15వేలు దాకా విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి.

cbn 12102018 3

పలాస, సోంపేట తదితర మండలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఎగిరిపడ్డాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. అధికారులు, సహాయక బృందాలు సైతం తుఫాను తీవ్రత, గాలులకు భయపడి సాయంత్రం దాకా అడుగు బయటకు వేయలేకపోయారు. శ్రీకాకుళం జిల్లాలో జాతీయరహదారి రూపురేఖలు కోల్పోయింది. నరసన్నపేట దాటాక ఇచ్ఛాపురం వరకు హైవేపై వేలాది చెట్లు పూర్తిగా నేలకొరిగాయి. పలాసకు దగ్గరలోని కృష్ణాపురం టోల్‌గేట్‌ నేలమట్టమైంది. హైవే వెంబడి పదుల సంఖ్యలో ఉన్న పెట్రోల్‌ బంకుల పై కప్పులు ఎగిరిపోయాయి. హైవే పక్కన ఉన్న దాబాలు, హోటళ్లు దెబ్బతిన్నాయి. చెన్నై-కోల్‌కతా హైవేను ఆనుకుని ఉన్న పలుగెడ్డలు రోడ్డుపైకి పొంగిపొర్లడంతో ఆ దారిలో కొన్నిగంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. బొప్పాయిపురం వద్ద హైవేపై 15 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో 15వ ఆర్థిక సంఘం చైర్మెన్ ఎస్ కె సింగ్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏపీ పునర్విభజన చట్టం విషయంపై అయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో విభజన చట్టాల అమలులో ప్రత్యేక వ్యవస్థ వుండేది. ఏపి పునర్విభజన చట్టం అమలుకు ప్రర్యవేక్షణ వ్యవస్థ అనేదే లేదు. గతంలో విభజన చట్టం అమలులో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బాధ్యులుగా ఉండేవారు. ఏపి పునర్విభజన చట్టం పార్లమెంట్ కు వచ్చినప్పుడు నేను రాజ్యసభలోనే ఉన్నాను. ప్రత్యేక హోదా అంశం 15వ ఆర్థిక సంఘం పరిధిలోకి రాదు.. రెనెన్యూ లోటు భర్తీ విషయమై రాష్ట్ర ప్రతిపాదనలను పరిశీలిస్తాం ప్రత్యేక హోదాను తప్పించేందుకు 14వ ఆర్థిక సంఘాన్ని సాకు గా చూపారు అని అయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

hoda 11102018 2

ఆ అంశం తమ పరిధిలోనిది కాదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుతో సుదీర్ఘ సమావేశం అనంతరం సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి ఆయన అభిఫ్రాయాలను సేకరించారు. అనంతరం ఎన్‌.కె.సింగ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకహోదా.. రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సిన అంశమని చెప్పారు. ఏపీ అవసరాలపై తమకు సానుభూతి ఉందని, తమ పరిధిలో చేయగలిగినంత సాయం చేస్తామని ఎన్‌.కె.సింగ్‌ హామీ ఇచ్చారు. రెవెన్యూ లోటు భర్తీపై ఏపీ ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పారు. ఏపీ విభజన బిల్లు పార్లమెంటులో పాస్ అయినప్పుడు తాను కూడా రాజ్యసభలో ఉన్నానని తెలిపారు.

hoda 11102018 3

నాలుగేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతి, వృద్ధి గణాంకాలపై 15వ ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని సీఎం చెప్పారు. పునర్విభజన చట్టంలో పొందుపరచిన ఏ అంశాన్నీ అమలు చేయలేదన్నారు. అయినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. దేశ సంపద వృద్ధికి దోహదపడేలా మా కృషి సాగుతోందని పేర్కొన్నారు. పురోగామి రాష్ట్రాలను దెబ్బతీయడం మంచిది కాదని హితవు పలికారు. అభివృద్ధి చెందే రాష్ట్రాలకు చేయూత అందించాలని కోరారు. కేంద్రం ఇచ్చిన రూ.350కోట్లు వెనక్కి తీసుకుందని విమర్శించారు. 14వ ఆర్థిక సంఘంపై నెపాన్ని నెట్టి హోదాపై కేంద్రం మాటమార్చిందని సీఎం ధ్వజమెత్తారు.

భారతీయ జనతా పార్టీ ప్రజలకు సంతోషాన్ని పంచాలని చూస్తుంటే.. కాంగ్రెస్‌ మాత్రం సమాజాన్ని విడదీయాలని చూస్తోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా మోదీ నమో యాప్‌ ద్వారా రాయ్‌పూర్‌, మైసూర్‌, దమోహ్‌, కరోలి, ధోల్‌పూర్‌, ఆగ్రా ప్రాంతాల్లోని భాజపా కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఎన్నికల్లో గెలుపు సాధించడమనేది ముఖ్యమైన విషయం కాదు. దీని వల్ల మేము ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని పొందగలుగుతున్నాం. భాజపా ఐక్యత కోసం పోరాడుతుంటే.. కాంగ్రెస్‌ ఒక కుటుంబం లాభపడేందుకు ప్రజలను విడదీసేందుకు ప్రాధాన్యత ఇస్తుంది’ అని ఆయన విమర్శించారు.

modi 11102018 2

ప్రజలను ఏకం చేయడంలోనూ, వారికి ఆనందం పంచడంలోనూ భాజపా తరిస్తుంటే.. కేవలం ఒక కుటుంబ ప్రయోజనం కోసం కాంగ్రెస్‌ పార్టీ సమాజాన్ని విడగొడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. బుధవారం పలు లోక్‌సభ నియోజకవర్గాల భాజపా కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. గుజరాత్‌లో వలస కార్మికులపై దాడులు చెలరేగి, వారు సొంత రాష్ట్రాలకు తిరుగుముఖం పట్టడానికి భాజపాయే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలంటే... పార్టీ ప్రతిష్ఠకు సవాలు మాత్రమే కాదనీ, ప్రజలకు సేవచేసే అవకాశం కూడానని ఆయనపేర్కొన్నారు.

modi 11102018 3

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన పేరుతో ఒకే భాష మాట్లాడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌ విడదీసి ఒకరినొకరిని శత్రువులుగా చేసిందని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోను కాంగ్రెస్‌ అదే విధానాన్ని అవలంభించే అవకాశముందన్నారు. అయితే మోడీ వ్యాఖ్యల పై, ఏపి, తెలంగాణా ప్రజలు భగ్గు మంటున్నారు. ఇరు రాష్ట్రాల్లో ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చకుండా, సాక్షాత్తు పార్లమెంట్ లో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మంచోడు అని, ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రికి మేచురిటీ లేదని, చెప్పటం, ఇరు రాష్ట్రాల మధ్య తగాదా పెట్టటం కాదా అని ప్రశ్నిస్తున్నారు.

‘నేను ముఖ్యమంత్రినో, లేక మంత్రినో తెలియకుండానే పవన్‌ కళ్యాణ్‌ నన్ను ముఖ్యమంత్రిగా సంబోధించి మాట్లాడు తున్నారని.. అవగాహన లోపమా, లేక ఎద్దేవా చేయ డానికా..అంటూ ఎక్సైజ్‌ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ సూటిగా ప్రశ్నించారు. కొవ్వూరు బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ముగిసిన వెంటనే ఆయన విమర్శలు, ఆరోపణలపై మంత్రి జవహర్‌ బుధవారం సాయంత్రం నేరుగా స్పందించారు. విలేకరులతో మాట్లాడారు. పవన్‌ కళ్యాణ్‌ అర్థం పర్దం లేకుండా మాట్లాడుతున్నారని, ఎవరి హోదా ఏపాటిదో తెలియని అమాయకత్వం అనుకోవాలా.. లేక కావాలని పలచన చేసే విధంగా మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదని దుయ్యబట్టారు.

pk 1102018 2

కొవ్వూరులో డిగ్రీ కాలేజీ లేదంటూ పవన్‌ చేసిన విమర్శలను నేరుగా తిప్పికొట్టారు. ఇరవై సంవత్సరాల క్రితమే ఏబీఎన్‌ డిగ్రీ కాలేజీ ఉండగా, కొవ్వూరుకు అతి సమీపాన ఉన్న రాజ మహేంద్రవరం లోను డిగ్రీ కాలేజీలు ఉన్నాయని, త్వరలోనే మరో డిగ్రీ కాలేజీ అదనంగా కొవ్వూరుకు వస్తుందని మంత్రి జవహర్‌ చెప్పారు. పవన్‌ సీఎం చంద్రబాబును, నారా లోకేష్‌ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, అంతేతప్ప తెలుగుదేశం పనితీరును పరిగణనలోకి తీసుకోవడంలేదని తప్పుపట్టారు.

pk 1102018 3

తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభలోనూ పవన్‌ ఇష్టాను సారంగా మాట్లాడితే బహిరంగ లేఖ రాసామని, దీనిపై పవన్‌కళ్యాణ్‌ బదులు ఇవ్వలేకపోయారని జడ్పీ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు అన్నారు. కేవలం బీజేపీకి, జగన్‌కు అనుకూలంగా మారిన పవన్‌ నేరుగా తెలు గుదేశంపై విరుచుకుపడుతున్నారని స్పష్టమవు తుందని చెప్పారు. ‘ఎక్కడో కాదు... తెలుగుదేశం స్వయంగా కవాతుకు దిగితే కొవ్వూరు గోదావరి బ్రిడ్జిపై నాలుగున్నర కిలోమీటర్ల మేర జనంతో నిండిపోతుంది. అదికూడా మంత్రి జవహర్‌ నాయకత్వాన.. కొవ్వూరు వాసులతోనే’ అని బాపిరాజు సవాల్‌ విసిరారు.

Advertisements

Latest Articles

Most Read