ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో చిత్రవిచిత్రమైన సంఘటనలు కనిపిస్తున్నాయి. మొన్నటి దాకా, ప్రత్యేకహోదా కోసం, మిగతా విభజన హామీలు, ఆంధ్రా అభివృద్ధి కోసం పోరాడుతున్నది తామేనని, జగన్, పవన్ చెప్పుకున్నారు. కానీ అసలైన పోరాటం జరుగుతున్న సమయంలో మాత్రం ఈ ఇద్దరు నాయకులు పోరాటంలో పాల్గనకుండా చేతులు ఎత్తేయటమే కాక, పోరాడేవారిని కూడా బలీహన పరుస్తున్నారు. వీరు మోడీ అనే పేరు పలకతానికే భయపడుతుంటే, అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు పార్లమెంట్‌లో తెగించి పోరాడారు. వారి పోరాటాన్ని చూసిన ఆంధ్రా ప్రజలు ఇటువంటి నేతలే కదా,మనకు కావాల్సింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

jaygalla 28072018

టిడిపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు ఎక్కడ, జగన్, పవన్ ఎక్కడ, వాళ్ళిద్దరికీ, వీళ్ళిద్దరికీ నక్కకి, నాగలోకానికి ఉన్న తేడా ఉంది అంటూ, రాజకీయాల నుంచి రిటైర్డ్ అయిన ఒక సీనియర్ నేత అన్నారు అంటే, అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ నలుగురు యువనేతల గురించి ఆసక్తి కరమైన చర్చ జరుగుతోంది. ప్రత్యేకహోదా ఉద్యమంలో ఈ నేతలు, ప్రస్తుతం, గతంలో చేసిన పోరాటాల గురించి వారికి రాష్ట్ర ప్రయోజనాల పై ఉన్న చిత్తశుద్ది గురించి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. తనకు వ్యాపారాలున్నాయని...తాను ప్రధానిపై విమర్శలు చేస్తే తనను ఇబ్బంది పెడతారని తెలిసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ 'మిస్టర్‌ మోడీ' అంటూ లోక్‌సభ సాక్షిగా నిలేశారు.

jaygalla 28072018

మరో యువ ఎంపీ రామ్మోహన్‌నాయుడు కూడా...మోడీని నిలేశారు. రైల్వేజోన్‌ ఇస్తామని హామీ ఇచ్చారని, దాన్ని ఎందుకు నెరవేర్చలేదని..ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని మీరు..మోసగాళ్లు అంటూ సభ సాక్షిగా గర్జించారు. మొత్తం మీద..యువ తెలుగుదేశం ఎంపీలు..'మోడీ'కి చెమటలు పట్టిస్తే..తమకు ప్రజల్లో అపారమైన మద్దతు ఉందని చెప్పుకునే 'జగన్‌,పవన్‌'లు..'మోడీ' పేరెత్తడానికే..వణికిపోయి దాక్కున్నారు. తాను ఎంపీల మద్దతు కూడగడతానని చెప్పిన 'పవన్‌' చివరకు టిడిపి అవిశ్వాసం పెట్టినప్పుడు..మద్దతు సంగతేమో నీ కనీసం నైతిక మద్దతు కూడా ఇవ్వలేదు. ఆయన బిజెపి ఆడించినట్లు ఆడుతున్నారనే విమర్శలను కొని తెచ్చుకున్నారు. ప్రతిపక్షానికి చెందిన ఇద్దరు యువనేతలు..ఈ విధంగా వ్యవహరిస్తే అధికార పార్టీకి చెందిన యువ ఎంపీలు పార్లమెంట్‌లో తెలుగు పతాకాన్ని గర్వంగా ఎగురవేశారు.

11 సిబీఐ కేసులు, 5 ఐడీ కేసుల్లో A2 గా ఉండి, 16 నెలలు జైలు జీవితం అనుభవించి, కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతూ, నీతులు చెప్తున్న విజయసాయి రెడ్డి కేసుల పై సిబిఐ ఉచ్చు బిగిస్తుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి పబ్లిక్‌ సర్వెంట్‌ పరిధిలోకే వస్తారని సీబీఐ తెలిపింది. ఈ కేసును విచారించే పరిధి సీబీఐ కోర్టుకు ఉందని పేర్కొంది. జగన్‌ అక్రమాస్తులకు సంబంధించి జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు, రాంకీ కేసుల్లో నిందితులు దాఖలు చేసుకున్న డిశ్ఛార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగాయి. సీబీఐ తరఫున కె.సురేందర్‌ వాదనలు ఇలా వినిపించారు.

vijaysi 28072018

‘‘ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ డైరెక్టర్‌గా విజయసాయిరెడ్డి పనిచేశారు. అప్పటి ముఖ్యమంత్రి సిఫార్సులతో ఓబీసీ బ్యాంక్‌ డైరెక్టర్‌గా విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. అవినీతి నిరోధక చట్టం కింద బ్యాంకు డైరెక్టర్‌ పబ్లిక్‌ సర్వెంట్‌ పరిధిలోకే వస్తారు’’ అని వివరించారు. వాన్‌పిక్‌ కేసులో సీబీఐ వాదనల నిమిత్తం కేసు విచారణ ఆగస్టు 3వ తేదీకి వాయిదా పడింది. శుక్రవారం విచారణకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పెన్నా ప్రతాప్‌రెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, అయోధ్యరామిరెడ్డి, ఐఏఎస్‌లు వై.శ్రీలక్ష్మి, మన్మోహన్‌సింగ్‌, వెంకట్రామిరెడ్డి తదితరులు కోర్టుకు హాజరయ్యారు.

రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య ప్రమాణాలను ఎప్పటికప్పుడు గుర్తించి సలహాలనిచ్చేందుకు అన్ని గ్రామపంచాయతీల్లో త్వరలో ప్రత్యేక పరికరాలను అందుబాటులోకి తేనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా, ప్రతి ఒక్కరికీ ఈ తరహా పరీక్షలు చేయించే బృహత్తర కార్యక్రమంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించి అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక విధానాలను, ఉపకరణాలను ఉపయోగించాలని నిర్ణయించింది. తొలుత ప్రయోగాత్మకంగా సచివాలయ ఉద్యోగులతో ప్రారంభించి... తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది. ఒక ప్రఖ్యాత సంస్థ ఇటీవల ప్రత్యేక వైద్య పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. దానిని చేతికి పెట్టుకొంటే రక్త పోటును పరిశీలించి, వివరాలను దానంతట అదే వెబ్‌సైట్‌కు పంపిస్తుంది.

cbn health 28072018 2

అలాగే... ఒక్క రక్తపు చుక్క ఆధారంగా పది నుంచి పదిహేను రకాల ఆరోగ్య విశ్లేషణలను చేస్తుంది. మొత్తం సమాచారాన్ని ఇంటర్నెట్‌లోని సంబంధిత వెబ్‌సైట్‌కు పంపిస్తుంది. ప్రతి వ్యక్తికి సంబంధించి ఒక కోడ్‌ను కేటాయిస్తారు. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, తమకు కేటాయించిన నంబర్‌ను ఇవ్వగానే... రక్త పరీక్షల వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే... కేవలం సాంకేతిక అంశాలను మాత్రమే చెప్పి వదిలివేయకుండా, ఆ ఫలితాలను విశ్లేషించేలా రిపోర్ట్స్‌ ఉంటాయి. ఉదాహరణకు... తిన్న తర్వాత బ్లడ్‌ షుగర్‌ 200 వచ్చిందనకుందాం! అది ఎక్కువా, తక్కువా, ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ వైద్యుడిని సంప్రదించాలి... ఇలాంటి సూచనలన్నీ ఇస్తారు.

cbn health 28072018 3

అది కూడా... తెలుగులోనే! ప్రస్తుతం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఖర్చుతో కూడుకున్న పని. ఏదైనా వ్యాధి బారిన పడితే... డాక్టర్ల సూచనమేరకు పరీక్షలు చేయించుకుంటున్న వారే ఎక్కువ. ప్రతినెలా ప్రాథమిక స్థాయిలో పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్సతోపాటు జాగ్రత్తలు తీసుకుంటే... ‘చికిత్స కంటే నివారణ మంచిది’ అనే నానుడిని పాటించినట్లవుతుంది. పైగా... ఈ పరికరం ద్వారా పరీక్షలు, విశ్లేషణ దానంతట అదే జరుగుతుంది. వయసు, బరువు, స్త్రీలా, పురుషులా... వంటి ప్రాథమిక వివరాలనూ పరిగణనలోకి విశ్లేషిస్తుంది. రాష్ట్రంలోని వారికి ఈ పరీక్షలు ప్రతి నెలా చేయగలిగితే మెరుగైన ఫలితాలు లభిస్తాయని, సమస్యలు ముందుగానే బయటపడి చికిత్స తేలిక అవుతుందని సీఎం భావిస్తున్నారు.

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, విభజన చట్టంలోని అంశాల సాధన కోసం తెదేపా పోరాట తీవ్రతను పెంచినప్పుడల్లా, దాన్ని దెబ్బతీసేందుకు తమ లాలూచీపరులతో భాజపా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. శనివారం తెదేపా ఒంగోలులో ధర్మపోరాట దీక్ష చేస్తుంటే, అదే రోజు భాజపా మరో పార్టీతో మరోచోట పోటీ దీక్షలు చేయిస్తోందన్నారు. ఇదంతా ఆ మూడు పార్టీలు కలిసి తెదేపాని దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్రలో భాగమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా, వైకాపా, జనసేనల లాలూచీ రాజకీయాలు బయటపడ్డాయని, ప్రజలన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు.

cbndharma 28072018 2

ముఖ్యమంత్రి శుక్రవారం తెదేపా ఎంపీలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పార్లమెంటులో ఎంపీలు అద్భుతంగా పోరాడారని, ప్రజల నుంచీ ప్రశంసలు అందుకుంటున్నారని కితాబిచ్చారు. ఇక ముందూ ఇదే పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. పార్లమెంటుకి వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చినందున ఎంపీలంతా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఎండగట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘‘కేంద్రానికి మన సంపద, వనరులు కావాలి. మనకిచ్చిన హామీలను మాత్రం నెరవేర్చరు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయరు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి’’ అని ఆయన సూచించారు.

cbndharma 28072018 3

ఒంగోలులో జరిగే ధర్మపోరాట సభకు ఎంపీలంతా హాజరవ్వాలన్నారు. భవిష్యత్తు పోరాటానికి మరింత ఉత్తేజం పొందాలన్నారు. రాష్ట్రానికి న్యాయం చేసేంత వరకు భాజపాని విడిచిపెట్టే ప్రసక్తి లేదని సీఎం వ్యాఖ్యానించారు. భాజపాదే యూటర్న్‌ అని, తెదేపాది ఎప్పుడూ రైట్‌ టర్న్‌ అన్న విషయాన్ని ఎంపీలు గట్టిగా చెప్పాలన్నారు. ‘‘వెనుకబడిన జిల్లాల కోసం ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కు తీసుకోవడం యూటర్న్‌ కాదా? మేనిఫెస్టోలో చెప్పింది చేయకపోవడం, రాజస్థాన్‌ పెట్రో కాంప్లెక్స్‌కు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ను సగానికి తగ్గించి, కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌కు మాత్రం మమ్మల్నే రూ.5,615 కోట్లు కట్టమనడం యూటర్న్‌ కాదా? దిల్లీ-ముంబయి కారిడార్‌కో న్యాయం, విశాఖ-చెన్నై కారిడార్‌కో న్యాయమా? ధొలెరా నగరానికి పుష్కలంగా నిధులిచ్చి అమరావతికి అన్యాయం చేయడం యూటర్న్‌ కాదా?’’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ అంశాలన్నీ ప్రజలకు వివరించాలను ఎంపీలకు సూచించారు.

Advertisements

Latest Articles

Most Read