నాలుగేళ్ళు చంద్రబాబుని ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తిన పవన్ కళ్యాణ్, ఎప్పుడైతే చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, మోడీ పై దాడి మొదలు పెట్టారో, అప్పటి నుంచి చంద్రబాబుని విమర్శలు చేస్తూ, మోడీ పై పోరాటంలో, చంద్రబాబుని బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ నాలుగు నెలల నుంచి ఎన్ని విమర్శలు చేసినా, ఎంతగా రెచ్చగొట్టినా చంద్రబ్బు మాత్రం, చూసి చూడనట్టు వదిలేసారు. పవన్ కళ్యాణ్ విమర్శలకు అనవసర ప్రాధాన్యత ఇవ్వటం ఇష్టం లేకో, లేక పవన్ పై ఎంతో కొంత ఉన్న గౌరవంతోనో కాని, చంద్రబాబు, పవన్ పై ఎప్పుడూ ఘాటు విమర్శలు చెయ్యలేదు. అయితే, రోజు రోజుకీ పవన్ కళ్యాణ్ దిగజారిపోతున్నారు. ఎప్పుడు చంద్రబాబు, కేంద్రం పై భారీ పోరాటం చేస్తున్నా, అది నీరుగార్చేలా పవన్ ముందుకు వస్తున్నారు.

cbn pk 21072018 2

ధర్మపోరాటం అంటూ తన పుట్టిన రోజు నాడు, చంద్రబాబు దీక్ష చేస్తే, శ్రీరెడ్డి ఇష్యూ తీసుకువచ్చి, శ్రీరెడ్డిని చంద్రబాబు పంపించారు అంటూ, ఆ రోజు ట్వీట్లు వేస్తూ డైవర్ట్ చేసే ప్రయత్నం చేసారు. ఇలా అప్పటి నుంచి, చంద్రబాబు, మోడీ పై ఏ పోరాటం చేసినా, మోడీ పై చంద్రబాబు చేస్తున్న విమర్శలు హైలైట్ అవ్వకుండా, ఎదో ఒక ఇష్యూ తీసుకువచ్చి డైవర్ట్ చెయ్యటం, పని అయిపోయిన తరువాత హైదరాబాద్ వెళ్ళిపోవటం, ఇదే పవన్ పని. అయితే, నిన్న అవిశ్వాసం లాంటి కీలక సమయంలో కూడా, పవన్ ఇదే స్ట్రాటజీతో వచ్చారు. గల్లా స్పీచ్ చండాలంగా ఉంది అంటూ ట్వీట్ లు చేసారు. అయితే, ఈ సారి మాత్రం చంద్రబాబు చూస్తూ కూర్చోలేదు. మోడీ పై ఇంతలా పోరాటం చేస్తుంటే, దేశం అంతా అండగా ఉంటే, పవన్ ఈ పోరాటాన్ని బలహీనపరిచే ప్రయత్నం చెయ్యటంతో, ఇక జగన్ కి, పవన్ కి తేడా లేదని, పవన్ ను కూడా టార్గెట్ చేసారు.

cbn pk 21072018 3

మొదటి సారి, పవన్ పై ట్వీట్ రూపంలో కూడా, పవన్ కు గడ్డి పెట్టారు. ఇక పవన్ ను ఉపేక్షించేది లేదని, రాష్ట్రం కంటే ఏది ముఖ్యం కాదని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు చేసిన ట్వీట్స్ ఇవే... "అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారు? తీర్మానం పెడితే దేశమంతా ఏకం చేస్తాం అన్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్లాడు? తెలుగు దేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టి మొత్తం దేశాన్ని, పార్లమెంటుని కదిలిస్తున్న రోజు జగన్, పవన్ ఎక్కడున్నారు? జగన్ కోర్టులో...పవన్ ట్వీట్లలో.... My State and its best interests are everything to me. Those who are with me in this fight are my friends and rest are my foes."

ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని చాటుతూ టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు సౌగత్‌ రాయ్‌, దినేశ్‌ త్రివేది, సీపీఎం నేత మహ్మద్‌ సలీంతో పాటు పలు పార్టీల నేతలు బరిపరిచారు. టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్‌ ప్రసంగం విన్నాక రాష్ట్ర ప్రజల సమస్యలపై ఆయన ప్రగాఢ ఆవేదన తనకు తెలిసిందని.. అన్యా యం జరిగిన వారిలో ఆయనొక్కరే లేరని, ఈ దేశంలో ఆయనలాంటి బాధితులెందరో ఉన్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన ప్రసంగంలో అన్నారు.

parliament 21072018 2


‘21వ శతాబ్దపు రాజకీయ ఆయుధానికి ఏపీ బలైంది. మాయమాటలు చెప్పి మోసగించడమే ఈ ఆయుధం. మనకు ఎలాంటి ప్రధానమంత్రి ఉన్నారో దీన్ని బట్టి అర్థమైంది. గల్లా ప్రసంగంలో ప్రతి ఒక్క పదాన్ని శ్రద్ధగా విన్నాను’ అని చెప్పారు. బీజేపీ, మోదీ ‘విభజించు-పాలించు’ సిద్ధాంతాన్ని పాటిస్తున్నందునే ఏపీకి అన్యాయం జరిగిందని ఖర్గే అన్నా రు. ఆంధ్రకు కేంద్రం అన్యాయం చేసిందన్న విషయంలో తాము ఏకీభవిస్తున్నామని, తమ నేత మమతా బెనర్జీ టీడీపీకి పూర్తి మద్దతు ఇస్తున్నారని టీఎంసీ ఎంపీ దినేశ్‌ త్రివేది చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌కు అకాలీదళ్‌ మద్దతిస్తోందని ఆ పార్టీ సీనియర్‌ నేత చందుమజ్రా స్పష్టం చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కూడా టీడీపీ అవిశ్వాసానికి మద్దతు ప్రకటించి విప్‌ కూడా జారీచేసింది. సభలో ఆప్‌ నేత భగవంత్‌ మాన్‌ ఆంధ్రకు అనుకూలంగా మాట్లాడారు.

 

parliament 21072018 3

మరో పక్క, గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడులకు టీడీపీ నేతల నుంచి అభినందనల వర్షం కురుస్తోంది. రాష్ట్ర సమస్యలను పార్లమెంటు వేదికగా ప్రశంసనీయంగా వినిపించారని, తమకు అప్పగించిన బాధ్యతను నూటికి నూరుపాళ్లూ నెరవేర్చారని వ్యాఖ్యానిస్తున్నారు. ‘అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవచ్చు. కానీ జరిగిన అన్యాయాన్ని దేశం మొత్తం వినిపించగలిగాం. కేంద్రాన్ని ఆత్మరక్షణలో పడేశాం’ అని ఒక మంత్రి మెచ్చుకున్నారు. పెద్ద సంఖ్యలో నేతలు ఆ ఇద్దరు ఎంపీల ఫోన్లకు అభినందన సందేశాలు పంపారు. నేరుగా ఫోన్‌ చేసి ప్రశంసించారు.

పురందేశ్వరి పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక ఫైర్ అయ్యారు. ఆమెకు పది ప్రశ్నలు సంధించారు. "పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైఖరి పట్ల యావత్‌ దేశమంతటా విమర్శలు ఎక్కుపెడుతుంటే రాష్ట్ర బీజేపీ నాయకులు పురందేశ్వరి మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శంచడం సమంజసం కాదు. తెలుగువారు ఎప్పటికీ గౌరవించే ఎన్టీఆర్‌ కుమార్తెగా.. తెలుగువారికి అన్యాయం జరుగుతుంటే కనీసం మాట్లాడకపోవటం ఏంటి.? కేంద్ర ప్రభుత్వం అపరిచితుడిలా వ్యవహరిస్తుంటే.. అంతకన్నా ఏమిస్తారని పురందేశ్వరి పేర్కొనటం సరికాదు. రాష్ట్ర ప్రజల నుంచి కేంద్రం వసూలు చేసిన సొమ్ములో 40శాతం ఇస్తూ.. ఏదో దారాదత్తం చేస్తున్నట్లు వ్యాఖ్యానించటం సరికాదు. కేంద్రం ఇతర రాష్ట్రాలతో సమానంగా నిధులు ఇచ్చింది తప్పా ప్రత్యేకంగా ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదు. పార్లమెంట్‌లోనే కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాష్ట్రానికి ఇప్పటి వరకు దాదాపు రూ. 13వేల కోట్లు మాత్రమే ఇచ్చామని చెప్పారు. సుప్రీంకోర్టులో అఫడవిట్‌, అవిశ్వాస తీర్మానంలోని ఒకటే చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని విమర్శించకుండా కేవలం రాజకీయ లబ్దికోసం పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారు."

puran 21072018 2

"పురందేశ్వరికి పది ప్రశ్నలు... 1. గతంలో విశాఖ నుంచి గెలిచి మంత్రిగా అయి ఉత్తరాంధ్ర చిరకాల వాంఛైనా విశాఖ రైల్వేజోన్‌ను ఎందుకు సాధించలేకపోయారు? రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సభలో ఉండి ఏం చేశారు?... 2. తెలుగు ప్రజలకు అండగా ఉండాల్సిన వారు కేంద్రానికి వత్తాసు పలకటం వెనుక ఆంతర్యమేంటి.?... 3. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదని, కాఫర్‌ డ్యాం అవసరం లేదని అసంబద్దమైన వ్యాఖ్యలు చేయటం మీకు తగునా.?... 4. రాష్ట్రానికి అడుగుతున్న నిధులు రాష్ట్రం చెల్లించిన పన్నులు కాదా.?... 5 జనసేన ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీలో మేధావులు, రాజకీయనేతలు రాష్ట్రానికి రూ.75వేల కోట్లు రావాలని పేర్కొన్నారు. దీనిపై ఎందుకు స్పందించరు?"

puran 21072018 3

"6. కేంద్రం యూసీల పేరుతో మోసం చేయాలని చూస్తున్న మాట వాస్తవం కాదా.?... 7. అధికార పార్టీలో ఉంటూ.. సొంత గడ్డకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించకుండా కేంద్రం తానా అంటే తందానా అన్నట్లు వ్యవహరించటం మీకు తగునా.?... 9. ఎన్టీఆర్‌ కేంద్రాన్ని మిధ్యగా పేర్కొంటే.. మీరు కేంద్రం మిన్న అనటం ఎంత వరకు సబబు.?.. 9. కేంద్రం చేస్తున్నది మోసం అని మీకు తెలియదా.? తెలిసీ తెలియనట్లున్నారా.?... 10. రూ.350 కోట్లు వెనకబడిన జిల్లాలకు కేటాయించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమ చేసి తిరిగి ప్రభుత్వం అనుమతి లేకుండానే వెనక్కు తీసుకున్న కేంద్రాన్ని నిలదీయని మీరు రాష్ట్ర ప్రజల పక్షమా?... లేక మోదీ పక్షమా? : " అంటూ ముళ్లపూడి రేణుక, పురందేశ్వరిని ప్రశ్నించారు.

పార్లమెంట్ సాక్షిగా తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ చేసిన ప్రసంగంపై అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేసారు. నిండు సభలో మోదీ చేసిన మోసాన్ని కడిగిపారేసిన గల్లా జయదేవ్ చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. కానీ ఇది పవన్ దృష్టిలో వ్యర్ధమైన ప్రసంగం అయ్యిందంటే. ఏ స్థాయిలో పవన్ రాజకీయ అవగాహన ఉందో అర్ధం చేసుకోవచ్చు. విమర్శించాల్సిన అంశాలలో విమర్శించవచ్చు, తప్పులేదు, కానీ కేంద్రాన్ని ఒత్తిడి తెస్తున్న సమయంలోనే సరిగ్గా రాష్ట్ర ప్రభుత్వంపై మరింతగా పవన్ విమర్శలు గుప్పించడం సరైన రాజకీయం అనిపించుకోదు. పవన్ ప్రసంగం పై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ స్పందించారు.

anuradha 21072018 2

పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ "నిన్న పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీలందరు.. రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ముక్తకంఠంతో లేవనెత్తారు. ట్వీట్టర్ పవన్ కళ్యాణ్, కన్ ప్యూజన్ పవన్ కళ్యాణ్.. చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన లేదు. తెలుగు దేశం గురించి హేళనగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంపై, సమస్యలపై అవగాహన లేదు. అవిశ్వాసంపై మద్దతు కూడగడతానన్న పవన్ ఎక్కడ ఉన్నారు. అవిశ్వాసానికి మద్దతు తెలపని పవన్ కళ్యాణ్...ఎంపీలపై కామెంట్ చేయడం సరైంది కాదు. హైదరాబాద్ లో ఇంటిలో కూర్చొని ట్వీట్ లు చేయడం కాదు. అనేక విధాలుగా పార్లమెంట్ లో మేము పోరాటం చేశాం. ఎంపీలు ఎంతో పోరాటం చేస్తుంటే.. ఎం చేశారంటూ ప్రశ్నించడం సరికాదు."

anuradha 21072018 3

"వ్యక్తిగత ప్రయోజనాలు మీకు.. మీ అన్నయ్య, మీ బావమరిది తెలిసినట్లు ఎవరికి తెలియదు. రాజ్యసభ సీటు, కేంద్రమంత్రి పదవి కోసం మీరు ప్రజారాజ్యం పార్టీని ఢిల్లీలో తాకట్టుపెట్టారు. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రమంత్రి పదవులనే త్యాగం చేశాం. దేశం మొత్తం మీద మోదీని ప్రశ్నించింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. పవన్ కళ్యాణ్ మోడీని ఎందుకు ప్రశ్నించరు..? వ్యర్ధ ప్రసంగాలు చేసేది మీరు ?.. ఉత్తరాంధ్రలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేది మీరు. టీడీపీ ఎంపీల ప్రసంగాలకు సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ వస్తుంది. రాష్ట్రానికి అన్యాయం జరిగితే చిన్న నిరసన కూడా చెయ్యలేదు. ఆదర్శ కుంభకోణంతో సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. మీ ట్వీట్టర్ అకౌంట్ ను ఢిల్లీ నుంచి బీజేపీ డీల్ చేస్తుందా ? ట్విట్టర్ లో విమర్శలు కాదు.. ప్రజల్లోకి వచ్చి మోడీని నిలదీయ్యండి. పదవికోసం పార్టీని మూసేసిన చరిత్ర మీది. ఇప్పటి వరకు ఎవరైనా క్రెడిబులిటీ ఉన్న వ్యక్తులు మీ పార్టీలో చేరారా ?" అని అనురాధ పవన్ ను ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read