రాష్ట్ర రాజకీయాల్లో శరవేగంగా మారుతున్న పరిణామాలతో ఆంధ్రప్రదేశ్‌లో చచ్చిపోయింది అనుకున్న కాంగ్రెస్, మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది. బీజేపీ చేసిన ఘనకార్యలతో, మళ్ళీ మాకు ఒకటి అరా సీట్లు వస్తాయని, తద్వారా, మళ్ళీ రాష్ట్రంలో పుంజుకుంటామని కాంగ్రెస్ భావిస్తుంది. అంతేగాక జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీకి దగ్గరవడం ఖాయమన్న ధీమా కాంగ్రెస్‌ పార్టీలోని కొంత మంది నాయకుల్లో ఉండడం గమనార్హం. అయితే కాంగ్రెస్ నేతల ఆశలు వాస్తవరూపం దాలుస్తాయా అనే ప్రశ్నకు, సాధ్యమేనన్న సమాధానం విశ్లేషకుల్లో కూడా వ్యక్తమవుతోంది. ఇందుకు రాష్ట్రానికి సంబంధించి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఆ పార్టీని పల్లెత్తు మాట అనకుండా ప్రతిపక్ష పార్టీ వైసీపీ అనుసరిస్తున్న వైఖరే కారణమని వారు అభిప్రాయపడుతున్నారు.

congress 02072018 2

నాలుగేళ్ల క్రితం రాష్ట్రానికి కాంగ్రెస్‌పార్టీ ద్రోహం చేసిందన్న కారణం చూపి, బీజేపీ వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీని దగ్గర చేసుకుని, రాష్ట్ర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని వారంటున్నారు. దీంతో కాంగ్రెస్‌ పై కోపం ఉన్న వారు, బీజేపీతో చెలిమి కట్టిన టీడీపీకి రాష్ట్రంలో పట్టం కట్టారని పేర్కొంటున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత క్రమేణా కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. నాలుగేళ్లు గడిచినా రాష్ట్ర ప్రధాన సమస్యలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ టీడీపీ కేంద్ర ప్రభుత్వం, ఏన్డీఏ నుంచి వైదొలిగింది. దాంతో కాంగ్రెస్ నేతలు స్వరం పెంచి నాడు తాము చేసింది తప్పతైతే నేడు బీజేపీ చేసింది నమ్మక ద్రోహం కాదా అని ఎదురుదాడికి దిగడంతో ప్రజలు ఆ పార్టీ వైపు ఆలోచించడం ప్రారంభించారని వారంటున్నారు.

congress 02072018 3

తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాహుల్‌ గాంధీ రాష్ట్ర సమస్యలన్నింటి పై, ప్రధానంగా ప్రత్యేక హోదాకు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కారం చూపుతామన్న ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఆశలు చిగురించాయి. నాడు కాంగ్రెస్ చేసిన తప్పిదానికి ఫలితం అనుభవించిందని తరువాత బీజేపీ వ్యవహరించిన తీరుతో మళ్లీ కాంగ్రెస్ వస్తే న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం ప్రజల్లో రావడం సహజమని వారంటున్నారు. రాష్ట్ర సమస్యలపై స్పందించకుండా నాలుగేళ్ల నుంచి నిన్నా మొన్నటి వరకూ అన్నీ ఇస్తామన్న బీజేపీ నేతలు నేడు ఏదో ఒక సాకు చూపుతూ ఏదీ సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నా, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఆ పార్టీని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అన్నింటికీ టీడీపీ కారణమని విమర్శిస్తున్న విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

విభజన సమయంలో కూడా లోక్‌సభలో నాడు ఎంపీగా ఉన్న జగన్ తీరు కారణంగానే ప్రజలు టీడీపీ వైపు చూశారని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా నాడు కాంగ్రెస్‌కు దూరమైన నేతలు మళ్లీ సొంత గూటికి చేరుకుంటే పార్టీ పరిస్థితి మెరుగయ్యే అవకాశాలు లేకపోలేదని వెల్లడిస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో ఇప్పుడే ఖచ్చితమైన నిర్ణయం చెప్పలేమని రానున్న రోజుల్లో టీడీపీ, వైసీపీ వ్యవహరించే తీరుపై ఇది ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇక సినీనటుడు, జనసేనపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రస్తుతం వామపక్ష పార్టీలతో సన్నిహితంగా ఉంటున్నారని, భవిష్యత్తులో ఎన్నికల సమయానికి మారే రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన వైఖరి తేలుతుందని వారంటున్నారు. మొత్తానికి బీజేపీ చేసిన ఘనకార్యంతో, ఆంధ్రప్రదేశ్ లో చచ్చిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ, ఊపిరి తీసుకుంటుంది.

ఆర్టీసీ అంటేనే, ఎప్పుడూ నష్టాల్లో నడిచే నష్టాల బస్సుగా ముద్ర పడింది.. ఇది నిజం కూడా... ఆదాయం రాక పడరాని పాట్లు పడుతోన్న ప్రజా రవాణాసంస్థ ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఏపీఎస్ఆర్టీసీ లాభాలను నమోదు చేసింది. బస్సులను నడపడంలో లోపాలను సరిదిద్దుకోవడం, కొత్త బస్సుల కొనుగోళ్లు, ఆక్యుపెన్సీని పెంచుకోవడం, పట్టుదలగా యాజమాన్యం చేసిన ప్రయత్నాలు తదితర అంశాలలో యాజమాన్యం చేసిన కృషి ఫలించి, చివరకు ఆర్టీసీని లాభాల బాట పట్టించింది. పెళ్లిళ్లు, వేసవి సెలవులు తదితర అంశాలు కూడా ఆర్టీసీకి బాగా కలసివచ్చాయి. సొంతగా కార్గో సేవలు అందిచటం కూడా,కలిసి వచ్చింది. కొన్ని రూట్లలో అద్దెబస్సులను, మరిన్ని రూట్లలో కొత్త బస్సులను నడిపి.. ప్రయోగాలకు తెర తీసింది. కేసినేని లాంటి ట్రావెల్స్‌ ఆగిపోవటంతో, దూరప్రాంత బస్సుల్లో కొంతమేర ఆక్యుపెన్సీ పెరిగింది.

rtc 02072018 2

రాష్ట్ర విభజన తరువాత దాదాపు 3వేల కోట్ల రూపాయల తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ వస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ తాజా సంస్కరణల ఫలితంగా క్రమేణా రాబడి పెంచుకుంటూ నష్టాలను తగ్గించుకుంటోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ మాలకొండయ్య హయాంలో 2016-17లో రూ. 780 కోట్లుగా ఉన్న సంస్థ నష్టం 2017-18 నాటికి రూ. 390 కోట్లకి చేరింది. అంటే రికార్డు స్థాయిలో ఒక్కసారిగా రూ. 450 కోట్లు నష్టం తగ్గింది. ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి సురేంద్రబాబు కృషి కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతినెలా క్రమేణా నష్టాలు తగ్గుతూ వస్తున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో 2017-18 ఏప్రిల్‌తో పోలిస్తే మొత్తం 128 డిపోల్లో రికార్డు స్థాయిలో రూ. 31 కోట్లు నష్టం తగ్గింది.

rtc 02072018 3

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే నెలలో ఏడు డిపోల్లో రాబడి పెరిగింది. ఏప్రిలో వచ్చిన నష్టం రూ. 27కోట్లు కాగా మే నెలలో వచ్చిన నష్టం రూ. 7.13 కోట్లు మాత్రమే కావటం విశేషం. మొత్తం 128 డిపోల్లో మూడు బస్ స్టేషన్లు సహా మొత్తం 35 డిపోల్లో రూ. 23.51 కోట్లు రాబడి రాగా, 97 డిపోల్లో రూ. 58 కోట్ల రూపాయల మేర సంస్థకు నష్టాలు వచ్చాయి. ఈ రెండు మాసాల్లో కలిపి అత్యధికంగా విజయవాడ డిపో రూ. 3.41 కోట్ల రాబడితో ప్రథమ స్థానంలో నిలవగా రూ. 1.91 కోట్లతో రాజమండ్రి, కోటి 90 లక్షల 42వేలతో అమలాపురం, కోటి 67 లక్షల 75 వేలతో కాకినాడ, కోటి 54 లక్షలతో కనిగిరి, కోటి 15 లక్షల 27వేలతో విజయవాడ ఆటోనగర్, కోటి 8 లక్షలతో విశాఖ, 88.81 లక్షలతో తుని, రూ. 69 లక్షలతో రాజోలు వరుస క్రమంలో నిలిచాయి. ఇక రూ. కోటి 84 లక్షల 12వేల నష్టాలతో చిత్తూరు-1 డిపో చివరి స్థానంలో నిలిచింది.

రాయలసీమ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేది... నవ్యాంధ్రలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ పరిశ్రమ ! ‘కియ’ కార్ల కంపెనీ ఏర్పాటు పనులు జోరుగా సాగుతున్నాయి. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో... యర్రమంచి గ్రామం వద్ద, జాతీయ రహదారి పక్కనే ‘కియ’ ప్లాంటు ఏర్పాటవుతోంది. మరొక్క ఏడాదిలోనే కియ ప్లాంటు నుంచి మొదటి కారు రోడ్డెక్కనుంది. పరిశ్రమ ఉత్పత్తి సమయానికి అవసరమైన సిబ్బంది, కార్మికుల కోసం ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే కియ కార్ల ఉత్పత్తికి సన్నాహాలు చేస్తుండగా.. తొలిగా 20 మంది డిప్లమో పూర్తి చేసిన వారిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. దశలవారీగా ఈ నియామకాలు కొనసాగుతూనే ఉంటాయని కియ ప్రతినిధులు చెబుతున్నారు. కియ కార్లపరిశ్రమలో ప్రాథమిక, సాంకేతిక కోర్సులో శిక్షణ ప్రారంభమైంది.

kia 02072018 2

మరో పక్క, కియాలో ఉద్యోగాల కోసం వచ్చిన ధరఖాస్తులు చూసి, కియా కంపెనీనే ఆశ్చర్యపోయింది. పరిశ్రమలో ఉద్యోగ నియామకాల కోసం 5400 మంది డిప్లమో అభ్యర్థులు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు దరఖాస్తు చేసుకున్నారని విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. అయితే, వీరిలో నుంచి ముందుగా 290 మందికి అర్హత పరీక్షలు నిర్వహించారు. పరిశ్రమ సమీపంలోని దుద్దేబండ క్రాస్‌ వద్ద 11 ఎకరాల్లో కియ మోటార్‌ ఇండియా శిక్షణ కేంద్రాన్ని ఈ నెల 20న ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ తొలి బ్యాచ్‌ అభ్యర్థులకు శిక్షణా తరగతులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అందులో 20 విభాగాల పనితీరుకు సంబంధించి శిక్షణ ఇస్తున్నారు. అర్హత సాధించిన అభ్యర్థుల్లో 20 మందికి ఐదేసి రోజుల చొప్పున శిక్షణ ఇస్తున్నారు.

kia 02072018 3

ఈ శిక్షణలో నైపుణ్యం కనబరచిన 600 మంది అభ్యర్థులను మెయిన్‌ ప్లాంట్‌కు, మిగిలిన వారిని వివిధ విభాగాల్లో పనికి నియమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కియ పరిశ్రమ ఒప్పందం ప్రకారం 11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాల్సి ఉంది. ఇందులో భాగంగా తొలిదశలో అనంతపురం జిల్లా వాసులు 2వేల మందికి మొదట పెనుకొండలో శిక్షణ పూర్తి చేస్తారు. డిప్లమో పూర్తి చేసిన వారికి మొదట ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆటో మొబైల్‌ పరిశ్రమ కోసం ప్రాథమిక, సాంకేతిక కోర్సు శిక్షణలో అత్యత్తమమైన ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు కియ ప్రధాన ప్లాంటులో నియమించనున్నారు. పరిశ్రమ నిర్మాణ పనులు పూర్తయితే ప్రత్యక్షంగా 4 వేలు, పరోక్షంగా 7 వేల మందికి ఉపాధి లభించనుంది.

సీఎం కుమారుడిగా రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టారు. అనంతరం మంత్రి పదవిని చేపట్టి మంచి మార్కులే పొందారు. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల కదన రంగంలోకి దూకబోతున్నట్లు ప్రకటించి ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఆయనెవరో కాదు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్. ఏపీ మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేష్ 2019 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. లోకేష్ తొలిసారి ఎదుర్కోబోతున్న ఎన్నికలు కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. దానికి కారణం లేకపోలేదు. ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన ఎక్కడ నుంచి అనేది మాత్రం పార్టీ నిర్ణయమేనని సస్పెన్స్‌కు తెరలేపారు. దీంతో లోకేష్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

lokesh 02072018 2

రానున్న సాధారణ ఎన్నికల్లో లోకేష్‌ను ఎక్కడ నుండి పోటీకి దింపాలనే అంశం పై అధిష్టానం తీవ్రస్థాయిలో చర్చిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల వాతావరణం రావడంతో లోకేశ్‌ పోటీ వ్యవహారమూ తెరమీదకొచ్చింది. ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి పోటీచేస్తుండటంతో నియోజకవర్గ ఎంపిక కీలకంగా మారనుంది. లోకేశ్‌ను చంద్రగిరి నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని ఇటీవల పార్టీ సర్వే చేయించినట్లు తెలిసింది. దీనిలో భాగంగానే అక్కడ ఇన్‌ఛార్జిగా ఉన్న గల్లా అరుణకుమారిని పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయనకు చంద్రగిరి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

lokesh 02072018 3

ఒకవేళ చంద్రగిరి కాకపోతే కృష్ణాజిల్లా గుడివాడ నుండి బరిలోకి దింపే ఆలోచనా చేస్తోంది. పెనమలూరు నియోజకవర్గాన్ని పరిశీలనలో పెట్టుకున్నారు. అక్కడ ఇప్పటికే బోడే ప్రసాద్‌ భారీ మెజార్టీలో గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ నుండి ప్రసాద్‌ను తప్పించడం అంతమంచిది కాదనే అభిప్రాయమూ వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వెనుకబడిన నియోజకవర్గాలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయనే అంశంపైనా పార్టీ ఇటీవల సర్వే చేయించించినట్లు తెలిసింది. దీనిలో ఎమ్మెల్యేలు ఉన్న 22 నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు తెలిసింది.

Advertisements

Latest Articles

Most Read