జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమి చేస్తారో, ఏమి మాట్లాడతారో ఆయనకే తెలియదు. తనది కమ్యూనిస్టుల భావజాలమని అనేక సార్లు చెప్పారు. ఇది నమ్మి కమ్యూనిస్ట్ లు దగ్గర అయ్యారు. పవన్ తో కలిసి ఎదో హడావిడి చేస్తున్నారు. ఎప్పుడూ ఎన్నికల ముందు, ఎదో ఒక పార్టీతో పొత్తు లేనిదే ఈ తోక పార్టీలకు మనుగడ ఉండదు. అందుకే, ఇప్పుడు పవన్ పక్కన చేరారు. కమ్యూనిస్ట్ భావజాలం అని చెప్పుకునే పవన్, నరేంద్ర మోడీ అంటే అమితమైన అభిమానం అని, ఆయన నాకు ఆదర్శం అని అనేక సార్లు చెప్పారు. అసలు కమ్యూనిస్టు అనే వాడికి,మోడీపై ఎలా అభిమానం ఉంటుందో అందిరికీ తెలిసిందే. కమ్యూనిస్ట్ లకు, ఈ దేశంలో ప్రధాన శత్రువు మోడీ. మరి మోడీని ఆరాధిస్తున్న పవన్ తో, కమ్యూనిస్ట్ లు వెళ్తున్నారు అంటే, వీళ్ళ పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

cpi 02072018 2

ఒక పక్క బీజేపీ పార్టీనే, పవన్ కళ్యాణ్ ను ఆడిస్తుంది అని, ఆంధ్రప్రదేశ్ మొత్తం నమ్ముతున్నారు. దగా పడ్డ ఆంధ్రుడుకి, విభజన హామీలు నెరవేర్చకుండా, నమ్మించి మోసం చేసాడు మోడీ. ఇలాంటి మోడీ పై, కనీసం ఒక్క మాట కూడా అనకుండా, పవన్ కళ్యాణ్ నాటకాలు పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నాడు. 2009 నుంచి, ప్రతి ఎన్నికల్లో ఒక ఆరు నెలలు ముందు రావటం, ఎన్నికలు అయిపోయినాక, త్రివిక్రమ్ తో సినిమాలు తీసుకోవటం, చూస్తూ ఉన్నాం. ఇలాంటి పవన్ కళ్యాణ్ తో కమ్యూనిస్ట్ లు దోస్తీ చేస్తున్నారు. ఒక పక్క, జనసేన పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందంటూ.. సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ ప్రకటిస్తున్నారు. అయినా సరే, పవన్ తోనే మా పొత్తు అని కమ్యూనిస్ట్ లు అంటున్నారు. దీని పై ఇప్పటి వరకు, పవన్ ఏ మాట చెప్పకపోయినా, వీళ్ళు మాత్రం, పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తుతున్నారు.

cpi 02072018 3

ఈ రోజు మరో అడుగు ముందుకు వేసి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, భజన కార్యక్రమం చేసారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలపై అవగాహన ఉన్న వ్యక్తి అని, మహా కూటమి ఏర్పడితే సీఎం అభ్యర్థి ఆయనే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రజల్లో పవన్‌కు ఇమేజ్‌, క్రేజ్‌ రెండూ ఉన్నాయని, అలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు సీఎం అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పవన్‌కు రాజకీయంగా మంచి పరిణతి ఉందని, ఇలాంటి నాయుకులు అసలు ఆంధ్రప్రదేశ్ లేరని కొనియాడారు. అందుకే మా కూటమికి పవన్ ముఖ్యామంత్రి అభ్యర్ధి అని, చెప్పారు. రానున్న ఎన్నికల్లో వామపక్ష, జనసేన పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్‌కల్యాణ్‌ అని, మేము అధికారంలోకి వస్తాం అంటూ చెప్పుకొచ్చారు.

రాయలసీమ సీనియర్ నేత, మాజీ మంత్రి మైసూరారెడ్డి మళ్లీ టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. పలు విషయాలపై వీరు చర్చించారని సమాచారం. ఒకవేళ ఇదే నిజం అయితే... టీడీపీలో మైసూరా చేరడం ఖాయమని చెబుతున్నారు. జులై మొదటి వారంలో ఆయన సైకిల్ ఎక్కే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. తన రాజకీయ ప్రస్థానంలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీల్లో మైసూరా ఉన్నారు.

mysora 01072018 2

25 ఏళ్ల‌పాటు కాంగ్రెస్ లో ప‌నిచేసిన మైసూరా, జిల్లా రాజ‌కీయాల్లో వైఎస్సార్ తో విభేదాలు తారాస్థాయికి చేరుకోవ‌డంతో 2004లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2004 ఎన్నిక‌ల్లో క‌డ‌ప పార్ల‌మెంట్ కు టీడీపీ త‌ర‌పున పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. 2006లో మైసూరారెడ్డిని రాజ్య‌స‌భ‌కు పంపింది టీడీపీ. అయితే, జ‌గ‌న్ జైలుకు వెళ్లే రెండు రోజుల ముందు టీడీపీకి గుడ్ బై చెప్పి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మైసూరారెడ్డి. జ‌గ‌న్ జైళ్లో ఉన్న‌స‌మ‌యంలో వైసీపీకి వెన్నుద‌న్నుగా నిలిచారు.

mysora 01072018 3

కొంత‌కాలం త‌ర్వాత పార్టీలో ప్రాధాన్య‌త త‌గ్గింద‌ని,జ‌గ‌న్ ఒంటెద్దుపోక‌డ త‌న‌కు న‌చ్చ‌డం లేదంటూ వైసీపీకి గుడ్ బై చెప్పేసి ప్ర‌స్తుతం త‌ట‌స్థంగా ఉంటున్నారు. వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న రాజ‌కీయంగా తిరిగి యాక్టివ్ అవ్వాల‌నుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న పొలిటిక‌ల్ రీ ఎంట్రీ తిరిగి టీడీపీతోనే స్టార్ట్ అవుతుంద‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. తాజాగా మంత్రి సోమిరెడ్డితో భేటీకావ‌డంతో మైసూరా మ‌ళ్లీ టీడీపీలో చేర‌బోతున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. జులై మొదటి వారంలో మైసూరా టీడీపీ తీర్థతం పుచ్చుకొంటారని తెలుస్తోంది.

నిన్నటి వరకు ఏసీబీ డీజీ ఆర్.పి.ఠాకూర్, ఆయన ఏసీబీ డీజీగా ఉన్న చివరి రోజుల్లో చేసిన పనితో, అవినీతి పరులు వణికిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని అందినకాడికి దోచుకున్నారు. ముందు మూడు తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తిని పోగేశారు. కథ అడ్డం తిరగడంతో ఏసీబీకి చిక్కారు. ఆ ఏముందిలే.. ఏసీబీకి చిక్కినా మనం పోగేసిన ఆస్తికి డోకా లేదనే ధీమాతో ఉన్న అక్రమార్కుల వెన్నులో ఇప్పుడు కొత్త చట్టం వణుకుపుట్టిస్తోంది. గత నెల 11 నుంచి అమలులోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం.. అక్రమాస్తులన్నీ ప్రభుత్వ పరం కానున్నాయి. గతేడాది విశాఖపట్టణం రేంజ్ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సర్వే ఇన్స్పెక్టర్ జీ.ఎల్.గణేశ్వరరావును కొత్త చట్టం కింద తొలికేసుగా తీసుకున్నారు. మరో మూడు అవినీతి తిమింగళాలను కొత్త చట్టం పరిధిలోకి తేనున్నట్టు ఏసీబీ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.

rp thakur 01072018

కొత్త చట్టం పరిధిలోకి వెళ్లడం ఖాయమని తెలిసినప్పటికీ.. ఇప్పుడా ముగ్గురు ఎవరనే దానిపైనే విస్తృతంగా చర్చ సాగుతోంది. 2017లో అక్రమాస్తుల కేసులు భారీగా నమోదయ్యాయి. ప్రజారోగ్య శాఖలో పని చేసిన పాము పాండురంగారావు, రాష్ట్రపట్టణ ప్రణాళిక డైరెక్టర్ జీ.రఘు, రహదార్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ ఎం.గంగాధర్, రాష్ట్రపరిశ్రమల శాఖ అదనపు డైరెక్టర్ సురేష్ బాబు సహా 11 భారీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పట్టుబడిన అక్రమ సంపాదన రూ.2500 నుంచి రూ.3వేల కోట్ల వరకు ఉండొచ్చని అప్పట్లోనే అధికారులు నిర్ధారించారు. రఘు, పాండు రంగారావు కేసుల్లోనే రూ.వెయ్యి కోట్ల వరకు అక్రమాస్తులను అధికారులు సీజ్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను ప్రత్యేక కోర్టు చట్టం-2016 పరిధిలోకి తెచ్చేందుకు ఏసీబీ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

rp thakur 01072018

పోయిన నెల 11 నుంచి అమలులోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను నెల రోజుల్లోగా ప్రభుత్వపరం చేస్తారు. చరాస్తులను కోర్టు కస్టడీలో పెట్టి స్థిరాస్తుల పై వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయనున్నారు. ఆరు నెలల్లోగా కేసులో చార్జిషీటు దాఖలు చేయడంతో పాటు ఏడాది లోగా విచారణ పూర్తి చేస్తారు. విచారణలో కేసులో పట్టుబడిన అధికారి, ఉద్యోగికి శిక్ష పడితే స్వాధీనం చేసుకున్న ఆస్తులు ప్రభుత్వ పరమవుతాయి. ఒక వేళ శిక్ష పడకుంటే 5శాతం వడ్డీతో ప్రభుత్వం సంబంధితులకు ఆస్తులను అప్పగిస్తుంది. ఇప్పటి వరకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులను విక్రయించే అధికారం లేకున్నా అనుభవించే అధికారం మాత్రం వీరికి ఉండేది. పైగా చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కోర్టు విచారణకు ప్రభుత్వ అనుమతి కోరాల్సి వచ్చేది. కొత్త చట్టంలో ఇప్పుడా పరిస్థితి లేదు. దేశంలో ఇప్పటి వరకు బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో మాత్రమే ఈ తరహా చట్టం అమలులో ఉంది. ఇప్పుడు ఏపీ ఈ తరహా చట్టం ప్రయోగించిన మూడో రాష్ట్రంగా ఉండబోతోంది.

ఉత్తరాంధ్రలో పర్యటిస్తోన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేస్తోన్న వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ ఉత్తరాంధ్రలో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతూ అశాంతిని సృష్టించకూడదని, ఆ ప్రాంతంలో ఏపీ సర్కారు చేసిన అభివృద్ధి కనబడట్లేదా? అని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ నటుడిగా కాకుండా ఓ రాజకీయ నాయకుడిలా ఆలోచించి మాట్లాడాలని బండారు సత్యనారాయణ సూచించారు. ఆయన కేంద్ర సర్కారుని ఎందుకు నిలదీయట్లేదని ప్రశ్నించారు. అభివృద్ధిపరంగా తగిన సలహాలు, సూచనలు ఇస్తే అమలుచేసే తత్వం తెదేపా ప్రభుత్వానికి ఉందన్నారు. ఓడరేవు ప్రాంతంలో కాలుష్య సమస్యకు రాష్ట్రప్రభుత్వమే బాధ్యత వహించాలనడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు.

bandaru 01072018 2

పవన్ రాజకీయాల్లోకి కొత్తగా రాలేదని.. ఆయన అన్న పార్టీలో పని చేసిన వైనాన్ని గుర్తు చేశారు. ప్రజారాజ్యం పార్టీని మీరు కాంగ్రెస్ పార్టీకి ఎంతకు అమ్మేశారో అందరికీ తెలుసంటూ సంచలన ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని చూసిన తర్వాత కూడా బీజేపీని కానీ ప్రధాని మోడీని కానీ పల్లెత్తు మాట ఎందుకు అనటం లేదన్న ఆయన.. పవన్ తీరు చూస్తుంటే బీజేపీ స్క్రిప్ట్ ను ఫాలో అవుతున్నట్లుగా ఉందని ఎద్దేవా చేయటం గమనార్హం. విశాఖలో మూడు నెలలుగా ఉంటున్న పవన్.. విశాఖ రైల్వే జోన్ గురించి ఎందుకు పోరాటం చేయటం లేదని ప్రశ్నించారు. భూ కుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సిట్‌ను ఏర్పాటు చేశారని, ఆ నివేదిక ప్రభుత్వ స్థాయిలో పరిశీలనలో ఉందని ఎమ్మెల్యే బండారు తెలిపారు. త్వరలోనే సిట్‌ నివేదిక వెలుగుచూస్తుందని, అక్రమార్కులకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.

bandaru 01072018 3

తెదేపా ఏర్పాటుతోనే ఉత్తరాంధ్ర రాజకీయంగా బలోపేతమైందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత సాగునీరు, ఐటీ రంగాల్లో గణనీయ పురోగతి సాధించిందన్నారు. భోగాపురం విమానాశ్రయం, భావనపాడు ఓడరేవు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు నీటి పారుదల ప్రాజెక్టులు వచ్చాయన్నారు. విశాఖ నగరం జాతీయ స్థాయి అత్యుత్తమ నగరాల్లో 7వ స్థానంలో నిలిచిందన్నారు. ఇదంతా తెదేపా పాలనలో సాగించిన అభివృద్ధి ఫలితమేనని, ఇవేవీ పవన్‌ కల్యాణ్‌కు కనబడడం లేదా? అని నిలదీశారు. కేంద్రంతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులు సైతం రాకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కారణమని ఏరకంగా పవన్‌ విమర్శిస్తారని ఆయన ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read