మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో జై సమైక్యాంధ్ర పార్టీ అంటూ వచ్చిన కిరణ్ ఆ తర్వాత కనుమరుగయ్యారు. ఈ రోజు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ వచ్చి కిరణ్ ను కలిసాక, ఇక కిరణ్ కాంగ్రెస్ ఎంట్రీ లాంచనమే. అయితే కిరణ్ కాంగ్రెస్ ఎంట్రీ వార్తలు వింటుంటే, జగన్ ఖంగారు పడుతున్నాడు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పటివరకు చంద్రబాబుకి ధీటైన ప్రత్యర్ధి లేక, చంద్రబాబుని వ్యతిరేకించే వారు జగన్ వైపు చూస్తున్నారు. పవన్ వచ్చినా, అతని సామర్ధ్యం ఏంటో రోజు రోజుకి ఎక్ష్పొజ్ అయ్యి, సీరియస్ నెస్ లేని రాజకీయ నాయకుడుకిగా మిగిలిపోయాడు. ఇప్పుడు కిరణ్ కాంగ్రెస్ ఎంట్రీ ఇస్తూ ఉండటంతో, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఎంతో కొంత ఇమేజ్ ఉంటుంది.

jagankiran 01072018 2

కిరణ్ ఎదో బలమైన నాయకుడు అని కాదు కాని, కిరణ్ కాంగ్రెస్ లోకి వెళ్తే, కాంగ్రెస్ పాత నాయకులు మళ్ళీ ఆక్టివ్ అయ్యే అవకాసం ఉంది. జగన్ వెంట వెళ్ళిన కొంత మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మళ్ళీ కాంగ్రెస్ వైపు వచ్చే అవకాసం లేకపోలేదు. ఎలాగూ జగన్ గెలవడు, ఆ ఉండేది ఎదో కాంగ్రెస్ లో ఉంటే, కొంచెం గౌరవంగా అయినా ఉండచ్చు కదా అనే అభిప్రాయం సీనియర్ కాంగ్రెస్ నేతల్లో ఉంది. మరో పక్క 2014లో కాంగ్రెస్ పార్టీ పై ఉన్న కోపం కంటే, ఇప్పుడు బీజేపీ పై ప్రజల్లో ఉంది. జగన్, బీజేపీతో అంటకాగుతున్నాడు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. చంద్రబాబు మీద ఉన్న వ్యతిరేకంతో, వైరంతో జగన్ తో ఉన్న వారు, ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తారు. ఎన్నికలు అయిన తరువాత, ఏ పార్టీ కేంద్రంలో అధికారం వచ్చినా, జగన్ కేసులు స్పీడ్ అవుతాయి, అనే అభిప్రాయం కూడా నేతల్లో ఉంది. వీటి అన్నికంటే, జగన్ ను కలవరపెడుతున్న సమస్య మరొకటి ఉంది.

jagankiran 01072018 3

ఇప్పటికే పవన్ కళ్యాణ్ రూపంలో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది అని భయపడుతున్న జగన్, ఇప్పుడు కిరణ్ ఎంట్రీతో మరింత ఖంగారు పడుతున్నారు. దీనికి కిరణ్ వ్యాఖ్యలు కూడా బలం చేకూరుస్తున్నాయి. రాష్ట్రంలో అధికార పక్షాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం వల్ల రాజకీయంగా ఎలాంటి ప్రయోజనమూ ఉండదని, ప్రధాన ప్రతిపక్షం వైసీపీని టార్గెట్‌ చేయకపోతే కాంగ్రెస్‌కు పూర్వవైభవం ఎలా వస్తుందని కిరణ్‌ అన్నట్లు సమాచారం. ఇటీవల రాష్ట్ర నేతలతో జరిగిన సమావేశంలో రాహుల్‌ వైసీపీని టార్గెట్‌ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇది కిరణ్‌తో మంతనాల ప్రభావమేనని తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ జగన్ ను ఎటాక్ చెయ్యటం,దానివల్ల వైసీపీకి కోత పడటం ఖాయం. ఎంత తక్కువ చూసుకున్నా, జగన్ కు పడే, కనీసం 3-4% ఓట్లు కాంగ్రెస్ కు పడే అవకాసం ఉంది. కిరణ్ రాకతో జరిగేది అదే. కిరణ్ గెలవలేడు,కాంగ్రెస్ ని గెలిపించలేడు. కానీ జగన్ పార్టీని ఓడించగలడు. ఇప్పుడు జగన్ ను కలవరపెడుతున్న అంశం ఇదే...

ఐటీ పరిశ్రమలకు అమరావతి కేంద్ర బిందువుగా మారుతోంది. రాజధాని అమరావతిలోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో యువతకు ఉద్యోగావకాశాలు అందుబాటులోకి తేవాలని చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. రాజధానిలో నాన్‌ రెసిడెంట్‌ తెలుగు(ఎన్‌ఆర్టీ) ఈ కృషిలో భాగస్వామ్యం అయింది. ఐకానిక్‌ టవర్‌ నిర్మాణానికి ఎన్‌ఆర్టీ శ్రీకారం చుట్టబోతోంది. ఏపీ సీఆర్‌డీఏ ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. మంగళగిరి సమీపంలో ప్రభుత్వం నేరుగా కంప్యూటర్‌ చీఫ్‌ డిజైనింగ్‌ సంస్థతో పాటు సెమీకండెక్టర్‌ సంస్థలను నెలకొల్పుతోంది. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌కి ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి ఫలించేందుకు సదుపాయాలు చేరువ అవుతున్నాయి.

amaravati it 01072018 2

రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నాలుగేళ్లలోనే ఐటీ రంగం అభివృద్ధి చెందిందనే చెప్పాలి. ఇప్పటికే శిక్షణ పొందే యువతీయువకులు, ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య 5వేలకు పైమాటే. మంగళగిరి వద్ద జాతీయ రహదారి పక్కన 18 ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసి ఎన్‌ఆర్టీ టెక్‌పార్కును ఏర్పాటు చేశారు. ఇక్కడ కంప్యూటర్‌ బేసిక్స్‌ నుంచి ఐటీకి సంబంధించిన పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ సంస్థలే 10 వరకు వెలిశాయి. విజయవాడతో కలిపి సుమారు 47 ఐటీ సంస్థలు పనిచేస్తున్నాయి.

amaravati it 01072018 3

33 అంతుస్తుల్లో ఐకానిక్‌ టవర్‌ : రాజధాని అమరావతిలో ఎన్‌ఆర్టీ కార్యకలాపాలను విస్తృతం చేసి రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి సంకల్పం నెరవేర్చటానికి వీలుగా ఎన్‌ఆర్టీలో లక్షకు పైగా సభ్యులు చేయి కలుపుతున్నారు. రాయపూడి-లింగాయపాలెం మధ్య సుమారు ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో 33 అంతస్తుల్లో ఐకానిక్‌ టవర్‌ నిర్మిస్తున్నారు. ఇందుకు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. టవర్‌ నిర్మాణానికి ఈనెల 22వ తేదీ ఉదయం 11గంటలకు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరో రెండు ప్రతిష్ఠాత్మక సంస్థలు : మంగళగిరి ఆటోనగర్‌ ప్రాంతాన్ని ఐటీ పార్కుగా మార్చేశారు. పెద్ద సంస్థలు వెలుస్తున్నాయి. ఇప్పటికే పైడేటా వంటి ప్రముఖ సంస్థలతో పాటు, పైకేర్‌ సంస్థ కార్యకలాపాలను సాగిస్తోంది. సుమారు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన కంప్యూటర్‌ చీఫ్‌ డిజైనింగ్‌ సంస్థతో పాటు సెమీకండెక్టర్‌ తయారీ సంస్థలను ప్రారంభించారు. మంగళగిరి రత్నాల చెరువు వద్ద ఖాళీగా ఉన్న 30ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఐటీ సంస్థల కోసం కేటాయించింది. జిల్లా కలెక్టరు ఇప్పటికే స్థలాన్ని రిజర్వు చేశారు.

బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆస్పత్రి క్లినిక్‌, సమాచార కేంద్రాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం విజయవాడలో ప్రారంభించారు. గవర్నర్ పేటలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ క్లినిక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ, ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, మంత్రి దేవినేని ఉమా, ఎం.వి.ఎస్. మూర్తి, ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ పుట్టినగడ్డపై క్యాన్సర్‌ ఆస్పత్రి సేవలు ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

balayya 01072018 2

బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిని ప్రజలకు చేరువ చేస్తామన్నారు. అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి ఆగస్టులో భూమి పూజ చేస్తామని బాలకృష్ణ చెప్పారు. మూడు దశల్లో ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. నమ్మకానికి చిరునామా బసవతారకం ఆస్పత్రని ఏపీ స్పీకర్‌ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఈ కార్యక్రమానికి కోడెలతోపాటు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ తదితరులు పాల్గొన్నారు.

balayya 01072018 3

క్యాన్సర్ తో మా అమ్మ పడిన బాధ మరెవరూ పడకూడదనే ఉద్దేశంతోనే బసవతారకం ఆసుపత్రిని ప్రారంభించామని బాలకృష్ణ తెలిపారు. ఆసుపత్రి సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని చెప్పారు. హైదరాబాదులోని ఆసుపత్రి సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం పన్ను రద్దు చేసిందని... అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి, జై సమైఖ్యాంధ్ర పార్టీ అధినేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాజకీయాల్లోకి రీ ఎంట్రీ చేయనున్నారు అనే వార్తలు నేపధ్యంలో, దాదాపు నాలుగేళ్ల తరువాత కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లడారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని అంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు ఆయన్ను ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఊమెన్ చాందీ ఈరోజు హైదరాబాదులోని కిరణ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఏపీకి చెందిన పలువురు నేతలు కూడా హాజరయ్యారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని ఇటీవల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

kiran 01072018 2

భేటీ అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ లో చేరుతున్నాననేవి కేవలం వార్తలు మాత్రమేనని... సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతానని తెలిపారు. ఊమెన్ చాందీ మాట్లాడుతూ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే కాకుండా, యావత్ దేశానికే కీలక సమయమని చెప్పారు. విభేదాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ దేశం కోసం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. కాంగ్రెస్ ను వీడిన నేతలందరినీ మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పార్టీలోకి ఆహ్వానించామని... తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ఆయనే అని తెలిపారు.

kiran 01072018 3

మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సొంతగూటికి చేరుతారన్న ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కిరణ్‌కుమార్‌రెడ్డిని కొందరు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కలిసి తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఆదివారం ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఉమెన్‌చాందీ, కిరణ్‌కుమార్‌రెడ్డి ఆసక్తి రేపుతుంది. ఈనెల 3న గానీ, 4న గానీ ఢిల్లీలో కాంగ్రెష్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కిరణ్‌ పార్టీలో చేరతారని సమాచారం. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి.. సొంతంగా పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం పొందారు. ఇన్నాళ్లు ఇంటికే పరిమితం అయిన ఆయన ఇప్పుడు మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్‌ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read