ఈ రోజే డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆర్పీ ఠాకూర్, విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్ సవాంగ్ కార్యాలయానికి వెళ్లారు. గౌతమ్ సవాంగ్ తో అరగంటకు పైగా భేటీ అయ్యారు. నగరంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. కొద్దిసేపు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఒకే బ్యాచ్‌కు చెందిన అధికారులు కావటంతో ఇద్దరి మధ్య డీజీపీ పోస్ట్‌కు పోటీ పెరిగింది. ప్రభుత్వం ఠాకూర్‌ను నియమించటంతో గౌతమ్ సవాంగ్ మనస్థాపానికి గురయ్యారని పోలీసులు వర్గాలు పేర్కొన్నాయి. సంప్రదాయంగా కొనసాగే మాజీ డీజీపీ మాలకొండయ్య రథ వీడ్కోలు యాత్రకు సీపి రాకపోవటంతో ఆయన్ను పలకరించేందుకు ఠాకూర్ సీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిశారు. అనంతరం ఇద్దరూ చిరునవ్వులతో బయటకు వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ నేపథ్యంలో డీజీపీ, సీపీల భేటీ విశేషంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఆర్‌.పి ఠాకూర్ నియమితులయ్యారు. ఈమేరకు శనివారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణ చేశారు. దీంతో కొత్త డీజీపీ కోసం సీఎం చంద్రబాబు కసరత్తు చేశారు. చివరకు ఠాకూర్‌ను డీజీపీగా ఖరారు చేశారు. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఆర్పీ ఠాకూర్ ఉన్నారు. ఠాకూర్ వచ్చాక అవినీతి అధికారుల భరతం పట్టారు. దీంతో డీజీపీగా ఠాకూర్ నియమించేంది అనుమానమే అని సావంగ్‌కే అవకాశం ఉందని మొదట ప్రచారం జరిగింది. డీజీపీ ఎంపికపై చంద్రబాబుతో అధికారులు భేటీ అయ్యారు. ఆ తరువాత ఎంపికపై చంద్రబాబు అన్ని కోణాల్లోనూ కసరత్తు చేసి చివరకు ఠాకూర్ వైపు మొగ్గు చూపారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని కీలక ప్రాంతాల్లో స్టార్‌ హోటళ్లు కొలువుదీరనున్నాయి. వివిధ పనులపై రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. దేశవిదేశాల నుంచి అమరావతికి వచ్చే వారి సంఖ్య అంతకంతకూ పెరగనున్న దృష్ట్యా ఇక్కడ ఆతిథ్యరంగం అంతర్జాతీయస్థాయిలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ సంకల్పించింది. ఈ మేరకు.. పేరున్న హోటల్‌ గ్రూపులను రప్పించడంలో ఏపీసీఆర్డీయే సఫలీకృతమైంది. అమరావతిలో తొలి విడతలో నాలుగేసి చొప్పున 5, 4 స్టార్‌ హోటళ్ల స్థాపనకు సీఆర్డీయే పచ్చజెండా ఊపింది. 5 స్టార్‌ హోటళ్లకు ఒక్కొక్కదానికి 4 ఎకరాలు, ఫోర్‌స్టార్‌ హోటళ్లకు రెండేసి ఎకరాల చొప్పున ఎకరం.. రూ.1.50 కోట్ల లెక్కన ప్రోత్సాహక ధరకే విక్రయిస్తోంది.

amaravati 30062018 2

ఉన్నతాధికారులు, నిపుణులతో అధ్యయనాలు, పరిశీలనలు, సమావేశాలు, వివిధ దశల్లో వడపోతలు ఇత్యాది కార్యక్రమాల అనంతరం నియమ నిబంధనల ప్రకారం వాటికి అవసరమైన భూకేటాయింపులు జరగనున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 3 నెలల్లోగా నిర్మాణాలు ప్రారంభమయ్యే అవకాశాలుండగా, మూడేళ్లలో వీటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పటికి.. రాజధానికి సందర్శకుల సంఖ్య బాగా పెరిగి, హోటల్‌ గదులకు మంచి గిరాకీ వస్తుందని అంచనా.

amaravati 30062018 3

అమరావతిలో 5 స్టార్‌ కేటగిరిలో హోటళ్లను నెలకొల్పే అవకాశాన్ని నోవాటెల్‌, హిల్టన్‌, క్రౌన్‌ ప్లాజా, డబుల్‌ ట్రీ అనే ప్రఖ్యాత గ్రూపులు దక్కించుకున్నాయి. ఒక్కో హోటల్‌లో 200 గదులుంటాయి. ఇవి కాకుండా ప్రపంచస్థాయి ప్రమాణాలున్న రెస్టారెంట్లు, లాంజ్‌లు, బాంక్వెట్‌ హాళ్లు, పార్కింగ్‌ వసతులు కొలువు దీరతాయి. ఇక.. 4 స్టార్‌ హోటళ్లను స్థాపించేందుకు హాలిడే ఇన్‌, గ్రీన్‌ పార్క్‌, జీఆర్‌టీ, దసపల్లా గ్రూపులు ఎంపికయ్యాయి. ఇప్పటికే వీటి ఏర్పాటుకు సంబంధించిన ఎల్‌ఓఐ (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌- అంగీకారపత్రాలు)లను ఆయా హోటల్‌ గ్రూపులకు జారీ చేసిన సీఆర్డీయే.. మిగిలిన అధికారిక లాంఛనాలను కూడా త్వరలోనే పూర్తి చేయనుంది.

భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఎత్తుకు పై ఎత్తు వేస్తోంది. రాజ్యసభలో తమ సంఖ్యా బలాన్ని పెంచుకోవటంతో పాటు ఇంత వరకు తమకు దూరంగా ఉన్న పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు తెర వెనక చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం 69. అయితే ఈ సంఖ్యను పెంచుకొనేందుకు బీజేపీ అధినాయకత్వం ప్రస్తుతం ఖాళీగా ఉన్న నాలుగు నామినేటెడ్ సీట్లను భర్తీ చేసేందుకు యుద్ధ ప్రాతిపదిక పై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేయటం ద్వారా తమ సంఖ్యా బలాన్ని 69 నుండి 73 పెంచుకునేందుకు బీజేపీ అధినాయకత్వం శరవేగంగా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. నాలుగు నామినేటెడ్ సీట్లకోసం బీజేపీ అధినాయకత్వం పన్నెండు పేర్లను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

amitshah 30062018 2

ఈ పన్నెండు మందిలో నలుగురిని ఎంపిక చేసి వీరి పేర్లను రాష్ట్రపతి రామ్నాథ్ కోవిందకు పంపిస్తారని అంటున్నారు. ఆ నలుగురిలో బాలీవుడ్ మాజీ సూపర్ స్టార్ మాధురీ దీక్షిత్, హర్యానాకు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్, శివాజీ జీవితం ఆధారంగా 'జనతా రాజ్' అనే పుస్తకం రాసిన బాబాసాహెబ్ పురందరేతో పాటు పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడిని రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ కూటమికి ప్రస్తుతం 106 మంది సభ్యుల మద్దతు ఉన్నది. నలుగురు నామీనేటెడ్ సభ్యులను కలుపుకుంటే ఈ సంఖ్య 110కు చేరుకుంటుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు బీజేపీ కూటమికి మరో ఇరవై మూడు మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే ఆరుగురు రాజ్యసభ సభ్యులున్న టీఆర్ఎస్ అధినాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరాపుతో ఈ విషయం గురించి ప్రస్తావించి ఉంటారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

amitshah 30062018 3

ముగ్గురు సభ్యులున్న వైఎస్ఆర్ సీపీ కూడా బీజేపీకి మద్దతు ఇస్తుందనే మాట వినిపిస్తోంది. తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ఉన్న బీజేడీని ఒప్పించేందుకు బీజేపీ అధినాయకత్వం తెర వెనక ప్రయత్నాలు ప్రారంభించింది. బీజేడీ మద్దతు ఇచ్చేందుకు అంగీకరిస్తే బీజేపీకి మరో ఐదుగురు సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. ఆ ఐదుగురి మద్దతు సంపాదించటం పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు పెద్ద పని కాదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. లోక్ సభ ఎన్నికల కోసం శివసేనతో రాజీపడేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధం కావటం తెలిసిందే. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఇవ్వటం ద్వారా శివ సేనను మంచి చేసుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకూ సత్పలితాలను ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ప్రాంతీయ పార్టీల కూటమి ప్రతిపాదించే అభ్యర్థికి బీజేడీ మద్దతు సంపాదించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.

తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో అనుక్షణం ఉత్కంఠ పెరుగుతోంది. ఎన్నికలు సమీపించే కొద్దీ సీఎం చంద్రబాబు పార్టీ కోసం నాలుగు నుంచి అయిదు గంటల సమయం రోజూ వెచ్చిస్తున్నారు. ప్రతిరోజూ పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళవారం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటుచేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ తరుణంలో తెలుగుదేశం నేతల తీరుతెన్నులపైకి ఆయన దృష్టి మళ్లింది. అంతర్గతంగా పార్టీ చేయిస్తున్న సర్వేలలో కొంతమంది ఎమ్మెల్యేలపై ఆ పార్టీ కార్యకర్తలలోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా నివేదికలు అందాయి. ఎమ్మెల్యే తమకు అందుబాటులో ఉండటంలేదనీ, పనులు చేయడంలేదనీ కొన్ని నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు గట్టిగా ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలలో దాదాపుగా ముప్పై నుంచి నలభై మందిని మార్చాల్సిందేనని అంచనాకు అధిష్టానం వచ్చింది.

ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాలలో వారికి ప్రత్యామ్నాయం ఎవరనే అంశంపై పార్టీ బృందాలు ఆరాతీస్తున్నాయి. అయితే ఈ విధానంపై కొందరు భిన్నాభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేని మార్చాలని ప్రయత్నిస్తే.. రెబల్స్‌గా వారు బరిలోకి దిగి కొత్తగా టిక్కెట్‌ ఇచ్చినవారిని ఓడించేందుకు ప్రయత్నిస్తారనీ, అదే జరిగితే పార్టీకి నష్టమనీ వాదిస్తున్నారు. అందువల్ల ముందే ఆయా శాసనసభ్యులను పిలిపించి తత్త్వం బోధపడేలా అన్ని విషయాలు వివరిస్తే మంచిదని అంటున్నారు. ఒకవేళ ఎవరికైనా టిక్కెట్‌ నిరాకరించే పరిస్థితి వస్తే... పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదో ఒక నియామక పదవి వారికి కట్టబెట్టే విధంగా ఒప్పిస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు. సదరు నేతలు అందుకు అంగీకరించని పక్షంలో పార్టీ నుంచి వారు వెళ్లిపోయినా లెక్కచేయకూడదని టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేత చంద్రబాబుకు సూచించారు. ఇలా చేస్తేనే మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే, క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు అన్నదానిపై ప్రస్తుతం టీడీపీలో వాడివేడి చర్చ జరుగుతోంది. పార్టీ చేయిస్తున్న అంతర‌్గత సర్వే వివరాలు ఎమ్మెల్యేలకు లీకవుతున్నాయి. దీంతో వారు చంద్రబాబుకు దగ్గరగా ఉండే ముఖ్య నేతల వద్ద తమ మనసులో ఉన్న ఆందోళనను వ్యక్తంచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంతమంది సిట్టింగ్‌లను మార్చే అవకాశం ఉందన్న విషయం స్పష్టం కానప్పటికీ.. ఆ జాబితాలో తమ పేరు ఉందో లేదో అంటూ కొందరు ఎమ్మెల్యేలు మీడియా మిత్రుల వద్ద కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే స్థానికంగా వ్యతిరేక పవనాలు వీస్తున్న ఎమ్మెల్యేలకు మాత్రం ఇప్పుటికే గట్టి సంకేతాలు అందాయట. మరి కొందరికి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందట. చంద్రబాబు సైతం ఈ అంశంపై ముందస్తు హెచ్చరికలు జారీచేస్తూనే ఉన్నారు. మొన్నటివరకు సుతిమెత్తగా మాట్లాడిన ఆయన ఇప్పుడు స్వరం పెంచారు. మీకోసం మొహమాటానికి పోయి పార్టీని దెబ్బతీసేది లేదని స్పష్టంచేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read