మన సొంత రాష్ట్రంలో ఉన్న నాయకులు, బీజేపీ పై మాట పడకుండా, ఇవ్వ వలిసిన వారిని కనీసం ఒక్క మాట కూడా అనకుండా, బీజేపీ మీద పోరాడుతున్న వారిని బలహీనపరిచే ప్రయత్నాలు చూస్తున్నాం. మరో పక్క, పక్క రాష్ట్రాల నాయకులు మాత్రం, మనం చేసే దీక్షలకు వచ్చి మద్దతు ఇస్తున్నారు. ఉక్కు ప్యాక్టరీ కేటాయించాలంటూ కేంద్రం తీరుకు నిరసగా టీడీపీ నేతలు సీఎం రమేష్, బీటెక్ రవి చేపట్టిన నిరాహార దీక్ష ఏడో రోజుకు చేరుకుంది. వీరి దీక్షకు పొరుగు రాష్ట్రాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. సీఎం రమేష్ చేపట్టిన దీక్షకు తమిళనాడులో ముఖ్య పార్టీయైన డీఎంకే మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగానే ఆ పార్టీ నేత కనిమొళి నేడు కడపకు రానున్నారు. సీఎం రమేష్‌కు సంఘీభావం తెలపనున్నారు.

ramesh 26062018 2

ఇదిలాఉండగా, దీక్ష కారణంగా సీఎం రమేష్‌, బీటెక్‌ రవి ఆరోగ్యం నానాటికి విషయమిస్తోందని వైద్యులు తెలిపారు. దీక్ష ఇలాగే కొనసాగిస్తే అపస్మారకస్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో వీరి ఆరోగ్య పరిస్థితిపై పార్టీ శ్రేణుల్లో శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. సోమవారం దీక్షల్లోని ఎంపీ, ఎమ్మెల్సీని రాష్ట్ర మంత్రి జవహర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వాసు కలిసి మద్దతు తెలిపారు. మంత్రి జవహర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని నిలువునా ముంచేస్తే ఎన్టీయేలోని భాజపా నమ్మించినట్టేట ముంచేసిందన్నారు. జిల్లాకు చెందిన జగన్మోహన్‌రెడ్డి తన కేసుల మాఫీ కోసం పాకులాడుతూ ఉక్కు గురించి మాట్లాడటంలేదన్నారు. జనసేన అంటూ గాలిపోగేసుకుంటున్న ఓ నటుడు చంద్రబాబు, లోకేష్‌ను తిడుతున్నారని భారతదేశ చరిత్రలో నీతి వంతపాలన, పరిపాలనాధక్షుడుగా పేరెన్నిగన్న చంద్రబాబును తిట్టడంలో అర్థంలేదన్నారు.

ramesh 26062018 3

మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ 120 గంటల పాటు ఆహారం లేకుండా ఉన్నవీరి పోరాట స్ఫూర్తిని అందరూ గుర్తించాలన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ కోరుతున్నా కేంద్రం స్పందించకపోవడం విచారకరమన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే సుమారు రెండు లక్షలమందికి ఉపాధి, ఉద్యోగాలు వస్తాయని, అవి రావడం ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డికి ఇష్టంలేదన్నారు. ఉక్కు పరిశ్రమపైన, ప్రత్యేక హోదాపైన కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్‌ నరసింహారావు, పురందేశ్వరి తమ పరిధికి మించి మాట్లాడుతున్నారని, నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ప్రకాశ్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉక్కుపై ఒక్క ప్రకటన చేస్తే వీరిద్దరూ దీక్ష విరమిస్తారని అన్నారు. రాష్ట్ర గవర్నర్‌ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి అర్థంలేకుండా దొంగదీక్షలని మాట్లాడటం తగదని అన్నారు.

ప్రపంచంలోని ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల్లో ఒకటైన ‘ఫ్లెక్స్‌ట్రానిక్స్‌’ రాష్ట్రానికి రానుంది. రూ.585 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సుమారు 30 దేశాల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ రాకతో రాష్ట్రంలోనూ 6,600 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. సంస్థ ప్రతినిధులు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, సమాచార, సాంకేతిక(ఐటీ) మంత్రి లోకేశ్‌తో సమావేశం కానున్నారు. అనంతరం ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖతో రాష్ట్రంలో పెట్టుబడులపై ఒప్పందం చేసుకోనున్నారు. సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేశ్‌ బెంగుళూరు, తిరుపతిలో ఇప్పటికే పలుసార్లు సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకున్న సానుకూలతలను వివరించారు.

fle 26062018 2

అవసరమైన సమాచారాన్ని అధికారులు అందించేలా ఏర్పాట్లు చేశారు. కంపెనీ రాకతో ప్రపంచంలో మరిన్ని అగ్రగామి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు గత కొంతకాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాలు ఈ కంపెనీని తమ దగ్గర పెట్టాలంటూ పోటీకి వచ్చాయి. అయితే పలు దఫాలుగా లోకేశ్‌, ఒక దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడి రాష్ట్రానికి ఈ కంపెనీ వచ్చేలా ఒప్పించగలిగారు. తిరుపతి సమీపంలో ఈ కంపెనీ తన యూనిట్‌ నెలకొల్పనుంది.

fle 26062018 3

ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ 30 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రెండు లక్షల మందికి పైగా ఉద్యోగస్థులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ రాష్ట్రానికి వస్తే...దానితో పాటు ఆ ఎలక్ర్టానిక్స్‌ కంపెనీకి విడిభాగాలను సరఫరా చేసే చిన్న చిన్న కంపెనీలు కూడా వచ్చేందుకు అవకాశాలున్నాయి. అయా కంపెనీలతో కూడా చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ శాఖ చేసిన ముమ్మర ప్రయత్నాల వల్ల ఇప్పటికే ఫాక్స్‌కాన్‌ రాష్ట్రానికి వచ్చింది. ఈ ఒక్క కంపెనీలోనే 14వేల మంది మహిళలకు ఉపాధి లభించింది. ఈ కంపెనీతో పాటు సెల్‌కాన్‌, కార్బన్‌, డిక్సన్‌ లాంటి కంపెనీలు ఉత్పత్తులను ప్రారంభించాయి. ఫలితంగా, విభజన నాటికి ఒక్క సెల్‌ఫోన్‌ కూడా తయారుకాని పరిస్థితి నుంచి...ఇప్పుడు దేశంలో తయారయ్యే ప్రతి 10సెల్‌ఫోన్లలో రెండు రాష్ట్రం నుంచే తయారయ్యే స్థాయికి రాష్ట్రం చేరుకొంది.

54 ప్రాజెక్టులలో మరో 6 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా వున్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సోమవారం సచివాలయంలో పోలవరం సహా 54 ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెదపాలెం, చినసేన, పులకుర్తి, ఓక్ టన్నెల్, గోరకల్లు రిజర్వాయర్, పులికనుమ ఎత్తిపోతల పథకం పనులు పూర్తయ్యాయని చెప్పారు. కొండవీటి వాగు ప్రాజెక్టు జూలై 15 నాటికి పూర్తికానుందని, జూలై 31 నాటికి కుప్పం బ్రాంచ్ కెనాల్ నుంచి నీటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతుందని అన్నారు.

irrigation 26062018 2

గుండ్లకమ్మ రిజర్వాయర్ పనులు తుదిదశకు చేరాయని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్, నెల్లూరు-సంగం బ్యారేజీలు ఆగస్టు 31 నాటికి పూర్తి కానున్నాయని వివరించారు. ఈ ఏడాది డిసెంబరులో ముల్లపల్లికి నీటి సరఫరా ప్రారంభమవుతుందని తెలిపారు. మల్లిమడుగు, బాలాజీ, వేణుగోపాల సాగర్ రిజర్వాయర్లు నిర్మాణం కోసం అటవీ భూముల సమస్యను పరిష్కరించాలని అటవీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వంశధార ప్రాజెక్టు స్టేజ్ 2, రెండో దశ పనులు పూర్తిచేసి 5 టీఎంసీల నీటిని జులై 15కి నిల్వ చేయాలని చెప్పారు. ఆగస్టు 15 నాటికి ప్రాధాన్య ప్రాజెక్టులలో మిగిలిన అన్ని ప్రాజెక్టులకు టెండర్లు పిలవడం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

irrigation 26062018 3

జలవనరుల శాఖకు 19 స్కోచ్ అవార్డులు రావడంపై అధికారులకు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. నీటి పారుదల రంగంలో ‘స్టేట్ ఆఫ్ ది ఇయర్’ కింద ప్లాటినమ్ అవార్డు. మరో పక్క, పోలవరం ప్రాజెక్టు సత్వరం పూర్తి చేసేందుకు తక్షణం నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. పోలవరం నిర్మాణం కోసం ఖర్చు చేసిన వాటిలో రూ. 1,504.14 కోట్లు ఇవ్వాలని, అలాగే నూతన అంచనాలకు త్వరగా ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విడుదలలో కేంద్రం ఆలస్యం చేయడం లేదని బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను తప్పుబట్టారు.

గుంటూరులో ప్రప్రథమంగా ఐటీ(ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ) కంపెనీ ప్రారంభం కాబోతోంది. వేద ఐఐటీ, ఇన్వేకాస్‌ సంస్థలు తమ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టేందుకు సంసిద్ధమయ్యాయి. డెస్కుటాప్‌లకు సంబంధించి ఏఎండీ మైక్రో ప్రాసెసర్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇక్కడ నిర్వహించబోతున్నట్లు ఆయా సంస్థలు జిల్లా యంత్రాంగానికి నివేదించాయి. ఇందులోనే వేద ఐఐటీ సంస్థ పెద్దఎత్తున శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించనుంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ విజ్ఞప్తి మేరకు నగరంలోని విద్యానగర్‌ ఒకటో లైనులో ఏడు అంతస్థుల భవనంలో ఐటీ టవర్‌ నిర్మాణం పూర్తి చేశారు.

guntur 26062018 2

ఈ నెల 29వ తేదీన ఉదయం దీనిని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌ హాజరుకానున్నారని కలెక్టర్‌ కోన శశిధర్‌కు ప్రభుత్వవర్గాల నుంచి సమాచారం అందింది. అమరావతి రాజధాని ప్రాంతానికి ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు సీఎంతో పాటు మంత్రి లోకేష్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మంగళగిరికి పై డేటా సెంటర్‌ని తీసుకొచ్చి వందలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. రెండు రోజుల క్రితం రాజధానిలోని రాయపూడిలో ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ ద్వారా ఐకాన్‌ టవర్‌కు శంకుస్థాపన చేశారు. 36 అంతస్థులలో నిర్మాణం జరగనున్న ఆ టవర్‌ ఐటీ కంపెనీలకు హబ్‌గా మారనుంది.

guntur 26062018 3

తాజాగా గుంటూరు నగరానికి తొలిసారిగా ఐటీ కంపెనీని తీసుకురాబోతోన్నారు. ఇందులోనూ వందల సంఖ్యలో సాఫ్టువేర్‌, హార్డ్‌వేర్‌ ఉద్యోగులకు ఉద్యోగాలు లభించనున్నాయి. 24 వేల చదరపు అడుగుల విస్త్రీర్ణంలో నిర్మించిన వేద ఐఐటీ, ఇన్వేకాస్‌ సంస్థలు ఒకే టవర్‌లో కార్యకలాపాలాను ప్రారంభించనున్నాయి. వచ్చే శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు, అంతకంటే గంట ముందే లోకేష్‌ రానున్నారని సమాచారం రావడంతో ఆదివారం కలెక్టర్‌ శశిధర్‌, అర్బన్‌ ఎస్‌పీ విజయారావు, కార్పొరేషన్‌ కమిషనర్‌ శ్రీకేష్‌ లత్కర్‌ బాలాజీరావు ఇతర అధికారులు ఇన్వేకాస్‌ టవర్‌ని సందర్శించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యానగర్‌ ఒకటో లైనులో ఆక్రమణలు తొలగించి కొత్తగా బీటీ లేయర్‌తో రోడ్డుని అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

Advertisements

Latest Articles

Most Read