రాష్ట్రంలో నీటిపారుద‌ల‌కు సంబంధించిన అన్ని కాలువ‌ల‌ను వ‌ర్చువ‌ల్ విధానంలో ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హిస్తాన‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలోని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ స్టేట్ క‌మాండ్ కేంద్రం నుంచి ఆయ‌న ప్ర‌కాశం బ్యారేజీలో పేరుకుపోయిన గుర్ర‌పుడెక్కను బ్యారేజీని వ‌ర్చువ‌ల్ విధానంతో ఆక‌స్మిక త‌నిఖీ చేశారు. బ్యారేజీలో గుర్ర‌పు డెక్క ఆకు పేరుకుపోయినా అధికారులు చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డంపై ముఖ్య‌మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటి పారుద‌ల శాఖ అధికారుల‌నుద్దేశించి మాట్లాడుతూ బ్యారేజీలో ప‌రిస్థ‌తి అలా ఉంటే మీరంతా ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. దుర్గ ఘాట్‌, త‌దిత‌ర ప్రాంతాలను కూడా ఆయ‌న వ‌ర్చువ‌ల్ త‌నిఖీ చేశారు. నాలుగు రోజ‌ల్లో ప్ర‌కాశం బ్యారేజీ నీరు ప‌రిశుభ్రంగా ఉండాల‌ని నీటి పారుద‌ల శాఖ ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు.

prakaasam 16062018 2

రాష్ట్రంలో సాగు నీటి కాలువ‌ల‌న్నీ కూడా ఇదే త‌ర‌హాలో ఇక‌పై వ‌ర్చువ‌ల్ త‌నిఖీ చేస్తాన‌ని తెలిపారు. డ్రోన్ కెమెరాలు ఉప‌యోగించి సాగు నీటి కాలవ‌ల‌న్నీ కూడా ఇదే త‌ర‌హాలో వ‌ర్చువ‌ల్ త‌నీఖీలు చేస్తాన‌ని, నీటి పారుద‌ల‌కు ఎక్క‌డా కూడా అడ్డంకులు లేకుండా చూడాల‌ని ఆదేశించారు. ఎక్క‌డైనా అధ‌కారులు నిర్ల‌క్ష్యం వ‌హిస్తే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో పింఛ‌న్ల పంపిణీ జ‌రుగుతున్న తీరును కూడా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆర్టీజీ కేంద్రంలో స‌మీక్ష నిర్వ‌హించారు. పింఛ‌న్ల పంపిణీ ఎలా జ‌రుగుతున్న‌ది, వాటిపై ప్ర‌జా సంతృప్తి శాతం ఎలా ఉంద‌నే అంశాల‌ను రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి బాబు ఏ వివ‌రించారు. పింఛ‌న్ల పంపిణీపై 79 శాతం సంతృప్తిని వ్య‌క్తం చేశార‌ని తెలిపారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ 21 శాతం మంది అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డానికి గ‌ల కార‌ణాలు విశ్లేషించి ఆ లోపాల‌ను భ‌ర్తీ చేయాల‌ని అన్నారు.

prakaasam 16062018 3

రాష్ట్రంలో ప్ర‌తి నెలా 47,20,253 మంది పింఛ‌న్లు అందుకుంటున్నార‌ని, పింఛ‌న్ల కోసం ప్ర‌భుత్వం ప్ర‌తి నెలా రూ.549 కోట్లు పంపిణీ చేస్తోంద‌న్నారు. వృద్ధుల‌కు వృద్ద్యాప్య పింఛ‌న్లు ఆస‌ర‌గా ఉంద‌ని, పింఛ‌న్ల పంపిణీలో ఎలాంటి అవినీతికి తావులేకుండా పంపిణీ చేస్తున్నామ‌న్నారు. కొన్ని చోట్ల వేలిముద్ర‌లు ప‌డ‌ని స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని, అక్క‌డ ముఖ గుర్తింపు (ఫేషియ‌ల్ రిక‌గ్నిషన్) విధానం అమలు చేస్తామ‌న్నారు. ప్ర‌తి నెల మొద‌టి ప‌ది రోజుల్లోనే దాదాపుగా పింఛ‌న్ల పంపిణీ పూర్తి అయ్యేలా చేస్తాన‌ని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో దెయ్యాలు పింఛ‌న్లు తీసుకునేవ‌ని, కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌న్నారు. ఎంతో పార‌దర్శ‌కంగా పింఛ‌న్ల‌ను పంపిణీ చేస్తున్నామ‌న్నారు. దేశంలో ఎక్క‌డైనా ఇలాంటి వ్య‌వ‌స్థ ఉందా చెప్పండి అని ఆయ‌న మీడియా ప్ర‌తినిధుల‌ను ప్ర‌శ్నించారు. రాబోయే రోజుల్లో కూడా టెక్నాల‌జీని ఉప‌యోగించి అన్ని ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను కూడా ఇదే స్థాయిలో అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వంలో కూడా ఇప్ప‌డు ఎవ‌రూ త‌ప్పించుకోలేర‌ని, అంద‌రూ నిజాయ‌తీ, నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేయాల్సిందేన‌ని తెలిపారు. స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కార్యాల‌య కార్య‌ద‌ర్శులు రాజ‌మౌళి, గిరిజా శంక‌ర్‌, సెర్ప్ సీఈఓ కృష్ణ‌మోహ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేకహోదా సహా రాజ్యసభలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఆందోళన, ఆవేదన, నిరసనను శనివారం దిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో నిలదేసేందుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. భారీ ప్రణాళికతో , పక్కా వ్యూహంతో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఆయన ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ప్రధాని నరేంద్రమోదీ ముందే ఎండగట్టేలా ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగానే రేపటి నీతి ఆయోగ్ సమావేశంపై చంద్రబాబు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తనున్నారు. 24 పేజీల సమగ్ర నివేదిక సిద్ధం సీఎం చేసుకున్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీయాలని సీఎం నిర్ణయం తీసుకన్నారు.

cbn 16062018 2

15వ ఆర్థిక సంఘం విధివిధానాల సవరణలకు ఆయన పట్టుబట్టనున్నారు. మాట్లాడే అవకాశమివ్వకుంటే అక్కడే నిరసన తెలిపే యోచనలో సీఎం ఉన్నట్లు వినికిడి. సీఎంతో పాటు మంత్రి యనమల రామకృష్ణుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని, అన్ని రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్న నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశం ఆదివారం (17న) ఢిల్లీలో జరగనుంది. ప్రధాని మోదీ దీనికి అధ్యక్షత వహించనున్నారు. దీనికి చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. ఎన్డీఏతో టీడీపీ తెగతెంపుల తర్వాత వీరిద్దరూ ఎదురుపడనుండడం ఇదే ప్రథమం. అక్షర క్రమం ప్రకారం ఈ సమావేశానికి వచ్చే ముఖ్యమంత్రుల్లో మాట్లాడే తొలి అవకాశం ఆంధ్ర సీఎంకే వస్తుందని అంచనా. ఈ అవకాశాన్ని వినియోగించుకుని తన అభిప్రాయాలను చంద్రబాబు బలంగా వినిపించనున్నారు.

cbn 16062018 3

రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించి... కేంద్ర ఉదాసీన వైఖరికి నిరసనగా సమావేశం నుంచి వాకౌట్‌ చేస్తే ఎలా ఉంటుందన్నది ఒక ఆలోచన. కేంద్రం వైఖరిపై ఆగ్రహంగా ఉన్న, భావసారూప్యం కలిగిన భాజపాయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్నీ కూడగట్టి నిరసన తెలియజేయాలన్నది మరో ప్రతిపాదన. ఈ అంశంపై భాజపాయేతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో చంద్రబాబు ఇప్పటికే చర్చించారు. పశ్చిమ బంగ, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, పినరయి విజయన్‌, కుమారస్వామిలతో ఫోన్లో మాట్లాడారు. దిల్లీ, పుదుచ్చేరి, పంజాబ్‌ ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడారు. ప్రధాని ముగింపు ఉపన్యాసం చేయడానికి ముందుగా అందరూ బయటకు వచ్చేస్తే బాగుంటుందని కూడా ఒక వ్యూహంగా తెలుస్తుంది. ఇవన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న ప్రధాని కార్యాలయం, దీనికి కౌంటర్ వ్యూహం కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.

ఢిల్లీలో వైసీపీ - బీజేపీ నేతలు చర్చలు చేస్తూ దొరికిపోవటం, ఇప్పుడు మరో మలుపు తీసుకునే అవకాశం ఉంది. బీజేపీ ఎమ్మల్యే ఆకుల సత్యన్నారాయణ, వైసీపీ ఎమ్మల్యే బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి భేటీ పై వార్తలు రావటంతో, ముందు అవి ఖండించారు.. తరువాత సిసి టీవీ ఫూటేజ్ రావటంతో, కలిసి టిఫిన్ చేసాం అని చెప్పారు, కాని రాం మాధవ్ ను కలవలేదు అని చెప్పారు. రాం మాధవ్ ఇంటికి వెళ్లినట్టు లాగ్ బుక్ లో ఉండటంతో, రాం మాధవ్ ఇంటికి వెళ్ళలేదు అని, రాం మాధవ్ ఇంటి దగ్గర ఒక కార్ దిగి, ఇంకో కార్ ఎక్కామని చెప్పారు. మొత్తానికి, ఇరు పార్టీలు కలిసి, రాం మాధవ్ ఇంట్లో భేటీ అయినట్టు, అక్కడ పీఏసీ చైర్మన్‌ హోదాలో, బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, అసెంబ్లీలోని కొన్ని కీలక పత్రాలు, రాం మాధవ్ కు ఇచ్చినట్టు వార్తలు వచ్చయి. అయితే, ఇప్పుడు ఇవి బుగ్గన మెడకు చుట్టుకునే అవకాసం కనిపిస్తుంది.

ycp bjp 16062018 2

సమగ్ర అధ్యయనం చేయడానికే ప్రజా పద్దుల సంఘానికి(పీఏసీ) వివిధ శాఖలు ప్రతులను అందిస్తాయని, వాటిని శాసనసభలో ప్రాతినిధ్యం లేని వ్యక్తికి, రాజకీయ పార్టీ సభ్యుడికి ఇవ్వడం శాసనసభా ధిక్కారమే అవుతుందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. దీన్ని శాసనసభా ప్రవర్తనా నియమావళి అతిక్రమణతో పాటు నేరంగా పరిగణించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. శాసనసభ కమిటీలన్నీ రాజ్యాంగపరమైన సంస్థలన్నారు. వీటికి సంబంధించిన చర్చలు, ప్రతులు, నివేదికలు అత్యంత రహస్యమన్నారు. వీటిని ప్రసార మాధ్యమాలతో పాటు ఎవరికీ ఇవ్వకూడదన్నారు. గతంలో పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి ఎంపీలను ప్రలోభాలకు గురిచేసిన అంశం కంటే ఇది తీవ్రమైనదన్నారు. ఇదే నిజమైతే బుగ్గనపై సభా హక్కుల ఉల్లంఘన(ప్రివిలేజ్‌ మోషన్‌) ఎందుకు పెట్టకూడదని ఆయన ప్రశ్నించారు.

ycp bjp 16062018 3

ఇదే విషయం పై చంద్రబాబు కూడా స్పందించారు. పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి కేంద్రానికి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ఢిల్లి వెళ్లి భాజపా పెద్దలతో బుగ్గన భేటీ కావడం వైకాపా, బీజేపీ కుట్రలకు పరాకాష్ట అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పీఏసీ చైర్మన్‌ రాష్ట్రానికి సంబంధించిన విషయాలను ఫిర్యాదు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ చైర్మన్‌ ఏదైనా విషయాలుంటే స్పీకర్‌కు తెలియజేయాలని అనంతరం శాసనసభలో దాని గురించి చర్చించా లన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక పాత్రలు, బీజేపీ పెద్దలకు చేరవేయడాన్ని సీఎం గర్హించారు. బైట ఫోజులు కొట్టి లోపల లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత్రలు ఇచ్చినట్టు తేలిన మరు క్షణమే, ఆయనకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చే అవకాశం ఉందని, ఛీఫ్ విప్ కూడా అన్నారు. మొత్తానికి, ఇది బుగ్గన మెడకు చుట్టుకునే అవకాసం ఉంది.

రేపు జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి, రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న అన్యాయం పై, నిరసన తెలపటానికి చంద్రబాబు ప్రాణాలక రచిస్తున్నారు. ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం పై, చంద్రబాబు ఎంపీలతో సమావేశం జరిపారు. బీజేపీయేతర ముఖ్యమంత్రుల్లో భావసారూప్యం ఉన్న వారితో సమన్వయం చేసుకోవడం ద్వారా ఈ సమావేశంలో వేడి పుట్టించాలన్న వ్యూహంలో ఆయన ఉన్నారు. దీనిపై ఆయన ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, కేరళ సీఎంలు మమతా బెనర్జీ, కుమారస్వామి, పినరయి విజయన్‌ వంటి వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మిగిలిన సీఎంలతోనూ టచ్‌లో ఉన్నానని ఎంపీలకు చెప్పారు. తమ సూచనలను పరిగణనలోకి తీసుకోకుంటే ఆయా రాష్ట్రాల బృందాలు నీతి ఆయోగ్‌ భేటీని బాయ్‌కాట్‌ చేసే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.

kcr 16062018 2

అయితే ఇదే సందర్భంలో కెసిఆర్ ప్రస్తావన కూడా వచ్చింది. ఫెడరల్‌ ఫ్రంట్‌ పెడుతున్నానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాత్రం చంద్రబాబు ఈ సంప్రదింపుల ప్రక్రియలో చేర్చకపోవడం విశేషం. ‘మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే విషయంలో కేసీఆర్‌ కలిసి రాకపోవచ్చు. ఆయనా, ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అటూ ఇటూగా ఉన్నారు. వారి సమస్యలు వారివి. వారిని వదిలివేసి కలిసి వచ్చేవారిని కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం’ అని తెలిపినట్లు సమాచారం. కేసీఆర్‌ కేంద్రానికి అనుకూలంగా ఉంటున్నట్లు కనిపిస్తోందని, శుక్రవారం ఢిల్లీలో ఆయన ప్రధానిని కలిసినప్పటి దృశ్యాల్లో కూడా వారు పరస్పరం సౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తోందని ఒక ఎంపీ వ్యాఖ్యానించారు.

kcr 16062018 3

నీతి ఆయోగ్‌ సమావేశంలో తమ వైఖరి ఎలా ఉంటే బాగుంటుందన్న అంశంపై చంద్రబాబు మిగిలిన ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. భావసారూప్యం ఉన్న వారంతా ఒకే వైఖరితో ఉంటే బాగుంటుందన్నది ఆయన యోచన. నీతి ఆయోగ్‌ సమావేశం తర్వాత ఆయన ఒక రోజు ఢిల్లీలో ఉంటారా లేక వెంటనే తిరిగొస్తారా అనేది ఇంకా స్పష్టంకాలేదు. అందరం ఒకసారి కలిస్తే బాగుంటుందని ఒకరిద్దరు సీఎంలు ఆయనకు ప్రతిపాదించారు. అవసరమని భావిస్తే ఆయన అక్కడే ఆగి వారిని కలిసే అవకాశముంది. ఇంతక ముందు కూడా కెసిఆర్, మోడీకి అనుకూలంగానే పని చేసారు. అవిశ్వాస తీర్మానం అప్పుడు, తన ఎంపీల చేత గొడవ చేపించటం, దక్షినాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తుందని అన్ని రాష్ట్రాలు కలిస్తే రాక పోవటం, కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ని, బీజేపీ ఆహ్వానించటం, ఇవన్నీ కెసిఆర్ - మోడీకి ఉన్న సంబంధాలు తెలియ చేస్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read