తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విపక్ష పార్టీలకు సూటిగా సవాల్ విసిరారు. ఎటువైపు ఉండాలో వైసీసీ, జనసేన తేల్చుకోవాలని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీ వైపు ఉంటారో, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పోరాడతారో తేల్చుకోవాలని ఆయన సవాల్ చేశారు. చంద్రబాబు సూటిగా చేసిన ఈ ఛాలెంజ్‌తో రాజకీయాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందా? బీజేపీతో ఎలాంటి సంబంధాలు లేవని వైసీపీ, జనసేన ప్రకటిస్తాయా? కేంద్రంపై సమరానికి ప్రభుత్వంతో కలిసి వస్తాయా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు బీజేపీతో పొత్తుపెట్టుకుని కేంద్రంతో భాగస్వామిగా ఉన్న టీడీపీ, రాష్ట్రానికి ఏ మాత్రం సహాయం చెయ్యని బీజేపీతో ఇప్పుడు అన్ని బంధాలను తెంచేసుకుని ఆ పార్టీపై తాడే పేడే అన్నట్లుగా పోరాడుతోంది. అదే సమయంలో ఏపీలో విపక్షంగా ఉన్న వైసీపీ.. బీజేపీతో బహిరంగంగా కాకపోయినా అంతర్గతంగా మంచి సంబంధాలు కొనసాగిస్తోంది. హోదా, విభజన హామీల విషయంలో ఆ పార్టీ ఏపీలో అధికార పార్టీనే విమర్శిస్తున్నారు కానీ, ఇవ్వాల్సిన కేంద్రంపై ఈగ వాలనీయడంలేదు. చివరికి మోదీని విమర్శించారని, నేరుగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చి అమితమైన అభిమానాన్ని ఆ పార్టీ నేతలు చూపిస్తున్నారు. అదే సమయంలో కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బహిరంగ మద్దతు ప్రకటించారు. బళ్లారి లాంటి జిల్లాలో వైసీపీ కార్యకర్తలే బీజేపీ బరువు బాధ్యతలు మోశారు. ఏపీలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో పొత్తు పెట్టుకుంటామని చెప్పడంలేదు. అలా అని విమర్శలు కూడా చేయడం లేదు.

cbn challange 05062018 2

ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతోపాటు ఎన్డీయేలో ఉన్న మరోపార్టీ జనసేన. హోదా విషయంలో మొదట్లో టీడీపీ, బీజేపీలతో తీవ్రంగా విభేదించి.. బీజేపీపై, మోదీపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఏపీలో బీజేపీ చచ్చిపోయిందన్నారు. తాను ఎన్డీయేలో లేనని తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. కానీ హఠాత్తుగా పవన్ తన స్టాండ్‌ను మార్చేసుకున్నారు. ఏపీలోని అన్ని వర్గాలూ ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగస్వాములైనప్పుడు పవన్ హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఆ సమయంలోనే నాలుగో ఆవిర్భావ దినోత్సవ సభ పెట్టి హోదాపై మినహా అన్ని మాట్లాడారు. అప్పటి నుంచి పవన్ కేంద్రంపై ఒక్క విమర్శ కూడా చేయడం లేదు. హోదా ఇవ్వాలని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నారే గానీ అంతకుమించి డిమాండ్ నోటి వెంట రావడం లేదు. కొన్నాళ్ల క్రితం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీకి హోదా ఇవ్వకపోయినా పర్వాలేదని, నిధులు ఇస్తే చాలని అన్నారు. అప్పుడే మోదీకి తాను సన్నిహితుడునని, ఆయన అంటే తనకు అభిమానమని చెప్పుకొచ్చారు. ఆయన బీజేపీ ఆత్మీయుడైపోయారు.

cbn challange 05062018 3

టీడీపీ ఎన్డీయే నుంచి బయటకొచ్చినప్పటి నుంచే పవన్ టీడీపీ వ్యతిరేకంగా మారారని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలు వద్దని చంద్రబాబు అన్నారు. లోపాయికారిగా బీజేపీతో ఒప్పందం చేసుకుని రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. దీనిపై నేరుగా సీఎం వైసీపీ, జనసేనకు సవాల్ విసిరారు. అయితే బీజేపీతో కలిసి నడుస్తున్నట్లు బహిరంగంగా చెప్పుకోవాలని, లేకపోతే రాష్ట్రం కోసం పోరాడేందుకు కలిసి రావాలని అన్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ గెలవడం కన్నా చంద్రబాబును ఓడించడమే టార్గెట్ అని ఈ విషయాన్ని బీజేపీ జాతీయ కార్యదర్శి ఒకరు మీడియాకు చెప్పారు. అందుకే కొత్త కొత్త రాజకీయ సమీకరణాలకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఏపీలో బీజేపీపై ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణంగా ఈసారి తనకు మద్దతు ఇచ్చే పార్టీలైనాసరే తాను లేకుండా కలిసి పోటీ చేయించాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కౌంటర్ గానే చంద్రబాబు సవాల్ చేసినట్లు సమాచారం. దీనిపై వైసీపీ, జనసేనలు ఎలా స్పందిస్తాయోనని టీడీపీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.

 

 

భూకంపాలు వస్తాయి అని, వరదలు వచ్చి అమరావతి మునిగిపోతుంది అని, లూజ్ సాయిల్ అని, అహార భద్రతకు ముప్పు అని, ఇలా టీవీల్లో, పేపర్ లో అమరావతి గురించి ఎలా భయపెట్టారో చూసాం.. అమరావతిలో బహుళ అంతస్థుల భవంతులు కడితే, రెండో రోజే కూలిపోతుంది అని, ఒక విష పత్రిక విషం చిమ్మంది... ఇలా ఒకటి కాదు రెండు కాదు, అమరావతి పై ప్రజల్లో ఎలాంటి భయాలు క్రియేట్ చెయ్యాలో, అలా చేసారు. అయితే, వీరికి ఎప్పటికి అప్పుడు, మాడు పగిలేలా టెక్నికల్ గా సమాధానం చెప్తూ వచ్చారు. తాజాగా, మరో సారి, భారీ నిర్మాణ సముదాయాలకు ఈ ప్రాంతం అనుకూలం కాదు అంటూ వ్యక్తమవుతున్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. రాజధాని అమరావతిలో శాశ్వత సచివాలయ నిర్మాణ ప్రాంతంలో 9 నుంచి 14 మీటర్లు (28 నుంచి 45 అడుగులు) లోతునే గట్టి రాయి తగిలినట్టు భూపరీక్షల్లో తేలింది.

amaravati 05062018 2

దీంతో నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్న అధికారులు, నిపుణుల్లో ఉత్సాహం నెలకొంది. వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం కోసం జరిపిన భూపరీక్షల్లో ఇలాంటి రాయి తగిలేందుకు 100 నుంచి 110 అడుగుల లోతు వరకూ వెళ్లాల్సి వచ్చింది. కానీ.. శాశ్వత సచివాలయ నిర్మాణ ప్రాంతంలో మాత్రం తక్కువ లోతులోనే గట్టిరాయి కనిపించింది. కృష్ణానదీ తీరం భారీ, బహుళ అంతస్థుల భవంతులకు ఏమాత్రం అనుకూలం కాదన్న కొందరి అనుమానాలకు ఈ భూపరీక్షలతో సమాధానం లభించినట్టయింది. ఇప్పటి వరకు బహుళ అంతస్థులతో కూడిన ఈ భారీ నిర్మాణ సముదాయం కోసం 23 చోట్ల ప్రముఖ సంస్థలతో భూపరీక్షలు జరిపించగా.. అవన్నీ కూడా చాలా తక్కువ లోతులోనే గట్టిరాతి నేల ఉన్నట్టు చూపాయి.

amaravati 05062018 3

‘షీట్‌ రాక్‌’గా నిపుణులు అభివర్ణించే ఈ రాతిపొర 40 నుంచి 50 అంతస్థులతో నిర్మితమవనున్న సచివాలయ సముదాయాన్ని త్వరగా, ధృఢంగా పూర్తి చేసేందుకు దోహదపడుతుందన్న విశ్వాసాన్ని రాజధాని నిర్మాణపనులు పర్యవేక్షిస్తున్న సీఆర్డీఏ అడిషనల్‌ కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌, ఇతర ఉన్నతాధికారులు, నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.2600 కోట్ల అంచనా వ్యయంతో సచివాలయం కాంప్లెక్స్‌కు సీఆర్డీఏ ఈ ఏడాది ఏప్రిల్‌ 26న టెండర్లు పిలిచింది. ఈ నెల 11న వాటిని తెరవనుంది. టెండర్ల ఖరారు ప్రక్రియ పూర్తవగానే నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సీఆర్డీఏ కమిషనర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ నేతృత్వంలో ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

విధి నిర్వహణలోనే కాదు, సాటి మనుషులను కాపదతంలోను ముందు ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు... ఈ మధ్య కోడెల శివ ప్రసాద్, పరిటాల సునీత, రోడ్ మీద ఆక్సిడెంట్ అయిన వారిని కాపాడి, స్వయంగా హాస్పిటల్ కు తీసుకువెళ్లటం చూసాం, ఇప్పుడు అదే విధంగా మానవత్వాన్ని చాటుకున్నారు మరో మంత్రి జవహర్.. విధి నిర్వహణలో భాగంగా రోడ్ పై వెళ్తూ ఉండగా, అక్కడ జరిగిన ఆక్సిడెంట్ చూసి, వెంటనే రంగంలోకి దిగి, ఒక నిండు ప్రాణం కాపాడారు... అ టైంకి, మంత్రి అటుగా వెళ్లి ఉండకపోతే, ఎవరూ ఆ మనిషిని రక్షించి ఉండే వారు కాదు... సరైన సమయంలో వెళ్లి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడి, మానవత్వం నిలబెట్టుకున్నారు మంత్రి.. వివరాలు ఇలా ఉన్నాయి...

jawahar 04062018 2

కొవ్వూరు మండలం నందమూరు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రమాదవశాత్తూ ఆటో కాల్వలో బోల్తా పడింది. చేబ్రోలుకు చెందిన ఆటో డ్రైవర్‌ కామిశెట్టి వీర వెంకట సత్యనారాయణ దొమ్మేరు జాతరకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఆటో కాల్వలోకి బోల్తా కొట్టింది. అదే సమయంలో అటుగా వస్తున్న మంత్రి జవహర్‌ ప్రమాదాన్ని చూసి కాన్వాయ్‌ ఆపించి మంత్రి స్వయంగా సిబ్బంది, పోలీసులతో కలసి సహాయక చర్యలు చేపట్టారు. ఆటోను పైకి తీసి డ్రైవర్‌ను కాపాడారు.

jawahar 04062018 3

అపస్మారక స్థితిలో ఉన్న డ్రైవర్‌ సత్యనారాయణను పట్టణ ఎస్‌ఐ రమేష్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం సత్యనారాయణను భార్య, బంధువులు ఇంటికి తీసుకెళ్లినట్టు ఎస్‌ఐ తెలిపారు.. అయితే, మంత్రి అక్కడకు వెళ్ళిన సమయంలో, ఆటో లేపటానికి మనుషులు సరిపోకపోతే, మంత్రి జవహర్ అక్కడ ఉన్న మిగతా సెక్యూరిటీ వారితో కలిసి, స్వయంగా ఆటోను పక్కకు తీసారని తెలుస్తుంది.. ఏది ఏమైనా, ఒక మంచి పని చేసి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన జవహర్ గారికి కృతజ్ఞతలు...

గన్నవరం నుంచి నుంచి సింగపూరుకి డైరెక్ట్ ఫ్లైట్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఒక బహిరంగ ప్రకటన ఇచ్చింది. హైదరబాద్ నుంచి సింగపూర్ మార్గంలో ప్రస్తుతం ఉన్న చార్జీల క్రమంలో, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి సింగపూర్ ఎయిర్ పోర్ట్ కి విమానాలను ప్రారంభించే సాధ్యాసాద్యాలను పరీక్షించే ప్రతిపాదన పై, ప్రజల నుంచి అభిప్రాయాన్ని తెలుసుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది అంటూ, ఒక ప్రకటన రెండు రోజుల క్రిందట జారీ చేసింది. 10 రోజుల పాటు ఈ ప్రాజాభిప్రాయ సేకరణ చేస్తారు.. మనం చెయ్యల్సింది చాలా ఈజీ, మనం ఉన్న చోటు నుంచే అభిప్రాయం చెప్పవచ్చు..

singapore 05062018 2

98681 75288 - ఈ నంబరుకి "Interested" అని వాట్సాప్ లో మెసేజ్ పంపండి. రాజధాని అమరావతినుండి (గన్నవరం విమానాశ్రయం) సింగపూరుకి డైరక్ట్ విమానాల సర్వీస్ ప్రారంభించేందుకు ప్రజాభిప్రాయసేకరణ ఇది. ఎంత ఎక్కువమంది రియాక్ట్ అయితే అంత వేగంగా సర్వీస్ మొదలవుద్ది. మరో మార్గం., www.APADCL.com వెబ్ సైటుకి వెళ్ళి అక్కడ కూడా అభిప్రాయం చెప్పవచ్చు. ప్రస్తుతం వెబ్ సైట్లో కౌంట్ 24144 ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాధ్యమైనంత వరకు, ఎక్కువ మంది ఇక్కడ అభిప్రాయం చెప్తే, ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మన వంతు ప్రయత్నం మనం చేద్దాం...

singapore 05062018 3

రెండుగంటల్లో 5000 మంది రాజధాని అమరావతినుండి (గన్నవరం విమానాశ్రయం) సింగపూరుకి డైరక్ట్ విమానాల సర్వీస్ ప్రారంభించండి అని www.APADCL.com వెబ్ సైటుకి వెళ్ళి తమ ఆసక్తిని తెలియజేశారు. వెబ్ సైట్లో కౌంట్ నిన్న 11,000 నుండి ప్రస్తుతం 24,500+ దాకా పెరిగింది. నెక్స్ట్ 48 గంటల్లో లక్షకి పెంచుదాం. ఇంకా వారమే సమయముంది. మీరు చేసి, మీ ఫ్రెండ్స్, వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి ఒక్కరితో చేయించండి. 98681 75288 - ఈ నంబరుకి "Interested" అని వాట్సాప్ లో మెసేజ్ పంపండి. రాజధాని అమరావతినుండి (గన్నవరం విమానాశ్రయం) సింగపూరుకి డైరక్ట్ విమానాల సర్వీస్ ప్రారంభించేందుకు ప్రజాభిప్రాయసేకరణ ఇది. ఎంత ఎక్కువమంది రియాక్ట్ అయితే అంత వేగంగా సర్వీస్ మొదలవుద్ది.

Advertisements

Latest Articles

Most Read