మాకు ఎదురు తిరిగాడు అనే కోపంతో, చంద్రబాబుని దించటానికి, రెండు నెలల క్రితం ఆపరేషన్ గరుడని, బీజేపీ మొదలి పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అనేక మందిని కూడగట్టి, చంద్రబాబుని అన్ని వైపుల నుంచి నిరాధార ఆరోపణలతో, నిందించే ప్రయత్నం చేసి, ప్రజల్లో ఆ అబద్ధాలు, నిజం అనే ప్రచారం చేపిస్తుంది బీజేపీ.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ, తిరుమల గొడవ... ఇప్పటికే పవన్ కళ్యాణ్, జగన్, ముద్రగడ, ఐవైఆర్, ఉండవల్లి లాంటి ఉద్దండులను ఈ ఆపరేషన్ గరుడలోకి తీసుకువచ్చిన బీజేపీ, ఇప్పుడు తాజాగా తెలంగాణా నాయకుడు మోత్కుపల్లిని కూడా, ఆపరేషన్ గరుడలోకి ఆహ్వానించింది.. ఈ ఆహ్వానం ఇవ్వటానికి, ఈ రోజు మోత్కుపల్లి ఇంటికి, ఆపరేషన్ గరుడలో సీనియర్ నాయకులు అయిన ముద్రగడను పంపించింది.

mudragada 01062018 2

మోత్కుపల్లి ఇంటికి వెళ్ళే ముందు, ఐవైఆర్ ను కలిసి, అమూల్యమైన సూచనలు తీసుకుని, ముద్రగడ, మోత్కుపల్లి ఇంటికి వెళ్లారు. చంద్రబాబుని టార్గెట్ చేసుకుని, వీరిద్దరూ చర్చించారు. చంద్రబాబు పతనం కోసం మేము అందరం కలిసి కట్టుగా ప్రయత్నం చేస్తున్నామని, అందుకే మీరు కూడా మాతో కలిసి రావాలని, ముద్రగడ, మోత్కుపల్లిని కోరినట్టు తెలుస్తుంది. అవసరం అయిన అన్ని సహాయాలు నేను మీకు, పై వాళ్ళతో మాట్లాడి, మీకు ఏమి కావాలంటే అది చేస్తానని, హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే అన్ని వైపుల నుంచి, అస్త్రాలను చంద్రబాబు మీదకు వదిలామని, పెద్దగా ఉపయోగం ఏమి లేదని, అందుకే తెలంగాణా నేత నుంచి కూడా చంద్రబాబు పై విమర్శలు చేస్తే, బాగుంటుంది అని, మీరు కూడా రండి అంటూ, మోత్కుపల్లిని, ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానించారు ముద్రగడ..

mudragada 01062018 3

దీంతో మోత్కుపల్లి కూడా నేను ఆంధ్రప్రదేశ్ రాష్టానికి వస్తానని, ఒక రధయాత్ర చేస్తానని, చంద్రబాబుని దించేలానే మీ ప్రయత్నంలో నేను భాగస్వామిని అవుతానని, ముద్రగడకు మాట ఇచ్చారని తెలుస్తుంది.. చంద్రబాబు పతనమే మన అందరికీ కావాల్సింది అని, ఆపరేషన్ గరుడలో నేను భాగస్వామి అవ్వటం, మీలాంటి గొప్ప నేతలు, ఐవైఆర్, పవన్, జగన్, సోము వీర్రాజు లాంటి ఉద్దండులతో కలిసి పని చెయ్యటం నాకు ఎంతో సంతోషంగా ఉందని, మీరు ఏమి చెప్తే, ఎలా చెప్తే అలా చెయ్యటానికి సిద్ధం అని మోత్కుపల్లి, ముద్రగడతో చెప్పారు. ఈ ఆపరేషన్ లోకి వస్తున్నందుకు, సంతోషం అని, త్వరలోనే పై వాళ్లతో మాట్లాడి, మీరు ఏమి చెయ్యాలో చెప్తా అని ముద్రగడ చెప్పినట్టు తెలుస్తుంది. ఇదే విషయం ఒక టిడిపి సీనియర్ నాయకుడు వద్ద ప్రస్తావించి, స్పందన కోరగా, ఆయన మాట్లాడుతూ, "ఇందులో చెప్పటానికి ఏముంది, జోగి జోగి రాసుకుంటే బూడిద రాల్తుంది" అని సింగల్ లైన్ లో తేల్చేసారు...

ఒక పక్క అమరావతికి నిధులు ఇవ్వకుండా, మీకు మయసభ కావాలా, మీకు ఇంత పెద్ద రాజధాని అవసరమా అంటూ బీజేపీ నేతలు హేళన చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అమిత్ షా మాట్లాడుతూ, మీ అమరావతి ప్లాన్ లు ఇంకా సింగపూర్ లోనే ఉన్నాయి, వెళ్లి తెచ్చుకోండి అంటూ ఎగతాళి చేసి, రూపాయి కూడా అమరావతి మీద ఖర్చు పెట్టలేదు, 1500 కోట్లకు ఖర్చు ఇవ్వలేదు అని అబద్ధాలు ఆడుతూ, అడుగు అడుగునా అమరావతి పై విషం చిమ్ముతూ, హేళనగా మాట్లాడుతూ, ఎగతాళి చేస్తుంటే, అదే సింగపూర్ ప్రధాని, మన ప్రధాని మోడీ ముందు అమరావతి ప్రస్తావాన తీసుకు వచ్చారు. సింగపూర్ లోనే మీ అమరావతి ప్లాన్ లు ఉండి పోయాయి అని ఎగతాళి చేస్తున్న అమిత్ షా గారు, మీ ప్రాణ స్నేహితుడు మోడీ గారికి, ఆ సింగపూర్ ప్రధాని, మా అమరావతి గురించి ఏమి చెప్పారో చూడండి..

singapore 01062018 2

మన ప్రధాని నరేంద్ర మోడి గారు, సింగపూర్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సింగపూర్ ప్రధాని లీ హసీన్ లూంగ్‌ ని కలిసారు. మోదీ సింగపూర్‌లోని ఇస్తానాలో సింగపూర్ ప్రధాని లీ హసీన్ లూంగ్‌తో కలిసి సంయుక్త విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా, అమరావతి గురించి సింగపూర్ ప్రధాని లీ హసీన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర ప్రాజెక్టు సింగపూర్ కన్సార్షియంతో విజయవంతంగా కొనసాగుతోందన్నారు. అమరావతిలో సింగపూర్ కన్సార్షియం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీని పై గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. మరో నెల రోజుల్లో, ఇక్కడ పనులు మొదలు కానున్నాయి. ఇదే విషయం పై సింగపూర్ ప్రధాని, మన ప్రధాని మోడీ పక్కన ఉండగానే, అమరావతి నగర ప్రాజెక్టు సింగపూర్ కన్సార్షియంతో విజయవంతంగా కొనసాగుతోందన్నారు.

singapore 01062018 3

సింగపూర్, భారతదేశం త్వరలోనే ఎయిర్ సర్వీస్ అగ్రిమెంట్ కుదుర్చుకోబోతున్నట్లు మోదీ తెలిపారు. ప్రముఖ కంపెనీల సీఈఓల్లో చాలా మంది భారతదేశం వైపు నమ్మకంతో చూస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేసేందుకు లీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భారతదేశంతోపాటు ఇతర దేశాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సింగపూర్ కేంద్రంగా మారిందని అన్నారు ప్రధాని మోడీ. మోదీ అంతకుముందు సింగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మూడు భారతీయ మొబైల్ పేమెంట్ యాప్‌లను ఆవిష్కరించారు. లీతో సంయుక్త మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రూపే, భీమ్, యూపీఐ ఆధారిత చెల్లింపు యాప్‌లను అంతర్జాతీయంగా ఆవిష్కరించామని, ఇది డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని, సింగపూర్‌తో బలపడుతున్న భాగస్వామ్యాన్ని తెలియజేస్తోందని వివరించారు.

సొంత భూములు సైతం ప్రభుత్వ భూములుగా రెవెన్యూ దస్త్రాల్లో నమోదు కావడంతో వాటిపై క్రయ.. విక్రయాలు లేక.. ఇతర రుణ సదుపాయం పొందలేక వందల మంది రైతులు నలిగి పోతున్నారు. ఇకపై అలాంటి రైతులకు వూరట లభించనుంది. ఎర్ర చుక్కలు ఉన్న భూములు ప్రభుత్వ భూమిగా అధికారులు గుర్తించి వాటిపై రిజిస్ట్రారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లను నిలిపి వేయడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడేవారు. ఇబ్బందుల సమయాల్లో వాటిని అమ్ముకోలేక.. కనీసం తాకట్టు పెట్టి బ్యాంకుల్లో రుణాలు పొందలేక అవస్థలు పడేవారు. ఎంతోకాలంగా అన్నదాతలు ఈ సమస్యపై ఆవేదనకు గురవుతూనే ఉన్నారు. ఈ సమస్యకు చంద్రబాబు ముగింపు పలకనున్నారు. నిషేధిత భూముల జాబితా 22-ఏలో ప్రైవేటు ఆస్తులు, చుక్కల భూముల సమస్యల పరిష్కారంపై రెవెన్యూ శాఖ కార్యాచరణ చేపట్టింది. గ్రామస్థాయిలోనే ఈ రెండు సమస్యలను పరిష్కరించేందుకు జూన్‌ 13 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనున్నట్లు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బుధవారం తెలిపారు.

cbn chukkalu 01062018 2

గతంలో రెవెన్యూ రికార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ‘మీ ఇంటికి-మీ భూమి’ కార్యక్రమం కింద గ్రామసభలు నిర్వహించామని, ఇప్పుడు ఇదే తరహాలో 22-ఏ, చుక్కల భూముల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తొలుత 22-ఏ నిషేధిత భూముల జాబితాను గ్రామస్థాయిలో పంచాయతీ కార్యాలయం లేదా రెవెన్యూ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. అక్కడ వ్యక్తమయ్యే అభ్యంతరాలను రెవెన్యూ అధికారులు లిఖితపూర్వకంగా తీసుకుంటారు. అయితే, వారి వద్ద అప్పటికే మీ-సేవ ద్వారా ఇచ్చిన దరఖాస్తులు కూడా ఉంటాయి. వాటిపై కూడా అధికారులు జరిపే చర్చల్లో ప్రస్తావిస్తారు. రైతులు, ప్రైవేటు వ్యక్తుల అభ్యంతరాలను స్వీకరిస్తారు. దరఖాస్తులు, అభ్యంతరాల పరిశీలన పూర్తయ్యాక.. ధర్మంగా ఉండే వాటిని అక్కడిక్కడే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కేఈ చెప్పారు. ఓ ప్రైవేటు ఆస్తి, లేదా ఓ భూమిని అన్యాయంగా 22-ఏలో చేర్చినట్లు నిర్ధారణ అయితే వెంటనే దాన్ని ఆ జాబితా నుంచి తొలగిస్తారు.

cbn chukkalu 01062018 3

గ్రామస్థాయిలో పరిష్కారం కాని వాటిని రాష్ట్ర కమిటీలు పరిశీలిస్తాయి. ఈ కమిటీలు జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పరిష్కరిస్తాయి. దీనికి అనుగుణంగా కలెక్టర్‌ తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ రాష్ట్ర స్థాయి కమిటీలకు భూపరిపాలన శాఖ కమిషనర్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, సర్వే డిపార్టుమెంట్‌ శాఖ సీనియర్‌ అధికారులు నేతృత్వం వహిస్తారు. చుక్కల భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి జిల్లా కమిటీల నిర్ణయంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 90రోజుల్లో సీసీఏల్‌ఏకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇస్తాం. దీనిపై సీసీఏల్‌ఏ తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. 1954కు ముందు పేదలకు అసైన్డ్‌ చేసిన భూములను 22-ఏ జాబితా నుంచి తొలగించే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని కేఈ చెప్పారు.

ధొలెరా సిటీ.. గుజరాత్ లో నిర్మిస్తున్న అతి పెద్ద నగరం.. ప్రధాని మోడీ స్వయంగా పర్యవేక్షిస్తూ కడుతున్న నగరం... ఈ నగర నిర్మాణం గురించి, పెద్దగా దేశంలో ఎవరికీ తెలియదు... ఎప్పుడైతే అమరావతికి చేస్తున్న అన్యాయం పై, చంద్రబాబు ఎదురుతిరిగి, ధొలెరా సిటీకి నిధులు ఇస్తారు, మాకు ఎందుకు ఇవ్వరు అని అడిగారో, అప్పటి నుంచి దేశంలో చర్చ మొదలైంది. అప్పటి వరకు ఎదో ప్రాజెక్ట్ అనుకున్న దేశ ప్రజలు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ అని చంద్రబాబు చర్చలో పెట్టేంతవరకు, తెలియదు.. ఇప్పుడే ఈ విషయం పై అన్ని రాష్ట్రాల్లో చర్చ మొదలైంది.. కేంద్రం నిధులు ఇచ్చి మరీ ఈ నగరం కడుతుంటే, మిగతా రాష్ట్రాలు ఎందుకు ఊరుకుంటాయి ? దీంతో అమిత్ షా రంగంలోకి దిగి, కేంద్రం ఒక్క పైసా ఇవ్వటం లేదు అంటూ అబద్ధాలు కూడా ప్రచారం చేసారు... గుజరాత్ ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది... దేశ వ్యాప్తంగా చర్చ మొదలు కావటంతో, ఒక పేపర్ యాడ్ కూడా ఇచ్చింది.

dholera 01062018 2

ప్రభుత్వ ఖర్చుతో పార్టీ పరంగా వివరణ ఇచ్చినట్లు ఉన్న ఆ ప్రకటనల్లో కేంద్రం రూ.3 వేల కోట్లు మాత్రమే ధొలెరాకు ఇస్తుందని.. ఆ ప్రాజెక్ట్ వ్యయం రూ.57 వేల కోట్లు అని ప్రకటనల్లో చెప్పుకొచ్చారు. అమరావతిని ఉపాధి అవకాశాల కేంద్రంగా చంద్రబాబు తీర్చిద్దాలనుకుంటున్నారు. ధొలెరా కాన్సెప్ట్ కూడా అదే. అమరావతి పోటీ వస్తే.. ధొలెరా నష్టపోతుంది అన్న ఉద్దేశంతో కేంద్రం కావాలనే నిరాదరణ చూపిస్తోంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం. అందుకే బయటకు చెప్పకపోయినా.. ప్రత్యేక పద్దతుల ద్వారా ధొలెరాకు వేల కోట్లు వెళ్తున్నాయనేది ఏపీ ప్రభుత్వం అనుమానం. యనల రామకృష్ణుడు కూడా అదే చెబుతున్నారు. ధొలెరాపై చంద్రబాబు విమర్శలు ప్రారంభించిన తర్వాత గుజరాత్ ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. ప్రచారం ఉద్ధృతం చేస్తోంది. కానీ టీడీపీ నేతలు మాత్రం అమరావతి- ధొలెరాను పోల్చి ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు.

dholera 01062018 3

ఈ ధొలెరా ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా నిర్మిమతవుతోంది. మొత్తం రెండు లక్షల ఇరవై వేల ఎకరాల ప్రాజెక్ట్. ఇందులో కోర్ ఏరియా 5,600 ఎక‌రాలు. రాజ‌ధాని అహ్మదాబాద్‌తో అనుసంధానం చేసేందుకు 10 లైన్ల ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను 2007లో ప్రకటించారు. అది పేపర్లపైనే ఉంది. మోదీ ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యారో..అప్పుడు ఈ నగారనికి మహర్దశ ప్రారంభమైంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ... ధొలెరాకు రూ.2,784 కోట్లు నిధులు ఇచ్చారు. అంత‌ర్జాతీయ సంస్థల ద్వారా పెట్టుబడుల‌ను ఆక‌ర్షించ‌డంలోనూ కేంద్రం చొర‌వ తీసుకుంది. అన్ని విధాలుగా ధొలెరాకు అండగా నిలుస్తోంది. అహ్మదాబాద్, సూరత్, వడోదరా లాంటి పెద్ద నగరాలు ఉన్నా, ఇప్పుడు ధొలెరా, గిఫ్ట్ సిటీ లాంటి మరో పెద్ద నగరాలు మీరు కట్టుకుంటున్నారు, మరి అమరావతికి ఎందుకు సహాయం చెయ్యరు అని అడిగితే మాత్రం, మీకు మయసభ కావాలా అంటూ, బీజేపీ నేతలు ఎగతాళి చేస్తారు.

Advertisements

Latest Articles

Most Read