ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖరీదైన క్యాథ్‌ల్యాబ్‌ సేవలు రోగులకు అందుబాటులో రానున్నాయి. పీపీపీ విధానంలో ఈ ల్యాబ్‌లు 13 ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు. గుండె సంబంధ రోగులకు వైద్య సేవలు అందించడంలో ఈ క్యాథ్‌ ల్యాబ్‌ సేవలకు ప్రాధాన్యం ఉంది. ఒక్కో క్యాథ్‌ల్యాబ్‌కు కనీసం రూ.3 కోట్లు వ్యయమవుతుంది. అంతేకాకుండా..ప్రత్యేకంగా వైద్యులు, సాంకేతిక నిపుణులు అవసరం. ఖరీదైన ఈ సేవలు జిల్లా ఆస్పత్రుల్లో లేనందున రోగులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రోగుల అవస్థలు తీరనున్నాయి.

cathlab 30052018 2

ఈ క్యాథ్‌ ల్యాబ్‌ ద్వారా 20 రకాల వైద్య సేవలు రోగులకు అందుబాటులో రానున్నాయి. ఈ జాబితాలో స్టంట్స్‌, ఫేస్‌మేకర్‌, యాంజియోప్లాస్టీ వంటి సేవలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు నిర్దేశించిన మేరకు రూ.7,770 నుంచి 80వేల రూపాయల విలువ కలిగిన సేవలు రోగులకు అందుతాయి. ఇక నుంచి ఒక్కో కేంద్రంలో రోజుకు 25 నుంచి 30మందికి స్టంట్, యాంజియోగ్రామ్ పరీక్షలు పరీక్షలు నిర్వహించొచ్చు. గుండె పనితీరుని గుర్తించి లోపాలను తెలియజేయడం, గుండె రక్త నాలాల్లో ఉన్న బ్లాక్స్ ని, వాటి తీవ్రతని గుర్తించడం క్యాథ్ ల్యాబ్ ప్రత్యేకత. వైజాగ్‌ కేజీహెచ్‌, కర్నూలు జీజీహెచ్‌లో పదేళ్ల కిందట, గుంటూరు జీజీహెచ్‌లో ఏడేళ్ల కిందట ఏర్పాటు చేశారు. ఇప్పటికే వీటి కాలపరిమితి ముగిసింది.

cathlab 30052018 3

ఈ నేపథ్యంలో క్యాథ్‌ల్యాబ్‌లను వైజాగ్‌, కర్నూలు, గుంటూరు జీజీహెచ్‌ల్లోనే కాకుండా....కడప, నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, కాకినాడ, శ్రీకాకుళం బోధనా ఆస్పత్రులు, ఏలూరు, విజయనగరం జిల్లా ఆస్పత్రుల్లో కొత్తగా ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ సుబ్బారావు వెల్లడించారు. విజయవాడ, అనంతపురం బోధనాస్పత్రులకు కేంద్రం నిధుల ద్వారా పరికరాలు రాబోతున్నాయి. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ మొదలైంది. జూన్‌ చివరినాటికి సంస్థ ఎంపిక జరిగేలా వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

వైసీపీ ఎంపీల రాజీనామాలు భావోద్వేగపూరితంగా ఉన్నాయని, ఏపీలో ఉన్న ఉద్వేగ పూరిత పరిస్థితుల వల్ల వారు రాజీనామాలు చేసినట్లు తనకు అనిపిస్తోందని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఇవన్నీ అమిత్ షా డైరెక్షన్ లో జరుగుతున్నాయి అనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో నిన్న వారు లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో భేటీ అయ్యారు. అనంతరం సుమిత్రా మహాజన్‌ మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తన పై ఉందని సుమిత్రా మహాజన్‌ పేర్కొన్నారు. భావోద్వేగపూరితంగా ఉన్నాయి కాబట్టి, మరో వారం రోజుల తరువాత రావాలని స్పీకర్ వారితో చెప్పారు.

ycp mp 30052018 2

అయితే, తమ పదవులకు రాజీనామాలు చేసిన ఐదుగురు ఎంపీల భవిష్యత్తు పై జూన్ 5 నుంచి 7వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లడించిన నేపథ్యంలో, వీరి రాజీనామాలు ఆమోదించినా, ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితులు ఎంతమాత్రమూ కనిపించడం లేదు. 2014 పార్లమెంట్ ఎన్నికల తరువాత జూన్ 4వ తేదీన లోక్ సభ సమావేశం జరుగగా, వచ్చే సంవత్సరం జూన్ 3తో మోదీ సర్కారుకు ఐదేళ్ల పదవీ కాలం పూర్తవుతుంది.

ycp mp 30052018 3

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం, ఓ ఉప ఎన్నిక జరిగితే, అందులో గెలిచే సభ్యుడి పదవీకాలం కనీసం ఏడాది పాటు ఉండాలి. జూన్ 5నే ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నా, ఎన్నికలు జరగాలంటే ఆపై మరో నెల రోజుల సమయమైనా పడుతుంది. అప్పుడు గెలిచే సభ్యుడి పదవీకాలం ఏడాది ఉండదు. ఇక నెలన్నర క్రితమే వీరి రాజీనామాలు ఆమోదం పొందినా, ఉప ఎన్నికలు వచ్చేవి కావని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రత్యేక కారణాలవల్ల ఖాళీ అయ్యే చోట్ల ఎన్నికలు జరిపించేందుకు ఈసీ 90 రోజుల వరకూ సమయం తీసుకుంటుంది కాబట్టి.

విజయవాడలో జరుగుతున్న మహానాడు మూడో రోజు సాయంత్రం ఆయన ప్రసంగించారు. 70లక్షల మంది కార్యకర్తలే తెదేపాకు ఉన్న బలమని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మనల్ని ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. మహానాడులో మొత్తం 37 తీర్మానాలు చేశామని, 106 మంది మాట్లాడారని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, బీజేపీ, పవన్, జగన్ వైఖరి పై, వారితో అనుసరించాల్సిన విధానం పై, పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఈ ముగ్గిరి విషయంలో, ఎక్కడా మొహమాటం లేకుండా, అనేక సందేహాలకు సమాధానం ఇస్తూ, చంద్రబాబు ప్రసంగం సాగింది. ఒక మామూలు కుటుంబంలో పుట్టి..నిరంతర శ్రమతో ఈ స్థాయిలో వచ్చానని, ఇప్పుడు వచ్చిన నాయకులు..నడిరోడ్డుపై ఉరి తీయాలని అంటారు, బంగాళాఖాతంలో పడేస్తామని అంటారు, వాళ్ల భాష చూస్తే బాధ కల్గుతోంది అంటూ, పరిటాల రవిని చంపినప్పుడు కూడా నేను నిగ్రహాన్ని కోల్పోలేదని, ఇలాంటి వారితో మాటలు పడాల్సి వస్తుందని అన్నారు.

mahanadu 29052018 2

పవన్ కళ్యాణ్ ఆరోపణల పై స్పందిస్తూ," ఉత్తరాంధ్రలో నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తున్నాం- తోటపల్లిని మనమే పూర్తి చేశాం..తోటపల్లికి డబ్బులివ్వకుండా పుష్కరాలకు ఖర్చుపెట్టామని విమర్శలు చేస్తున్నారు- ప్రకృతిని ఆరాధించండం మన సంస్కృతి- నీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రకృతిని ఆరాధించాలని కృష్ణా, గోదావరి పుష్కరాలు చేశాం- ఉద్దానం కిడ్నీ బాధితులకు పెన్షన్లు ఇస్తున్నాం- మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం..ఉచితంగా మందులిస్తున్నాం- దేశంలో ఇంత బాధ్యత కలిగిన ప్రభుత్వం ఉంటే చెప్పమని ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నా- విమర్శల్లో నీతి, నిజాయతీ ఉండాలి- ఫైబర్ గ్రిడ్ హెరిటేజ్ ఉద్యోగికి ఇచ్చామని ఆరోపిస్తున్నారు..తప్పుడు సమాచారాన్ని పదేపదే చెప్తే ప్రజలు నమ్ముతారని భ్రమ పడుతున్నారు- బీజేపీ వల్ల మనం గెలిచామని మాట్లాడుతున్నారు...అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు పంచాయతీ ఎన్నికలు జరిగాయి..ఆ ఎన్నికల దామాషా ప్రకారం చూస్తే బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే మనకు మరో 15 నుంచి 20 సీట్లు ఎక్కువ వచ్చేవి- పవన్ కళ్యాణ్ కూడా అదే మాట పదేపదే చెబుతున్నారు- మీరు సహకరించారు అందుకు ధన్యవాదాలు ...అంతేకాని మీ వల్లే గెలిచామనడం కరెక్ట్ కాదు- బీజేపీతో విభేదించిన తర్వాత పవన్ మన గురించి మాట్లాడుతున్నారు- అప్పటి నుంచే కుట్ర ప్రారంభమైంది- డిల్లీలో స్క్రిప్ట్ తయారయింది వీళ్లు దాన్ని పాటిస్తున్నారు అని చంద్రబాబు అన్నారు.

mahanadu 29052018 3

జగన్ పై మాట్లాడుతూ, "గాలి జనార్దన్ రెడ్డిని, జగన్ ను పక్కన పెట్టుకొని బీజేపీ నేతలు నీతులు ఎలా చెబుతున్నారు- నేతల అవినీతి కేసులపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు- అవినీతి కేసులపై ఆనాడు దర్యాప్తు చేసి అధికారి కూడా నేడు రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం పర్యటిస్తున్నారు- రూ.43వేల కోట్లు అవినీతి జరిగిందని ఛార్జిషీట్ లో వేశారు- అవిశ్వాస తీర్మానం పెట్టండి మేం మద్దతు తీసుకొస్తామన్న వ్యక్తులు నేడు లాలూచీ పడి మనల్ని తిడుతున్నారు- ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లి బోను ఎక్కే వ్యక్తులు నన్ను తిడుతుంటే బాధేస్తుంది- బెయిల్ మీద బయటకొచ్చిన అవినీతి పరుడు తిడుతున్నా ప్రజల కోసం ఆ బాధను అనుభవిస్తున్నా" అని చంద్రబాబు అన్నారు.

బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారం పై స్పందిస్తూ " రాజధానిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు- రాజధాని కట్టడం ఒక సవాల్..రాష్ట్ర బడ్జెట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆదాయం సంపాదించే మార్గాల ద్వారా అమరావతి నిర్మాణం చేస్తాం- భూములిచ్చిన రైతులను అభినందిస్తున్నా- అమరావతిని, పోలవరం, నదుల అనుసంధానం పూర్తి చేయాలి- ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా ఎన్డీఏ ప్రభుత్వం సహకరించడం లేదు- పొత్తు ధర్మం పాటించలేదు- రాజకీయ ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టడం చాలా ప్రమాదకరం. న్యాయం చేయమంటే కుట్రలు చేస్తున్నారు- మీ కుట్రలు, కుతంత్రాలు ఇక్కడ సాగవు- అభివృద్ది పనులు చేస్తున్నానని నాపై విమర్శలు చేస్తున్నారా?- విద్వేషాలు రెచ్చగొడుతూ విషం చల్లుతున్నారు- దేశ ప్రభుత్వమే ఏపీకి అవార్డులు ఇస్తోంది..ఏకపక్షంగా విమర్శలు చేస్తే మంచిది కాదు- నిధులు మంజూరు చేసి ప్రధాని ఒప్పుకోలేదని మళ్లీ వెనక్కి తీసుకున్నారు- ఆధారాలతో లెక్కలు చూపిస్తే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు- రాజధానికి ఇచ్చింది రూ,1500కోట్లు అయితే రూ.2100 కోట్లు ఇచ్చామంటున్నారు" అని అన్నారు.

చివరగా ముగిస్తూ, "ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి..మనం బలహీనమైతే కేంద్రంలో ఎవరూ మన మాట వినరు- మనం దెబ్బతింటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది- అడ్మినిస్ట్ర్రేషన్ అస్తవ్యస్తమవుతుంది- కేంద్రం సహకరించినా, సహకరించపోయినా రాష్ట్రాన్ని అభివృద్ది చేసే బాధ్యత నాది-ఎప్పుడు పోరాడితే ఫలితాలొస్తాయో నాకు తెలుసు కాబట్టి నాలుగేళ్లు వేచి చూశా- ఈ మహానాడు ద్వారా నూతనమైన చరిత్రకు శ్రీకారం చుడుతున్నాం- రాబోయే రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని ఏపీని అగ్రగామిగా నిలబెడతాం- పనికిమాలిన రాజకీయాలు చేసేవారు రాష్ట్ర ద్రోహులుగా నిలిచిపోతారు..ప్రజలు వాళ్లని తరిమికొట్టాలి" అని అన్నారు.

దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ పై వస్తున్న వ్యతిరేకత ద్రుష్టిలో పెట్టుకుని, ఆరెస్సెస్‌ పావులు కదుపుతుంది... మోడీ ఓడిపోయినా, కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రాకూడదు అనే ఉద్దేశంతో భారీ స్కెచ్ వేస్తున్నారని ఎన్డీటీవీ సంచలన కధనం ప్రచురించింది. ఆ కధనం ప్రకారం, మోడీకి ప్రత్యామ్నాయ అభ్యర్దిగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని రంగంలోకి దించుతుంది ఆరెస్సెస్‌. 2019 ఎన్నికలకు కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రధానిగా రంగంలోకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, దీనిలో భాగంగానే, వచ్చే నెలలో ఆరెస్సెస్‌ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆ సంస్థ అధినేత మోహన్‌ భగవత్‌ పంపిన ఆహ్వానాన్ని ప్రణబ్‌ అంగీకరించరనే సమాచారం రావటంతో, రాజకీయ వర్గాల్లో పెను ఆసక్తినే రేకెత్తించింది.

modi 30052018 2

ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించిన ప్రణబ్‌ ముఖర్జీ ట్విటర్‌లో తననుతాను సిటిజన్‌ ముఖర్జీగా ప్రస్తావించుకుంటారు. తద్వారా తాను ‘స్వతంత్ర’ పౌరుడిననే సందేశాన్ని ఇస్తారు. ఈ సంకేతాలకు అనుగుణంగానే ఆయన తాజా చర్యలు ఉంటున్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత జనవరిలో బిజూపట్నాయక్‌ జీవితచరిత్ర ఆవిష్కరణ సందర్భంగా.. భువనేశ్వర్‌లో ఒడిసా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌తో ప్రణబ్‌ ఒక విందు సమావేశం జరిపారు. సోనియాగాంధీ, శరద్‌ పవార్‌ ఇచ్చిన విందులాగా మీడియాలో దీనిపై ఎక్కడా హడావుడి జరగలేదు. అయితే, ఈ సమావేశానికి దేవెగౌడ, సీతారాం ఏచూరి, ఎల్‌కే ఆడ్వాణీ తదితరులు హాజరయ్యారు. పేరుకిది బిజూపట్నాయక్‌ జీవితచరిత్ర ఆవిష్కరణ సమావేశమే అయినా నిజానికి మూడో ఫ్రంట్‌ ఏర్పాటుకు సంబంధించిన కీలక సందర్భం కూడా అని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.

modi 30052018 3

దానికి కొద్దినెలల ముందు ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండగానే.. నవీన్‌ పట్నాయక్‌కు రాష్ట్రపతి భవన్‌లో విందు ఇచ్చారు. అక్కడి నుంచే వారు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీతో ఫోన్‌లో సంభాషణలు జరిపారు. బెంగాల్‌ వాస్తవ్యులైన దాదాకు, దీదీకి మధ్య ఆది నుంచీ సత్సంబంధాలున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ లేదా ఎన్డీయేకు మెజారిటీ రానిపక్షంలో కీలకపాత్ర పోషించడానికి ప్రణబ్‌ సిద్ధంగా ఉన్నారని ఓ ఎంపీ వివరించారు. బీజేపీ లేదా ఎన్డీయేకు మెజారిటీ రాని పక్షంలో కాంగ్రె్‌సను ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వకూడదని ఆరెస్సెస్‌ పట్టుదలగా ఉంది. మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పాతుకుపోతుందన్నది దాని భయం. అందుకే.. అది ప్రత్యామ్నాయ వ్యూహాల మీద సీరియ్‌సగా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటయ్యే ఫ్రంట్‌ వెనుక రహస్య అస్త్రమే ప్రణబ్‌ అని ఎన్డీటీవీ వర్గాలు విశ్లేషించాయి.

Advertisements

Latest Articles

Most Read