గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి కుర్చీ కోసం, పాదయాత్ర చేస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్‌, ప్రస్తుతం తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో పాదయాత్ర చేస్తున్నారు.. ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు అలా నడుచుకుంటూ, వెళ్లి పోయి, సాయంత్రం ఒక మీటింగ్ చెప్పేసి, ఆ రోజుకి పాదయాత్ర ముగిస్తున్నారు... అయితే, ఈ రోజు జగన్ పాదయత్రలో ఒక వింత సంఘటన చోటు చేసుకంది.. ఈ రోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో పాదయాత్ర చేస్తున్న జగన్ ను చూసేందుకు కొంత మంది వైసిపీ కార్యకర్తలు వచ్చారు.. జగన్ తో కలిసి కొంత దూరం నడిచేందుకు ఉత్సాహం చూపారు...

jagan 22052018 2

ఈ సందర్భంలో, వారు జగన్ కు దగ్గరికి వెళ్ళకుండా సెక్యూరిటీ సిబ్బంది ఎప్పటికప్పుడు పక్కకి తోసేస్తున్నారు.. అయితే, ఇక్కడ వరకు ఎవరికీ ఇబ్బంది లేదు... ఎవరి సెక్యూరిటీ వాళ్లకి ముఖ్యం కాబట్టి, ఎంత అభిమానులని అయినా పక్కకు తోసేస్తారు.. అయితే, ఇక్కడ పక్కకి తోసే క్రమంలో, అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, ఆ అభిమానుల మేడలో ఉన్న చైన్ లు కొట్టేస్తున్నారు... దీంతో, జగన్‌ పాదయాత్రలో సెక్యూరిటీ సిబ్బంది చైన్‌ దొంగిలించారంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేసారు... సెక్యూరిటీ సిబ్బంది వైఖరిని నిరసిస్తూ కార్యకర్తల ధర్నా చేసారు... మా చైన్లు మాకు ఇప్పించాలి అంటూ, ఆందోళన చేసారు...

jagan 22052018 3

నిజానికి ఎప్పటి నుంచో, ఈ ఆరోపణలు ఉన్నాయి... అయితే ఎవరన్నా జేబు దొంగలు ఇలా చేస్తున్నారేమో అని ఇన్నాళ్ళు అందరూ అనుకున్నారు.. కాని, ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది స్వయంగా, చైన్లు కొట్టేయటం చూసిన అక్కడి అభిమానులు అందోళన చేస్తున్నారు... మా తల్లి దండ్రులు కష్ట పడి సంపాదించిన డబ్బు అని, మా బంగారం మాకు ఇచ్చేయాలని ఆందోళన చేసారు... ఈ సెక్యూరిటీ అంతా, పులివెందుల నుంచి వచ్చిన ప్రైవేటు సెక్యూరిటీగా తెలుస్తుంది... ఇప్పటికే, వీరు ఆడ పిల్లల పై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.. అయినా ప్రతి ఊరు తిరిగి హామీలు ఇచ్చే జగన్, ఇలాంటి దొంగలను ఊరు ఊరు తిప్పుతూ, ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నారు ?

ఈయన పేరు భాను ప్రకాష్.. తిరుపతిలో బీజేపీ నాయకుడు.. మాజీ టిటిడి బోర్డు మెంబెర్... రాజకీయంగా బీజేపీని ఎంతో బాగా డిఫెండ్ చేస్తారు.. ప్రతి విషయంలో బీజేపీ తరుపున గట్టిగా మాట్లాడతారు.. కాని, ఈ సారి ఆ వెంకన్న ముందు, బీజేపీ పార్టీని పక్కన పెట్టారు... ఒక బీజేపీ నాయకుడిగా కాదు, వెంకన్న భక్తుడిగా చెప్తున్ను అంటూ, తిరుమలలో జరుగుతున్న కుట్ర పై, నిన్న ఒక టీవీ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో కుండ బద్దలు కొట్టారు... ఇంకో విషయం, తిరుమలలో వైఎస్ఆర్ హయాంలో డాలర్లు మాయం అప్పుడు, రాజశేఖర్ రెడ్డి తిరుమలని అపవిత్రం చేస్తున్నప్పుడు, పోరాడింది ఈయనే.. ఇప్పుడు రమణ దీక్షితులు గారు చేస్తున్న ఆరోపణల పై స్పందించారు... ప్రతి తిరుమాల భక్తుడికి జరుగుతున్న విషయాలు చెప్పారు...

bhanu 22052018 2

తిరుమలలో జరుగుతుంది కుటుంబ ఆధిపత్య గొడవ అని, ప్రధాన అర్చుకుడుకి సంబంధించి, నాలుగు కుటుంబాలు ఉంటాయని, అందులో రమణ దీక్షితులు ఒకరని అన్నారు... ధర్మ కర్తల మండలి సభ్యులుగా చెప్తున్నామని చెప్పారు... రమణ దీక్షితులు గారు ప్రధాన అర్చుకుడిగా స్వామి తరువాత, స్వామి వారి లాంటివారని, వారే ఈ రోజు అబద్ధాలు చెప్తున్నారని అన్నారు... అసలు తిరుమలలో నెలమాలిగులు అనేవి ఉండవు అని, దీక్షితులు గారు వచ్చి చూపించాలని, ప్రజలకు చెప్పాలని చెప్పారు. 65 ఏళ్ళకు మిమ్మల్ని తీస్తున్నారని తెలిసి, మీరు బ్లాకు మెయిల్ చెయ్యటానికి, ఇలా చేస్తున్నారని అని అన్నారు... ఇన్ని కమిటీల రిపోర్ట్ లు ఉంటే, ఎలా అబద్ధాలు ఆడతారని అన్నారు...

bhanu 22052018 3

ప్రతి సంవత్సరం, ప్రతి గ్రాము బంగారం గురించి, ప్రతి రాయ గురించి, అన్ని నగల గురించి లెక్కలు తీస్తారని, జ్యువలరీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ప్రతి సంవత్సరం ఈ రిపోర్ట్ ఇస్తుంది అని అన్నారు.. ఎందుకు ఇలా తప్పు దోవ పట్టిస్తున్నారని అని అన్నారు... మిగతా ముగ్గురు అర్చకులు ఎందుకు ఆరోపణలు చెయ్యటం లేదు ? 2001లో ఇది జరిగింది అని చెప్తూ, 17 సంవత్సరాల పాటు ఎందుకు బయట పెట్టలేదు ? దీంట్లో ఉన్న మర్మం ఏంటి ? మీరు చెప్పినట్టు నేలమాళిగలు, రుబీ డైమెండ్ అని ఎందుకు అబద్ధాలు చెప్తారు ? దయ చేసి, మీరు ఇలాంటి అబద్ధాలు చెప్పి, మీకు పర్సనల్ విషయాల కోసం, భక్తుల మనో భావాలు దెబ్బ తియ్యద్దు అంటూ, నాకు నా పార్టీ కంటే, నా స్వామి ముఖ్యం అంటూ, ఉన్న విషయాలు కుండ బద్దలు కొట్టారు భాను ప్రకాష్.. ఈ వీడియో ఇక్కడ చూడవచ్చు https://www.facebook.com/VoteforTDP/videos/1459251940848245/

ఆపరేషన్ గరుడ అంటే ఏంటో అనుకున్నారు అందరూ.. మీ రాష్ట్రంలో అనిశ్చితి నెలకోల్పుతాం, రాష్ట్రం మొత్తం ఆందోళనలతోనే ఈ సంవత్సరం మీరు గడపాలి అన్నప్పుడు, చుక్కలు చూపిస్తాం అన్నప్పుడు, కేసులు వేసి అరెస్ట్ చేపిస్తాం అన్నప్పుడు, ఇవన్నీ రాజకీయ ఆరోపణలు అనుకున్నాం... కానీ అవే వాస్తవాలు.. ఈ గుజరాత్ ద్వయం చేస్తున్న కక్ష సాధింపు ఇది... మీరు మమ్మల్ని ఎదిరిస్తారా ? 13 జిల్లాల వారు, ఢిల్లీ పీఠాన్ని శాసిస్తారా అనే అహంతో, మన రాష్ట్రం మీద organizedగా దాడి జరుగుతుంది... ఒక పక్క కుల గొడవలు రేపటానికి, ఒకడిని లైన్ లో పెట్టి తిప్పుతున్నారు... మరో పక్క అవకాసం దొరికిన ప్రతిసారి, మతాల మధ్య గొడవలకు ప్లాన్ చేస్తున్నారు (గుంటూరులో జరిగిన సంఘటన)... మరో పక్క లేని వివాదాలు సృష్టించి రచ్చ రచ్చ చేస్తూ, ఎదో జరిగిపోయినట్టు వాతావరణం సృష్టిస్తున్నారు... వీరికి బీహార్ బ్యాచ్, చింతలబస్తీ బ్యాచ్ తోడు... అసలు ఈ తిరుమల ఇష్యూ, ఆపరేషన్ గరుడ అని ఎందుకు అనుకుంటున్నామో చూద్దాం...

amitshah 22052018 2

అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరుమల దర్శనానికి వచ్చారు... దర్శనానికి ముందు, అమిత్ షా తో, రమణ దీక్షితులు దాదాపు 40 నిమషాలు ఏకాంతంగా భేటీ అయ్యారు అనే సమాచారం బయటకు వచ్చింది... అప్పుడు ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు... అమిత్ షా వెళ్ళిన రెండో రోజే, రమణ దీక్షితులు, చెన్నై వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేసారు... అందులో ప్రధానమైనవి, స్వామి వారికి నైవేద్యం సరిగ్గా పెట్టటం లేదు అని, పింక్ డైమండ్ పోయింది అని, పోటులో నేలమాలిగల్లో నిధి తవ్వేసారు అని... కాని అవన్నీ అవాస్తవాలు అని తేలాయి.. స్వమి వారికి నైవేద్యం సరిగ్గా పెట్టటం లేదు అనే ఊహే అసలు భయంకరం, అంత సాహసం ఎవరు చేస్తారు ? అసలు టిటిడి రికార్డ్స్ లో పింక్ డైమండ్ అనేది లేదు అని రికార్డు లు చెప్తున్నాయి.. అలాగే పోటులో నేలమాలిగలు అనేవి పచ్చి అబద్ధాలు అని పురావస్తు శాఖ డైరెక్టర్ చెప్పారు... ఇన్ని చెప్పినా, నిన్న ఒక పెద్ద నేషనల్ వైడ్ క్యంపైన్ నడిచింది...

amitshah 22052018 3

ఉన్నట్టు ఉండి, బీజేపీకి అత్యంత ప్రీతి పాత్రుడు, రిపబ్లిక్ టీవీ అర్నాబ్, ఈ విషయం పై నిన్నటి నుంచి రచ్చ రచ్చ చేసాడు.. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, మిగతా ఏ నేషనల్ మీడియా ఈ విషయం పై కనీసం స్క్రోలింగ్ కూడా వెయ్యలేదు... రిపబ్లిక్ టీవీ వెయ్యగానే, బీజేపీ సోషల్ మీడియా పైడ్ బ్యాచ్, విషం చిమ్మటం మొదలు పెట్టింది... మొత్తం ఒక organized అట్టాక్ స్టార్ట్ అయ్యింది... ఎంత మంది అధికారులు, అర్చకులు, రమణ దీక్షితులు ఆరోపణలు తప్పు అని చెప్పినా, వీళ్ళు మాత్రం, బీజేపీ స్క్రిప్ట్ ప్రకారం నడుచుకున్నారు.. వీరికి ఎవరైనా ఎదురు వెళ్తే, వారు హిందూ వ్యతిరేకులు అని ప్రచారం చెయ్యటం వీరికి బాగా అలవాటు.. అందులో భాగమే ఈ కుట్ర... అయితే ఈ కుట్ర కు సంబంధించి, మరో అతి పెద్ద ఆధారం బయట పడింది... పోయిన శుక్రవారం, రమణ దీక్షితులు, ఢిల్లీ వెళ్లి అమిత్ షా ని కలసిన ఫోటోలు బయటకు వచ్చాయి.. అలాగే ఆయన ప్రధానికి అత్యంత దగ్గర అధికారాని కూడా కలిసినట్టు చెప్తున్నారు... మరి ఇదంతా కుట్ర కాక, ఇంకా ఏమిటి ? అయినా దీక్షితులు గారిని స్వామి సేవ చెయ్యమంటే, అమిత్ షా సేవ చెయ్యటం ఏంటి ? అమిత్ షా ఒక సాధారణ ఎంపీ.. అయనను వెళ్లి గెస్ట్ హౌస్ లో కలవాల్సిన అవసరం, ఏమి ఉంటుంది... అమిత్ షా సేవ చేసి వచ్చి, స్వామీ వారికి సేవ చేస్తారా ? ఒక్కటి మాత్రం నిజం, ఇందులో ఎవరిది తప్పు ఉన్నా, వెంకన్న చూస్తూ ఊరుకోడు... అందరి లెక్కలు సరి చేస్తాడు... వడ్డీతో సహా...

తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంపై చేసిన ఆరోపణలు అన్నీ పచ్చి అబద్ధాలు అని వాద్వా కమిటీ రిపోర్ట్ చెప్తుంది... అంతే కాదు, ఈ వ్యవహారం మొత్తం రమణ దీక్షితులకు అన్ని విషయాలు తెలుసని, కూడా ఈ రిపోర్ట్ చుస్తే అర్ధమవుతుంది... అన్నీ తెలిసి కూడా, రమణ దీక్షితులు, స్వామి వారితో ఎందుకు రాజకీయం చెయ్యాలని అనుకున్నారు ? ఎవరి ఒత్తిడితో, ఎవరి ప్లాన్ తో ఇవన్నీ చేసారో తేలాల్సి ఉంది... ముఖ్యంగా రమణ దీక్షితులు ఒక భయంకర ఆరోపణ చేసారు... స్వామి వారికి ఒక పింక్ డైమెండ్ ఉండేది అని, 2001లో స్వామి వారికి గరుడ సేవ చేసే సమయంలో, అది పగిలి ముక్కలు అయ్యింది అని, అప్పుడు అది జాగ్రత్త చేసామని, కాని ఇప్పుడు అది కనిపించకుండా పోయింది అని, దాన్ని విదేశాల్లో కొన్ని వేల కోట్లుకి అమ్మేశారని ఆరోపణ చేసారు...

vadva commitee 22052018 2

కాని అది తప్పు అని, ఈవో ఏకే సింగాల్ ఇప్పటికే వివరణ ఇచ్చారు. జస్టిస్ జగన్నాథ రావు కమిటీ నివేదికలోనే 2001లో పగిలిపోయింది డైమాండ్ కాదని, రూబీ అని పేర్కొందని సింఘాల్ చెప్పారు. పగిలిపోయిన రూబీ ముక్కలు ఇప్పటికీ టీటీడీ ఆధీనంలోనే ఉన్నాయని తెలిపారు. ఆలయంలో రహస్యంగా ఏమీ జరగడం లేదన్నారు... ఆ పగిలన ముక్కలు మీడియా ముందు కూడా ప్రదర్శించారు... అయితే ఇదే విషయం వాద్వా కమిటీ రిపోర్ట్ చూస్తే కూడా స్పష్టంగా తెలుస్తుంది... వాద్వా కమిటీ అంటే, ఎదో ఆషామాషీ కమిటీ కాదు. "Justice Wadhwa Committee comprising of 2 Justices, 2 IAS Officers (Ex EOs too); 1 Ex DGP, 1 Ex AP Press Academy Chairman"

vadva commitee 22052018 3

వాద్వా కమిటీ రిపోర్ట్ ప్రకారం.. "16-09-2009న పింక్ డైమెండ్ పోయింది అనే ఆరోపణల గురించి ఎంక్వయిరీ చేసాము. 2001లో అప్పుడు పగిలింది పింక్ డైమెండ్ కాదని, రుబీ (కెంపు) అని మాత్రమే తేలింది. ఉత్సవ మూర్తులను, గరుడ సేవ నిమిత్తం ఊరేగింపుగా తీసుకు వెళ్తున్న సమయంలో, కొంత మంది భక్తులు, ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు స్వామి వారి పై coins వెయ్యటం వళ్ళ, ఆ రుబీ పగిలింది. డైమెండ్ అయితే అసలు పగలదు అనే విషయం అందరికీ తెలుసు. ఆ రుబీ కింద పాడినప్పుడు, ఆలయా ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గారు, అది గుర్తించారు.. దీంతో ఆ ప్రదేశంలో అందరూ వెతకగా, ఆ రుబీ ముక్కలు అయ్యి కనిపించిది. ఇదే విషయం అప్పట్లోనే తిరువాభరణం రిజిస్టర్ లో కూడా ఎంటర్ అయ్యింది. ఆ పగిలిన ముక్కలు ఇప్పటికీ టిటిడి వద్ద బద్రంగా ఉన్నాయి. ఆ పగిలిన కెంపు స్థానంలో, పగడం పెట్టారు. 1945లో మైసూర్ మహారాజా గారు, అది ఇచ్చినప్పుడు ఆ కెంపు విలువ 50 రూపాయలు ఉంది. ఇదే విషయం ఒక కేసు విషయంలో, హై కోర్ట్ కి కూడా టిటిడి చెప్పింది" అంటూ వాద్వా కమిటీ రిపోర్ట్ లో స్పష్టంగా పెర్కున్నారు... మరీ అన్నీ తెలిసిన రమణ దీక్షితులు గారు, ఎందుకు అబద్దాలు ఆడతున్నారో, ఆ వెంకన్న దయతో త్వరలోనే వాస్తవాలు బయటకు తెలియాలని కోరుకుందాం...

vadva commitee 22052018 4

Advertisements

Latest Articles

Most Read