గత వారం రోజులుగా తిరుమల పై జరుగుతున్న కుట్రలో మరో ఆరోపణ, శ్రీవారి వజ్రం అమ్ముకున్నారు అంటూ రమణ దీక్షితులు చేసిన ఆరోపణ... సరిగ్గా అమిత్ షా తిరుమల వచ్చి వెళ్ళిన రెండో రోజే, రమణ దీక్షితులు ఈ విష ప్రచారం మొదలు పెట్టారు.. ఇక దీన్ని పట్టుకుని, జగన్ మోహన్ రెడ్డి సాక్షి చేస్తున్న ప్రచారం అయితే ఇక సరే సరి... వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన అరచకాలు అన్నీ ఇన్నీ కావు.. వీరు కూడా కబురులు చెప్తున్నారు.. సరే ఏది ఏమైనా, వీళ్ళు చేస్తున్న విష ప్రచారం పై, టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్పందించారు. వారి ఆభరణాల భద్రత విషయంలో జస్టిస్ వాద్వ కమిటీ, జస్టిస్ జగన్నాధరావు కమిటీలు ఆభరణాలు సక్రమంగా ఉన్నాయని టిటిడి కి రిపోర్ట్ ఇచ్చాయిని ఆయాన అన్నారు.

eo 20052018 2

అప్పట్లో ఆభరణాలు అన్ని సక్రమంగా ఉన్నాయని అర్చకులు కూడా రిజిస్టర్ లో సంతకం పెట్టారని, అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. 2001 గరుడసేవ రోజున శ్రీవారి హారంలోని రూబీ డైమండ్ కనపడలేదని కొంతమంది అర్చకులు టిటిడి దృష్టికి తీసుకువచ్చారు. అప్పటి అధికారులు వెతకగా పగిలిన రూబీ డైమండ్ పీసులు ఇప్పటికి టీటీడీ వద్ద ఉన్నాయి. రూబీ డైమండ్ ను వేలం వేశారని రమణ దీక్షితులు చెప్తున్న మాటలు అవాస్తవం అని టిటిడి ఈఓ అనిల్ కుమార్ అన్నారు. ఆగమ సలహాదారులు ఒప్పుకుంటే శ్రీవారి ఆభరణాలను భక్తుల సందర్శనకు ఉంచేందుకు టిటిడి కి ఎటువంటి ఇబ్బంది లేదని అన్నారు. మార్చి 1 1979 నుంచి స్వామివారి కైంకర్యాలు అగమోక్తంగా సమయం ప్రకారం నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం అని, జీయర్ స్వాముల పర్యవేక్షణలో స్వామివారి కైంకర్యాలు యధావిధిగా జరుతున్నాయిని అన్నారు. దేవాలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని అన్నారు. శ్రీవారి ఆలయంలో తవ్వకాలు జరుగుతున్నాయనేది అవాస్తవం అని, ఆలయం లో చిన్నచిన్న రిపేర్లు జరుగుతున్నాయిని, అవికూడా ఆగమ సలహదారుల సంప్రదింపుల తర్వాతే జరిగాయని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.

eo 20052018 3

2013 జనవరిలో ప్రభుత్వ జిఓ నెం 1171, go ms నెం 611ప్రకారం అర్చకులకు 65 సం రిటైర్మెంట్ ను ప్రభుత్వం వర్తింపజేసిందని, జి.ఓ ప్రాకారం ఏ.యస్ నరసింహ దీక్షితులు, భక్తవత్సల దీక్షితులు రామచంద్ర దీక్షితులను రిటైర్ చేశారని చెప్పారు. 956 టిటిడి సర్వీస్ రూల్స్ ప్రకారం టిటిడి లో పనిచేసే ఉద్యోగులు, అర్చకులందరు పదవీవిరమణ చేయాలని ఉందని, సర్వీస్ రూల్స్ ప్రకారమే నూతన ప్రధాన అర్చకుల నియామకాలు జరిగాయని చెప్పారు . మిరాశి రద్దైయాక ప్రధాన అర్చక నాలుగు కుటుంవాలను నుండి ఒక్కక్కరిని‌ తీసుకున్నామని, ఇప్పుడు వంతులు లేకుండా అందరు కలసి ఉత్సవాలు,కైంకర్యాలు నిర్వహిస్తున్నారని, మిరాశి అర్చకులకి గాని,బ్రహ్మణులకు మాత్రం నష్టం జరగలేని చెప్పారు.

గత వారం రోజులుగా, అంటే అమిత్ షా తిరుమల వచ్చి, రమణ దీక్షితులను కలిసి వెళ్ళిన వెంటనే, ఒక సామాజిక వర్గాన్ని దూరం చేసే కుట్రతో, సాక్షాత్తు శ్రీవారినే వాడుకుని, రాజకీయాలు చేస్తున్నారు ఆపరేషన్ గరుడ బ్యాచ్.. ఈ ఛండాలపు రాజకీయాలకు, తిరుమల ప్రతిష్టతను మంట కలిపే ప్రయత్నం చేస్తున్నారు.. తిరుమల పై జరుగుతున్న విష ప్రచారం పై ఈ రోజు టీటీడీ ఈవో సింఘాల్‌ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు, పూజలు.. శాస్త్రోక్తంగా జరుగుతున్నాయని వివరించారు. శ్రీవారి నగలన్నీ భద్రంగా ఉన్నాయని ఆయన అన్నారు. 2012లోనే అర్చకులకు 65 ఏళ్ల వయోపరిమితి అమలులోకి వచ్చిని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

singhal 20052018 2

ఆ సమయంలోనే ముగ్గురు అర్చకులు రిటైర్ అయ్యారని సింఘాల్ తెలిపారు. రిటైర్‌ అయిన అర్చకులు కోర్టుకెళ్లారని, వారి విజ్ఞాపనను కోర్టు తిరస్కరించి౦దని, జీతభత్యాలు లేకుండా అర్చకులుగా కొనసాగవచ్చని కోర్టు ఆదేశించిందన్నారు. వంశపారంపర్య అర్చకుల వారసులు తమకు అవకాశం ఇవ్వాలని టీటీడీని కోరారని, అలాగే ప్రధాన అర్చకులుగా తమకు అవకాశం కల్పించాలని గొల్లపల్లి కుటుంబానికి చెందిన వేణుగోపాల దీక్షితులు కోర్టుకెళ్లారని ఈవో తెలిపారు. సర్వీస్ ప్రకారం టీటీడీలో సేవలందించిన సీనియర్‌కు ప్రధాన అర్చకులుగా నియమించడం జరిగిందని సింఘాల్ తెలిపారు. ప్రధానంగా రమణ దీక్షితులు చేసిన విమర్శలపై ఈవో సింఘాల్ మీడియా ద్వారా భక్తులకు వివరణ ఇచ్చారు. భక్తులకు వాస్తవాలు తెలియజేసేందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన వ్యాఖ్యానించారు.

singhal 20052018 3

‘ శ్రీవారికి పూజా కైంకర్యాలన్నీ శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. స్వామివారి నగలన్నీ భద్రంగానే ఉన్నాయి. ఇటీవల తితిదే బోర్డు నిర్ణయాలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఆలయాల మరమ్మతుల విషయంలో భక్తులకు అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేసేందుకే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. అర్చకుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు చేయడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు. ప్రభుత్వ జీవోను మాత్రమే అమలు చేస్తున్నాం. శ్రీవారి నగలకు సంబంధించి 1952 నుంచి పక్కా లెక్కలున్నాయి. స్వామివారికి వచ్చిన నగలన్నింటినీ ఏటా ప్రజల ముందు ఉంచడానికి ఎలాంటి అభ్యంతరం లేదు’ అని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు.

రాజధాని అభివృద్ధి పనులను శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించారు. నడి ఎండలోనూ ఆయన పర్యటన సాగింది. ముందుగా ఉండవల్లి రెస్ట్‌హౌస్‌ నుంచి ఉదయం 9.39 గంటలకు వెంకటపాలెం సెంట్రల్‌ నర్సరీని సీఎం సందర్శించారు. ఏడీసీ ఆధ్వర్యంలో రాజధాని రోడ్లకిరువైపులా నాటడానికి నర్సరీలో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నట్లు ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారధి ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును, బ్రిడ్డిలను పరిశీలించారు. మందడం రెవెన్యూ నిర్మిస్తున్న పేదళ ఇళ్ల సముదాయాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. రాజధానిలో 320 కి.మీ. పొడవైన 32 ప్రధాన రహదారులు, ఎల్‌పీఎస్‌ లేఅవుట్‌లలో 1250 కి.మీ. పొడవైన రహదారులు, బలహీనవర్గాల వారికి ఐదు వేల ఇళ్లు నిర్మిస్తున్నామని వివరించారు. సచివాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచామని, శాసనసభ, హైకోర్టు భవనాలకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని తెలిపారు. స్టార్టప్‌ ప్రాంతంలో జూన్‌ 7 నుంచి సింగపూర్‌ సంస్థల కన్సార్షియం పనులు ప్రారంభిస్తుందని చెప్పారు.

cbn amaravati 20052018 2

రాజధాని నిర్మాణానికి ఉదారంగా నిధులిచ్చేందుకు ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్‌ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘ఇక్కడ వచ్చే డబ్బులు వాళ్లకు కావాలి. రాజధానికి మాత్రం ఒక్క విగ్రహానికిచ్చినన్ని డబ్బులు కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం రూ.24 వేల కోట్ల పనులు జరుగుతున్నాయి. వీటిపై సెంట్రల్‌ ఎక్సైజ్‌, సర్వీస్‌ ట్యాక్స్‌ వంటి రూపాల్లో కేంద్రానికే ఎక్కువ ఆదాయం వస్తుంది. మొత్తం డబ్బులు వాళ్లే తీసుకుంటూ నిధులివ్వకపోవడం దుర్మార్గం. ఇది ప్రజల కష్టార్జితం. రైతులు రూ.50 వేల కోట్ల భూమిని రైతులు ఉదారంగా ఇచ్చారు. ఇక్కడి నుంచి రూ.వందల, వేల కోట్ల ఆదాయం తీసుకుంటున్నప్పుడు కేంద్రానికి బాధ్యత లేదా?...’’ అని చంద్రబాబు నిలదీశారు.

cbn amaravati 20052018 3

రాజధాని నిర్మాణానికి అడ్డుపడాలని చూస్తున్నారని, కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, లేనిపోని విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘మీరు చేస్తున్న విమర్శల వల్ల కొందరు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. మీరు రాజధానికి తీవ్ర నష్టం చేస్తున్నారు. మీకు చేతనైతే సహకరించండి... లేకపోతే ఊరుకోండి...’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాజధానికి అడ్డుపడేవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. ఎటు చూసినా హరితవనాలు, పచ్చికబయళ్లు, జలాశయాలతో అమరావతిని అత్యంత అహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

వర్చ్యువల్ రియాలిటీ, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ... ఇవన్నీ మాట్లాడుతుంది, ఈ టెక్నాలజీలు వాడుతుంది, ఏ మైక్రోసాఫ్ట్, గూగులో అనుకునేరు... ఇవన్నీ మాట్లాడుతుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి... మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు... టెక్నాలజీ పట్ల, ఆయనకు ఉన్న అవగాహన, టెక్నాలజీ ఉపయోగించుకుని సమర్ధవంతమైన పరిపాలన చెయ్యటం, టెక్నాలజీతో ఉద్యోగాల కల్పన ఇవన్నీ చూశాం... ఇప్పుడు మరో సరి కొత్త టెక్నాలజీ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు... అదే "అలెక్సా"... జనవరిలో జరిగిన సిఐఐ సమ్మిట్ లో చంద్రబాబు, ఈ విషయం చెప్తే అందరూ నవ్వారు.. ఇప్పుడు ఇది రియాలిటీలోకి వస్తుంది...

haichandranna 20052018 2

‘హాయ్‌ చంద్రన్న’ అంటే చాలు, అన్ని పనులు చేసి పెట్టేలా యాప్‌ను రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ‘‘అలెక్సా, గుగూల్‌ ఓకే లాగా.... హాయ్‌ చంద్రన్న యాప్‌ ద్వారా పలకరిస్తే... ఏ సమస్యని అయినా పరిష్కరించి ఎప్పటికప్పుడు సమాచారమందిస్తాం. పెన్షన్‌ ఎందుకు రాలేదనేది ఇంట్లో కూర్చోని తెలుసుకోవచ్చు’’ అని నిన్న జరిగిన సాధికార మిత్రల సమావేశంలో వివరించారు. భవిష్యత్తు పాలనలో సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయికి విస్తరిస్తుందో వివరిస్తూ దీనిని, అక్కడ ఉన్న సాధికార మిత్రలకు పరిచయం చేసారు.

haichandranna 20052018 3

వాయిస్‌ ఇంటరాక్టివ్‌ సిస్టమ్‌ ద్వారా ఈ యాప్ పని చేస్తుంది. సీఎం డ్యాష్‌బోర్డుకు వాయిస్‌ ఇంటరాక్టివ్‌ సిస్టమ్‌ ద్వారా కనెక్ట్‌ చేసి, మన సమస్య తెలుసుకుని సమాధానం ఇస్తుంది. ప్రజలు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానమిస్తుంది. ప్రజలు ఇంటి నుంచే ఈ సాఫ్ట్‌వేర్‌తో నేరుగా మాట్లాడొచ్చని, ఆఖరికి నీటి సమస్యలు, ఇతర ఏ సమస్యల గురించి చెప్పినా ‘హాయ్‌ చంద్రన్న’ నేరుగా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పరిష్కారమయ్యేలా చూస్తుందని చంద్రబాబు అన్నారు. ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం, దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ వద్ద తప్పితే మరెక్కడా లేదని చంద్రబాబు చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read