బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడిన వీహెచ్.. కర్ణాటక వ్యవహారంలో బీజేపీ అనుసరించిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కర్ణాటకలో న్యాయం గెలిచిందని, అవినీతి ఓడిందన్నారు. న్యాయాన్ని కాపాడిన సుప్రీంకోర్టు ధర్మాసనానిని సలాం అని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు చాలా అప్రమత్తతో ఉండాలని, ఆయన పై కక్ష తీర్చుకునే ప్రయత్నంలో, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్లాన్ వేసారని సంచలన ఆరోపణలు చేసారు.. సౌత్ ఇండియాలో చంద్రబాబు బలమైన నేత కాబట్టి, ఆయన్ను బలహీన పరుస్తారాని వీహెచ్ అన్నారు.

vh 19052018 2

ఇది ఇలా ఉండగా, బీజేపీ చేస్తున్న పనుల పై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా స్పందించారు. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు నీతి నిజాయితీలకు కట్టుబడి ఉన్నారని, కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగలేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడినా బీజేపీ వెంటాడుతుందని చెప్పారు. యశ్వంత్ సిన్హా లాంటి సీనియర్ నాయకుడే... మోదీతో దేశానికి ప్రమాదం అంటూ ఆ పార్టీకి రాజీనామా చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మోదీని తెర వెనుక నుంచి ప్రేమించే జగన్‌లాంటి వారికి ఇది షాక్ అని వ్యాఖ్యానించారు.

vh 19052018 2

కర్ణాటక పరిణామాల పై చంద్రబాబు కామెంట్... కర్ణాటకలో రాజకీయ పరిస్థితి దారుణంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. అప్రజాస్వామిక విధానాలను కర్ణాటకలో అవలంబిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మెజార్టీ లేకున్నా ప్రభుత్వ ఏర్పాటు కోసం భాజపా కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. కర్ణాటకలో సంప్రదాయానికి విరుద్ధంగా పనులు జరుగుతున్నాయన్నారు. కర్ణాటకను భ్రష్టు పట్టిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. గాలి జనార్దన్‌ రెడ్డి ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించటం ఏమిటని అన్నారు. ప్రతిపక్ష నేత కర్ణాటకలో జరుగుతోన్న దారుణాలను ప్రశ్నిచలేరా అని వ్యాఖ్యానించారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీలు వృద్ధి చెందుతోన్న రాష్ట్రాలని, వీటిని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

"Right now news has come that BS Yeddyurappa has resigned as Karnataka's CM, are all of you happy? All those who believe in democracy are happy" ఇది చంద్రబాబు విలేఖరులకు చెప్పిన సమాధనం... అనంతరం, యడ్యూరప్ప రాజీనామా అంశాన్ని సాధికార మిత్ర సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించారు. యడ్డీ రాజీనామా చేయడం అందరికీ సంతోషంగా ఉందా అంటూ సాధికార మిత్ర కార్యకర్తలను చంద్రబాబు ప్రశ్నించారు. సంతోషంగా ఉందంటూ సాధికార మిత్ర కార్యకర్తలు బదులిచ్చారు. యడ్యూరప్ప రాజీనామా ప్రజాస్వామ్య విజయం అని చంద్రబాబు అన్నారు. యడ్యూరప్ప రాజీనామా చేయడం అందరికీ సంతోషమే అని అన్నారు. " రాష్ట్రానికో విధానం అన్నట్టుగా వ్యవహరిస్తోంది బీజేపీ. గోవాలో ఓ తరహాలో.. కర్ణాటకలో మరో తరహాలో వ్యవహరిస్తోంది బీజేపీ. ప్రధాని, బీజేపీ అధినేత లాంటి వారు రంగంలోకి దిగారు.. కానీ విఫలం చెందారు" అని చంద్రబాబు అన్నారు.

cbn 19052018 11 2

"ఏపీకి అన్యాయం చేసిన వారిని మట్టి కరిపించాలని పిలుపిచ్చా. గాలి జనార్దన్ రెడ్డి లాంటి అవినీతి పరులను బీజేపీ రంగంలోకి దింపింది. గాలి అంటేనే మనకు భయం. వంద కోట్లు ఇస్తాం. లైఫ్ సెటిల్ చేస్తామంటూ గాలి ప్రలోభ పెట్టారు. ప్రధాని లాంటి నేతలు.. జాతీయ నేతల్లాంటి వారు అవినీతిని ప్రొత్సహిస్తే యువతకేం సందేమిస్తారు..? యడ్డీ రాజీనామా చేశారనగానే మహిళల ముఖాలు వెలిగిపోయాయి. కర్ణాటకలో ఏం జరుగుతుందోననే ఆందోళన అందరిలోనూ కనిపించింది. ప్రజాస్వామ్యం విజయం సాధించిన రోజు. " అని చంద్రబాబు అన్నారు.

cbn 19052018 131

"కర్నాటక అయిపోయింటే ఆ తర్వాత మనపై పడేవారు. తమిళనాడులోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రజాస్వామ్యవాదిగా కర్ణాటక ఎపిసోడు పై స్పందిస్తున్నా. నా పుట్టిన రోజు నాడే దీక్ష చేసే పరిస్థితికి తెచ్చారు. ఏపీకి న్యాయం చేయమంటే ఏ మాత్రం పట్టించుకోలేదు. గవర్నర్ మెజార్టీ ఉన్న వాళ్లని పిలవకుండా యడ్జీతో ప్రమాణ స్వీకారం చేయించారు. కర్నాటకలో బీజేపీ నేతలు ఓటుకు పది వేలిచ్చారనే ప్రచారం ఉంది. అవినీతి పరుల భరతం పట్టండని పిలుపిచ్చా. కర్ణాటకలోని తెలుగు వారు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలకు వంద కోట్ల రూపాయలు.. మంత్రి పదవుల విషయంలో వల వేసిన సంఘటనలు ప్రపంచం చూసింది. ప్రొటెం స్పీకరుగా సీనియర్ ఎమ్మెల్యేను నియమించడం ఆనవాయితీ.. కానీ దీన్ని కర్ణాటకలో బీజేపీ ఉల్లంఘించింది. కర్ణాటక అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేయమని సుప్రీం ఆదేశించడం మంచిదైంది." అని చంద్రబాబు అన్నారు...

నీతీనిజాయితీ, విలువలూ విస్తరాకులూ, దేశభక్తీ జనోద్ధరణా అంటూ కబుర్లు చెప్పే బీజేపీ పార్టీకి అవన్నీ ఉత్తిత్తి కబుర్లు.. తాటాకు దరువులు.. ఆచరణలో దానివి దగుల్బాజీ పనులూ, దరిద్రపుగొట్టు కుయుక్తులూ .. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామిక విలువలన్నిటినీ తుంగలో తొక్కటానికి, అడ్డదిడ్డంగా బరితెగించటానికి 30, 40 ఏళ్ళ కాలం పట్టింది! విలువల వలువలను నట్ట నడివీధిలో నిర్లజ్జగా వదిలిపెట్టటానికి బీజేపీకి మోడీ హయాంలో మూడేళ్లు కూడా పట్టలేదు. అన్ని విలువలకూ పాతరేసి _ అధికార దాహం ఒక్కటే తన పరమాశయమని బీజేపీ పార్టీ రంకెలేస్తున్న నిస్సిగ్గు జాతర రోజూ దేశంలో నడుస్తూనే ఉంది .. కర్ణాటక ఇప్పుడు కాషాయ కంగాళీకి నిలువెత్తు వేదిక.

tape 5 19052018 3

తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి 4 టేప్ లు రిలీజ్ చేసింది.. అందులో గాలి జనార్ధన్ రెడ్డి, స్వయంగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా ఉన్న సంగతి తెలిసిందే.. తాజాగా కాంగ్రెస్ 5వ టేప్ రిలీజ్ చేసింది... ఇందులో ప్రతి నిమిషం మన ఆంధ్రప్రదేశ్ గురించి కబురులు చెప్పే, బీజేపీ జాతీయ నాయకుడుని అని చెప్పుకునే మురళీధర రావు కూడా ఉన్నాడు.. నువ్వు మా పార్టీలొఇ వచ్చేసేయ్యి.. లకపోతే ప్రోటెం స్పీకర్ చేత, నీకు ఓటు లేకుండా చేస్తాం అంటూ బిసి పాటిల్ అనే కాంగ్రెస్ ఎమ్మల్యేను బెదిరించారు... మొత్తానికి, ఒక్క రాష్ట్రం కోసం, బీజేపీ ఎలా దిగజారిందో దేశ ప్రజలు చూస్తున్నారు...

tape 5 19052018 2

మోడీ, అమిత్ షా & పరివారం...బలం లేకున్నా అధికారం కోసం నానా గడ్డీ కరుస్తారు .. ప్రలోభాలూ బెదిరింపులూ దేబిరింపులూ .. ఎంతకన్నా దిగజారతారు... తమ నీతిమాలిన వ్యూహాల్లో గవర్నర్లను ఇష్టమొచ్చినట్టు ఉపయోగిస్తారు... అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి ఎక్కువసార్లు గెలిచిన mla ని ప్రోటెం స్పీకరుగా పెట్టటం సాంప్రదాయం... అలా అయితే_ కర్ణాటకలో 8 సార్లు గెలిచిన కాంగ్రెస్ mla దేశ్ పాండే ని నియమించటం పధ్ధతి... దానిని కాలదన్ని 3 సార్లు గెలిచిన rss వాది బొప్పయ్యను నియమించారు... సిగ్గుమాలిన బీజేపీకి ఇంకా చెప్పటానికి నీతి కబుర్లు ఏమన్నా మిగిలాయా? నాలుగేళ్ల కాలంలో దాని నిజస్వరూపం మొత్తం దేశానికి ప్రదర్శించేసింది !! చాలు చాలు ఇక ... !! చెప్పటానికి నీతులు ఏమీ మిగల్లేదు !! గెలిస్తే గెలవొచ్చు గానీ, గెలిచేంత గొప్పది కాదు బీజేపీ .. ఓడినోడి వైఫల్యాలు గెలిచినోడికి పాఠాలే తప్ప, ప్రశంసలు కావు. దేశం చూస్తోంది .. దేశం మేల్కొంటోంది !!

దేశ చరిత్రలోనే అతి దరిద్రమైన ఆట, కర్ణాటకలో ఆడి, మోడీ, అమిత్ షా చివరకు ఏమి సాధించారు ? గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వాడిని చేరదీసి, పక్కన పెట్టుకుని, నిస్సిగ్గుగా ప్రచారం చేసారు... మెజారిటీ రాకపోయినా, గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారు... చివరకు 150 కోట్లు ఆఫర్ చేసారు... అర్ధరాత్రి సుప్రీం కోర్ట్ తలుపులు తెరుచుకున్నాయి.. దేశంలో ఎంత దౌర్భాగ్యం లేకపోతే, అర్ధరాత్రి తలుపులు తెరుచుకుంటాయి ? అమిత్ షా, మోడీ కుట్రలని తిప్పి కొడుతూ, సుప్రీం కోర్ట్ ఒక్క రోజే బల నిరూపణకు టైం ఇచ్చింది... దీంతో బేర సరాలకు టైం సరిపోలేదు... చివరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడు రోజుల క్రితమే ప్రమాణస్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. అమిత్ షా, మోడీ కుట్రలని తట్టుకుని, దేశం గెలిచింది...

modishah 19052018 2

నీతీనిజాయితీ, విలువలూ విస్తరాకులూ, దేశభక్తీ జనోద్ధరణా అంటూ కబుర్లు చెప్పే బీజేపీ పార్టీకి అవన్నీ ఉత్తిత్తి కబుర్లు.. తాటాకు దరువులు.. ఆచరణలో దానివి దగుల్బాజీ పనులూ, దరిద్రపుగొట్టు కుయుక్తులూ .. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామిక విలువలన్నిటినీ తుంగలో తొక్కటానికి, అడ్డదిడ్డంగా బరితెగించటానికి 30, 40 ఏళ్ళ కాలం పట్టింది! విలువల వలువలను నట్ట నడివీధిలో నిర్లజ్జగా వదిలిపెట్టటానికి బీజేపీకి మోడీ హయాంలో మూడేళ్లు కూడా పట్టలేదు. అన్ని విలువలకూ పాతరేసి _ అధికార దాహం ఒక్కటే తన పరమాశయమని బీజేపీ పార్టీ రంకెలేస్తున్న నిస్సిగ్గు జాతర రోజూ దేశంలో నడుస్తూనే ఉంది .. కర్ణాటక ఇప్పుడు కాషాయ కంగాళీకి నిలువెత్తు వేదిక.

modishah 19052018 3

మోడీ, అమిత్ షా & పరివారం...బలం లేకున్నా అధికారం కోసం నానా గడ్డీ కరుస్తారు .. ప్రలోభాలూ బెదిరింపులూ దేబిరింపులూ .. ఎంతకన్నా దిగజారతారు... తమ నీతిమాలిన వ్యూహాల్లో గవర్నర్లను ఇష్టమొచ్చినట్టు ఉపయోగిస్తారు... అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి ఎక్కువసార్లు గెలిచిన mla ని ప్రోటెం స్పీకరుగా పెట్టటం సాంప్రదాయం... అలా అయితే_ కర్ణాటకలో 8 సార్లు గెలిచిన కాంగ్రెస్ mla దేశ్ పాండే ని నియమించటం పధ్ధతి... దానిని కాలదన్ని 3 సార్లు గెలిచిన rss వాది బొప్పయ్యను నియమించారు... సిగ్గుమాలిన బీజేపీకి ఇంకా చెప్పటానికి నీతి కబుర్లు ఏమన్నా మిగిలాయా? నాలుగేళ్ల కాలంలో దాని నిజస్వరూపం మొత్తం దేశానికి ప్రదర్శించేసింది !! చాలు చాలు ఇక ... !! చెప్పటానికి నీతులు ఏమీ మిగల్లేదు !! గెలిస్తే గెలవొచ్చు గానీ, గెలిచేంత గొప్పది కాదు బీజేపీ .. ఓడినోడి వైఫల్యాలు గెలిచినోడికి పాఠాలే తప్ప, ప్రశంసలు కావు. దేశం చూస్తోంది .. దేశం మేల్కొంటోంది !!

Advertisements

Latest Articles

Most Read