మొన్నటి దాక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పై విరచుకుపడ్డ విజయసాయి రెడ్డి, గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు.. ఏమై పోయాడో, ఎక్కడకి వెళ్ళాడో తెలియక, రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తుంటే, ఆయన ఒక మిషన్ పై పని చేస్తున్నట్టు తెలిసిందే... ఈ బాధ్యత అప్పచెప్పింది కూడా అమిత్ షా నే.. సాక్షాత్తు అమిత్ షా, టాస్క్ ఇవ్వటంతో, అన్ని పనులు పక్కన పెట్టి మరీ విజయసాయి రెడ్డి ఆ పనిలో పడ్డారు... దీనికి జగన్ కూడా ఫుల్ పర్మిషన్ ఇచ్చినట్టు తెలిసింది.. మాట రానియ్యకుండా, అమిత్ షా చేసిన పని సమర్ధవంతంగా నిర్వహించాలని, మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యద్దు అని, ఎలా అయినా సరే, విజయంతో తిరిగి రావాలని, అవసరం అయితే, నీకు ఏమి కావాలంటే అది ఇస్తాను అని, ఫైనల్ గా అమిత్ షా సంతృప్తి చెందాలని, జగన్, విజయసాయి రెడ్డికి చెప్పి పంపించారు..

ఇంతకీ, విజయసాయి రెడ్డికి ఇచ్చిన బాధ్యత ఏంటి అనుకుంటున్నారా ? బీజేపీ పార్టీ తరుపున కర్ణాటక ఎన్నికల బాధ్యత... కర్ణాటక ఎన్నికల్లో, పని చెయ్యటానికి, విజయసాయి రెడ్డికి కొన్ని నియోజకవర్గాల బాధ్యత ఇచ్చినట్టు తెలుస్తుంది.. ఆ పనుల్లో చాలా బిజీగా ఉన్న విజయసాయి రెడ్డి, గత కొంత కాలంగా సైలెంట్ అయిపోయారు.. అక్కడ కావాల్సిన ఆర్ధిక వనరులు, మనుషలని పంపించటంలో బిజీగా ఉన్నారు.. కడప, అనంతపురం నుంచి, ఇప్పటికే కొన్ని వేల మంది వైసిపీ కార్యకర్తలని, కర్ణాటక పంపించారు.. అక్కడ బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గునటం, చీకటి పడిన తరువాత, ఎన్నికల సమయంలో చేసే పనులు, వీళ్ళ బాధ్యత... అలాగే, ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి వ్యతిరేక ప్రచారం చేసే ఎవరైనా వస్తే, వారిని అడ్డుకోవటం కూడా వీరి బాధ్యత...

మొన్న మహా న్యూస్, బెంగుళూరులో డిబేట్ జరుపుతుంటే, అక్కడకు వెళ్లి, గొడవ చేసి, మహా న్యూస్ మూర్తి పై దాడి చేసింది కూడా ఈ వైసిపీ కార్యకర్తలే... అయితే ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక కాంగ్రెస్, వీరి పై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు కూడా చేసింది... పక్క రాష్ట్రము నుంచి, ఇక్కడకు వచ్చి, అలజడి రేపే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పింది... ఇక్కడ వింత ఏంటి అంటే, వైసిపీ ఇంత బహిరంగంగా, కర్ణాటకలో బీజేపీ కోసం పని చేస్తూ, కాంగ్రెస్ ను ఓడించే ప్రయత్నం చేస్తుంటే, మన రాష్ట్రంలో ఉన్న ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా, వైసిపీ నేతలను తప్పు పట్టం లేదు... మొత్తానికి, అమిత్ షా ని ప్రసన్నం చేసుకోవటాని, విజయసాయి రెడ్డి, కర్ణాటకలో బిజీగా ఉన్నారు... మరి, ఫలితం ఎలా ఉంటుందో, కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది...

‘భరత్ అనే నేను’ సినిమా సక్సెస్ కావటంతో, సినిమా ప్రమోషన్ లో భాగంగా, మహేష్ బాబు ఈ రోజు విజయవాడలో పర్యటించారు.. ప్రేక్ష‌కుల‌తో క‌ల‌సి సినిమాను చూసేందుకు ప్ర‌త్యేక విమానంలో, హైదరాబాద్ నుంచి విజ‌య‌వాడ చేరుకున్నారు. దర్శకుడు కొరటాల శివ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తో కలిసి ఆయన విజయవాడ వచ్చారు. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం నుంచి నేరుగా, క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ‌వారి ఆల‌యానికి చేరుకొని, అమ్మవారిని ద‌ర్శించుకున్నారు.. ఆల‌యానికి చేరుకున్న మ‌హేష్, దర్శకుడు, ఇతరులకు, ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగతం ప‌లికారు. అనంత‌రం ద‌ర్శ‌న ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్ధ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

అక్కడ నుంచి, బెంజిసర్కిల్ ట్రెండ్ సెట్‌ మాల్ లో ప్రేక్షకులతో కలిసి ‘భరత్ అనే నేను’ సినిమాను చుసారు. తరువాత, డీవీ మానర్‌ హోటల్‌లో మహేశ్‌బాబు గుండె శస్త్ర చికిత్స చేసుకున్న చిన్నారులను కలిశారు. ఆంధ్రా హాస్పిటల్స్ మరియి ఇంగ్లండ్‌కు చెందిన లిటిల్ హెవెన్స్ ఆధ్వర్యంలో, ఇప్పటి వరకు 300 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేశారు. గుండె చికిత్స చేయించుకున్న చిన్నారులతో కలిసి మహేష్ కాసేపు సరదాగా గడిపారు. రెండేళ్లుగా చిన్న పిల్లల హార్ట్ ఆపరేషన్లకు మహేష్‌బాబు సహకారం అందిస్తున్నారని, అలాగే బుర్రిపాలెం గ్రామంలో మెడికల్ క్యాంపులు నిర్వహించామని, వైద్యులు తెలిపారు. ఆంధ్రా హాస్పిటల్ చీఫ్‌ పిడియాట్రిషియన్ రామారావు మాట్లాడుతూ, చిన్న పిల్లల ఆపరేషన్ల పై, షార్ట్‌ఫిల్మ్‌ తీసేందుకు మహేష్‌ అంగీకరించారని తెలిపారు.

అనంతరం, మహేష్ మీడియాతో మాట్లాడారు.. విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడికి రావడం సెంటిమెంట్‌గా ఫీలవుతానన్నారు. ఒక్కడు, పోకిరి, దూకుడు వంటి విజయోత్సవ సభలు విజయవాడలోనే నిర్వహించిన సంగతిని గుర్తుచేసుకున్నారు. రాజకీయ అరంగేట్రం గురించి ప్రస్తావించగా, తనకు వందేళ్లు వచ్చే వరకూ సినిమాల్లోనే నటిస్తానని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రానని వెల్లడించారు. జీవితాంతం సినిమాలు చేస్తానని, ఇతర విషయాల జోలికి వెళ్లనని మహేష్‌బాబు ఘంటాపథంగా చెప్పారు. మహేశ్ బాబును చూడటానికి అభిమానులు భారీగా చేరుకున్నారు.

ఆంధ్రుల ఆశల సౌధం... అమరావతి నిర్మాణాలు మొదలు కానున్నాయి.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది... అమరావతి అంటే అది పీపుల్స్ కేపిటల్... అది వన్ అఫ్ ది బెస్ట్ కాదు, ది బెస్ట్ కావలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సార్లు మేధో మధనం చేసి, మైన్యూట్ విషయాలు కూడా పర్ఫెక్షన్ వచ్చేలా చేసి, డిజైన్లు ఫైనల్ చేసారు... ఈ ప్రక్రియ కొంచెం ఆలస్యం అయినా, డిజైన్లు ప్రజలందరికీ నచ్చాయి... మరో పక్క, భ్రమరావతి అనే హేళన చేసే బ్యాచ్ ఉంటానే ఉంది... ఇవన్నీ పక్కన పెడితే, అమరావతి నిర్మాణాల పై ఇక దూకుడుగా వెళ్ళాలని ప్రభుత్వం నిర్ణయించింది... నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అత్యంత కీలకమిన్ సచివాలయ భవన నిర్మాణానికి ఏపీసీఆర్డీయే పూనుకుంటోంది.

మొత్తం ఐదు ప్రధాన టవర్లు, వాటికి అనుబంధంగా ఉండే భవనాల నిర్మాణానికి, మూడు ప్యాకేజీలుగా సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది... ఈ మూడు ప్యాకేజీల అంచనా విలువ మొత్తం 2176 కోట్లు... వీటిలో ముఖ్యమంత్రి కార్యాలయ భవనానికి రూ.530 కోట్లు, 1, 2 టవర్ల నిర్మాణానికి రూ.895 కోట్లు, 3, 4 టవర్ల నిర్మాణానికి రూ.751 కోట్లతో సీఆర్‌డీఏ టెండర్లు ఆహ్వానించింది. బిడ్‌లు దాఖలు చేయడానికి, మే 16 వరకు సీఆర్‌డీఏ టైం ఇచ్చింది. పరిపాలనా నగరంలో పాలవాగుకు ఉత్తర, దక్షిణ దిశల్లో మొత్తం 5 టవర్లతో సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌ ఆవిర్భవిస్తుంది. పాలవాగుకు ఒకపక్కన మూడు టవర్లు, మరో పక్కన రెండు టవర్లు వస్తాయి.

సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌ మొత్తం 32 ఎకరాల్లో, సుమారు 69 లక్షల చదరపుటడుగుల వైశాల్యంతో రూపుదిద్దుకోనుంది. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, కార్యదర్శులు, జీఏడీ కొలువుదీరనున్న టవర్‌ 50 అంతస్థులతోనూ, వివిధ శాఖాధిపతులు, ఉన్నత స్థాయి అధికారులు, ఉద్యోగుల కోసం మిగిలిన 4 టవర్లు ఒక్కొక్కటీ 40 అంతస్థులతోనూ నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం 46వ అంతస్తులో ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయ పైనే హెలిప్యాడ్‌ ఉంటుంది. ఈ ఐదు టవర్లను కలుపుతూ ఒక ఎలివేటెడ్‌ మార్గం ఉంటుంది. అన్ని భవనాల్లో మాదిరిగా ఇందులో పిల్లర్లు ఉండవు. పిల్లర్లకు బదులుగా డయాగ్రిడ్‌ డిజైన్లు మోస్తాయి. కలంకారీ డిజైన్‌లో ఈ డయాగ్రిడ్‌ ఉంటుంది.

మాకు న్యాయం చెయ్యండి అని అంటున్నందుకు, కేంద్ర ప్రభుత్వం మన మీద కక్ష కొనసాగిస్తూనే ఉంది. చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలని, కేసులు పెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా, అవినీతి జరిగినట్టు చిన్న ఆధారం కూడా దొరక్కపోవటంతో, అమరావతి పై, పోలవరం పై, ఆ కక్ష తీర్చుకుని, తన పై ఎదురు తిరుగుతున్న ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించటం కోసం, కేంద్రం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కొన్ని రోజుల క్రితం, అమరావతి పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో వాదనలు జరిగాయి... అమరావతి నిర్మాణం ఆపెయ్యమని, కొంత మంది రాష్ట్ర ద్రోహులు, కేసులు వేసారు... అయితే, అప్పట్లో, అమరావతి నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది.. పర్యవనానని ఎటువంటి ఆటంకం కాకుండా, నిర్మాణాలు చేసుకోమని తీర్పు ఇచ్చింది...

అప్పటికి ఇంకా చంద్రబాబు ఎన్డీఏ లోనే ఉన్నారు... అయితే ఇప్పుడు పరిస్థుతులు వేరు.. మోడీ పై ఒక యుద్ధమే చేస్తున్నారు చంద్రబాబు.. మా హక్కు ప్రకారం, మా రాష్ట్రానికి సాయం చెయ్యమని పోరాడుతున్నారు.. ఈ తరుణంలో, మళ్ళీ కొంత మంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు... తీర్పును పునర్‌ సమీక్ష చెయ్యాలి అంటూ మరో పిటీషన్ వేసారు.. నిజానికి, ఒక్కసారి కొట్టేస్తే, వెంటనే మరో పిటీషన్ స్వీకరించరు.. మరీ ప్రత్యెక పరిస్థుతుల్లో తప్ప ఇది జరగదు... అయితే, కేసు కొట్టేసి 7-8 నెలలు కాకముందే, అమరావతి నిర్మాణంపై దాఖలైన పునర్‌ సమీక్ష పిటిషన్‌కు సంబంధించి ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేస్తామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొంది.

అమరావతి నిర్మాణం పై ఎన్జీటీ, గతంలో ఇచ్చిన తీర్పును పునర్‌ సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ పై, నిన్న గురువారం జస్టిస్‌ జావేద్ ర‌హీం ధర్మాసనం విచారించింది... గతంలో తీర్పును ఇచ్చిన న్యాయమూర్తులు పదవీ విరమణ పొందారని, అందుకే కొత్త బెంచ్‌ ఏర్పాటు చేస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది... అంటే, ఇప్పుడు అమరావతి నిర్మాణం పై మళ్ళీ వాదనలు జరుగుతాయి... మనం ఎంత సమర్ధవంతంగా వాదించినా, కేంద్రం తలుచుకుంటే, ఈ విషయంలో మనల్ని ఇబ్బంది పెట్టటం, పెద్ద సమస్య కాదు.. మరోసారి, చంద్రబాబుని, అమరావతి విషయంలో ఇబ్బంది పెట్టే స్కెచ్ అంటూ, ప్రభుత్వ వర్గాలు కూడా గుసగుసలాడుతున్నాయి.. కొట్టేసిన కేసు, మళ్ళీ రీ ఓపెన్ చెయ్యటం ఏంటో అంటూ, మాట్లాడుకుంటున్నారు... చివరకు ఇది ఎటు పోతుందో చూడాలి...

Advertisements

Latest Articles

Most Read