మీ దాక వస్తే కాని నొప్పి తెలియలేదా ? మీ రాజకీయం కోసం, సినిమా పరిశ్రమ మొత్తం ఏకం కావాలా ? సినీ ఇండస్ట్రీ పై ఇన్ని రోజులుగా ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయో, అవేమీ పట్టించుకోని మీరు, మీ మీదకు వస్తే మాత్రం, వచ్చి హడావిడి చేస్తారా ? అదీ రాజకీయంగా వాడుకుంటారా ? ఇది ప్రతి ఒక్క సామాన్యుడు అభిప్రాయం... కాని, ఇదే అభిప్రాయం, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు కూడా వినిపిస్తున్నారు... పవన్ బ్యాచ్ చేస్తున్న హడావిడి పై మండిపడుతున్నారు... టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులలో ఒకడిగా ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ నలుగురులో కీలక వ్యక్తిగా పేరు గాంచిన అల్లు అరవింద్ మాటలకు ఎదురు ఉండదు అనే అభిప్రాయానికి చెక్ పడింది. అరవింద్ కు కొన్ని రోజుల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల సమావేశంలో నాగార్జున మేనకోడలు సుప్రియ అరవింద్ ను టార్గెట్ చేస్తూ ఘాటైన కామెంట్స్ చేసింది అంటూ ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

allu 26042018

పవన్ కళ్యాణ్ ను అదేవిధంగా అతడి తల్లిని టార్గెట్ చేసే విధంగా కొన్ని ప్రముఖ ఛానల్స్ నెగిటివ్ ప్రచారాన్ని చేస్తున్నాయి అంటూ దానికి వ్యతిరేకంగా పవన్ తన రాజకీయ కార్యకలాపాలను పక్కకు పెట్టి గత కొద్ది రోజులగా ఆ ఛానల్స్ ను చూడవద్దు అంటూ పవన్ చేస్తున్న హడావిడి తెలిసిందే. దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న పవన్ కు సపోర్ట్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన సమావేశంలో సుప్రియ అరవింద్ ల మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగినట్లు ఆ పత్రిక పేర్కొంది. అరవింద్ న్యూస్ చానల్స్ ను బ్యాన్ చేద్దాం అని ప్రకటించగా, ఈ సందర్భంలో సుప్రియ అరవింద్ ను ఉద్దేసించి మాట్లాడుతూ కొంతకాలం క్రితం ఒక టివి యాంకర్ ఒక హీరోయిన్ విషయమై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన విషయాన్ని గుర్తుకు చేస్తూ మాట్లాడిందట.

allu 26042018

అంతేకాదు అప్పట్లో తాను ఆ కామెంట్స్ ను ఖండించమని కోరుతూ పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు మెసేజ్ లు పెట్టినా స్పందించని సందర్భాలను గుర్తుకు చేసి, అప్పుడు ఆవిషయాలు అన్యాయంగా అనిపించలేదా అంటూ అరవింద్ ను అందరి ఎదురుగా సుప్రియ ప్రశ్నించిందని, ఆ పత్రిక వివరణాత్మకంగా వార్తను వ్రాసింది. దీనితో ఊహించని ఈ పరిణామానికి అరవింద్ షాక్ ఐనట్లు తెలుస్తోంది. ఆ తరువాత అరవింద్ టివి9, ఎబిఎన్ ఛానల్స్ కార్యక్రమాలకు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల వారు ఎవరూ వెళ్ళకూడదు అన్న తీర్మానాన్ని పెట్టడానికి ప్రయత్నించినప్పుడు, ఇండస్ట్రీ పెద్దలతో పాటు సుప్రియ కూడ తీవ్రంగా వ్యతిరేకించినట్లు టాక్. మొత్తానికి, తమ రాజకీయ ప్రయోజానాల కోసం, కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న పవన్, అల్లు బ్యాచ్ కి, సినీ ఇండస్ట్రీలోని పెద్దలు ఎవరూ మద్దతు పలకటం లేదు...

ఫేకో... ఫేకస్య... ఫేకభ్యహ... ఇచ్చట సర్వం ఫేక్ చెయ్యబడును... మాములుగా అయితే, ఈ క్యాప్షన్ లోటస్ పాండ్ సొంతం... ఒకటి కాదు, రెండు కాదు, అక్కడ సర్వం ఫేక్... ఉన్నది లేనిది, లేనిది ఉన్నది చేసే మాస్టర్ ఆర్ట్స్ లోటస్ పాండ్ పైడ్ బ్యాచ్ సొంతం... సన్నీ లియోన్ కు వచ్చిన జగన్ కూడా, ఫోటోషాప్ చేసి జగన్ కు వచ్చారు అనే చెప్పే ఘనులు ఉన్నారు అక్కడ... బీహార్ లో రోడ్లు చూపించి, ఇది చంద్రబాబు పాలన అంటారు.... తమిళనాడులో ఫోటోలు తమిళ్ రాసి ఉన్న ఫోటోలు చూపించి, చూసారా మా రాజశేఖర్ రెడ్డి పాలనలో, ఎంత మందికి చదువు చెప్పించామో అంటారు... ఈ పైడ్ బ్యాచ్ కి తోడు, సాక్షి ఛానల్ ఉండనే ఉంది... అయితే, ఇప్పుడు ఈ ఫేక్ బ్యాచ్ కు తోడుగా, పవన్ కళ్యాణ్ ఫేక్ బ్యాచ్ కూడా తయారయ్యింది... ఎలాగూ, త్వరలో కలిసిపోతారు కదా, ఇద్దరూ కోఆర్డినేట్ చేసుకుంటూ, ఫేక్ చేసి పదేస్తున్నారు...

pawab 26042018 1

పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఎలాంటి చౌకబారు పోస్ట్లు పెడుతున్నాడో చూస్తున్నాం... ఈ చౌకబారు పోస్ట్లకు, బుద్ధి ఉన్నవాడు ఎవడూ మద్దతు ఇవ్వడు... గాలి మంద తప్ప... అందుకే, మా పవన్ తోపు తురం అని కలరింగ్ ఇవ్వటానికి, ప్రముఖల పేరుతో ఫేక్ ట్విట్టర్ ఖాతాలు తెరిసారు... ఆ ఫేక్ ఖాతాలతో, పవన్ చేసే ప్రతి ట్వీట్ ఆహా ఓహో అనటం, మరో పక్క చంద్రబాబుని తిట్టించటం ఈ ఫేక్ బ్యాచ్ పని... సినీ హీరోలు, ప్రముఖులు, సెలబ్రిటీల పేరుతో ఈ ఫేక్ ఎకౌంటు లు ఓపెన్ చేసారు... ఇప్పటికే జగన బ్యాచ్ ఇలాంటివి తయారు చేసింది... ఇప్పుడు జనసేన బ్యాచ్ మరి కొన్ని ఫేక్ ఎకౌంటు లు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే.. ట్విట్టర్‌లో యాంకర్‌ రవి పేరిట, ఇలాంటి డ్రామాలు ఆడి దొరికిపోయారు.

యాంకర్‌ రవి కామెంట్‌ ఒకటి ట్విట్టర్‌లో పోస్ట్‌ అయ్యింది. హఠాత్తుగా బుధవారం ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని టార్గెట్‌ చేస్తూ.. పవన్ కల్యాణ్‌ ట్వీట్ చేసిన రీతిలోనే.. అభ్యంతరకరంగా రవి ఓ ప్రశ్న సంధించాడు. దీనికి కూడా అనుకూలంగా, వ్యతిరేకంగా 59 రీట్వీట్స్‌, 499 లైక్‌లు వచ్చాయి. యాంకర్‌ రవి చేసిన ట్వీట్‌కు హీరో నితిన్ స్పందించాడు. అతన్ని వారిస్తున్నట్లు, డోస్‌ చాలన్న రీతిలో ఓ కామెంట్‌ను రీ ట్వీట్‌ చేశాడు. రవి ట్వీట్‌కు.. హీరో నితిన్‌ స్పందించడం... మరింత చర్చకు దారితీసింది. ట్విట్టర్‌ వేదికపై ఈ రచ్చ రంబోలా సాగుతుండటాన్ని గమనించిన కొందరు యాంకర్‌ రవి అభిమానులు, జర్నలిస్టులు.. ఆయన పేరిట పోస్ట్‌ అవుతున్న ట్వీట్లపై ప్రశ్నించారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిపై అభ్యంతరకర పోస్టును ఎందుకు పెట్టావంటూ రవి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. షాక్‌ అవ్వడం యాంకర్‌ రవి వంతు అయ్యింది. తన ప్రమేయం లేకుండా.. తన పేరుతో.. తన ఫోటోతో ట్విట్టర్‌లో కామెంట్లు ఎలా పోస్ట్‌ అయ్యాయని విస్తుపోయాడు. తన పేరిట నకిలీ ట్విట్టర్‌ ఖాతా ఓపెన్‌ అయ్యిందని గుర్తించాడు.

pawab 26042018 1

అయినా తన పేరుతో నకిలీ ట్విట్టర్‌ అకౌంట్ వాడుతూ.. అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్నారని.. ఆపోస్టులపైనా, ఆపోస్టులు పెట్టిన వాళ్లపైనా లీగల్‌గా కేసువేసి ప్రొసీడ్‌ అవుతానన్నారు. అంతేకాదు.. తన అఫిషియల్‌ ట్విట్టర్‌ అకౌంట్, నకిలీ ట్విట్టర్‌ అకౌంట్ల అడ్రస్‌ను వెల్లడించారు యాంకర్‌ రవి. వీటిని పరిశీలించి.. అసలు ఖాతా ఏదో, నకిలీ అకౌంట్‌ ఏదో గుర్తించాలని కోరుతున్నారు. అటు.. హీరో నితిన్‌ తండ్రి సుధాకర్‌రెడ్డి కూడా తన కుమారుడికి ఈ పేరుతో ట్విట్టర్‌ అకౌంట్‌ లేదని, ఎవరో నకిలీ అకౌంట్‌తో పోస్టులు చేస్తుండవచ్చని స్పష్టం చేశారు. యాంకర్‌ రవి వివరణ, హీరో నితిన్‌ తండ్రి చెబుతున్న విషయాలతో.. పవన్‌ కల్యాణ్‌ అభిమానుల పైత్యం మరోసారి బయటపడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మే 14న ధర్మాసనం ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో పోలీసుల దగ్గర కీలక ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు విచారణకు కూడా కోటం శ్రీధర్‌రెడ్డి సహకరించలేదని సమాచారం. దీంతో ఎమ్మెల్యేపై 173, 174 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధర్మాసనం ముందు హాజరుకావాలని ఆదేశించింది... ఈ విషయం పై నెల్లూరు పోలీసులు పత్రికా ప్రకటన ఇచ్చారు.. ఇదే ఆ ప్రకటన...

nellore 25042018 1

"నెల్లూరు నగర 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అయిన కృష్ణ సింగ్, బుకీలు, పంటర్ల పై Sec.3 A.P Gaming Act మరియు Sec.109 IPC క్రింద కేసు నమోదు చేయటం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో నెల్లూరు రూరల్ MLA అయిన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అయిన కృష్ణ సింగ్ మరియు బుకీలు, పంటర్లను ప్రోత్సహిస్తూ, వారికి సహకరిస్తున్నట్లు వారితో లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తగు ఆధారాలు సేకరించడం జరిగింది. సేకరించిన ఆదారాల ఆధారంగా సదరు MLA గారికి దర్యాప్తు అధికారి Sec.41 Cr.P.C ప్రకారం సంజాయిషీ ఇచ్చుకొనుటకు నోటీసు ఇవ్వటం జరిగింది. MLA గారు నోటీసు తీసుకొని దర్యాప్తు అధికారి వద్ద హాజరు కాలేదు. సదరు MLA గారు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి " నేను దర్యాప్తు అధికారుల వద్ద హాజరుకాను. వారి ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టుకోండి " అని తెలియచేయడం జరిగింది. దర్యాప్తు అధికారి 2వ సారి నోటీసు ఇవ్వటానికి ప్రయత్నించగా నోటీసును MLA గారు నిరాకరించటం జరిగింది.

nellore 25042018 1

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ, క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడిన కృష్ణ సింగ్ మరియు బుకీలు, పంటర్ల పై ఆధారాలు సేకరించిన తర్వాత వారిపై Sec.3 of AP. Gaming Act క్రింది మరియు వారిని ప్రోత్సహిస్తూ, వారికి సహకరిస్తూ వారితో లావదేవీలు నిర్వహిస్తున్నట్లు ఆధారాలు ఉన్నందు వలన MLA శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిపై Sec.3 of AP Gaming Act, Sec. 109 IPC క్రింద, మరియు నోటీసు తీసుకొని హాజరు కానందుకు, నోటీసు నిరాకరించినందుకు Sec.173, 174 IPC క్రింద నేరాలు రుజువు అయినందున ది.23.04.18 న సంభందిత కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయటమయినది. సదరు కోర్ట్ మే నెల 14 వ తేదీన కోర్టులో హాజరు కావలసినదిగా రూరల్ MLA శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మరియు ఇతర ముద్దాయిలకు సమన్లు జారీ చేయటం జరిగినది. రూరల్ MLA శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి క్రికెట్ బుకీల తోను మరియు పంటర్ల తోను జరిపిన ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని ACB వారికి సమర్పించటం జరుగుతుంది. ఈ లావాదేవీలపై తదుపరి దర్యాప్తు ACB వారు నిర్వహిస్తారు. జిల్లాలో క్రికెట్ బూకీలపై, నిర్వాహకులపై మరియు Gutka అమ్మకందారుల పై మరియు సరఫరా దారుల పైన కఠిన చర్యలు తీసుకోబడుతాయి. సూపరింటెండెంట్ అఫ్ పోలీస్, నెల్లూరు"

రాజధానిలో పైప్‌లైన్ డక్టులు, గ్యాస్, పెట్రో స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలను వినియోగించుకునే వాణిజ్య సంస్థల నుంచి యూజర్ ఛార్జీలను వసూలు చేయడం ద్వారా కొంతమేర ఆదాయ వనరులు పెంచుకోవచ్చునని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. రాజధానిలో తాగునీరు, మురుగునీరు, విద్యుత్, కమ్యూనికేషన్ తదితర వ్యవస్థల కోసం ఏర్పాటు చేస్తున్న పైప్‌లైన్ డక్టులనే వాణిజ్య సంస్థలు తమ అవసరాలకు వినియోగించుకోవాల్సి వుంటుంది. నూతన నగరంలో అన్ని రకాల కేబుళ్లు, పైప్ లైన్లు ఈ డక్టుల ద్వారానే వెళ్లాలి. ఇవే కాకుండా గ్యాస్, పెట్రో స్టేషన్లు, జల మార్గాల ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుందని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

amaravati 25042018

అమరావతిలో 1350 ఎకరాలలో నిర్మించే పరిపాలన నగరానికి ప్రత్యేకంగా ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని గత సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన సూచన మేరకు తాజాగా ఈ ప్రతిపాదనలను పరిశీలించారు. సచివాలయంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన సమీక్షా సమావేశంలో సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ వీటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అమరావతిలో పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. తొలుత 10 ఎకరాలలో మాల్ తరహాలో దీన్ని ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ధియేటర్లు, రెస్టరెంట్లు, ఫుడ్ కోర్టులు, రిటైల్ షాపింప్ సదుపాయాలతో ఈ మాల్‌ను నెలకొల్పాలని భావిస్తున్నారు. మాల్ నిర్మాణాన్ని సీఆర్‌డీఏ చేపడితే, తరువాత దాని నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించవచ్చునని తలపోస్తున్నారు.

amaravati 25042018

ఏడాదిన్నర కాలంలోగా ఇక్కడికి 38 వేల కుటుంబాలు తరలివస్తాయని అంచనా వేస్తున్నామని, మున్ముందు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వీరందరి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ తరహా సదుపాయాలను ముందే సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాజధానిలో స్టార్ హోటళ్లను ఏర్పాటు చేయడానికి ప్రతిష్టాత్మక సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చినా ప్రస్తుత అవసరాలను గమనంలోకి తీసుకుని ప్రధాన రహదారుల వెంబడి కంటైనర్ హోటళ్లను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. కంటైనర్ హోటల్ భావనను విజయవాడలోని మురళీ ఫార్య్చూన్ నిర్వాహకులు ఐటీసీతో కలిసి అభివృద్ధి చేస్తున్నారు.

amaravati 25042018

కొత్త నగరంలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించిన మౌలిక వసతుల కోసం రూ.166 కోట్లు అవసరం అవుతాయని అంచనావేశారు. అమరావతి ఆర్థిక ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు. ఆదాయాన్ని పెంచడం ద్వారా రాజధాని ప్రాంతాన్ని రాష్ట్రానికి అతిపెద్ద ఆస్తిగా మార్చాల్సివుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వివిధ ఆర్థిక సంస్థల నుంచి వనరులను సమకూర్చుకునే క్రమంలో మున్ముందు ప్రభుత్వానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడ్చుకోకూడదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆర్థిక సంస్థల నుంచి వనరులను సమకూర్చునేప్పుడు ప్రభుత్వానికి ఉన్న దారులన్నీ మూసుకుపోయేలా కాకుండా పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకునేలా విధానాలు ఉండాలని చెప్పారు. బాండ్ల ద్వారా రాజధాని నిర్మాణంలో ఎన్‌ఆర్ఐలను భాగస్వాముల్ని చేయాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. ‘హడ్కో’ కంటే ఇతర వాణిజ్య బ్యాంకులు అందించే రుణాలకు వడ్డీ తక్కువగా ఉన్నందున రాజధానిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుకు వాటి ద్వారా ఆర్థిక సాయం తీసుకోవాలన్న ప్రతిపాదనపై చర్చించారు.

Advertisements

Latest Articles

Most Read