ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఈ మధ్య నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడు, ఏదైనా ప్రజల తరుపున పోరాటం విషయంలో వార్తల్లో ఉండాలి కానీ, ఇక్కడ మాత్రం నెగటివ్ విషయాలకు వార్తల్లో ఉంటున్నారు. చివరకు అధికార పార్టీకి, జగన్ మోహన్ రెడ్డికి మంచి చేస్తున్నారు. సోము వీర్రాజు పాజిటివ్ కంటే, నెగిటివ్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది ఒక స్ట్రాటజీ ప్రకారమే చేస్తున్నట్టు అర్ధం అవుతుంది. నెగటివ్ ప్రచారానికే తాను వార్తల్లో ఉంటానని, తద్వారా జగన్ కు అనుకూలంగా ఉండొచ్చు అని ఏమో మరి. గత నెల రోజులుగా సోము వీర్రాజు చేస్తున్న పనులు ఇలాగే ఉన్నాయి. చీప్ లిక్కర్ 50 రూపాయలకు ఇస్తామని ఎవరైనా అంటారా ? హ-త్య-లు చేసే కడప వారికి ఎయిర్ పోర్ట్ ఎందుకు అని ఎవరైనా అంటారా ? దొంగ లం అని బూతులు మాట్లాడతారా ? ఈ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు ? చివరకు ఇవి రాజకీయంగా ఎవరికి బెనిఫిట్ అవుతున్నాయి అనేది కూడా అర్ధం అవుతుంది. అయితే సోము వీర్రాజు వరుస వివాదాల పై హైకమాండ్ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇక ముందు అయినా సోము వీర్రాజు జాగ్రత్తగా ఉంటారో, ఇదే నెగటివ్ ప్రచారం కోసం తపిస్తారో చూడాలి మరి.
news
వైఎస్ఆర్ ని మర్చిపోయిన వైసీపీ... కొత్త పేరు స్మరణతో, విస్మయం వ్యక్తం చేస్తున్న వైసీపీ క్యాడర్...
ఎవరికైనా ఒక పార్టీకి, ఒక నేత ఇన్స్పిరేషన్ గా ఉంటారు. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలకు వారే సగం బలం. తమిళనాడులో కానీ, ఏపిలో కానీ. ముఖ్యంగా ఆ పార్టీ స్థాపించిన వ్యక్తులను ముందు పెట్టుకుని ప్రచారం చేసుకుంటారు. అయితే ఇక్కడ ఏపిలో మాత్రం వింత పరిస్థితి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకడు అన్న ఎన్టీఆర్. తెలుగు ప్రజలే కాదు, యవత్తు దేశం, ఎన్టీఆర్ ముందు మోకరిల్లిన రోజులు కూడా ఉన్నాయి. తెలుగు వారి ఆత్మగౌరవానికి, చిహ్నం అన్న ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకునే ప్రచారం చేస్తుంది. ఇక మరో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు వైఎస్ ని ముఖ్యమంత్రిని చేసినా, ఆ పార్టీకి వెన్ను పోటు పొడిచి, బయటకు వచ్చి అదే వైఎస్ఆర్ పేరుతో పార్టీ పెట్టారు. సరి ఇది తప్పు లేదు. వైఎస్ఆర్ బ్రాండ్ ని వాడుకుని, రాజకీయంగా ఎదుగుతున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, గత నాలుగు రోజులు నుంచి వైసిపీ అధిష్టానం తీరు చూసి, వైసీపీ శ్రేణులే షాక్ తిన్నాయి. ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టారని, వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇది రాజకీయంగా చేస్తున్న ఎత్తుగడ అని అందరికీ తెలిసిందే. ఏదో ఒక రోజు చేసారు అంటే అర్ధం ఉంది, నాలుగు రోజుల నుంచి, పై స్థాయి నాయకుల నుంచి అందరు ఎన్టీఆర్ నామస్మరణ చేస్తూ, ఎన్టీఆర్ గొప్పతనం చెప్తూ, చేస్తున్న డబ్బా చూసి, ప్రత్యర్ధి పార్టీ ఆశయాలు మనం తీసుకుని వెళ్ళటం ఏంటి ? మన పార్టీ బ్రాండ్ వైఎస్ఆర్ బొమ్మ కాకుండా, ఎన్టీఆర్ బొమ్మతో ఈ హడావిడి ఏంటి, రాజకీయంగా ఇంత దిగజారాలా అంటూ, వైసీపీ శ్రేణులు బాధ పడుతున్నారు. మరి వారి అధిష్టానానికి ఇది అర్ధం అవుతుందో లేదో మరి.
క్రమశిక్షణ చర్యలు అంటూ, ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం ? ఎస్మా ప్రయోగానికి వెనుకాడరా ?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం మోసం చేసింది అంటూ, జీతాలు పెరగకుండా, తగ్గించిన పీఆర్సీ పై, ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఎలాగైనా ఉద్యోగులకు పెరిగిన పీఆర్సీ ప్రకారం జీతాలు ఈ నెలలోనే ఇచ్చేస్తే, చట్ట పరంగా బయట పడొచ్చని, ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగుల పై, జీతాల బిల్లులు ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగులు కూడా తాము కూడా నిరసనల్లో పాల్గుంటున్నామని, పాత జీతాల బిల్లులు అయితేనే ప్రాసెస్ చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం బెదిరింపు ధోరణికి దిగింది. వెంటనే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేయాలని, డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగులను బెదిరిస్తుంది. లేదంటే, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం అంటూ, మేమోలు జారీ చేసారు. ప్రభుత్వ విధులు ఆటంకం కలిగించారనే నెపంతో, చర్యలు తీసుకంటాం అని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం కూడా పని చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే అధికారులు మాత్రం, మేము చేసేది లేదని, కలెక్టర్లకు తెగేసి చెప్తున్నారు. దీంతో ప్రభుత్వం ఉద్యోగుల పై చర్యలకు దిగుతుంది అని ప్రచారం జరుగుతుంది. ఎస్మా ప్రయోగించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరి ఈ సమస్య పరిష్కారం అవుతుందో, ముదురుతుందో చూడాలి.
ఈ నెల పడిన పెన్షన్ చూసి, షాక్ అయిన రిటైర్డ్ ఉద్యోగులు... కొంత మందికి రూ.15 వేల వరకు తగ్గుదల...
అనుకున్నదే అయ్యింది. ఇన్నాళ్ళు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు చెప్తున్నట్టే, పెన్షన్ లో భారీ కోత పడింది. అయితే దీనికి తోడుగా, ఇంకా కొత్త పీఆర్సీ ప్రకారం పెన్షన్ వేయక పోవటంతో, భారీగా కోత పడింది. పోయిన నెలతో పోల్చుకుంటే, వారి వారి పెన్షన్ స్థాయిని బట్టి, దాదాపుగా రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు బొక్క పడింది. కొంత మందికి పెన్షన్ పడటం, అలాగే తమకు జెనరేట్ అయిన పెన్షన్ అమౌంట్ సిఎంఎఫ్ఎస్ లో చూసిన రిటైర్డ్ ఉద్యోగులు షాక్ తిన్నారు. అయితే ఏదో వెయ్యి రూపాయల వరకు తగ్గుతుంది అనుకుంటే, ఏకంగా పది, 15 వేలు తగ్గటం చూసి షాక్ తిన్నారు. అసలు విషయం ఏమిటి అని ఆరా తీస్తే, కొత్త పీఆర్సి ప్రకారం వేయలేదని, అలాగే ఇప్పటి వరకు నడుస్తున్న ఐఆర్ కూడా ఇవ్వలేదు. దీంతో భారీ బొక్క పడింది. ఇవన్నీ తరువాత అరెయర్స్ రూపంలో ఇస్తామని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వం ఇస్తుందో లేదో తెలియని పరిస్థితి. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షనే ఆధారం. వృద్ధ వయసులో, నెల వారి ఖర్చులకు ఇదే వారికి ఆధారం. అలాంటిది ఏకంగా పది వేలు, 15 వేలు తగ్గించి ఇవ్వటంతో, రిటైర్డ్ ఉద్యోగులు లబో దిబో అంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేని అంటున్నారు.