ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చిత్ర విచిత్రాలు బహుసా ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఉండవు. ఒక పక్క జీతాలకు డబ్బులు లేవు అంటారు, ఆదాయం లేదు అంటారు, మరో పక్క మూడు రాజధానులు, 26 జిల్లాలు, 26 ఎయిర్ పోర్ట్ లు, 26 మెడికల్ కాలేజీలు, ఇలా రకరకాలుగా, వింత వింతగా నిర్ణయాలు తీసుకుంటారు. అన్నీ కూడా హడావిడి నిర్ణయాలు. ఏదో రాత్రి కలలో గుర్తుకు వచ్చి, ఉదయం చేసేసినట్టు ఉంటుంది. మూడు రాజధానుల విషయంలో కూడా అలాగే అయ్యింది. వాళ్ళ కోటరీ మాత్రమే డిస్కస్ చేసుకుని, ఎవరికీ చెప్పకుండా, ప్రజలలో చర్చ లేకుండా, ఉన్నట్టు ఉండి మూడు రాజధానులు అన్నారు. అది ఎంత కామెడీ అయ్యి కూర్చుందో, చివరకు ఆ బిల్లు వెనక్కు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలను చేసేసారు. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసారు. ఏంటి ఇలా జరిగింది అని ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. నిద్ర లెగిసి చుసేసరికి, మా జిల్లా మారిపోయింది అని గోల చేస్తున్నారు. గత రెండు మూడు రోజుల నుంచి, కొత్త జిల్లాల ఏర్పాటు పై చర్చ నడుస్తుంది. అయితే ఇది మొత్తం పద్దతి ప్రకారం చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం వార్తలు చూసి షాక్ అయ్యారు.

cabinet26012022 2

నిన్న అర్జెంట్ గా ఆన్లైన్ లో క్యాబినెట్ మీటింగ్ జరిగింది అట. అందులో రెవిన్యూ మంత్రి ధర్మాన, ఈ ప్రతిపాదన పెట్టటం, క్యాబినెట్ మొత్తం ఒకే చెప్పటం, వెంటనే గెజిట్ వచ్చేయటం జరిగిపోయాయి అంట. ఎందుకు ఇంత అర్జెంట్ గా రాత్రికి రాత్రికి చేసారో, వాళ్ళకే తెలియాలి. ఇక ఇప్పుడు ప్రజలు తేరుకుని చూసే సరికి చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలో కృష్ణమ్మ లేదు. ఎన్టీఆర్ జిల్లాలో, ఎన్టీఆర్ సొంత ఊరు లేదు. డెల్టా ప్రాంతంలో కాలువలు లేవు. హిందూపురం జిల్లా, మదనపల్లె జిల్లా లేవు. ఇలా మొత్తం గందరగోళంగా మారిపోయాయి. నూజివీడు తీసుకుని వెళ్లి ఏలూరులో కలిపారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు. అనేక అభ్యంతరాలు వస్తున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, గెజిట్ విడుదల చేసి అభ్యంతరాలు ఉంటే చెప్పాలి అని చెప్పటం. అసలు ఒక పక్క కొత్త జనాభా లెక్కలు అయ్యే దాకా, ఇది వద్దు అని కేంద్రం అంటుంటే, ఇది చెల్లదు అని తెలిసినా, ఎందుకు హడావిడిగా ఇది చేసారో, జగన్ గారికే తెలియాలి మరి.

ఆంధ్రప్రదేశ్ ఆర్దిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ఆయన పాత్ర ఏమీ కనిపించడం లేదు. అసలు అయితే ఇలాంటి ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీఆయనే చూసుకోవాలి. కాని ఈ మధ్య చాలా విషయాల్లో ఆయన అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వ్యవహారాలన్నీ సజ్జల లే చూసుకుంటున్నారు. AP ఉద్యోగుల పీఆర్సీ పై ఇంత ఎత్తున సమ్మె జరుగుతున్నా బుగ్గన దీని పై ఏమి స్పందిచకపోవడం  గమనార్హం. ఒక్కసారి మాత్రం ఉద్యోగుల ను సమ్మె చేయకుండా నచ్చ చెప్పడానికని ఒక  మీటింగు ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్ కు వచ్చి ఊరికే అలా కూర్చొని  వెళ్లి పోయారు. ఆ మీటింగులో కూడా  కనీసం ఆయన ఏమి మాట్లాడక పోవడం పై ఉద్యోగులు కూడా అయోమయానికి గురయ్యారు. ఆ మీటింగులో కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి దే డామినేషనగా కనిపించింది. అయితే వేరే మంత్రులు పేర్ని నాని, బొత్సలను ఉన్న కూడా సజ్జలే మీడియాతో మాట్లాడారు. ఇందంతా చూస్తుంటే  AP లో అన్ని విషయాలపై  సజ్జల దే ముఖ్య పాత్ర గా కనిపిస్తుంది. అయితే అసలు బుగ్గన ఈ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ఎందుకు కల్పించుకోవడం లేదో అర్ధం కావట్లేదంటున్నారు. మరో వైపు బుగ్గన మాత్రం ఎక్కువగా  డిల్లి లోనే  ఉంటున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన అప్పులు తేవటంలో ఆయన బిజీగ ఆన్నారు. ఏపిలో ఉద్యోగుల విషయంలో బుగ్గన మాత్రం అ వివాదాలన్నీ తనకేందుకులే అని, ప్రభుత్వం  డిల్లి లో ఎవర్ని కలిసి రమ్మంటే వారిని కలిసి వస్తున్నారట .ఈయన ఎందుకు ఇలా అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు అనే విషయం పై స్పష్టత రావాల్సి ఉంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకునే అనేక నిర్ణయాలు, ఈ మధ్య కాలంలో వివాదాస్పదం అవుతున్నాయి. దీనికి ముఖ్య కారణం, ఫెడరల్ వ్యవస్థలో కీలకమైన రాష్ట్రాల హక్కులను, కేంద్రం నెమ్మదిగా తమ అధీనంలోకి తెచ్చుకోవటం. ఈ మధ్య కాలంలో అనేక నిర్ణయాలు రాష్ట్రాలు విమర్శలు చేస్తున్నాయి. వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అలాంటి నిర్ణయమే ఇప్పుడు కేంద్రం మరొకటి తీసుకుంది. అదే ఐపిఎస్, ఐఏఎస్ అధికారులను కేంద్రం గుప్పిట్లోకి తీసుకోవటం. దీని కోసం కేడర్ రూల్స్ ని మార్చేస్తున్నారు. ఐపిఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులను ఎప్పుడు కావలి అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం వెనక్కు పిలిపించుకోవచ్చు. అయితే కేంద్రం తీసుకునే ఈ నిర్ణయాన్ని, బీజేపీ, దాని మిత్ర పక్షాలు పాలించే రాష్ట్రాల్లో ఎలాగూ వ్యతిరేకించరు. కేవలం మిగతా బీజేపీయేతర రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయి. కీలకమైన సివిల్ సర్వీస్ అధికారులు కేంద్రం చేతుల్లోకి వెళ్తే, ఇక రాష్ట్రాల్లో తమకు ఇష్టం వచ్చినట్టు కేంద్రం చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా బీజేపీ బలంగా లేని చోట, అంటే మమతా బెనర్జీ, కేజ్రివాల్, స్టాలిన్, ఇలాంటి చోట్ల, కేంద్రం ఇష్టం వచ్చినట్టు చేసే అవకాసం లేక పోలేదు. అందుకే బీజేపీయేతర రాష్ట్రాలు అన్నీ కూడా ఈ ప్రతిపాదనను వ్యతికేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేసాయి కూడా.

shah 25012022 2

బీహార్, తమిళనాడు తో పాటుగా, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, కేరళ, పంజాబ్‌ జార్ఖండ్‌, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రం నిర్ణయం పై ఎదురు తిరిగాయి. తాజాగా తెలంగాణా రాష్ట్రం కూడా, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పైన తమ అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఇన్ని రాష్ట్రాలు వ్యతిరేకత చెప్పినా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జగన్ మోహన్ రెడ్డి, ఎలాంటి ప్రకటన కాని, లేఖ కాని కేంద్రానికి రాయలేదు. అంటే కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకత చెప్పటం లేదు. మరీ ముఖ్యంగా ఇది కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శాఖ కావటంతో, జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి వ్యతిరేకంగా సాహసం చేయలేదు. కేంద్రం గుప్పిట్లోకి వెళ్ళిపోతుందని తెలిసినా కూడా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారో అర్ధం కావటం లేదు. రాష్ట్రాల హక్కులు కేంద్రానికి ఇచ్చేస్తూ పొతే, ఇప్పుడు జగన్ సొంత నిర్ణయాలు కోసం చేసే ఈ పనులు, రేపు ప్రభుత్వాలు మారిన తరువాత ఎంత ఇబ్బంది అవుతుందో ఆలోచన చేయకుండా, ఇలా చేయటం పై విమర్శలు వస్తున్నాయి.

ప్రశాంత్ కిషోర్... ఈ పేరు తెలియని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉండరు. జగన్ మోహన్ రెడ్డి కోసం పని చేస్తూ, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పి, ఫేక్ చేసి, ఇష్టం వచ్చినట్టు అస్తవ్యస్తం చేసి, కుల గొడవలు, ప్రాంతీయ గొడవలు, ఇలా రకరకాలుగా చేసి, జగన్ మోహన్ రెడ్డిని అందలం ఎక్కించిన వ్యక్తి. ఐప్యాక్ సంస్థతో కలిసి, ప్రశాంత్ కిషోర్ చేసిన రచ్చ ఏపిలో అంతా ఇంతా కాదు. ఇందు కోసం జగన్ మోహన్ రెడ్డి, పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఇచ్చారు. వందల కోట్లు అని ప్రచారం ఉంది కానీ, నిజం అయితే తెలియదు. ఇలా వందల కోట్లు ప్రశాంత్ కిషోర్ కి ఇచ్చిన జగన్, ప్రశాంత్ కిషోర్ కి సన్నిహితుడు అయిపోయారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య కాలంలో జాతీయ రాజకీయాల పై దృష్టి పెట్టారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకు బీహార్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పని చేసారు. అలాగే ప్రధాని మోడి కోసం కూడా గతంలో పని చేసారు. ఇప్పుడు తాను గెలిపించిన ఇన్ని రాష్ట్రాలు ఉండటంతో, ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలు పై ఫోకస్ పెట్టారు. ఎక్కడ చేడిందో ఏమిటో కానీ, మోడిని దించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందు కోసం కాంగ్రెస్ పార్టీ వద్దకు వెళ్లి ప్రతిపాదన పెట్టారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో మీటింగ్ పెట్టుకున్నారు.

pk 25012022 2

అయితే ఈ ప్రతిపాదన మాత్రం వర్క్ అవుట్ అవ్వలేదు. ఈ క్రమంలోనే ప్రత్యామ్న్యాయం వైపు ప్రశాంత్ కిషోర్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్, నిన్న ఎన్డీటీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుత రాజకీయాలు గురించి, అడిగిన యాంకర్, మీరు బీజేపీ అజేంట్ అని అందరూ అంటున్నారు, దీని పై మీ సమాధానం ఏమిటి అని అడగగా, అలా ఎందుకు అంటున్నారు ? నేను గెలిపించిన జగన్ మోహన్ రెడ్డి, బీజేపీ పై ఎలాంటి పోరాటం చేయటం లేదు కాబట్టి, నేను బీజేపీ అజేంట్ అనుకుంటున్నారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి, బీజేపీ పై ఎలాంటి పోరాటం చేయటం లేదు అని చెప్పటమే కాదు, జగన్ వల్ల తనని బీజేపీ అజెంటు అనుకుంటున్నారు అంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రశాంత్ కిషోర్ చెప్పకపోయినా, జగన్ మొహన్ రెడ్డి, ఎలాంటి పోరాటాలు చేయటం లేదు అని తెలుసు అనుకోండి.

Advertisements

Latest Articles

Most Read