ఆంధ్రప్రదేశ్ లో వైకాపా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందంటే వాటిలో ముఖ్య కారణం ఆనాడు జగన్ ఇచ్చిన హామీలే. అందులో అతి ముఖ్యమైనది క్రిస్టియన్ చర్చిలు ఫాదర్ లకు తాము అధికారం లోకి రాగానే 5 వేలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు అర్హులో జాబితా తయారు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఆ చర్చి ఫాదర్ ల జాబితా విడుదల చేసారు . కాని ప్రభుత్వం విడుదల చేసిన ఈలిస్టు షాక్ కు గురిచేసింది. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్ధికంగా వెనుక బడిన చర్చి పాస్టర్లకు గౌరవ వేతనం కింద 5 వేలు ఇస్తామని ఎలక్షన్స్ టైం లో హామీ ఇచిన సంగతి తెలిసిందే. ఐతే ఏకంగా 16 వేల పాస్టర్లు ఈ గౌరవ వేతనం పొందటం కోసం అప్లై చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తుల్లో ఎంతమంది అర్హులో తేల్చమని గ్రామా సచివాల వాలంటీర్లకు ఈ పని అప్పచెప్పింది. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దీని కోసం 16 వేల మంది దరఖాస్తు చేయగా కేవలం 500 మందినే అర్హులుగా తేల్చారు. అయితే ఈ పధకానికి అర్హత పొందాలంటే ప్రభుత్వం పెట్టిన షరతులు ఇవే .. ఆ చర్చికి మినిస్ట్రీస్ రిజిస్టేషన్ ఉండాలట. మరొకటి ఆ చర్చి ఉన్న స్థలంకు ఆ సొసైటీ పేరు ఉండాలట. ఆఖరిది ఆ చర్చి పాస్టర్ కి వేరే ఇతర ఆదాయాలు ఉండకూడదట.

pastors 27012022 2

ఈ కారణాలు చూపిస్తూ వైసిపి ప్రభుత్వం కేవలం 500 మందినే ఈ పధకానికి అర్హులుగా తేల్చింది. దీనితో కేవలం 500 ఇవ్వటంతో షాక్ అయ్యారు. ప్రభుత్వం పైన పాస్టర్లు ఒత్తిడి తెస్తున్నారు. దీనితో మళ్ళి నిభందనలు మార్చే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో కానీ, మరో హామీ గాలిలోకి కలిసి పోయేలా ఉంది. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి, ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూ, అన్ని హామీలను గాల్లో కలిపేస్తున్నాడు. ఈ ఏడాది ఇవ్వాల్సిన అమ్మ ఒడి ఇప్పటికీ ఇవ్వలేదు. జూన్ లో ఇస్తామని అంటున్నారు. ఇక ఉద్యోగులకు పెట్టిన షాక్ అయితే మామూలు షాక్ కాదు. రెండు చేతులతో ఓట్లు వేసిన వారికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా పాస్టర్ లు. జగన్ గెలుపులో పాస్టర్లు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ పాస్టర్లకు కూడా జగన్ షాక్ ఇచ్చారు. ఆర్ధిక కష్టాలో, మరే కష్టాలో కానీ, 16 వేల మంది ఎక్కడ, 500 మంది ఎక్కడ ? మరి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రభుత్వం నిబంధనలు మార్చి, వీరి సంఖ్య పెంచుతుంది ఏమో చూడాలి మరి.

కులాల మధ్య, ప్రాంతాల మధ్య కుంపట్లు పెట్టటంలో వైసిపీ పార్టీది మాస్టర్ గేం. ఇప్పుడు కుటుంబాలు మధ్య కూడా పెడుతున్నారు. గతంలోనే ఇలా పెట్టిన చరిత్ర ఉన్నా, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టింది. ఇందు కోసం వైసీపీ సోషల్ మీడియా పేటీయం బ్యాచ్ ని రంగంలోకి దింపారు. ఈ పేటీయం బ్యాచ్, పై నుంచి వచ్చిన ఆదేశాలు ప్రకారం, రంగంలోకి దిగారు. కొత్త జిల్లాల విభజనలో, విజయవాడ ప్రాంతాన్ని, ఎన్టీఆర్ జిల్లాగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ వింత ఏమిటి అంటే, ఎన్టీఆర్ జిల్లాలో, ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు లేకపోవటం. సరే ఇది పక్కన పెడితే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ కొత్త హడావిడి మొదలు పెట్టింది. సోషల్ మీడియాలో, జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేసింది వైసీపీ. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు, జగన్ మోహన్ రెడ్డికి థాంక్స్ ఎందుకు చెప్పరు అంటూ, గోల గోల చేయటం మొదలు పెట్టారు. ఎన్టీఆర్ పేరు వాడుకుని సినిమాల్లో పైకి వచ్చావ్, అలాంటి ఎన్టీఆర్ కి జగన్ ఇంత గౌరవం ఇస్తే, ఎందుకు థాంక్స్ చెప్పటం లేదు అంటూ వైసీపీ సోషల్ మీడియా ఊదర గొడుతుంది. ఇందంతా ఒక ప్లాన్ ప్రకారం, organized గా జరుగుతున్న క్యంపైన్ అని చూసిన వారికి అర్ధం అవుతుంది. దీని వెనుక వైసీపీ వ్యూహం కూడా ఉంది.

jagan 27012022 2

ఇలా ఎన్టీఆర్ పేరు వాడుకుని, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి, ఎన్టీఆర్ ని ట్రాప్ లోకి లాగాలని వైసీపీ చూస్తుంది. ఇలా చేస్తే, ఒక వేళ ఎన్టీఆర్ రియాక్ట్ అయి, జగన్ కు ధన్యవాదాలు చెప్తే, ఎన్టీఆర్ ఫాన్స్ కి, తెలుగుదేశం పార్టీకి, మధ్య గ్యాప్ తీసుకుని రావచ్చని, ప్లాన్ వేసినట్టు అర్ధం అవుతుంది. అయితే ఎన్టీఆర్ ఏమి తెలివి తక్కువ వాడు కాదు కదా, ఆయన ఎందుకు రియాక్ట్ అవుతారు ? అయితే వైసీపీ సోషల్ మీడియా, ఎన్టీఆర్ ని టార్గెట్ చేయటంతో, తెలుగుదేశం పార్టీ ఫాన్స్ కూడా రంగంలోకి దిగారు. ముందు వైఎస్ఆర్ ని నాలుగు తిట్టి, అప్పుడు జగన్ ని పొగుడుతాం అని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో, డొమెస్టిక్ టెర్మినల్ కు నాడు వైఎస్ఆర్ సియంగా ఉండగా, ఎన్టీఆర్ పేరుని తీసి వేసి, ఎన్టీఆర్ పేరు పెట్టం అని తెగేసి చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మీకు ఏమి ఎన్టీఆర్ మీద ప్రేమ లేదులే, గతంలో వైఎస్ఆర్ , ఎన్టీఆర్ ని ఎలా టార్గెట్ చేసే వారో తెలియదా, ముందు దానికి ఏమి చెప్తారు అంటూ, కౌంటర్ లు వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య అగాధం ఏర్పడిన సంగతి తెలిసిందే. రెండు చేతులు, రెండు కాళ్ళతో, జగన్ కు ఓటు వేశామని, ఉద్యోగులు చెప్తూ ఉంటారు. అలాగే జగన్ మొదటి సారి సచివాలయం వచ్చిన సందర్భంలో, జై జగన్ అంటూ నినాదాలతో, ఉద్యోగులు హోరెత్తించిన సంగతి ఇప్పటికీ అందరికీ గుర్తుంది. అయితే రెండేళ్ళకే బొమ్మ తిరగబడింది. పీఆర్సి అద్భుతంగా ఇస్తారని అనుకుంటే, గతం కంటే తక్కువ జీతాలు ఇచ్చారు. ఇంకా రకరకాల లెక్కలు చూపించి, కొంత మంది ఉద్యోగులు ఎదురు తమకే కట్టాలని ప్రభుత్వం చెప్పినట్టు చెప్తున్నారు. దీంతో, ఇప్పుడు ఉద్యోగులు సమ్మె బాట పడుతున్నారు. అంత కంటే ముందు, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం ఉద్యోగుల పై ఎదురు దా-డి మొదలు పెట్టింది. మరీ ముఖ్యంగా చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఉద్యోగులను టార్గెట్ చేస్తూ, మేము ప్రజా ప్రతినిధులగా జీతం తీసుకోమని, మీరు మా లాగా జీతం తీసుకోకుండా పని చేస్తారా అని చాలెంజ్ చేసారు. దీనికి ఉద్యోగులు వైపు నుంచి గట్టిగా కౌంటర్ పడింది. మా ఆస్తులు మీకిస్తాం, మీ ఆస్తులు మాకు ఇవ్వండి, ఈ ఆందోళన కూడా ఆపేసి, మీరు చెప్పినట్టే ఉచితంగా పని చేస్తాం అని కౌంటర్ ఇచ్చారు. మరి దీనికి శ్రీకాంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన కంపెనీ అమరరాజా కంపెనీ. ఇక్కడ దాదాపుగా పది వేల మంది వరకు పని చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఈ కంపెనీతో అనేక మందికి రిలేషన్ ఉంటుంది. అయితే ఈ కంపెనీ తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ది కావటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ కంపెనీ పైన కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. దానికి తగ్గట్టే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో, ఏకంగా అమరరాజా కంపెనీ మూసి వేయించాలని ప్రభుత్వం, ఆదేశాలు జారీ చేసింది. ముఖ్య కారణంగా, అక్కడ గ్రామస్తులు, అలాగే ఉద్యోగుల రక్తంలో లెడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుందనే ఆరోపణలు చేసారు. దీని పైన అమరరాజా కంపెనీ కోర్టుకు వెళ్ళింది. ప్రభుత్వ నోటీసులు పైన స్టే ఇచ్చిన హైకోర్టు, ప్రభుత్వాన్ని బ్లడ్ సంపుల్స్ ఇవ్వమని అడిగింది. అయితే నెలలు గడుస్తున్నా, ప్రభుత్వం ఆ నివేదిక ఇవ్వటానికి ఎందుకో సాకులు వెతుక్కుంటుంది. హైకోర్టు వార్నింగ్ ఇచ్చినా, నిన్న జరిగిన వాయిదాలో, రిపోర్ట్ ఇంకా రాలేదని చెప్పారు. దీంతో అమరరాజా తరుపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రభుత్వం కావాలనే ఇలా చేస్తుందని, కావాలనే తమను ఇరికించే ప్రయత్నంలో భాగంగానే తప్పుడు రిపోర్ట్ లు సృష్టించే పనిలో పడింది అంటూ, కోర్టు ముందు వదానలు వినిపించారు.

hc 26012022 2

ప్రభుత్వ తరుపు న్యాయవాది, ఈ రిపోర్ట్ లను ఐఐటి మద్రాస్ వారు ఇవ్వాల్సి ఉందని, అయితే కోవిడ్ కారణంగా, ఇప్పటి వరకు కుదరలేదని, అందుకే ప్రైవేటు సంస్థలతో టెస్ట్ రిపోర్ట్ లు చేపిస్తున్నాం అని చెప్పగా, అమరరాజా తరుపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసారు. రాష్ట్రం బయట ఉన్న సంస్థలతోనే రిపోర్ట్ తయారు చేపించాలని, ప్రభుత్వం తమ పైన కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని తెలిపారు. అయినా దాదాపుగా ఏడాది కావస్తున్నా, ఇప్పటి వరకు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వక పోవటం వెనుక, అక్కడ ఏమి లేదని తేలటంతోనే, ప్రభుత్వం తప్పుడు నివేదకలు కోసమే, జాప్యం చేస్తుందని కోర్టు ముందు వాదించారు. దీంతో హైకోర్టు, వచ్చే వాయిదాకి తమ ముందు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని, లేని పక్షంలో కేసు మెరిట్స్ ఆధారంగా తాము నిర్ణయం ప్రకటిస్తాం అంటూ, కేసుని వాయిదా వేసింది. అయితే ప్రభుత్వం ఈ విషయంలో ఇరుకున పడిందా అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అమరరాజాకి వ్యతిరేకంగా ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవటంతోనే, ప్రభుత్వం వెనకడుగు వేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Advertisements

Latest Articles

Most Read