జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై, తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో బలమైనది ఒకటి ఉంది. అది ఏమిటి అంటే, జగన్ మోహన్ రెడ్డి ఫేక్ అని. ఇందుకు తెలుగుదేశం పార్టీ అనేక ఉదాహరణలు చెప్తుంది. అయితే ఇప్పుడు తాజాగా మరో ఉదాహరణ తెలుగుదేశం పార్టీ లేవనెత్తింది. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన అతి పెద్ద హామీ, పెన్షన్ మూడు వేలు చేస్తాను అని. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత, అది మర్చిపోయారు. అదేమిటి అంటే, ఏడాదికి రూ.250 పెంచుతాను అంటున్నారు. సరే పోనీ, అలా అయినా చేసారా అంటే, మూడో ఏడాది వస్తున్నా, ఆ ఊసే లేదు. ఇప్పుడు ఎట్టకేలకు మూడో ఏడాది రూ.250 పెంచుతున్నారు. రేపటి నుంచి ఈ పెంపు వస్తుంది. సరి ఇక్కడ వరకు బాగానే ఉంది. ఏదో ఒకటి ఇస్తున్నారు. అయితే ఇక్కడ చేస్తున్న ప్రచారంలో మాత్రం, అప్పట్లో చంద్రబాబు వెయ్యి రూపాయలు ఇచ్చాడు, నేను వచ్చిన తరువాత రూ.2250 ఇచ్చాను అని నిస్సిగ్గుగా అబద్ధం ఆడుతున్నారు. కొత్త ఏడాది కూడా కొత్త అబద్ధంతో మొదలు పెడుతున్నారు. చంద్రబాబు రూ.200 పెన్షన్ ని, అయుదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేసారు. తరువాత దాన్ని రెండు వేలు చేసారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం, చంద్రబాబు వెయ్యి రూపాయలే ఇచ్చారు అంటూ, కొత్త అబద్ధం మొదలు పెట్టారు.

jagan 31122021 2

ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు, వంచనలు, దారుణాలతో ముగిసిందని, రాబోయే కొత్తసంవత్సరంలోకూడా ఆయన తనదైనశైలిలో ప్రజలను వంచించడం, వారిని లూఠీ చేయడం వంటి కార్యక్రమాలనే కొనసాగిస్తున్నాడని, రూ.3వేల పింఛన్ ఇస్తానని అవ్వాతాతలను మూడేళ్లపాటు నిర్విరామంగా మోసగించిన జగన్మోహన్ రెడ్డి, 2022లో కూడా తనవాగ్ధానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడని టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరా వు స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలే కరులతో మాట్లాడారు. "అధికారంలోకి వస్తే రూ.3వేల పింఛన్ ఇస్తానని చెప్పి అవ్వాతాతలను నిలువునా వంచించిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక అబ్బెబ్బే తాను అలా అనలేదని బుకాయించి, కేవలం రూ.250లు మాత్రమే పెంచి, సామాజిక పింఛన్లను రూ.2250కే పరిమితం చేశాడు. మూడేళ్లపాటు 2,250రూపాయలేఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఈ జనవరి నుంచి దాన్ని రూ.250లు పెంచి, రూ.2,500లు ఇస్తున్నట్లు ప్రకటించాడు. జగన్మోహన్ రెడ్డి రేపటినుంచి ఇవ్వబోయే పింఛన్లకు కోట్లాది రూపాయల సొమ్ముని ప్రచారానికి తగలేశాడు. తొలినాళ్లలో రూ.250లు పెంచామనిచెప్పి చేసిన ప్రచారానికి, ఇప్పుడు చేస్తున్న ప్రచారానికి చేసిన ఖర్చుని అవ్వాతాతలకు ఇచ్చిఉంటే, ఆయన గతంలో ఇచ్చినట్లుగా రూ.3వేల పింఛన్ వాగ్ధానాన్ని నిలబెట్టుకునేవాడు. సొమ్ముపెంపులో వాగ్ధానాన్ని నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి, పింఛన్ లబ్ధిదారుల సంఖ్యలో మాత్రం ఏటేటా కోతపెడుతున్నాడు." అని అన్నారు.

కులం కులం కులం... దేశంలో మొత్తం అనేక రాష్ట్రాల్లో, ప్రజలకు అభివృద్ధి కంటే , కులమే ఎక్కువ. కులం ఉంటే చాలు. ఏమి అవసరం లేదు అన్నట్టుగా ఉంటారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కొంత ఎక్కువే. అందుకే ప్రశాంత్ కిషోర్ లాంటి వారికి, కులం కుంపట్లు పెట్టి చలి కాచుకోవటం బాగా ఈజీ అయిపొయింది. సాంప్రదాయ పార్టీలకు భిన్నంగా వచ్చిన లోక్ సత్తా పార్టీ, అడ్డ్రెస్ లేకుండా పోయింది. తరువాత జేడీ లక్ష్మీ నారయణ వచ్చారు. ఆయనే ఏ పార్టీ పెట్టకపోయినా, ఆయన అంటే ఒక మంచి అభిప్రాయం ప్రజల్లో ఉంది. గతంలో జనసేన నుంచి పోటీ చేసినా, ప్రస్తుతం ఆయన ఒక మేధావిలా, అన్ని విషయాల పైన తన అభిప్రాయాలు తెలియ చేస్తూ, ఆయన పంధాలో ఆయన వెళ్తున్నారు. అయితే ఇంత మంచి పేరు ఉన్న జేడీ లక్ష్మీనారాయణ కూడా, కులానికి లొంగి పోయారు. రెండు రోజుల క్రితం కాపు నాయకులు అందరూ కలిసి కూర్చున్న సమావేశంలో, జేడీ లక్ష్మీనారాయాణ కూడా కనిపించటం పలువురిని ఆశ్చర్య పరిచింది. రాజకీయాల్లో కాపులు బలపడాలి అనే అజెండాతో జరిగిన సమావేశంలో, జేడీ పాల్గునటం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇలాంటి వాళ్ళు కూడా, ఇలాంటి కుల మీటింగ్లలో పాల్గుంటే, ఇక ఈ రాష్ట్రం, కుల పిచ్చ నుంచి ఎప్పటికి బయటకు వస్తుందో అని బాధ పడుతున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ని వంగవీటి రాధా కోరినట్టు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం చంద్రబాబు అమరావతి వస్తున్నారు. రేపు చంద్రబాబు నివాసం వద్దే, వంగవీటి రాధా, చంద్రబాబుని కలిసే అవకాసం ఉందని చెప్తున్నారు. రాధా పై రెక్కీ నిర్వహించారని తెలియగానే, విదేశాల్లో ఉన్న చంద్రబాబు, రాధాకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతే కాదు, రాధా సెక్యూరిటీని తిప్పి పంపటం పై చంద్రబాబు ఆక్షేపిస్తూ, సెక్యూరిటీని ఉంచుకోవాలని, పరిస్థితి బాగాలోదని, రాష్ట్రంలో కుట్ర రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పారు. దీంతో ఈ రోజు చంద్రబాబు అమరావతి వస్తూ ఉండటంతో, రాధా రేపు చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాసం ఉందని తెలుస్తుంది. జరిగిన పరిణామాలు మొత్తం, రాధా , చంద్రబాబుకి వివరించే అవకాసం ఉంది. ఇక పోతే, విచారణ ప్రారంభించిన పోలీసులు, రాధా నివాసం ప్రాంతంలో, అనుమానస్పద కారుని గుర్తించారు. ఒకే రోజు అటూ ఇటూ మూడు నాలుగు సార్లు కారు సంచరించినట్టు గుర్తించారు. ఆ కారు పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఉద్యోగ సంఘాల మధ్య ప్రభుత్వం చర్చలు ఇంకా ఇంకా ఇంకా సాగుతూనే ఉన్నాయి. గతానికి భిన్నంగా ఉద్యోగ సంఘాలు వేడుకునే ధోరణిలో ప్రభుత్వం ముందు మోకరిల్లారు. ఈ రోజు కూడా ప్రభుత్వం ముందు చర్చలకు వెళ్ళారు. చర్చలు తరువాత ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేసారు.  ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఉద్యోగుల జీతాలకు 33 శాతం ఖర్చు పెడుతున్నారని, కానీ వందశాతమని చెప్పడం సరికాదని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలే ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇచ్చాయని ప్రభుత్వం అంటోందని అన్నారు. ప్రభుత్వ తీరు దుర్మార్గంగా ఉందని, తమ సమస్యలు ఏమి పరిష్కరించటం లేదని అన్నారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను యథావిధిగా అమలు చేయాలని ఆయన తెలిపారు. ఎన్నిసార్లు చర్చలకు పిలిచి అవమానించినా వస్తూనే ఉన్నాం అని అన్నారు. ఈ విధమైన చర్చలు గతంలో ఎప్పుడూ జరగలేదని, తమను సీఎం దగ్గరకు తీసుకెళ్తే ఆయనతోనే మా సమస్యలు చెప్పుకుంటాం అని అన్నారు. రూ.6 వేల కోట్లు సీపీఎస్ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలు ఉన్నాయని, మాకు డబ్బులు ఇవ్వకుండానే ట్యాక్స్‌లు కట్ చేసుకున్నారని అన్నారు. ట్యాక్సులు కట్ చేసుకోడానికే డీఏ ప్రకటించారని సంచలన వ్యాఖ్యలు చేసారు. పీఆర్సీతో పాటు సీపీఎస్ రద్దుపై సీఎం స్పష్టత ఇవ్వాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేసారు.

Advertisements

Latest Articles

Most Read