నీటిపారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు అన్నివిధాలుగా వార్తల్లో వ్యక్తి. ఇప్పుడు మరో విషయంలోనూ అంబటిపై అందరి దృష్టి పడింది. అంబటిపై సొంత నియోజకవర్గంలో, సొంత పార్టీ వైసీపీ నుంచే అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. ఇవి ఏకంగా సత్తెనపల్లి సీటుకే ఎసరు పెట్టే స్థాయికి చేరాయి. సత్తెనపల్లి వైసీపీ నేత చిట్టా విజయభాస్కర్ రెడ్డి పార్టీ ఆత్మీయ సమావేశం పెట్టి అంబటి పేరు ప్రస్తావించకుండానే వైసీపీకి డ్యామేజ్ చేస్తున్నవాళ్లు ఎంత పెద్దవాళ్లయినా లెక్కచేయమంటూ వ్యాఖ్యానించారు. సత్తెనపల్లిలో బలమైన కేడర్ తనకు ఉందని, వచ్చే ఎన్నికలకు సత్తెనపల్లి టికెట్ తనకే ఇవ్వాలని విజయభాస్కర్ రెడ్డి ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. మరోవైపు సత్తెనపల్లికి చెందిన వైసీపీ నేత సయ్యద్ మాబుకు విభేదాలు మంత్రి అంబటి రాంబాబుకి విభేదాలు తీవ్రం అయ్యాయి. దీంతో మాబు కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంబటి రాంబాబుతో అంటీముట్టనట్టు ఉంటున్నారు. దీంతో మాబు పార్టీ వీడుతారని ప్రచారం సాగుతోంది. ఇటీవలే టిడిపిలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లిలో వైసీపీ నేత సయ్యద్ మాబు ఇంటికి వెళ్లారు. సత్తెనపల్లి రాజకీయాలపై మాబుతో కన్నా చర్చలు జరిపారని సమాచారం. ఓ వైపు కీలక నేత టికెట్ రేసులో ఉన్నానని ప్రకటించడం, మరోవైపు మరో కీలక నేత పార్టీ వీడేలా కనిపిస్తుండడంతో అంబటికి సత్తెనపల్లిలో చెక్ పెట్టే దిశగా వైసీపీ అసంతృప్తులు పావులు కదుపుతున్నారు. అంబటి రాంబాబుకి సొంత పార్టీ నుంచే ఎదురవుతున్న ఇబ్బందులు తమకి ప్లస్సుగా మార్చుకునే వ్యూహంతో టిడిపి చురుగ్గా తమ వ్యూహాన్ని అమలు చేస్తోంది.
news
వైసీపీలో రెడ్డి సామాజికవర్గ మంత్రులు, ఎమ్మెల్యేలు, చంద్రబాబు పై ఎందుకు విమర్శలు చేయటం లేదు ? వ్యూహం మార్చారా ?
ఏ శాఖ సమాచారమైనా ప్రభుత్వం నుంచి ప్రకటించేది సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డే. సీఎం ప్రతినిధిగా, మంత్రుల తరఫునా ఆయనే మీడియా ముందుకొస్తారు. ప్రతిపక్ష నేతల ఆరోపణలకీ ఆయనే వివరణ ఇస్తారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రకటనలన్నీ చూసుకునేది సజ్జలే. ఇటీవల కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి టోన్ డౌన్ అవుతూ వస్తోంది. మీడియా ముందుకు మళ్లీ నానీలను వదులుతున్నారు. మంత్రివర్గం నుంచి తప్పించిన తరువాత కూడా కొడాలి నాని, పేర్ని నానిలు ప్రత్యేక ప్రెస్మీట్లు పెడుతున్నారు. సబ్జెక్టుతో సంబంధంలేకుండా విపక్షాలని బూతులు తిట్టాలంటే కొడాలి నానీ మీడియా ముందుకు తీసుకొస్తోంది వైసీపీ. కాపులు, జనసేన గురించి విమర్శలు గుప్పించాలంటే పేర్ని నాని వస్తున్నారు. మంత్రులంతా ఆల్మోస్ట్ మ్యూట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. రెడ్డి సామాజికవర్గ మంత్రులైతే నోరు మెదపడంలేదు. సీఎం జగన్ రెడ్డి కూడా సభలకు వెళ్లినప్పుడు ముసలి చంద్రబాబు, దుష్టచతుష్టయం, పేదలతో ప్రయాణం, పెత్తందారులతో యుద్ధం వంటి డైలాగులూ ఆపేశారు. గత కొద్దిరోజులుగా మంత్రి పదవులు లేకపోయినా వైసీపీ మీడియా-సోషల్ మీడియా నానీల బైట్లతోనే ఫీడ్ నడుపుతోంది.
పేర్ని నాని "గే" వ్యాఖ్యలు.. తిరిగి వైసీపీకే తగులుకోవటంతో వైసీపీ షాక్...
తనతో నలభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఇటీవల వ్యాఖ్యానించారు. మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి పేర్ని నానిని ఇదే విషయమై మీడియా ప్రతినిధులు అడిగారు. వైసీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడికి టచ్‌లో ఉన్నారట కదా అని ప్రశ్నించారు. దీనిపై పేర్నినాని ఘోరమైన గే భాషతో సమాధానం ఇచ్చారు. అచ్చెన్నాయుడుతో టచ్‌లో ఉండడానికి ఆయన ఏమైనా గే అని ఎదురు ప్రశ్నించారు. టచ్‌లో ఉంటే మా దగ్గర ఉన్న స్క్రాప్‌ని తీసుకెళ్లు, మగాళ్లు-మగాళ్లు ఎందుకు టచ్‌లో ఉంటారంటూ పేర్నినాని అసహనం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని అచ్చెన్నాయుడు అంటే గే అని వక్రభాష్యం చెప్పిన పేర్నినాని, వైసీపీకి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తమతో టిడిపి ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని గతంలోనూ, తాజాగానూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వేరే పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవాలంటే టీడీపీ నుంచి ఇద్దరు మినహా మిగిలిన వారంతా సిద్దంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. టిడిపి ఎమ్మెల్యేలతో టచ్‌లోకి వెళ్లిన వైసీపీ నేతలంతా పేర్ని నాని లాజిక్ బట్టి గేలే అవుతారు. టిడిపిని క్లీన్ స్వీప్ చేస్తానని అప్పుడు, వైసీపీ గేట్లు ఎత్తితే చంద్రబాబు, అచ్చెన్నాయుడు తప్పించి అంతా తమ వైపు వచ్చేస్తారని ప్రకటించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్ని నానీ భాషలో గే అయి ఉండాలి మరి అంటున్నారు టిడిపి నేతలు. వైసీపీ నలుగురు టిడిపి ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి, ఇప్పుడు టిడిపి తమ ఎమ్మెల్యేలు నలుగురిని కొనుగోలు చేసిందని వాపోవడం చూస్తుంటే..తాము చేస్తే సంసారం, ఎదుటోళ్లు చేస్తే వ్యభిచారం అన్న చందంగానే ఉంది. పేర్ని నాని గే వ్యాఖ్యలు తిరిగి వైసీపీకే తగులుతున్నాయి.
వైసీపీపై టిడిపి ప్రతీకారం తీర్చుకునే ఐడియాలు పోలీసులే ఇస్తున్నారా ?
వైసీపీ అధికారంలోకి వచ్చిన నుంచీ తీవ్రమైన నిర్బంధం ఎదుర్కొంటోంది, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ. ప్రతిపక్షనేత చంద్రబాబు నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకూ ప్రభుత్వ ప్రేరేపిత హిం-సకు బాధితులే. వైసీపీ అరాచక వాదానికి పోలీసులే సూత్రధారులుగా మారుతున్నారు. తమపై దా-డులు జరిగిన ప్రతీసారి టిడిపి నేతలు తప్పుడు కేసులు బనాయించే పోలీసులు, పెట్టిస్తున్న వైసీపీ నేతలకి వడ్డీతో సహా చెల్లిస్తామంటూ వార్నింగ్‌లు ఇస్తూనే ఉన్నారు. అయినా వైసీపీ బరితెగింపు తగ్గడంలేదు. అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ ఎంతగా బరితెగించి అందరినీ బాదేయవచ్చో పోలీసులే వైసీపీ సర్కారులో పైలట్ ప్రాజెక్టులా అమలు చేసి టిడిపికి అందిస్తున్నారు. తాము టార్గెట్ చేసే టిడిపి సానుభూతిపరుల దగ్గర దగ్గర గంజాయి, పో-ర్న్ వీడియోలు దొరకడం అనే ప్రమాదకర ఎత్తుగడని వైసీపీ పోలీసుల ద్వారా అమలు చేసింది. టిడిపి అధికారంలోకి వస్తే ఇది వైసీపీ మీద ఇదే పోలీసుల్ని వాడి ప్రయోగించే బ్రహ్మాస్త్రం కానుంది. చంద్రబాబుపై చెప్పులు విసిరి, ఆయనపై బస్సుని రాళ్లతో కొడితే..అప్పటి డిజిపి భావప్రకటన స్వేచ్ఛ అని చెప్పుకొచ్చారు. ఇది టిడిపి అమ్ములపొదిలో ఒక అస్త్రం. చంద్రబాబు ఇంటి మీదకు ఎమ్మెల్యే జోగి రమేష్ దా-డికొస్తే వినతిపత్రం ఇవ్వడానికి అని కవర్ చేసిన పోలీసులు...రేపు వైసీపీ నేతల ఇళ్ల మీదకు టిడిపి వాళ్లు ఎటాక్ వెళితే ఇలాగే మీడియాకి వివరించాల్సిన పరిస్థితిని పోలీసులే సృష్టించారు. బీజేపీ నేత సత్యకుమార్ కారుపై రాళ్లతో కొడితే.. దానికి పోలీసులు ఉన్నతాధికారులు చెప్పిన సూత్రం...రాబోయే కాలంలో టిడిపి నిరసనలు తెలిపేందుకు ఓ అస్త్రం కానుంది.