బీజేపీ పెద్ద‌లు పిలుపుతో హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లిన‌ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి వీడ్కోలు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింద‌ని టాక్ వినిపిస్తోంది. ఇటీవ‌ల ఢిల్లీ కేంద్రంగా జ‌రిగిన ఏపీ నేత‌ల భేటీలు వీర్రాజు ప‌ద‌వికి ఎస‌రు పెట్టాయ‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. రెండుసార్లు జ‌గ‌న్ రెడ్డి ప్ర‌ధాని మోదీ, షాల‌ని క‌లిసినా..ఆయ‌న మిత్రుడైన సోము వీర్రాజు ప‌ద‌వికి ఎటువంటి ఢోకా లేకుండా పోయింది. ఆ త‌రువాతే కీల‌క‌మైన భేటీలు వీర్రాజు వీడ్కోలుకి మార్గం చూపాయ‌ని అంటున్నారు. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీజేపీ పెద్ద‌ల‌తో భేటీ అయ్యారు. అనంత‌రం మాజీ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరారు. బీజేపీలో ఈ ఇద్ద‌రి నేత‌ల ప్ర‌భావం సోము వీర్రాజుపై త‌ప్ప‌క ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులతో పాటు పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు.. ఇటీవల.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ బీజేపీ పెద్దలను కలిసి ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంత‌రం మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ రెండు భేటీలు సోము వీర్రాజు ప‌ద‌వికే ఎస‌రు పెట్టాయ‌ని క‌మ‌ల‌నాథుల అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో వ్య‌క్తం అవుతోంది.

కొడుకు లోకేష్ ఓ ప‌క్క సెల్ఫీ చాలెంజుల‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే..తండ్రి చంద్ర‌బాబు కూడా రంగంలోకి దిగి సెల్ఫీ చాలెంజ్ విసిరి వైసీపీపై పొలిటిక‌ల్ ఎటాక్ గ‌ట్టిగానే చేస్తున్నారు. కౌంట‌ర్ ఎలా ఇవ్వాలో తెలియ‌క వైసీపీ బ్రాండ్ అయిన ఫేక్ ప్ర‌చారంతో వ‌చ్చింది. టిడిపి చంద్ర‌బాబు సీఎంగా క‌ట్టిన టిడ్కో ఇళ్లు తేదీల‌తో స‌హా పోస్ట్ చేసి కౌంట‌ర్ ఎ టాక్ బాగానే చేసింది. నెల్లూరు జిల్లాకి చెందిన మంత్రి కాకాని టిడ్కో ఇళ్ల వ‌ద్దు కాదు, ప్ర‌తీ ఇంటి వెళ్లి అడుగుదాం ర‌మ్మంటూ చంద్ర‌బాబుకి స‌వాల్ విస‌ర‌డంతో ఓట‌మిని ఒప్పుకున్న‌ట్టే అయ్యింది. చంద్రబాబు టిడిపి జోన్ -4 సమావేశంలో పాల్గొనేందుకు నెల్లూరు వెళ్తూ టిడిపి ప్రభుత్వ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్ల ముందు సెల్ఫీ దిగి  జగన్ రెడ్డికి సవాల్ చేశారు. తమ హయాంలో ఇన్నిఇళ్లు కట్టామని మీ హయాంలో ఏం కట్టాలో చెప్పాలన్నారు. చంద్ర‌బాబు సెల్ఫీ చాలెంజ్ ఎటాక్ ఊహించ‌లేని వైసీపీ కిందిస్థాయి కేడ‌ర్ నుంచి టాప్ లీడ‌ర్ వ‌ర‌కూ అవాక్క‌య్యారు. ముందుగా రంగంలోకి దిగిన సోష‌ల్ మీడియా ఫేక్ మార్ఫింగ్ పోస్టుల‌తో కౌంట‌ర్ ఇచ్చామ‌ని మురిసిపోయింది. అయితే టిడిపి సోష‌ల్ మీడియా వైసీపీ ఎస్ఎం పోస్టు చేసిన ప్ర‌తీ పోస్టు డిటైల్డ్‌గా టిడిపి ప్ర‌భుత్వంలో తేదీలు, ఒరిజిన‌ల్ ఫోటోల‌తో వేసి వైసీపీ ఫేక్ బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులు వితండ‌వాదంతో వ‌స్తున్నారే కానీ, ఇళ్లు క‌ట్టిన చాలెంజ్ స్వీక‌రించ‌లేక చేతులెత్తేశారు.

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌ర‌డుగ‌ట్టిన ఫ్యాక్ష‌నిస్టు మ‌న‌స్త‌త్వం అని ఆయ‌న‌కి ద‌గ్గ‌ర‌గా ఉండి, వేగ‌లేక దూర‌మైన వారు చెప్పే మాట‌. ఏదైనా క‌ష్ట‌ప‌డి సంపాదించాల‌ని అనికాకుండా కొట్టేయాల‌నే మెంటాలిటీ అని వారే చెబుతుంటారు. తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని చేసిన అవినీతి సొమ్ముతో సాక్షి పెట్టి ఈనాడుని కొట్టేయాల‌నుకున్నారు. 15 ఏళ్ల‌యినా అది సాధ్యంకాలేదు. జీవిత‌కాలంలో సాధ్యం కాదు. తాను చేసిన దొంగ‌ప‌నుల‌కు సీబీఐ-ఈడీలు ఏ1గా పేర్కొన్నాయి. అయితే తన అక్ర‌మాస్తుల కేసులో వార్త‌లు రాసేట‌ప్పుడు ఈనాడు మీడియాలో ఏ1గా రాసేవారు. అలాగే అవినీతి కేసుల‌న్నీ లోతుగా విశ్లేషిస్తూ ప్ర‌త్యేక క‌థ‌నాలు రాసింది ఈనాడు. దీంతో ఈనాడుపై క‌క్ష క‌ట్టిన జ‌గ‌న్ రెడ్డి ఇన్నాళ్ల‌కి త‌న చేతికి అధికారం రావ‌డం, కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల అండ‌దండ‌లుండ‌డంతో రామోజీరావుని మార్గ‌ద‌ర్శి కేసులో అరెస్టు చేయించాల‌ని సీఐడీని వ‌దిలారు. 86 ఏళ్ల రామోజీరావు అనారోగ్యంతో మంచం ప‌ట్టి ఉంటే, ఆయ‌న‌ని సీఐడీ విచారిస్తున్న ఫోటోలు త‌న మీడియా ద్వారా బ‌య‌ట‌కి పంపి వికృతానందం పొందారు. ఇంత చేసిన జ‌గ‌న్ రెడ్ది క‌క్ష తీర‌లేదు. రామోజీరావు ఏ1, ఆయ‌న కోడ‌లిని ఏ2 చేసేశారు. అయితే వారిని ఎలాగైనా అరెస్టు చేయాల‌నే క‌సితో ఉన్నారు జ‌గ‌న్ రెడ్డి. అయితే మార్గ‌ద‌ర్శిలో చిట్స్ వేసిన వారి ప్ర‌యోజ‌నాల కోసం అంటూ ఎవ్వ‌రూ ఫిర్యాదు చేయ‌క‌పోయినా రాష్ట్ర‌మంతా మార్గ‌ద‌ర్శి బ్రాంచీల‌పై దాడులు చేసి, బ్రాంచీలు మూసేసి, బ్రాంచి మేనేజ‌ర్ల‌ను అరెస్టు చేయించారు జ‌గ‌న్ రెడ్డి. అయితే వేల మంది మార్గ‌ద‌ర్శి ఖాతాదారుల‌లో ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా త‌మ సొమ్ము తిరిగి ఇవ్వాల‌ని కానీ, త‌మ‌ని చిట్స్ పేరుతో మోస‌గించార‌ని ఈ రోజువ‌ర‌కూ ఫిర్యాదులూ ఇవ్వ‌లేదు. రోడ్డెక్కి ఆందోళ‌న చేయ‌లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే, చిట్స్ ఎప్ప‌టి నుంచి వేస్తారో, వేస్తే త‌మ‌ని స‌భ్యులుగా చేర్చుకోవాలంటూ ఉద్యోగులు-వ్యాపారులు మార్గ‌ద‌ర్శి వారిని బ‌తిమాలుతున్నారు. రామోజీ పై ఎన్ని కుట్రలు చేసినా, ఒక్క ఖాతాదారు కూడా ముందుకు రాలేదు. సీఐడీ పేరుతో మార్గ‌ద‌ర్శిలో అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తే, ఖాతాదారులు ఒకేసారి వచ్చి, రామోజీ మీద పడాలని జగన్ కుట్ర ప‌న్నితే, ఒక్క ఖాతాదారుడు బ‌య‌ట‌కి రాలేదు.  రామోజీరావు మంచంపై ఉన్న‌ ఫోటోని బ‌య‌ట‌కి విడుద‌ల చేసి, ఆయన ఆరోగ్యం పోయింద‌ని, మీ డబ్బులు రావు అనే విధంగా జ‌నంలోకి ప్ర‌చారం చేయాల‌ని చూస్తే, అది కాస్తా విక‌టించింది. ఖాతాదారుల న‌మ్మ‌కాన్ని వ‌మ్ముచేయ‌ని రామోజీరావు మార్గ‌ద‌ర్శిగా నిలిచారు.

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ అనుమానితుడిగా ఉన్న క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి త్వ‌ర‌లో క‌డిగిన ముత్యంలా అన్న చెంత‌కి రావ‌డం ఖాయ‌మ‌ని ప‌రిస్థితులు స్ప‌ష్టం చేస్తున్నాయి. మూడుసార్లు విచారించిన సీబీఐ బాబాయ్ హ‌త్య‌కేసులో అబ్బాయ్ హ‌స్తంలో కీల‌క ఆధారాలు దొర‌క‌డంతో నేడో రేపో అరెస్టు చేస్తుంద‌నుకున్న ద‌శ‌లో సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి రెండుసార్లు ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్ షాతో భేటీ అయ్యారు. వెంట‌నే ద‌ర్యాప్తు అధికారిని మార్చాల‌ని అవినాష్ రెడ్డి కోర‌డం, సుప్రీంకోర్టు జ‌డ్జి కూడా ద‌ర్యాప్తు అధికారినే మార్చాల‌ని ప‌ట్టుబ‌ట్టి మార్చేశారు. అరెస్టు కావాల్సిన అవినాష్ రెడ్డి హాయిగా న‌వ్వుతూ, తుళ్లుతూ కేంద్ర‌మంత్రుల‌తో భేటీ అవుతున్నారు. కేంద్ర‌మంత్రి గ‌డ్క‌రీని క‌లిసి విన‌తి ప‌త్రం ఇచ్చి వ‌చ్చారు. ఇక సీబీఐ త‌న జోలికి రాద‌ని ఎవ‌రో గ‌ట్టిగా భ‌రోసా ఇచ్చిన‌ట్టున్నారు. టూర్లు మీద టూర్లు వేస్తున్నారు. త‌న అన్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి ఇంటికి కూడా చుట్ట‌పు చూపుగా వ‌చ్చి వెళ్లారు. సీబీఐ అవినాష్ రెడ్డి తండ్రిని కూడా విచార‌ణ‌కి పిలిచింది. ఆయ‌న వెళ్ల‌లేదు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామ‌ని కోర్టులో అఫిడ‌విట్ వేసింది. అదీ చేయ‌లేదు. అంటే అన్న జ‌గ‌న్ రెడ్డి రెండుసార్లు ఢిల్లీ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంత‌మైన‌ట్టేన‌ని, అవినాష్ రెడ్డి సేఫ్ అని వైసీపీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి

Advertisements

Latest Articles

Most Read