తిరుపతిలోని రుయాఆసుపత్రిలోజరిగిన ఘటనకు సంబంధించిన వాస్తవాలను బయటపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని, నిన్న ఘటన జరిగే సమయానికి ఎందరు రోగులుఆసుపత్రిలోఉన్నారు... అక్సిజన్ సరఫరాపై ఆధారపడి ఎందరు రోగులున్నారు...వారిలో ఎందరు చనిపోయారనే పూర్తి వివరాలను ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం...! ఘటనపై ముఖ్యమంత్రి ఏదో ఆరాతీశాడన్నట్లు రాత్రి ప్రసార మాథ్యమాల్లో వచ్చింది. రాష్ట్రం అల్లకల్లోలమవుతుంటే తనకేదో అనారోగ్యం ఉన్నట్లు ఆరోగ్యశాఖా మంత్రి నటిస్తున్నాడు. ఆయనేమో రుయా ఆసుపత్రి సూపరింటెండ్ కి ఫోన్ చేసి మాట్లాడినట్టు చెబుతున్నారు. నిన్న ఉదయమే ఆసుపత్రిలో ఎంతవరకు ఆక్సిజన్ నిల్వలున్నాయి... ఎందరు రోగులున్నారు..ఉన్నవారికి ఆక్సిజన్ సరిపోతుందా లేదా అనేదానిపై రుయా ఆసుపత్రి సిబ్బంది ఎందుకు దృష్టిసారించలేదు? ప్రభుత్వం మొద్దునిద్ర పోవడంవల్లే ఇంతటి దారుణ ఘటన జరిగింది. రాత్రే కలెక్టర్ ఘటనా స్థలికి వెళ్లి, 11మంది చనిపోయారని చెప్పాడు. కొన్ని పత్రికలు, న్యూస్ ఛానళ్లవారేమో రాత్రంతా అక్కడే ఉండి దాదాపు 22మంది చనిపోయినట్టు చెప్పారు. ఇటువంటి అనేక సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యతప్రభుత్వంపై ఉందా లేదా? జరిగిన హ-త్య-ల-కు ప్రభుత్వం కారణమా...కాదా? ఇంతవరకు రాష్ట్రంలో అనేక ఘటనలు ఇదేమాదరి జరిగాయి. విజయనగరంలో తొలి ఘటన జరిగినప్పుడే, ప్రభుత్వం మేల్కొని ఉంటే, నిన్న రుయా ఘటనజరిగేదా? ప్రభుత్వ మొద్దునిద్ర, పాలకులు నిర్లక్ష్యం వల్లే నిన్న రుయా ఆసుపత్రిలో మరణాలు సంభవించాయి. నిన్నేమో ప్రభుత్వ ప్రత్యేకసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏదేదో చెబుతున్నాడు. ప్రజలప్రాణాలు కాపాడమని ప్రతిపక్షం మొత్తుకుంటుంటే, ప్రతిపక్షనేతలపై కేసులుపెట్టండి..చంద్రబాబుపై కేసులు పెట్టండంటూ, తీవ్రమైన నిరాశానిస్పృహలతో సజ్జల మాట్లాడుతున్నాడు.

ప్రతిపక్షనేతలపై, పత్రిలకవారిపై రాజద్రోహం కింద కేసులు పెడతారా? సజ్జల రామకృష్ణారెడ్డిని సలహాదారుగా నియమించి 24నెలలు అవుతోంది. ఈ 24నెలల్లో ఆయనిచ్చిన సలహాలు ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి. ఆయనగానీ, ముఖ్యమంత్రి గానీ ప్రజల ఆరోగ్యంపై తొలినుంచీ శ్రద్ధ పెట్టిఉంటే, నిన్న రుయా ఘటన జరిగేదా? విజయనగరం ఘటన జరిగినప్పుడే, సజ్జల మంచి సలహాలు ఇచ్చిఉంటే, నిన్న అంతమంది చనిపోయేవారా? ప్రతిపక్షనేతలపై, పత్రికలపై కేసులు పెట్టాలంటున్న సజ్జల, నిన్న జరిగిన ఘటనపై ఎవరిమీద కేసులు పెడతాడో సమాధానం చెప్పాలి. ప్రజల చావులకు కారణమవుతున్న ముఖ్యమంత్రిపై కేసులుపెట్టాలా? లేక ఆయనకు సలహాలిస్తున్న సజ్జలపై పెట్టాలా? తనకేమీ సంబంధంలేదన్నట్లు వ్యవహరిస్తున్న ఆరోగ్యశాఖామంత్రిపై కేసు పెట్టాలా? లేక రుయాఆసుపత్రి సిబ్బందిపై పెట్టాలో సజ్జ లే చెప్పాలి. వ్యాక్సిన్లకోసం ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని సజ్జల ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈరోజుకి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షమందికి రెండోవిడత వ్యాక్సిన్లు ఇవ్వాలి. ఎన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి... రోజుకి ఎందరికి వ్యాక్సిన్లు వేస్తున్నారనే సమాచారాన్ని ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడంలేదని ప్రశ్నిస్తున్నా. క-రో-నా రెండోదశ ఆరంభమైనప్పటినుంచీ ఆక్సిజన్ లేక, పడకలు దొరక్క, వెంటిలేటర్లు లేక చెట్లకింద, రోడ్లపైన, బస్టాండ్ లలో రోగులు చనిపోతున్నారు. అటువంటి దుస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వంకాదా?

క-రో-నా రెండోదశ మొదలైనప్పటినుంచీ సంభవించిన మరణాలకు ముఖ్యమంత్రిని, సజ్జల రామకృష్ణారెడ్డిని, ఆరోగ్యశాఖామంత్రిని బాధ్యులను చేసి, వారిపైనే హ-త్యా-య-త్నం కేసులుపెట్టాలి. రుయా ఘటనలో సంభవించిన మరణాలపై ప్రభుత్వం, ముఖ్యమంత్రే బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వపెద్దలు, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూకూడా స్పైడర్ సినిమాలో విలన్ పాత్రధారిలా చావులను చూసి ఆనందిస్తున్నారు. ప్రజలు చస్తే ఛస్తారులే తమకేం సంబంధమన్నట్లు ముఖ్యమంత్రి, ప్రభుత్వపెద్దలు వ్యవహరిస్తున్నారు. రుయా ఆసుపత్రి రికార్డులు ప్రకారం నిన్న ఆసుపత్రిలో 135 మంది రోగులున్నారు. వారిలో ఎందరు చనిపోయారు...ఎందరు అస్వస్థతకు గురై, చావుబతుకులమధ్యన కొట్లాడుతున్నారు... మరణించిన వారి పేర్లేమిటనే వివరాలను ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నా. రుయా ఘటనకు నైతికబాధ్యత వహిస్తూ, ఇంతటి అసమర్థ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడా? లేక ఆయనకు సరైన సలహాలు ఇవ్వని సజ్జల రాజీనామా చేస్తాడా? ఆరోగ్యశాఖా మంత్రి రాజీనామా చేస్తాడో చెప్పాలి. ఆసుపత్రి సిబ్బంది వల్లే ఘటన జరిగిందని చెప్పి, చివరకు ఈప్రభుత్వం వారిని బలిచేస్తుందేమో చూడాలి. చనిపోయినవారి కుటుంబాలకు రూ.5లక్షలు, రూ.10లక్షలిచ్చి చేతులు దులుపుకోవడం ఈప్రభుత్వానికి అలవాటుగా మారింది. మరణాలు సంభవించకుండా చూడాల్సిన ప్రభుత్వం, వాటికి రేట్లు కట్టడమేంటి?

తిరుపతిలోని రుయాఆసుపత్రిలో సంభవించిన మరణాలన్నీ ప్రభుత్వనిర్లక్ష్యం వల్ల జరిగిన హ-త్య-లే-న-ని, వాటికి ముఖ్య మంత్రే బాధ్యుడని ఆయనపై తక్షణమే హ-త్యా-య-త్నం కేసులు పెట్టాలని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ రుయాఘటనపై తీవ్ర విచారం వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచో ట మరణాలు సంభవిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ల పంపిణీలో 5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం దేశంలోనే 28వ స్థానంలో నిలిచిందన్నారు. వ్యాక్సిన్ల నిల్వలో మరీహీనంగా ఆంధ్రప్రదేశ్ సున్నాకు పడిపో యిందని పట్టాభిరామ్ కేంద్రప్రభుత్వ గణాంకాలతో సహా ప్రజలముందుంచారు. ఆయన విలేకరుల సమావేశం వివరాలు "తొలిదశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేవలం 10.86శాతం మాత్రమే వ్యాక్సినేషన్ అందించారు. వ్యాక్సిన్ల పంపిణీలో రాష్ట్రం 28వస్థానంలో ఉండటానికి ఈ ముఖ్యమంత్రి కారకుడు కాడా? 5కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో నిన్నఒక్కరోజు కేవలం 2003 మందికి మాత్రమే వ్యాక్సిన్లు ఇస్తారా? నిన్న ఉదయానికి రాష్ట్రంలో 73లక్షల8వేల217 వ్యాక్సిన్లు పూర్తిచేస్తే, ఈరోజు ఉదయానికి 73లక్షల10వేల220.. అంటే కేవలం 2003 మందికి మాత్రమే వ్యాక్సినేషన్ చేశారు. ఈ మాట మేం చెప్పడంకాదు.. కేంద్ర ప్రభుత్త్వ లెక్కలే చెబుతున్నాయి. మీకులాగా దొంగలెక్కలు చెప్పడంలేదు. జగన్ రెడ్డి జీతగాడేమో రోజుకి 6లక్షల వ్యాక్సిన్లు ఇస్తున్నట్టు, దేశంలో జగన్మోహన్ రెడ్డే వ్యాక్సిన్ పంపిణీలో టాప్ లోఉన్నట్లు కబుర్లు చెబుతున్నాడు. వాస్తవాలు ఎవరికీ తెలియవనుకుంటున్నావా సజ్జలా? నిన్న ఒక్కరోజే వ్యాక్సిన్ పంపిణీలో పొరుగు రాష్ట్రాలు ఎలా ఉన్నాయో ఎలాఉన్నాయో చూడండి. తెలంగాణ 93వేలమందికి, తమిళనాడు 87వేలు, కర్ణాటక లక్షా03వేలు, కేరళ లక్షా07వేలమందికి, మహారాష్ట్ర 2లక్షల94 వేలమందికి, రాజస్థాన్ లక్షా83వేలు, ఉత్తరప్రదేశ్ లక్షా66వేలమందికి, గుజరాత్ 2లక్షల34వేలమందికి వ్యాక్సిన్లు ఇచ్చింది. ఏరాష్ట్రం చూసినా రోజుకి లక్షా, 2లక్షలవ్యాక్సిన్లు ఇస్తుంటే, ఈ దిక్కుమాలిన ప్రభుత్వం నిన్నటికి నిన్న కేవలం 2003మందికి ఇస్తుందా?

సిగ్గుందా మీకుఅసలు? ప్రజల ప్రాణాలు వందల్లో పోతుంటే, వ్యాక్సిన్లు 2వేలమందికి ఇస్తారా? ఇంకా తగుదనమ్మా అంటూ ప్రతిపక్షాలపై కేసులు పెట్టమంటారా? ఈ చేతగాని, దద్దమ్మ ప్రభుత్వ పని తీరు ఎలాఉందో ప్రజలుకూడా తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ మై.జీవోవీ.ఇన్ ట్విట్టర్ అకౌంట్ లో చూస్తే నిన్న ఉదయానికి ఏపీలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు (0.11.) ఆల్ మోస్ట్ గుండుసున్నా. వ్యాక్సిన్లు రాష్ట్రంలో ఎక్కడా ఏంలేవు. నిన్న ఉదయానికి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు సున్నా. అదే పొరుగురాష్ట్రాలనుచూస్తే, తెలంగాణలో 4లక్షల12వేలు, తమిళనాడు 8లక్షల70వేలు, కర్ణాటక 4లక్షల12వేలు, మహారాష్ట్ర 8లక్షల32వేలు, ఒడిశా 4లక్షల06వేలు, మధ్యప్రదేశ్ 6లక్షల60వేల వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకున్నాయి. ఆఖరికి చిన్నరాష్ట్రాలైన ఈశాన్యరాష్ట్రాలు మనకంటే ముందు న్నాయి. నాగాలాండ్ లక్ష డోసులు నిల్వచేసుకుంది. మణిపూర్ లక్షా45వేలడోసులు, మిజోరం కూడా 63వేల డోసుల వ్యాక్సిన్లు, అస్సాం 2లక్షల78వేల వ్యాక్సిన్లు అందుబాటులో పెట్టుకున్నాయి. ఏపీలో మాత్రం వ్యాక్సిన్ నిల్వలుసున్నా మాత్రమే. ఇదేనా ఈముఖ్యమంత్రి ముందుచూపు? ప్రతిదానికి కేంద్రంపై నిందలేసే జగన్ రెడ్డి ఈ వాస్తవాలపై ఏంసమాధానం చెబుతాడు? పొరుగురాష్ట్రాల్లో లక్షలకొద్దీ వ్యాక్సిన్లు నిల్వఉంటే, ఏపీలో ఎందుకు లేవు? వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు ఆర్డర్లు పెట్టలేదు కాబట్టే, రాష్ట్రంలోఉన్న వ్యాక్సిన్లు గుండుసున్నా. జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడానికి కారకులుఎవరు? ఇన్ని వాస్తవాలు బయటపడ్డాక కూడా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడానికి జగన్ రెడ్డికి ఏం అర్హతఉంది? ఏఏ రాష్ట్రంలోఎన్ని వ్యాక్సిన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయో కేంద్రప్రభుత్వ ట్విట్టర్ అకౌంట్ చాలాస్పష్టంగా చెబుతోంది.

నేనేమీ గాలిపోగేసి గాలికబుర్లు చెప్పడం లేదు సజ్జల లాగా. వాస్తవంగా రాష్ట్రపరిస్థితి ఏమిటో కేంద్రప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. నిన్నఅనేకరాష్ట్రాలు లక్షల్లో వ్యాక్సిన్లు పంపిణీచేస్తే, మనరాష్ట్రంలో కేవలం రెండువేలు మాత్రమే ఇచ్చారు. అనేకచోట్ల నిన్న నో వ్యాక్సిన్ బోర్డులే దర్శనమిచ్చాయి. తొలిదశవ్యాక్సిన్ల పంపిణీలో జనాభానిష్పత్తిప్రకారం చూస్తే రాష్ట్రం 28వస్థానంలో ఉంది. అదీ ఈముఖ్యమంత్రి పనితీరు. వ్యాక్సిన్లు కొనుగోలు చేయడు.. వాటికి ఆర్డర్ పెట్టడు.. కొనడానికి నిధులివ్వడు. ప్రతిపక్షనేతలపై దాడులు చేయడం..కేసులుపెట్టడం... వారిని జైళ్లకుపంపడం మాత్రం కచ్చితంగాచేస్తాడు. ఆక్సిజన్ లేక ప్రజలంతా అకారణంగా చనిపోతుంటే, కేసులతో బెదిరిస్తారా? రుయా ఆసుపత్రిలో సంభవించిన మరణాలకు పూర్తిబాధ్యత ముఖ్యమంత్రే వహించాలి. గతంలో అనేకఘటనలు జరిగినా తన నిర్లక్ష్యాన్ని వీడకుండా, ప్రజలను మాయమాటలతో మోసగించాడు. ముఖ్యమంత్రి తనపదవికి రాజీనామాచేస్తే, కేంద్రం మొత్తం వ్యవస్థలను తనఅధీనంలోకి తీసుకొని ప్రజలప్రాణాలు కాపాడుతుంది. ప్రజలకు మాయ మాటలు చెబుతూ, వారిప్రాణాలు తీస్తున్న జగన్ రెడ్డిపై తక్షణమే హత్యాయత్నం కేసుపెట్టాలి. మహారాష్ట్ర ముందస్తు చర్యలు తీసుకొని, వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలుస్తోంది. దేశంలో వ్యాక్సిన్లన్నీ అయిపోయాక ముఖ్యమంత్రి ఇప్పుడు గ్లోబల్ టెండర్లు పిలుస్తామంటున్నాడు. రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలు చేసే అవకాకాశాన్ని కేంద్రం ఏప్రియల్ 26న ఇచ్చిందే. అంతర్జాతీయంగా కూడా వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవచ్చని కేంద్రం చెప్పింది వాస్తవంకాదా? అలాంటప్పుడు ఈ ముఖ్యమంత్రి ఆదిశగా ఎందుకు ఆలోచించలేదు? వ్యాక్సినేషన్ ప్రక్రియ మొత్తం అయిపోయాక గ్లోబల్ టెండర్లు గుర్తొచ్చాయా ఈ ముఖ్యమంత్రికి? ఇప్పటివరకు ఈ ముఖ్యమంత్రి గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవలేదు?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై గుంటూరులో మరో కేసు నమోదు అయ్యింది. గుంటూరుకు చెందిన న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ గుంటూరు అరండల్‌పేట పోలీసులు స్టేషన్ లో, చంద్రబాబుతో పాటు, కొంత మంది తెలుగుదేశం నేతల పైన కూడా ఆయన ఫిర్యాదు చేసారు. తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు, కొంత మంది టిడిపి నేతలు మీడియా సమావేశాల్లో పదే పదే  N440K వైరస్ ప్రమాదకరంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను పదే పదే  చెప్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు, దీంతో ఇతర రాష్ట్రాలు కూడా మన ప్రజలను కట్టడి చేస్తున్నాయని, ఇదంతా చంద్రబాబు, టిడిపి నేతలు చేసిన తప్పుడు ప్రచారం అంటూ ఆయన ఫిర్యాదులో తెలిపారు. పచ్చల అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు, కొద్ది సేపటి క్రితం కేసు కూడా నమోదు చేసారు. కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. 188, 505(1)b, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఇప్పటికే ఇదే అంశం పై, కర్నూల్ లో కేసు పెట్టించారు. ఇప్పుడు తాజాగా గుంటూరులో కూడా మరో కేసు పెట్టించారు. ఇప్పటికే కర్నూల్ పోలీసులు చంద్రబాబుకు నోటీసులు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా, ఎందుకో వెనక్కు తగ్గారు. ఇప్పుడు వ్యూహం మార్చి, గుంటూరులో ఎందుకు కేసు పెట్టించారో చూడాలి...

రెండు రోజుల క్రితం, కడప జిల్లాలోని మామిళ్లపల్లె ముగ్గురాళ్ల గనిలో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో దాదాపుగా పది మంది కూలీలు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసులో అనూహ్యంగా ఒక కీలక వ్యక్తని పోలీసులు అరెస్ట్ చేయటం సంచలనం కలిగిస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి పెదనాన్న అయిన ప్రతాప్‌రెడ్డి. వైఎస్ కుటుంబానికి చెందిన ప్రతాప్ రెడ్డి ఈ కేసులో అడ్డంగా దొరికిపోవటంతో, తప్పించుకునే అవకాసం దక్క లేదు. దీంతో, ఆయన్ను పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేసారు. వైఎస్‌ అవినాష్‌రెడ్డికి పెదనాన్న , వైఎస్ ప్రతాప్‌రెడ్డిని అరెస్ట్ చేసి, పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. అయితే ఈయన అరెస్ట్ కు ప్రధాన కారణం, జిలెటన్‌ స్టిక్స్‌ సప్లయ్ చేయటం. మామిళ్లపల్లె ముగ్గురాళ్ల గనిలో ఉపయోగించిన, జిలెటన్‌ స్టిక్స్‌ ని పులివెందుల నుంచి, వైఎస్ ప్రాతప్ రెడ్డి తీసుకుని వెళ్లినట్టు, ఆధారాలు దొరకటంతో, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయక తప్ప లేదు. వైఎస్ ప్రతాప్ రెడ్డికి పులివెందులలో మ్యాగజైన్‌ లైసెన్స్‌ నుంచి, ముగ్గురాళ్ల గనికి జిలెటన్‌ స్టిక్స్‌ ని తరలించారు. ఈ జిలెటన్‌ స్టిక్స్‌ తరలించే సమయంలో నిబంధనలు తుంగలోకి తొక్కి, ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టలేదు.

blast 11052021 2

చివరకు పది మంది చనిపోవటానికి కారణం అయ్యారు. ఈ అభియోగంతోనే, ఆయన్ను అరెస్ట్ చేసారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి, పెదనాన్న అయిన వైఎస్ ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయటంతో, ఈ అంశం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వైఎస్ ప్రతాప రెడ్డికి, కడపలోని అనేక ప్రాంతాల్లో గనులు ఉన్నాయని. అక్కడ ఉపయోగించే జిలెటన్‌ స్టిక్స్‌ను, ఆయనకు ఉన్న మ్యాగజైన్‌ లైసెన్స్‌ ఉపయోగించి, ఈ జిలెటన్‌ స్టిక్స్‌ను మామిళ్లపల్లె గనులకు తరలించారు. అయితే ఈ క్రమంలోనే, అక్కడ సరైన ఏర్పాట్లు చేయక పోవటం, ఇష్టం వచ్చినట్టు అన్ లోడ్ చేసే క్రమంలో, పెద్ద పే-లు-డు సంభవించింది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న కూలీలు పది మందికి పైగా చనిపోయారు. ఇక్కడ గని యజమాని అయిన నాగేశ్వర్‌రెడ్డిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా, పది మందికి పైగా ప్రాణాలు కోల్పోవటం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా వార్త అవ్వటం, ప్రతిపక్షాలు ఆందోళన చేయటంతో, అరెస్ట్ చేయక తప్పలేదు.

Advertisements

Latest Articles

Most Read