తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న చంద్రబాబు, ఈ రోజు రావూరులో ఎన్నికల ప్రచారం చేసారు. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు.. సీఎం పదవి తనకు కొత్త కాదు.. తన రికార్డు ఎవ్వరూ బద్దలు కొట్టలేరు.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.. తిరుపతి ఉప ఎన్నికల ద్వారా మంచి తీర్పును ఇచ్చి పనబాక లక్ష్మిని మంచి మెజార్టీతో గెలిపించుకుందాం.. మీ ఉత్సాహం, - కేరింతలు చూస్తుంటే కడుపు నిండిపోతుందని అన్నారు.. పార్లమెంట్లో టీడీపీ బలాన్ని పెంచే విధంగా అడుగులు వేద్దాం.. కక్ష్య సాధింపులతో నీచమైన పరిపాలన అందిస్తూ ఆకాశంలో తిరుగుతున్న జగన్ రెడ్డికి బుద్ధి చెప్పి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాల్సిన సమయం ఆసన్నమయ్యిందని చంద్రబాబునాయుడు తెలుగు తమ్ముళ్లకు పిలుపును ఇచ్చారు. భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న జగన్ రెడ్డికి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఎన్నికలకు ముందు జగన్‌ రెడ్డి ఏ ఒక్కరిని వదిలి పెట్టకుండా ముద్దులు పెట్టి అధి కారంలోకి వచ్చిన తర్వాత పిడిగుద్దులు గుద్దుతూ పాలన సాగిస్తున్నారన్నారు. అందరినీ వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఓ వైపు క-రో-నా కారణంగా ఆదాయం తగ్గిపోయి అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతుంటే ధరలు మోత మోగిస్తూ నీచ పరిపాలన సాగిస్తున్న జగన్ రెడ్డి అమ్మ ఒడి ద్వారా రూ 15వేలు తల్లి ఖాతాలో వేసినాన్న బుడ్డీరూ 30వేలు చేసి దోచుకుంటున్నారన్నారు. ప్రజలకు గోరంత ఇచ్చి కొండంత దోచుకుంటున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులను బ్రాందీషాపుల వద్ద ఉంచి మద్యం అమ్మకాలు సాగించిన జగన్‌ రెడ్డి గురువు పవిత్రతను అపవిత్రం చేశారన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏ విధంగా జరిగాయో అందరికీ తెలుసన్నారు.

సర్పంచ్ ఎన్నికలు సైతం ఏ విధంగా చేసుకున్నారో ప్రత్యక్షంగా చూశామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏది చెబితే పోలీసులు అది అమలు చేశారన్నారు. సొంత చిన్నాన్న వైఎస్ వివేక్ హ-త్య-కు గురైతే అప్పట్లో సాక్షి పత్రికలో గుండెపోటుతో చనిపోయాడని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారన్నారు. ఆ తర్వాత సాక్ష్యాలు తారుమారు చేశారన్నారు. ఆ సమయంలో వివేకనందరెడ్డి కుమార్తె తనకు ఫోన్ చేసి తమ నాన్న మృతిపై అనుమానాలు ఉన్నా యని చెప్పారన్నారు. గొడ్డలితో న-రి-కి చం-పి-చ-న-ట్లు-గా తేలిందన్నారు. ఆ నింద తనమీద వేసి జగన్‌రెడ్డి ఆరోపణలు చేశారన్నారు. ఇప్పటికీ చిన్నాన్నను చం-పి-న దోషులెవ్వరో తేల్చలేదన్నారు. సొంత చిన్నాన్నను చం-పి-న వ్యక్తులను కాపాడుతున్న జగన్ రెడ్డికి ప్రజలు ఓ లెక్క అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను అణగదొక్కాలని చూస్తే తిరుగుబాటు చేసి తగిన బుద్ధి చెబుతామన్నారు. క-రో-నాపై దృష్టి సారించని జగన్ రెడ్డి కక్ష్య సాధింపు చర్యలకు దిగడం నీచం అన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకున్న జగన్ రెడ్డి మిగిలిన సినిమాలను ఎందుకు అడ్డుకోలేదో వాటికి ఎందుకు రాయితీలు ఇచ్చారో చెప్పాలన్నా రు. పవన్‌ కళ్యాణ్ పై అంత కక్ష్య ఎందుకో చెప్పాలన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కక్ష్య సాధింపు చర్యలకు తాను పాల్పడి ఉంటే జగన్ రెడ్డి బయట కాలు పెట్టేవారు కాదన్నారు. సొంత పార్టీ ఎంపీ రఘు రామరాజు తనకు ప్రాణహాని ఉందని కేంద్రానికి లేఖ రాశారంటే జగన్ రెడ్డి ఎలాం టి పరిపాలన అందిస్తున్నారో ప్రజలంతా గమనించాలన్నారు.

నాసిరకం బ్రాందీలను ప్రజలచేత తాగించి దానికి మద్యపాన నిషేధమని పేరుపెట్టి ఆ మద్యం ద్వారా వేలకోట్లు సంపాదిస్తున్నారన్నారు. జగన్‌ రెడ్డి దోపిడి రాజ్యం కారణంగా 40 లక్షల మంది భవన కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా అన్న విషయాన్ని జగన్ రెడ్డికి గుర్తు ఉందా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధన కోసం తన పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. జగన్ రెడ్డి పరిపాలన పై చర్చకు సిద్ధం అని, ఎవరు వస్తారో రావాలని సవాల్ విసిరారు. ప్రతి ఒక్కరు ఆలోచన చేసి చరిత్రను సృషించే విధంగా తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పనబాక లక్ష్మిని నిండు మనస్సుతో ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షోకు వేలాదిగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావడంతో ఈ రోడ్ షో విజయ వంతం అయ్యింది. అయితే పెద్దిరెడ్డి సవాల్ కు చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. రాజకీయాలు కాదని, ప్రత్యేక హోదా కోసం, రాజీనామాలు చేయటానికి సిద్ధం అని, మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు.

మొన్నటిదాకా చంద్రబాబు ఆరు లక్షల కోట్లు తిన్నాడు, చంద్రబాబు ఆ స్కాం చేసాడు, చంద్రబాబు అమరావతి భూములు కాజేసాడు, ఇదీ, అదీ అంటూ హడావిడి చేసిన వైసీపీ ప్రభుత్వం, ఒక్క రూపాయి అవినీతి కూడా ఇప్పటి వరకు చంద్రబాబు పై నిరూపించలేక పోయింది. అమరావతి భూములు పై కేసు నమోదు చేయగా, దాన్ని కోర్టు స్టే కూడా ఇచ్చింది. దీంతో ఎలాగైనా చంద్రబాబు పై కేసు నమోదు చేయాలి అనుకున్నారో ఏమో కానీ, మళ్ళీ చంద్రబాబు పై ఇంకో కేసు నమోదు చేసారు. అదే సోషల్ మీడియాలో టిడిపి ఏదో పోస్ట్ చేసిందని, ఎస్సీ, ఎస్టీ కేసు. ఆశ్చర్యపోతున్నా ఇది నిజం. ఒక మాజీ ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు సియంగా చేసిన వ్యక్తి, 40 ఏళ్ళు ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి పై, సోషల్ మీడియాలో టిడిపి ఏదో పోస్ట్ చేసిందని, ఏకంగా ప్రభుత్వమే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయటం ఆశ్చర్యకరం. చంద్రబాబుతో పాటుగా, మాజీ మంత్రి నారా లోకేష్ పై కూడా కేసు నమోదు అయ్యింది. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు అయ్యింది. వినటానికి సిల్లీగా ఉన్నా, ఇది వాస్తవం. చంద్రబాబు పై, ఈ కేసు ఏమిటి అంటూ, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు కూడా ఆశ్చర్య పోతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగుదేశం పార్టీ అఫిషియల్ ఫేస్బుక్, ట్విట్టర్ ఎకౌంటు లో, తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ఒక పోస్టింగ్ పడింది.

cbn 11042021 2

అందులో తిరుపతి వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి, జగన్ మోహన్ రెడ్డి కాళ్ళు ఒత్తుతున్న ఫోటో ఒక వైపు, పెద్దిరెడ్డి కాళ్ళు ఒత్తుతున్న ఫోటో ఒక వైపు పెట్టి, పాద సేవ చేసే వారు కావాలా, ప్రశ్నించే వారు కావాలా అంటూ, పోస్టింగ్ వేసారు. అయితే దీని పై స్పందించిన వైసీపీ దళిత ప్రజా ప్రతినిధులు, ఈ పోస్టింగ్ పై డీజీపీకి ఫిర్యాదు చేసారు. వెంటనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలని, డీజీపీకే కంప్లైంట్ ఇచ్చారు. దీని పై విచారణ చేసిన పోలీసులు, కేసు నమోదు చేసారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. అయితే దీని పై తెలుగుదేశం పార్టీ భగ్గుమంది. జగన్ మోహన్ రెడ్డి కాళ్ళు, గురు మూర్తి ఒత్తుతున్న ఫోటో, వారే కదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, అలాగే గురుమూర్తి, పెద్దిరెడ్డికి కడు ఫిజియో చేస్తారని తెలిసింది, ఇందులో తప్పు ఏముంది, మేము అదే వేసాం అని టిడిపి అంటుంది. ఏదైనా ఉంటే, ఆ ఫోటో బయటకు వదిలిన జగన్ మోహన్ రెడ్డి పై కేసు పెట్టాలని టిడిపి వాదిస్తుంది. చంద్రబాబు లక్షల కోట్లు దోచారు అని ప్రచారం చేసి, చివరకు ఇలాంటి కేసులు పెడుతున్నారని వాపోయారు.

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గునబోవటంలేదని, ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. క-రో-నా కారణంగా రాలేకపోతున్నా అంటూ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే అంతకు ముందు జగన్ మోహన్ రెడ్డి సభకు మంచి హైప్ ఏర్పడింది. లోకేష్ చేసిన చాలెంజ్ కు జగన్ ఏమి సమాధానం చెప్తారా అని అందరూ వైట్ చేసారు. అయితే అనూహ్యంగా, క-రో-నా సాకుతో జగన్ మోహన్ రెడ్డి, పర్యటన రద్దు చేసుకున్నారు. అయితే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా, రేపు జరగబోయే తిరుపతి సభకు రావటం లేదని తెలుస్తుంది. ఇప్పటి వరకు అధికారింగా దీని పై చెప్పకపోయినా, ఇప్పటికే పవన్ హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు, జనసేన ప్రకటించింది. దీంతో పవన్ కళ్యాణ్ కూడా రేపు సభకు రావటం లేదనే అనుకోవాలి. నిజానికి రేపు నెల్లూరు జిల్లా నాయుడు పేటలో, పవన్ సభ ఉంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్ష్యుడు జేపీ నడ్డా కూడా వస్తున్నారు. ఇదే మీటింగ్ లో పవన్ కూడా పల్గునవలసి ఉంది. పవన్ కళ్యాణ్, నడ్డా కలిసి రోడ్ షో చేసి, మీటింగ్ పెడతారని, దీన్ని భారీ ఎత్తున చేయాలని బీజేపీ భావించింది. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు, జనసేన పార్టీ నుంచి, కొద్ది సేపటి క్రితమే ప్రెస్ నోట్ విడుదల అయ్యింది.

pavan 11042021 2

ఈ ప్రెస్ నోట్ లో, పవన్ కళ్యాణ్ మ్యానేజర్లు, సెక్యూరిటీతో పాటుగా వ్యక్తిగత సిబ్బందిలో చాలా మందికి క-రో-నా వచ్చిందని తెలిపారు. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, డాక్టర్ల సూచన మేరకు, పవన్ కళ్యాణ్ కూడా, హోం క్వారాన్టైన్ లో ఉంటున్నారని ఆ ప్రకటన లో తెలిపారు. గత వారం రోజులుగా పవన్ చుట్టూ ఉండే ఒక్కోక్కరూ క-రో-నా బారిన పడుతూ వస్తున్నారని ఆ ప్రెస్ నోట్ లో తెలిపారు. వీరు పవన్ కు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులని తెలిపారు. దీంతో ముందు జాగ్రత్తగానే పవన్ కళ్యాణ్ కూడా క్వారన్టైన్ లోకి వెళ్లిపోయారని తెలిపారు. అయితే పవన్ రోజు వారీ విధులు నిర్వహిస్తున్నారని, పార్టీ కార్యకలాపాలు కూడా చూస్తున్నారని, టెలి కాన్ఫెరెన్స్ ద్వారా పార్టీ ముఖ్యులతో మాట్లాడుతున్నారని తెలిపారు. అయితే ఈ విషయం తెలియటంతో, బీజేపీ డీలా పడింది. రేపు జరగబోయే ఎన్నికల ప్రచారానికి పవన్ రావటం ఇక అసాధ్యమే అని తెలియటంతో, రేపు పవన్ లేకుండా, కేవలం బీజేపీ నేతలతో మీటింగ్ చేయనున్నారు.

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం హోరా హోరీగా జరుగుతుంది. అధికార వైసీపీ పార్టీ దూకుడు మీద ఉంటుందని అందరూ భావించినా, అనూహ్యంగా తెలుగుదేశం పుంజుకుంది. ఎన్నికల ప్రచారం మొత్తం టిడిపి డామినేట్ చేసింది. ఒక పక్క లోకేష్ దూకుడు, మరో పక్క చంద్రబాబు ఆలోచింప చేసే ప్రచారంతో, టిడిపికి బాగా ఊపు వచ్చింది. అటు పక్క వైసీపీ ప్రచారం కంటే, పోల్ మ్యానేజ్మెంట్ మీదే ఎక్కువ ఆసలు పెట్టుకున్నట్టు అర్ధం అవుతుంది. ఇక తెలుగుదేశం పార్టీ , తెలుగుదేశం నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తిరుపతి పార్లమెంటరీ తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, అవినీతి పాలనని అంతం చెయ్యాలని కోరుతూ ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు. వైసిపి ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడని, ఇసుక, సిమెంటు, ఐరన్ ధరలు విపరీతంగా పెంచేయడంతో కార్మికులు పనులు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలు ఒకసారి ఆలోచించి వైసిపికి బుద్ధి వచ్చేలా ఈ నెల 17వ తేదీన జరిగే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి పనబాక లక్ష్మిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరుతున్నారు.

peddireddy 11042021 2

టిడిపి దూకుడుతో, వైసీపీ లైన్ మార్చింది. ఈ రోజు పెద్దిరెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ గెలిస్తే, తమ ఎంపీలు అంతా రాజీనామా చేస్తారు, మేము గెలిస్తే మీ ఎంపీలు రాజీనామా చేస్తారా అంటూ, టిడిపికి ఛాలెంజ్ విసిరారు. అయితే ఈ చాలెంజ్ రాజకీయంగా ఉపయోగపడటం కంటే, ఇది వైసీపీకి బాగా డ్యామేజ్ చేసేది లాగా ఉంది. ఒక పక్క ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవటానికి, అందరం రాజీనామా చేద్దాం అని టిడిపి అంటుంటే దానికి వైసీపీ స్పందిచటం లేదు. ప్రత్యెక హోదా కోసం, రాజీనామాలకు రెడీ అని చంద్రబాబు అంటుంటే దానికి వైసీపీ స్పందించటం లేదు. పైగా, రాజీనామాల వల్ల ఏమి ఉపయోగం అంటూ విజయసాయి రెడ్డి, వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో, ప్రజా సమస్యల పై కాకుండా, రాజకీయాల కోసం పెద్దిరెడ్డి ఇలా చాలెంజ్ చేయటం, అది వైసిపీకి ప్లస్ కంటే మైనస్ అవుతుందని చెప్పాలి. ఇక మరో పక్క 5 లక్షల మెజారిటీ అని చెప్తున్న పెద్దిరెడ్డి, ఇప్పుడు టిడిపి గెలిస్తే అనే దాకా వచ్చారు అంటే, పరిస్థితి రోజు రోజుకీ ఎలా మారిపోతుందో అర్ధమవుతుందని, టిడిపి అంటుంది.

Advertisements

Latest Articles

Most Read