రాష్ర్ట ప్రజల ప్రతినిధిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ రాష్ర్ట్ర ప్రయోజనాలు కాపాడకపోగా తన కేసుల మాపీ కోసం రాష్ర్ట ఆర్దికమూలాలు దెబ్బతీస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి అన్నారు. బుధవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జగన్ లోపాయికారీ ఒప్పందాలతో రాష్ట్ర ఆర్దిక మూలాలు దెబ్బతీస్తున్నారు. నాడు చంద్రబాబు నాయుడు దేశ, విదేశాలు తెచ్చి రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకువస్తే, నేడు జగన్ ఒక్క కొత్త పరిశ్రమ తేకపోగా ఉన్నవాటిని అమ్మేస్తున్నారు. నాడు 32 మంది బలిదానాలతో ఏర్పాటైన విశాఖను తన స్వార్దప్రయోజనాల కోసం జగన్ తాకట్టు పెట్టడటం సిగ్గుచేటు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రతి అంశాన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పే చేస్తున్నామని కేంద్ర మంత్రులు పార్లమెంట్లో స్పష్టంగా చెప్పారు కానీ జగన్ రెడ్డి అండ్ కో.. మాత్రం మాకేమీ తెలియదంటూ మాట్లాడటం సిగ్గుచేటు. జనవరి 27 నే స్టీల్ ప్లాంట్ పై నిర్ణయం తీసుకున్నామని ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసని కేంద్రం చెప్పింది, కానీ ఆ తర్వాత జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను ఆపాలంటూ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎందుకు అడగలేదు? లేఖలు వల్ల ప్రయోజనం ఏంటి? ప్రధానితో నేరుగా ఫోన్ లో ఎందుకు మాట్లాడటం లేదు? విశాఖలో ఉవ్వెత్తున్న ఉద్యమం రుగులుతుంటే ముఖ్యమంత్రి, వైసీపీ నేతలు ఉద్యమానికి ఎందుకు మద్దతు తెలపటం లేదు? 25 మంది ఎంపీలు ఇస్తే ‍హోదా తెస్తామన్న జగన్ నేడు విశాక ప్రజల ఆత్మగౌరవ ప్రతీకైన విశాఖ ఉక్కును కేంద్రం అమ్ముతుంటే జగన్ నోరు ఎందుకు మెదపటం లేదు? పోస్కో కంపెనీని అడ్డుపెట్టుకుని , జగన్, విజయసాయిరెడ్డి స్టీల్ ప్లాంట్ ని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలకు తెలిసిపోయింది, ఇది వాస్తవం కాకపోతే కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదు?

28 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం కాకుండా అడ్డుకోలేరా? వైసీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామాకు ముందుకు రాటం లేదు? రాజీనామాల ద్వారా ఏం సాధించలేమని మంత్రి పెద్దిరెడ్డి చెప్పటం సిగ్గుచేటు. మీరు రాజీనామా చేస్తే ఉక్కు పరిశ్రమను కాపాడుకోవచ్చు, అన్ని రాజకీయపార్టీలు, కార్మికులు, ఉద్యోగులు ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు సిద్దంగా ఉన్నారు. రాష్ర్టంలో ఉన్న యువత, విధ్యార్దులు అందరూ కూడా ఏకమై విశాఖ ఉక్కును కాపాడుకోవాలి. నాడు స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో యువత, విధ్యార్ది ఉద్యమంలో కీలకపాత్రం పోషించారు, ఆ వారసత్వం నేడు కొనసాగించాల్సిన అవసరం ఉంది, విశాఖ ఉక్కును కాపాడుకోవాలన్న, రాష్టంలో జరుగుతున్న అరచాకాలకు అడ్డకోవాలన్నా, వైసీపీ దొంగనాటకాలకు పుల్ స్టాప్ పడాలన్నా విశాఖ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలి. యువత, విద్యార్ధులు వైసీపీ పాలనలో వైపల్యాల్ని, , పెరిగిన నిత్యవసరాలు, వైసీపీ అరచాకాలను ప్రజలకు వివరించి చైతన్యం చేసి టీడీపీకి ఓటు వేయించాలి, విశాఖలో రూ.70వేల కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన అదానీ డేటా సెంటర్, లులూ కన్వెన్షన్ సెంటర్ ఇతర రాష్ట్రాలకు తరలిపోవడానికి జగన్ రెడ్డి దుర్మార్గమైన జేట్యాక్స్ బెదిరింపులే కారణం. విశాఖ ఉక్కును అమ్మడానికి. వాళ్లెవరు, అమ్మేయమని చెప్పడానికి వీళ్లెవరు.? విజయసాయిరెడ్డికి డిల్లీలో పాదయాత్ర చసే దమ్ముందా, ఉద్యమంలో పెద్దన్న పాత్రపోషించాల్సిన ప్రభుత్వం స్వార్ద ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టాలని చూస్తే రాష్ర్ట్ర యువత చూస్తూ ఊరుకోరు. జగన్ ఇప్పటికైనా తాడేపల్లి ప్యాలె స్ నుంచి బయటకి వచ్చి అఖిలపక్షాన్ని డిల్లీ తీసుకెళ్లి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను అడ్డుకోవాలని బ్రహ్మం చౌదరి డిమాండ్ చేశారు.

టిడిపి అధినేత చంద్రబాబు, ఎన్నికలు జరుగుతున్న తీరు పై స్పందించారు. "మున్సిపల్ ఎన్నికలు నిస్పక్షపాతంగా జరిగితే గెలవలేమన్న భయం వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులను, ఓటర్లను భయపెడుతున్నారు. విశాఖపట్నంలోని ఏయూ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందన్న సమాచారంతో పరిశీలనకు వెళ్లిన టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును అరెస్టు చేయడం ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం. మచిలీపట్నం 13వ డివిజన్ లో టీడీపీ సానుభూతిపరుడు దినకర్ మీద వైసీపీ కార్యకర్తలు కత్తులతో దాడికి పాల్పడ్డారు. విజయవాడలో టీడీపీ అభ్యర్ధులను బెదిరించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను చూస్తుంటే.. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక వైసీపీ నేతల ప్రోద్భలంతోనే దాడులు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో టీడీపీ కార్యకర్త పసుపు చొక్కా వేసుకున్నందుకే అతణ్ణి పోలింగ్ కేంద్రంలోకి అనుమతించని పోలీసులు....వైసీపీ కార్యర్తలు పేట్రేగిపోతుంటే చోద్యం చూస్తూ కూర్చోవడం హేయం. వైసీపీ నేతలు కత్తులు, కర్రలతో పేట్రేగిపోతుంటే.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుండడం సరికాదు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి."

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరైనా ఏమైనా విమర్శలు చేస్తే, వాళ్ళను చంద్రబాబు మ్యానేజ్ చేస్తున్నాడని, లేదా వారు ఆ ఒక్క కులం అంటూ టార్గెట్ చేసి, ఎదురు దాడి చేయటంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని అయిపొయింది. ఆ విమర్శ ఏంటి, ఎందుకు చేసారు, దాంట్లో ఉన్న లోతు ఏమిటి, ఇలా దానిపైన మాత్రం ఎవరూ మాట్లాడరు. కేవలం ఎదురు దాడి చేయటం తప్పించుకోవటం. చివరకు తీర్పులు చెప్పే జడ్జీలను కూడా అలాగే టార్గెట్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇలాగే మరొకరు టార్గెట్ అయ్యారు. ఈ సారి నేషనల్ మీడియా. చివరకు నేషనల్ మీడియాలో తమకు వ్యతిరేక కధనాలు వస్తే, దానికి కారణం తెలుగుదేశం అని చెప్పేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రిపబ్లిక్ టీవీ ఛానల్ లో, జగన్ మోహన్ రెడ్డి సన్నిహితులు, విదేశాల్లో చేసిన అవినీతి పై, విదేశీయులు కొంత మంది కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు, వారం రోజులు క్రిందట రిపబ్లిక్ టీవీలో సంచలన కధనం ప్రసారం అయ్యింది. దీంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. అసలు ఆ ఫిర్యాదు చేసింది ఎవరు, ఏ కంపెనీ, ఏ వ్యక్తి, అసలు వీళ్ళు చేసిన స్కాం ఏంటి, ఎలా దొరికారు అనే విషయం పై, ఆరాలు తీయటం మొదలు పెట్టారు. అయితే వారం తిరగకుండానే, ఇప్పుడు మరో కధనం రిపబ్లిక్ టీవీలో ప్రసారం అయ్యింది.

arnab 09032021 2

జగన్ మోహన్ రెడ్డి పార్టీకి చెందిన కొంత మంది, ప్రజా ప్రతినిధులు ఆయనతో విభేదిస్తున్నారని, పార్టీలో సంక్షోభం వచ్చే అవకాసం ఉంది అంటూ, సంచలన కధనం ఒకటి ప్రసారం అయ్యింది. దీంతో మళ్ళీ అలజడి రేగింది. ఇక లాభం లేదని, తమ పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని అనుకున్నారో ఏమో కానీ, ఏకంగా జగన్ మోహన్ రెడ్డి కోటరీలో నెంబర్ వన్ అయిన సజ్జల రామకృష్ణా రెడ్డి రంగంలోకి దిగారు. రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ పై, విమర్శలు గుప్పించారు. దేశానికి పట్టిన పీడ అర్నాబ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు సజ్జల. చంద్రబాబు ఆదేశాల ప్రకారం, చంద్రబాబు కోసం ఆ కధనం రాసారని, తమకు అనుమానం ఉంది అంటూ సజ్జల వ్యఖ్యలు చేసారు. అర్నాబ్ ఫేక్ న్యూస్ వేశాడని, ఆ ఫేక్ న్యూస్ పై న్యాయ పరంగా ముందుకు వెళ్తామని, రిపబ్లిక్ టీవీ కధనాల్లో ఒక్కటి కూడా నిజం లేదని, చంద్రబాబు చెప్పినట్టు వార్తలు రాస్తున్నారు అంటూ, ఏకంగా నేషనల్ మీడియాను కూడా చంద్రబాబుకు అంటగట్టారు. ఇంకా నయం, కులంతో అంటగట్టలేదని, అందరూ అనుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుని, రాష్ట్ర ప్రభుత్వం గంట రెండేళ్లుగా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన పై ఎలాంటి అభియోగాన్ని నిరూపించలేక పోయారు. దీంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర పై పసలేని ఆరోపణలు చేస్తే, ఆయన సస్పెన్షన్ ను ఏడాదికి పైగా పొడిగించటాన్ని, సవాల్ చేస్తూ, ఏబీవెంకటేశ్వరరావు, సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విషయం పై, ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు పై ఈ రోజు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వర రావు పై ఉన్న ఆరోపణలు పై, దర్యాప్తు మొత్తం ఏప్రిల్ 6 లోపు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. రోజు వారీ దర్యాప్తు ఎందుకు చేయటం లేదని, రోజు వారీ దర్యాప్తు చేసి, కేసుని వెంటనే క్లోజ్ చేయాలని పేర్కొంది. ఏప్రిల్ 30వ తేదీన, ఈ నివేదిక మొత్తం కోర్టుకు సమర్పించాలని, ఆదేశాలు ఇచ్చింది. తదుపతి విచారణను మే 3 వ తేదీకి వాయిదా వేసింది. ఆ లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం తరుపున న్యాయవాది కలుగు చేసుకుని, తమకు ఆరు నెలల సమయం కావాలని, ఈ కేసు విచారణకు ఆరు నెలలు పడుతుందని కోర్టుకు తెలిపారు. అయితే దీని పై కోర్టు ఘాటుగా స్పందించింది.

abv 09032021 2

ఏడాదికి పైగా సస్పెన్షన్ వేటు వేసి, కాలం గడుపుతున్న సమయంలో, ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆరు నెలలు ఎందుకు ? రోజు వారీ విచారణ చేపట్టి, ఈ కేసుని పూర్తి చేయండి అంటూ, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి కోర్టు సూచించింది. అయితే అవినీతి ఆరోపణలు లేననుంది, రివ్యూ కమిటీ ఏడాదికి పైగా పొడిగించటానికి వీలు లేదని, ఏబి వెంకటేశ్వరరావు తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. అలాగే ఈయన మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు, ఈయన పై ఆరోపణలు మోపితే, వేరే డిపార్టుమెంటు లో పోస్టింగ్ ఇవ్వచ్చు కదా, ఇప్పటి వరకు ఎందుకు దూరం పెట్టారు అని కోర్టు ప్రశ్నించింది. ఒక సీనియర్ అధికారిని ఇంత కాలం ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కోర్టు. కేసు దర్యాప్తులో ఉందని, అందుకే పోస్టింగ్ ఇవ్వటం కుదరలేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది చెప్పగా, ఈ కేసుని వేగంగా దర్యాప్తు చేసి, తమకు నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ తగిలింది. నిరుపించటానికి ఏమి ఆధారాలు లేకపోవటం, ఇలాగే సాగదీయాలని ప్రభుత్వం వేసిన ఎత్తులకు, సుప్రీం కోర్ట్ బ్రేక్ వేసింది.

Advertisements

Latest Articles

Most Read