ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, వరుస పెట్టి ఎన్నికలు జరుపుతూ, ప్రతి కేసు కోర్టులో గెలుస్తూ, తమకు ఉన్న అధికారాలను ఉపయోగించి, వరుస పెట్టి ఎన్నికలు నిర్వహిస్తూ ముందుకు దూసుకుని వెళ్ళిపోతున్నారు రాష్ట్ర ఎన్నికల కమీషనర్. పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతలుగా పూర్తి చేసి ఇప్పుడే సక్సెస్ అయ్యారు. ఇక వీటి తరువాత, మునిసిపల్ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వచ్చింది. మార్చి నెల పదవ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీటి తరువాత ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక సర్కులర్ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. అందులో ఏకాగ్రీవలకు సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడైనా సరే బలవంతపు ఏకాగ్రీవాలు జరిగితే, దానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తే, అలాంటి వాటి పై తగు చర్యలు తీసుకుంటామని, ఆధారాలతో సహా, ఎన్నికల కమిషన్ ను అపోర్చ్ అయితే సరైనా విధంగా, దాని పై చర్యలు తీసుకుంటాం అంటూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక సర్కులర్ కూడా ఇచ్చింది. అయితే దీని పై ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. ఇప్పటికే ఏకగ్రీవాలు అయిన చోట, మళ్ళీ విచారణ వద్దు అంటూ ప్రభుత్వం కోర్టులో పిటీషన్ వేసింది. 

అయితే ఇందులో విచారణ జరిపిన తరువాత, కోర్టు కూడా వారితో ఏకీభవించింది. అయితే ఎక్కడైతే ఫారం-10 ఇచ్చేసి ఉన్నారో, అక్కడ మళ్ళీ నామినేషన్ వేయటం కుదరదు అని, కోర్టు కూడా తేల్చి చెప్పింది. అయితే ఇవి మధ్యంతర ఉత్తర్వులు అని కోర్టు చెప్పింది. తుది ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. అయితే రెండు రోజులు క్రితం ప్రెస్ మీట్ పెట్టిన నిమ్మగడ్డ, పరిషత్ ఎన్నికల పై మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణ పై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. కోర్టు తీర్పుకు లోబడి ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, న్యాయపరమైన చిక్కులు తొలగిపోతేనే, వాటి పై ఆలోచన చేస్తామని తేల్చి చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పిన వ్యాఖ్యలు చూస్తే, ఆయన ఇప్పుడు పరిషత్ ఎన్నికల నిర్వహణకు విముఖంగా ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. వరుస పెట్టి కోర్టులతో పోరాడిన ఎన్నికల కమిషన్, ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. మరి రిటైర్డ్ అయ్యే లోపు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుకు వెళ్తారా, న్యాయస్థానాల్లో ఏ అడ్దంకులు లేకుండా ముందుకు సాగుతారో లేదో చూడాలి.

విశాఖలో ఉన్నటు వంటి స్వరూపానంద సరస్వతి మఠం అక్రమాలకు అడ్డంగా మారింది అంటూ, ఫిర్యాదు చేసారు. విశాఖకు చెందినటు వంటి, రాం దీని పై ఫిర్యాదు చేసారు. విశాఖ భీమిలిలోని 15 పంచాయతీల్లో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడిందని, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కూడా అవకతవకలు జరిగాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసారు. అటు స్వరూపానంద స్వామి ఒక దొంగ స్వామి అంటూ, స్వరూపానంద స్వామి ఆశ్రమం, వైసీపీ పార్టీకి అడ్డాగా మారింది అని కూడా ఫిర్యాదు చేయటం జరిగింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు, ఆశ్రమం మూసివేయాలని, లేని పక్షంలో ఎన్నికలను అక్కడ నుంచి అధికార పార్టీ ప్రభావితం చేసే ప్రమాదం ఉందని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసారు. దేశంలో ఎక్కడా, ఏ ఆశ్రమానికి లేని సెక్యూరిటీ, ఏపి ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసిందని, ఎందుకు ఆశ్రమాలకు ఆ స్థాయిలో సెక్యూరిటీ ఇవ్వాల్సి వచ్చిందో కూడా, ప్రభుత్వం నుంచి వివరణ కోరాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులో తెలిపారు.

ఒకరకంగా గతంలోనే స్వరూపానంద స్వామికి సంబందించినంత వరకు కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా దుర్గ గుడి పైన జరుగుతున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు ఏవైతే ఉన్నాయో, అక్కడ నుంచి నిధులు తరలిపోయాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే, మొత్తం మీద ఇప్పుడు నేరుగా స్వరూపానంద మఠం పై నేరుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయటం, సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. జగన్ మోహన్ రెడ్డి ఆధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి స్వరూపానందకి అధికా ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నారు. డీజీపీ, అధికారులు, మంత్రులు అందరూ వరుస పెట్టి ఆయన దగ్గర మోకరిల్లారు. దీని పై మొదటి నుంచి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే మొన్న ఎన్నికలు జరగటం, అక్కడ స్వరూపానంద ఆశ్రమం పై విమర్శలు రావటంతో, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఈ ఆశ్రమం పై, ఇక్కడ జరుగుతున్న అధికార దుర్వినియోగం పై ఫిర్యాదులు రావటం చర్చకు దారి తీసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించటం లేదు అంటూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ పై, గతంలో ఇప్పటికే రెండు పర్యాయాలు విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ వేసిందో లేదో చూడాలని చెప్పి, గతంలో జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే ఈ రోజు కొద్ది సేపటి క్రితం రాష్ట్ర హైకోర్టు ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేసిన పిటీషన్ పై, మళ్ళీ విచారణ జరిపింది. ఈ విచారణలో భాగంగా అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన నీలం సాహనీ, ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖ ప్రినిసిపల్ సెక్రటరీగా ఉన్న గోపాల కృష్ణ ద్వివేదీ, వీళ్ళ ఇద్దరినీ కూడా కోర్టుకు వ్యతిగంగా రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోర్టు ధిక్కరణ పిటీషన్ వేయటంతో, ఈ కోర్టు ధిక్కరణ పిటీషన్ పై ప్రభుత్వం అసలు స్పందించటం లేదని, అదే విధంగా ఎన్నికల కమిషన్ కు కావలసిన వివిధ అవసరాలకు సంబంధించి, గవర్నర్ కు విజ్ఞప్తి చేసినప్పటికి కూడా , రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పిటీషన్ దాఖలు చేసింది. దీని పై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు ఈ రోజు ఆదేశాలు ఇస్తూ, వచ్చే నెల 22వ తేదీ నాటికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన నీలం సాహనీ, ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖ ప్రినిసిపల్ సెక్రటరీగా ఉన్న గోపాల కృష్ణ ద్వివేదీ కోర్టు ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నీలం సాహనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

దుర్గగుడిలో జరిగిన ఏసీబీసోదాల్లో అవినీతికిపాల్పడిన అసలు దొంగైన వెల్లంపల్లి శ్రీనివాస్ ను వదిలేసి, అమాయకులైన ఉద్యోగులను సస్పెండ్ చేయడం మంచిపద్ధతికాదని, దేవాదాయ శాఖకే మచ్చతెచ్చిన వెల్లంపల్లి, దేవాదాయశాఖలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రచరిత్రలో ఎప్పుడూలేనట్టు, వెల్లంపల్లి దోపిడీకి పాల్పడ్డాడని టీడీపీ రాష్ట్రప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దావెంకన్న స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో టీడీపీ అధికారప్రతినిది నాగుల్ మీరాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఏసీబీసోదాల్లో అసలు వాస్తవాలు బయటకురాలేదని, అందుకే వాటిని ప్రజలముందుంచడానికి తాము మీడియాముందుకు వచ్చినట్లు బుద్దా తెలిపారు. దుర్గగుడిలో మాయమైనచీరల్లో కొన్ని వెల్లంపల్లి ఇంటికి వెళితే, మరికొన్ని ఆయన దుకాణానికి వెళ్లాయన్నారు. ఆఖరికి అమ్మవారికి వేసే కానుకలు, చెల్లించే మొక్కుబడులు, హుండీలో వేసే ఇతరవిలువైన వస్తువులను సాధారణంగా భక్తులసమక్షంలో లెక్కించాలన్నారు. అలాకాకుండా డినామినేషన్ అనేది బహిరంగంగా అందరిముందుచేయరని, మంత్రివెల్లంపల్లి వచ్చాకే అది జరుగుతుందని, దానిలో కోటిరూపాయలు వస్తే, రూ50లక్షలు మాత్రమే అధికారికంగా చెప్పి, మిగిలిందంతా శ్రీనివాస్ కాజేస్తాడన్నారు. గతంలో ముఖ్యమంత్రులుగా రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, ఎమ్మెల్యేస్థాయిలో తనదోపిడీని ప్రారంభించిన వెల్లంపల్లి, నేడు మంత్రి హోదాలో దాన్నిరెండింతలకు పెంచాడన్నారు. ఏసీసీఅధికారులు, ప్రభుత్వం కేవలం దుర్గగుడికే పరిమితం కాకుండా, అన్నవరం, సింహాచలం, ద్వారకాతిరుమల దేవాలయాలలో కూడా తనిఖీలుజరపాలన్నారు. ద్వారకాతిరుమలలో వెల్లంపల్లి సాగిస్తున్న దోపిడీ అంతాఇంతా కాదన్న వెంకన్న ఆఖరికి విజయవాడలోని వినాయక దేవాలయాన్నికూడా మంత్రి వదల్లేదన్నారు.

విఘ్నేశ్వరుడి ఆలయంతోపాటు, విజయేశ్వరస్వామి ఆలయాన్నికూడా శ్రీనివాస్ తనదోపిడీకేంద్రాలుగా మార్చుకున్నాడన్నారు. రూ.కోటి30లక్షలతో నిర్మించిన దుకాణాల అద్దెలనుకూడా తనకు నచ్చిన ధరకే వెల్లంపల్లి నిర్ణయించాడన్నారు. వెల్లంపల్లి తనకూతురిపై ప్రమాణం చేసి, అమ్మవారిగుడిలో ప్రమాణంచేసి, తాను దేవుడి సొమ్మురూపాయికూడా తినలేదని చెప్పగలడా అని వెంకన్న నిలదీశారు. ప్రభుత్వం, ఏసీబీ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని వెల్లంపల్లిని అరెస్ట్ చేస్తేనే అసలు వ్యవహారాలు బయటకు వస్తాయన్నారు. వెల్లంపల్లి కనుసన్నల్లోనే దుర్గగుడి నడుస్తోందని, అక్కడ జరిగే ప్రతిఅవినీతిలో ఆయనప్రమేయం ఉందన్నారు. నెలకు రెండుసార్లు తిరుమలవెళ్తూ, తనవెంట తీసుకెళ్లేవారికి స్వామివారి దర్శనంచేయించి,వారినుంచి కూడా డబ్బులు దండుకుంటున్నాడన్నారు. గతఎన్నికల్లో రూ.10కోట్ల ఆస్తిని ఎన్నికల అఫిడవిట్ లోచూపిన వెల్లంపల్లి ఆస్తినేడు కోట్లాదిరూపా యలు ఎలా అయిందో ఆయనే సమాధానంచెప్పాలన్నారు. 2009 – 2014 మధ్యలో వెల్లంపల్లి ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు, జగన్మో హన్ రెడ్డి సొంతపత్రిక అయినసాక్షిలో శ్రీనివాస్ పై చెన్నైలో వ్యభిచార కేసులు నమోదయ్యాయని రాశారు. ఆవ్యవహారంపై కూడా జగన్ ప్రభుత్వం విచారణ జరిపి వెల్లంపల్లిపై చర్యలు తీసుకోవాలని బుద్దా డిమాండ్ చేశారు.

Advertisements

Latest Articles

Most Read