నాలుగవ విడత పంచాయతీ ఎన్నికలు ఈ రోజు జరిగాయి. ఎన్నికలు అయిన వెంటనే, సాయంత్రం కౌంటింగ్ కూడా ప్రారంభించారు. రాష్ట్రం మొత్తంలో, టిడిపి, వైసీపీ మధ్య హోరా హరీగా ఫలితాలు వస్తున్నాయి. సాయంత్రం 7.30 వరకు వచ్చిన ఫలితాలు చూస్తే, తెలుగుదేశం పార్టీకి 222 పంచాయతీలు రాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 248 పంచాయతీలు వచ్చాయి. అయితే ఇంకా చాలా చోట్ల కౌంటింగ్ జరుగుతుంది. అయితే కృష్ణా జిల్లా గన్నవరం మేజర్ పంచాయతీలో ఇప్పటి వరకు ఎలాంటి ట్రెండ్ బయటకు రాలేదు. అయితే విషయం ఏమిటి అని ఆరా తీయగా, గన్నవరంలోని పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో పెద్ద హైడ్రామా నెలకొంది. కౌంటింగ్ కేంద్రం గేట్లకు తాళాలు వేసి మరీ కౌంటింగ్ చేస్తున్నారు ఎన్నికల అధికారులు. చివరకు మీడియాకు కూడా ఎటువంటి అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. దీంతో అసలు లోపల ఏమి జరుగుతుందో, ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ముఖ్యంగా అభ్యర్ధులు, మీడియా ఈ విషయం పై ఆరా తీస్తున్నాయి. వల్లభనేని వంశీ నివాసం ఉండే ప్రాంతం కావటంతో, ఈ ఫలితం పై టెన్షన్ నెలకొంది.
news
4వ విడత ఫలితాలు వస్తున్న వేళ, వైసీపీకి చాలెంజ్ విసిరిన టిడిపి...
నాలుగోవిడత పంచాయతీ ఎన్నికలఫలితాల్లో 6-20నిమిషాల సమయానికి టీడీపీ మద్ధతుదారులు విజయం సాధించినవి 24 గ్రామాలైతే, వైసీపీవారు గెలిచినవి కేవలం పదిగ్రామాలేనని, ఉదయం నుంచి చంద్రబాబునాయుడు స్వగ్రామమైన కందులవారి పల్లె పంచాయతీపై మీడియామొత్తం టెన్షన్ వాతావరణాన్ని సృష్టించిందని, ఆగ్రామంలో టీడీపీ మద్ధతుదారు 563ఓట్లతో విజయం సాధించాడని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి నక్కా ఆనందబాబు స్పష్టంచేశారు. ఆదివారం సాయంత్రం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. సాయంత్రం 6, 7,8 గంటలవరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ మద్ధ తుదారులే విజయం సాధిస్తుంటారని, మెజారిటీస్థానాలు టీడీపీకే వస్తాయని, తరువాత చిన్నచిన్నగా వైసీపీవారి చీకటిరాజ్యం మొద లవుతుందన్నారు. టీడీపీ విజయాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తు న్నామని, ఈ విధంగా మొదటివిడతనుంచీ చెబుతున్నామన్నారు. అదేవిధంగా వైసీపీవారు ఎందుకు వెల్లడించలేకపోతున్నారని ఆనందబాబు ప్రశ్నించారు. తాము 6గంటలకు గెలుపొందిన 24 పంచాయతీల వివరాలను నియోజకవర్గాలవారీగా వెల్లడిస్తు న్నామని, అదేమాదిరి వైసీపీమద్ధతుదారులు గెలిచిన గ్రామాలను ఆపార్టీవారు ఎందుకు బహిర్గతంచేయడం లేదన్నారు. చీకటి పడే కొద్దీ వైసీపీనేతలు, ఆపార్టీకి చెందిన గూండాలు, రౌడీలు, పోలీసులు కౌంటింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఫలితాలు తారుమారు చేస్తున్నారు. అర్థరాత్రి అయ్యేసరికి పూర్తిగా ఫలితాలన్నీ వైసీపీ పరమే అవుతున్నాయని, గడచిన మూడుదశల్లో వెలువడిన ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు.
పోలీసులు, వైసీపీనేతలు, ఆపార్టీ రౌడీలు ఎంతలా బెదిరింపులకుపాల్పడినా, టీడీపీకార్యకర్త లు, గ్రామనాయకులు మొక్కవోని ధైర్యంతో ఎదురొడ్డి నిలిచి పంచా యతీ ఎన్నికల్లో పోరాడారు. అటువంటి వారందరికీ పేరుపేరునా టీడీపీ తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నా మని ఆనంద్ బాబు తెలిపారు. సాయంత్రం 6గంటలకే వైసీపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలకు సిద్ధమయ్యారని, ఫలితాలసరళి వారికి అనుకూలంగా లేకపోయినా, అత్యుత్సాహం చూపుతున్నా రన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతరమంత్రులు సంబరాలకు సిధ్ద మవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. 6 గంటల కు వెలువడిన ఫలితాల్లో టీడీపీకి 24స్థానాలు వస్తే, విజయోత్సవ కార్యక్రమాలు ఎలాచేస్తారని మాజీమంత్రి నిలదీశారు. అధికార దర్పంతో, కౌంటింగ్ ప్రక్రియలో ఉన్న అధికారులను, సిబ్బందిని కూడా భయభ్రాంతులకు గురిచేయడానికే విజయోత్సవాల పేరుతో పరోక్షంగా బెదిరింపులకు దిగుతున్నారన్నారు. సాయంత్రం 6 తరువాత నుంచి రాబోయే ఫలితాలు తమకే అనుకూలంగా వస్తా యనే అభిప్రాయంలో వైసీపీ వారు ఎలా ఉంటున్నారన్నారు. ముం దుగాను సంబరాలకు పిలుపునిచ్చి, కౌంటింగ్ ప్రక్రియను తారుమా రుచేయడమే లక్ష్యంగా అధికారపార్టీ వ్యవహరిస్తోందన్నారు. నైతికం గా ఓడిపోయిన వైసీపీ, ప్రజలదృష్టి మళ్లించడానికే విజయోత్సవ సంబరాలకు పిలుపునిస్తోందన్నారు. తొలివిడత నుంచీ రాజ్యాంగా న్ని తుంగలో తొక్కి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలుచేసేలా వైసీపీ ఎన్నికలప్రక్రియను నిర్వహిస్తోందని మాజీమంత్రి మండిపడ్డా రు. గ్రామాల్లో ఎన్నిరకాలుగా చేయాల్సిన దారుణాలు చేసినా, భయోత్పాతం సృష్టించినా, ప్రజలను భయపెట్టి, వ్యవస్థను భ్రష్టు పట్టించేలా వ్యవహరించి, గ్రామాల్లో కలుషితవాతావరణం తీసుకొచ్చినా టీడీపీ కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారన్నారు. ఇదేవిధంగా రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సి పల్ ఎన్నికల్లో కూడా తమపార్టీ నేతలు, కార్యకర్తులు పనిచేస్తారని ఆనందబాబు తేల్చిచెప్పారు.
చంద్రబాబుని దెబ్బ కొడదామని, బొక్క బోర్లా పడ్డ వైసీపీ...
మొన్న కుప్పంలో అధికారం, డబ్బు, పోలీసులు ఇలా మొత్తాన్ని ఉపయోగించుకుని, మెజారిటీ పంచాయతీలు గెలుచుకున్న వైసీపీ, ఈ రోజు నాలుగవ విడత జరిగిన నారావారి పల్లె ఎన్నికల్లో కూడా గెలిచి చంద్రబాబుని దెబ్బ కొట్టాలని భారీ ప్లాన్ వేసారు. కుప్పంలో చేసినట్టు చేయటమే కాక, ఈ సారి దొంగ ఓట్లు కూడా వేసే ప్రయత్నం చేసారు. తిరుపతి నుంచి నారావారి పల్లె వచ్చి, ఓటింగ్ లైన్ లో నుంచున్న దాదాపు 20 మందిని టిడిపి వాళ్ళు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. అయితే మళ్ళీ చంద్రబాబుని టార్గెట్ చేస్తూ, వైసీపీ నేతలు పెద్ద ఆపరేషన్ చేయటంతో, నారా వారి పల్లెలో కూడా ఎలా ఫలితం ఉంటుంది అనే టెన్షన్ ప్రజల్లో నెలకొంది. దొంగ ఓట్లు కూడా వేయటంతో, ఇక ఇది కూడా వైసీపీ కొట్టేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే టిడిపి మాత్రం భారీ మెజారిటీతో గెలిచింది. వైసీపీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, అధికారం ఉపయోగించినా అడ్రెస్ లేకుండా పోయారు. రెండు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఎన్నిక జరిగిన ఎనిమిది వార్డులకు గానూ, ఎనిమిది వార్డులు తెలుగుదేశం పార్టీ గెలిచింది. అలాగే సర్పంచి అభ్యర్ధి కూడా, బొబ్బా లక్ష్మి 563 ఓట్లతో గెలిచారు. దీంతో వైసీపీకి భంగపాటు తప్పలేదు.
కౌంటింగ్ కేంద్రాల్లో ఉన్న, టిడిపి నేతలకు చంద్రబాబు అర్జెంట్ మెసేజ్...
పథకాలు తీసేస్తాం, అక్రమకేసులు పెడతాం, దాడులు చేస్తామంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. గత మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి ప్రజా తీర్పును తారుమారు చేసినట్లుగా ఈ రోజు కౌంటింగ్ కూడా వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రతి పంచాయతీలో ఆఖరి ఓటు లెక్కించేంతవరకు ఎవరూ కౌంటింగ్ కేంద్రం వదలి బయటికి రావద్దు. ప్రతి పంచాయతీలో చివరి ఓటు లెక్కించేంతవరకు అప్రమత్తంగా ఉండాలి. కరెంటు తీసి వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతుండడంపై జాగ్రత్తగా ఉండాలి. వైసీపీ నేతల బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి డిక్లరేషన్ ఇచ్చేంతవరకు ఎలక్షన్ ఏజెంటు, కౌంటింగ్ ఏజెంటు, అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లోను బయటికి రావద్దు. పోలీసులు ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించినా, బెదిరింపు చర్యలకు దిగినా, కౌంటింగ్ ప్రక్రియలో వైసీపీ నేతలు ఏవైనా అవకతవకలకు పాల్పడినా వెంటనే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి 7557557744 లేదా ఎస్ఈసీకి 08662466877 నెంబరుకు తెలియజేయండి. 9గానీ, అంతకంటే తక్కువ ఓట్లుగానీ తేడా ఉన్నప్పుడు మాత్రమే రీ కౌంటింగ్ చేయాలి. ఒకసారి మాత్రమే రీకౌంటింగ్ చేయాలి. కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో కెమెరాలు లేదా సీసీ కెమెరాలతో రికార్డు చేయాలి. కౌంటింగ్ ప్రక్రియ అంతా పూర్తయి ఫలితాలు ప్రకటించకుండా, డిక్లరేషన్ ఇవ్వకుండా జాప్యం చేసినా వెంటనే తెలియజేయాలి. చివరి ఫలితం తేలేంతవరకు తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాలయం అందుబాటులో ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల్లో ఏ ఇబ్బంది వచ్చినా గానీ తెలియజేయగలరు.