ఒక పక్క ఎన్నికలు జరుగుతున్నాయి. ఎంతటి గొప్ప ప్రభుత్వం అయినా, ఎన్నికల కమిషన్ మాటలు వినాలి. అది మన రాజ్యాంగం చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లెక్క చేయటం లేదు. అసలు ఎన్నికల విధుల్లో మంత్రులు జోక్యం చేసుకోవటం అనేది పరాకాష్ట అనే చెప్పాలి. ఇక విషయానికి వస్తే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఏకాగ్రీవాలు అసాధారణంగా ఉండటంతో, ఎలక్షన్ కమిషన్ వాటి పై దృష్టి పెట్టింది. మిగతా జిల్లాలతో పోలిస్తే, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకాగ్రీవాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని ఎన్నికల కమిషన్ పరిశీలిన చేసి నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు ఏకగ్రీవాల ఫలితాలు ప్రకటించ వద్దు అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇందులో తప్పు ఏముందో కానీ, మంత్రి పెద్దిరెడ్డి భగ్గుమన్నారు. నిజానికి ఎన్నికల కమిషన్ ఎంక్వయిరీ చేసి, ఏమి లేదు అని చెప్తే, అందరికీ మంచిదే కదా. నిజంగానే అందరూ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందని, ఎవరి బలవంతంగా లేకుండా ఎన్నికలు ఏకగ్రీవం అయ్యారని అనుకుంటే, ఇది ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ వైపే, ప్రభుత్వ పెద్దలు వేలు చూపించి, ఇది ప్రజలకు మా మీద ఉన్న నమ్మకం అని చెప్పవచ్చు .

peddireddy 060220212

దీనికి భిన్నంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి, ఎవరూ నిమ్మగడ్డ మాట వినాల్సిన పని లేదని, వెంటనే ఏకాగ్రీవాలు ప్రకటించాలని ఆదేశించారు. అధికారులు అలా చేయకపోతే, ఎన్నికలు అయిన తరువాత బ్లాక్ లిస్టు లో పెడతాం అని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఏకంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలకు దిక్కు లేకపోతె, ఇంకా ఎన్నికలు ఎందుకు అని టిడిపి ప్రశ్నించింది. అయితే మంత్రి పెద్దిరెడ్డి శ్రుతిమించి వ్యాఖ్యలు చేయటంతో, ఈ రోజు ఎన్నికల కమిషన్ స్పందించింది. మంత్రి పెద్దరెడ్డి పై సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని డీజీపీని ఆదేశించింది ఎన్నికల కమిషన్. ఆయన మీడియాతో కూడా మాట్లాడనివ్వకుండా చూడాలని ఆదేశించింది. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. ప్రజలు నిర్భయంగా ఓటేసేందుకే ఈ చర్యలు తీసుకున్నామని, మంత్రిని 21 వరకు బయటకు రాకుండా చూడాలని డీజీపీని ఆదేశించింది. మరి దీని పై ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.

ఆలయాలపై దాడు-లతో పాటు, ప్రవీణ్ చక్రవర్తి అనేవ్యక్తి 600 దేవాలయాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చానని, హిందూదేవతల విగ్రహాలను ధ్వంసంచేశానని బహిరంగంగానేచెప్పినప్పటికీ అతనిపై ఈప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందని, అతన్ని అరెస్ట్ చేసి నెలరోజులైనా, విచారణలో అతనేం చెప్పాడనే వివరాలను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడంలేదని టీడీపీ నేత బుచ్చిరామ్ ప్రసాద్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రవీణ్ చక్రవర్తి జగన్ కు చెందిన కుటుంబసభ్యులతో కలిసి పనిచేస్తూ, విదేశాలనుంచి నిధుల సేకరణ చేస్తున్నాడని, అతనికి కడపలోని ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న అకౌంట్ లోనికి రూ.93కోట్ల సొమ్ము ఎక్కడినుండి వచ్చిందనేదానిపై పోలీసులు ఎందుకు విచారణ జరపడం లేదన్నారు. అతన్ని అరెస్ట్ చేసి ఇన్నాళ్లైనా అతనుఏంచెప్పాడో, ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదని బుచ్చిరామ్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రవీణ్ చక్రవర్తి వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు గోప్యత వహిస్తుందో చెప్పాలన్న టీడీపీనేత, ఆయనపై ప్రభుత్వానికి ఎందుకంత ఆపేక్షో, ఆయనవివరాలు వెల్లడించడానికి ప్రభుత్వానికి ఎందుకుభయమో చెప్పాలని ప్రసాద్ నిలదీశారు. ప్రవీణ్ కుమార్ ఫోన్ సంభాషణలు బయటకువచ్చాకకూడా అతనివ్యవహారంలో ఎవరెవరికి ప్రమేయం ఉందో, అతనికి ఎక్కడెక్కడినుంచి నిధులువస్తున్నాయో ప్రభుత్వం ఎందుకు వెల్లడించడంలేదన్నారు. ప్రవీణ్ చక్రవర్తి వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. అప్పుడే అసలుదోషులెవరలో, అతనికి ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన వారికి ఉన్నసన్నిహిత సంబంధాలేమిటో బట్టబయలవుతాయన్నా రు. అంతర్వేదిరథం దగ్ధంఘటనపై, సీబీఐ విచారణకు ఆదేశించామని చెప్పిన ప్రభుత్వం, ఆ వివరాలను ఎందుకు బహిర్గతం చేయలేదన్నారు?శ్రీకాకుళంలోని టెక్కలి లో బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసంచేయడం, రామతీర్థంలో రాములవా రి విగ్రహ శిరస్సుని ఖండించిన తర్వాత చంద్రబాబునాయుడు, అక్కడకు వెళ్లాకే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు.

రామతీర్థం దేవాలయానికి ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజుని గురించి హేళనగా మాట్లాడి, ఆయన్ని దేవస్థానం ధర్మకర్త పదవినుంచి తప్పించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పిఠాపురం మొదలు, బిట్రగుంటలో రథంకాలిపోవడం, విజయవాడలో అమ్మవారి దేవాలయంలో వెండిసింహాలు మాయంకావడం, బస్టాండ్ సమీపం లో సీతమ్మవారి విగ్రహం ధ్వం-సం చేయడం వంటి అనేకఘటనలు జరిగినా ప్రభుత్వంలో ఎందుకుచలనం రాలేదన్నారు. శ్రీశైలంలో దర్శన టిక్కెట్లకుంభకోణం, తిరుమలలో అన్యమత ప్రచారం వంటి దారుణాలు జరిగినా జగన్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదన్నా రు. 20నెలల్లో హిందూమతంపై, దేవాలయాలపై దాదాపు 161 వరకు ఘటనలు జరిగినా పట్టించుకోని ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో అధికారంలో కొనసాగే అర్హత లేనేలేదని బుచ్చిరామ్ ప్రసాద్ తేల్చి చెప్పారు. ఘటనలకు కారకులైనవారిని అరెస్ట్ చేసి, శిక్షించడంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. పురోహితులను చర్నాకోల్ తో కొట్టిన వైసీపీనేతపై జగన్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందన్నారు? బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు ఈప్రభుత్వం వచ్చాక ఏమయ్యాయో తెలియకుండాపోయిందన్నారు. దేవాదాయ శాఖ నిధులతోపాటు, బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులనుకూడా ప్రభు త్వం వివిధపథకాలకు దారిమళ్లించిందన్నారు. ఏ మతంజోలికి, మరే మతానికి చెందిననిధులను వాడుకోవడానికి ధైర్యం చేయని ప్రభుత్వం, కేవలం హిందూమతాన్నే లక్ష్యంగా చేసుకొని దారుణాల కు తెగబడుతోందన్నారు. ఆఖరికి టీటీడీ సొమ్మునికూడా ప్రభుత్వం కొట్టేయాలని చూసిందని, ప్రతిపక్షంతో పాటు, హిందూ భక్తులు గగ్గోలుపెట్టడంతో దాన్ని విరమించుకుందన్నారు. హిందూ మతంపై, దేవాలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రతి ఒక్కరూ పార్టీలు, కులాలకు అతీతంగా పోరాడాలని రామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు.

వైఎస్ వి-వే-క కేసులో పలు దఫాలుగా విచారణ చేస్తున్న సిబిఐ అధికారులు, మరోసారి పులివెందులకు వచ్చారు. పులివెందుల కోర్టులో తమకు ఉన్నటు  వంటి అనుమానాలు నివృత్తి చేసుకోవటానికి, గతంలో పులివెందుల కోర్టులో ఉన్న డాక్యుమెంట్ లు, ఆధారాలు కోసం వచ్చారు. గతంలో సిట్ విచారణ సందర్భంగా, వాళ్ళు సమర్పించిన దర్యాప్తు నివేదిక, ఆధారాలు ఇవ్వాలని పులివెందుల కోర్టుని సంప్రదించారు. అయితే దానికి సంబంధించి, పులివెందుల కోర్టు ఆ ఆధారాలు, డాక్యుమెంట్ లు ఇవ్వటానికి నిరాకరించింది. దీంతో సిబిఐ అధికారులు షాక్ అయ్యారు. దీంతో సిబిఐ అధికారులు, తమకు కీలకమైన సమాచారం పులివెందుల కోర్టు ఇవ్వకపోవటంతో, తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయారు. అయితే సిబిఐ అధికారులకు, పులివెందుల కోర్టు వివరాలు ఇవ్వకపోవటం సంచలనంగా మారింది. సాంకేతిక కారణాలు చెప్పి కోర్టు వివరాలు ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే గతంలోనే సిబిఐ అధికారులకు ఇదే అనుభవం ఎదురైతే, సిబిఐ అధికారులు హైకోర్టుకు వెళ్లారు. విచారణ చేసిన హైకోర్టు, పులివెందుల కోర్టులో ఉన్న ఆధారాలు, డాక్యుమెంట్ లు అన్నీ సిబిఐకి ఇవ్వాలని ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలు ఉన్నా, ఇప్పుడు సిబిఐకి మళ్ళీ పులివెందుల కోర్టులో చుక్కుఎదురు అయ్యింది. మరి దీని పై ఇప్పుడు సిబిఐ ఏమి చేస్తుందో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక పక్క ఇప్పటికే హైకోర్టు, సుప్రీం కోర్టులో చీవాట్లు పెట్టినా, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేయటం ఆపేలేదు. ఈ రోజు ఉదయం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన అసాధారణ ఏకగ్రీవాల పై, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టి, వాటి పై పరిశీలన జరిపిన తరువాతే, ఏకాగ్రీవాలు ప్రకటించాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే దీని పై మంత్రి పెద్దిరెడ్డి, తన పరిధిలో లేని అంశం పై కూడా మాట్లాడారు. ఏకంగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలకు తల ఊపితే మీ సంగతి చూస్తాం అంటూ అధికారులకు హెచ్చరికలు జారీ చేసారు. ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు విని, ఇష్టం వచ్చినట్టు చేస్తే, ఏప్రిల్ 1 తరువాత మీ సంగతి చూస్తాం అని, మిమ్మల్ని ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు బ్లాక్ లిస్టు లో పెడతాం అంటూ బెదిరించారు. ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు చేస్తే, మీ పై చర్యలు తీసుకుంటాం అని అన్నారు. ఎలక్షన్ కమిషన్ చేస్తున్న పిచ్చి పనులు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే, అధికారులకు కుదరదని అన్నారు. మార్చ్ 31 దాకా ఏమైనా చేసుకోండి, ఏప్రిల్ 1 నుంచి మీ సంగతి చూస్తాం అంటూ బహిరంగంగా బెదిరించారు. ఎలక్షన్ కమిషన్ మాటలు వినాలి అనుకుంటే, మీకు తిగిన శాస్తి చేస్తాం అంటూ బెదిరించారు.

అయితే మంత్రి బెదిరింపులు పై, తెలుగుదేశం స్పందించింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ''రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి సహకరించినా చర్యలు తీసుకుంటాం''... అని పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడడం రాజ్యాంగ వ్యవస్థలను అవమానించడమే. మంత్రి వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వ అధికారులను బహిరంగంగా బెదిరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తక్షణమే రాష్ట్ర క్యాబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకపోతే స్థానిక సంస్థల ఎన్నికలే వేదికగా ప్రజలందరూ వైకాపా బలపరిచిన అభ్యర్థులను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలోనే రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీరం చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పేర్కొనడం గర్హనీయం. ఒకవైపు హింసాయుతంగా బెదిరింపు చర్యలతో ఏకగ్రీవాలకు పాల్పడుతూ, మరోవైపు రాత్రింబవళ్లు రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్న అధికారులను అవమానపరుస్తూ హెచ్చరికలు జారీ చేయడం దుర్మార్గం. ఉద్యోగులకు న్యాయబద్దంగా ఇవ్వాల్సిన గవర్నమెంటు ప్రావిడెంట్ ఫండ్ నిధులు అడ్డుకుంటు ఈ విధంగా వేధిస్తారా? పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆగ్రహాలను కప్పిపుచ్చుకునేందుకు అధికారులను పావుగా వాడుకుంటున్నారు. పీఆర్సీ, సీపీఎన్, డీఏలు, ఎల్టీసీలు ఇవ్వకుండా ఉద్యోగులపై ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు. మంత్రి పెద్దిరెడ్డి ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్ లు, ఐపీఎస్ ల పై దాడికి పాల్పడుతుంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు నోరు మెదపడంలేదు? ఎందుకు ఖండించడంలేదు? ఎందుకు భయపడుతున్నారు?
అని పి. అశోక్ బాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read