వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంటే మొద‌టి నుంచీ బీజేపీ సీనియ‌ర్ లీడ‌ర్ కిష‌న్ రెడ్డికి అవ్యాజ‌మైన ప్రేమ‌. హిందుత్వమే అజెండాగా న‌డిచే బీజేపీలో కీల‌క‌నేత అయిన కిష‌న్ రెడ్డి, క్రిస్టియ‌న్ అయినా జ‌గ‌న్ రెడ్డితో అనుబంధం కొనసాగించ‌డంలో ఎటువంటి మొహ‌మాటం ప‌డ‌రు. సుప్రీంకోర్టులో ఉన్న రాజ‌ధాని అంశంపైనా జ‌గ‌న్ క‌ళ్ల‌లో ఆనందం కోసం కేంద్ర‌మంత్రి అయి ఉండి విశాఖ రాజ‌ధాని ప్ర‌క‌టించి క‌ల‌క‌లం రేపారు కిష‌న్ రెడ్డి.దీంతో తీవ్ర దుమారం రేగ‌టంతో మ‌ళ్లీ మాట మార్చారు కిషన్‌ రెడ్డి. ఏపీ రాజధాని అమరావతి అని దిద్దుబాటు ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖపట్టణం రాజధాని అని తాను అన్న మాట, జిల్లా కేంద్రమైన విశాఖపట్టణాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటే కానీ, రాష్ట్ర రాజధాని విశాఖపట్టణం అన్నది నా ఉద్దేశం ఎంతమాత్రం కాదని కిష‌న్ రెడ్డి వివ‌ర‌ణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ అని బీజేపీ ఇదివరకే ప్ర‌క‌ట‌న ఇచ్చింద‌ని, దీనికే తామంతా క‌ట్టుబ‌డి వున్నామ‌ని కేంద్ర‌మంత్రి పేర్కొన్నారు.ఏపీలో బీజేపీ నేత‌ల‌కు, కిష‌న్ రెడ్డికి ఇష్టంలేక‌పోయినా అమ‌రావ‌తే రాజ‌ధాని అని కేంద్ర పెద్ద‌లు సంకేతాలు ఇవ్వ‌డంతో అయిష్టంగానే వారు స్పందిస్తున్నారు. జ‌గ‌న్ రెడ్డి కోసం ఏకంగా కోర్టులో ఉన్న అంశంపైనే కిష‌న్ రెడ్డి మాట్లాడారంటే, ఎంత‌గా ఆ ప్రేమ ఉందో తేట‌తెల్లం అవుతుంది.

పీలేరులో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పాద‌యాత్ర‌పై దాడికి య‌త్నించిన వైసీపీ మూక‌ల్ని టిడిపి కేడ‌ర్ త‌రిమేసింది.  నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు పీలేరు నియోజకవర్గంలో జ‌న‌హోరుతో క‌దం తొక్కింది. న‌ల్లారి కిశోర్ కుమార్ రెడ్డి త‌న స‌త్తా  చాటారు. పీలేరు ప‌ట్ట‌ణంలో అడుగు తీసి అడుగు వేసే ఖాళీ లేనంత‌గా జ‌నంతో నిండిపోయింది.  నారా లోకేష్‌ని చూసేందుకు రోడ్లవెంట మహిళలు, యువకులు ప‌రుగులు పెట్టారు. పీలేరు పట్టణంలో లోకేష్‌పై అడుగడుగునా పూలవర్షం కురిపించారు. బాణాసంచా మోతలు, డప్పు శబ్ధాలతో పీలేరు హోరెత్తిపోయింది. పెద్దెత్తున యువ‌త పాద‌యాత్ర ఆరంభ‌మైన నుంచీ రాత్రివ‌ర‌కూ యువ‌నేత వెంటే ఉన్నారు. బ‌హిరంగ స‌భ ప్రాంగ‌ణం కిక్కిరిసిపోయింది. ప్ర‌సంగానికి ఈల‌లు, చ‌ప్ప‌ట్లు మారుమోగాయి. వేదిక‌పై నుంచి మంత్రి పెద్దిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే  చింత‌ల రామ‌చంద్రారెడ్డిపై అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఎక్క‌డ ఎంత దోచారో లెక్క‌లు ప్ర‌జ‌ల ముందుంచారు. పాపాల పెద్దిరెడ్డి, ఆయ‌న పార్టీని ఓడించ‌క‌పోతే రాష్ట్రానికి భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని హెచ్చ‌రించారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర పీలేరులో అంచనాల‌కు మించి దిగ్విజ‌యం కావ‌డం వైసీపీ నేత‌లు జీర్ణించుకోలేక‌పోయారు. వైసీపీ నేత, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గిరిధర్ నాథ్ రెడ్డి త‌న అనుచ‌రుల‌తో క‌లిపి దాడి చేసేందుకు ప్ర‌య‌త్నించారు. వేలాదిగా టిడిపి కార్యకర్తలు ఒక్కసారిగా తిరగబడటంతో పారిపోయి మార్కెట్ యార్డులో దాక్కున్నారు. పాద‌యాత్ర సాగే ప్రాంతాల‌లో క‌రెంటు తీసేశారు. పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డే అడ్డంకులు క‌ల్పించారు. అయినా యువ‌గ‌ళం పీలేరులో గ‌ర్జించింది. స‌వాల్ విసిరింది. వైసీపీ మూక‌లే తోకముడిచాయి.

ఢిల్లీలో వైసీపీకి చెందిన ఏ ప‌నైనా ముందు క‌నిపించేది ఆ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి. ఏ అంశం మీదైనా వినిపించే సాయిరెడ్డి గొంతు మూగ‌బోయింది. వైసీపీ త‌ర‌ఫున ఢిల్లీలో అన్నీ తానై వ్య‌వ‌హారాలు చ‌క్క‌బెట్టిన విజ‌య‌సాయిరెడ్డి అన్ని పోస్టుల‌తోపాటు ఢిల్లీ బాధ్య‌త‌లు పీకేశార‌ని తెలుస్తోంది. కేంద్రంతో లాబీయింగ్, ఢిల్లీ వ్య‌వ‌హారాల‌న్నీ రాజ్య‌స‌భ ఎంపీ నిరంజ‌న్ రెడ్డికి అప్ప‌గించార‌ని వైసీపీలోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మిధున్ రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌నుకుని తండ్రి పెద్దిరెడ్డితో క‌లిసి మ‌ళ్లీ త‌న సీటుకే ఎస‌రు పెడ‌తార‌నే డౌటుతో నిరంజ‌న్ రెడ్డిని రంగంలోకి దింపారు వైఎస్ జ‌గ‌న్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. కేంద్రం వైసీపీకి కొద్దిగా దూరం పెడుతూ వ‌స్తోంది. ఈ ప‌రిస్థితుల్లో తన‌ను జైలుకి పంపితే త‌న భార్య భార‌తి కాకుండా మంత్రి పెద్దిరెడ్డి బీజేపీతో క‌లిసి ముఖ్య‌మంత్రి అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తార‌నే భ‌యం మొద‌టి నుంచీ జ‌గ‌న్ రెడ్డిని వెంటాడుతోంది. అందుకే సాయిరెడ్డి ప్లేసులో తెలంగాణ‌కి చెందిన నిరంజ‌న్ రెడ్డికి ఢిల్లీ బాధ్య‌త‌లు అప్ప‌గించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. విజ‌య‌సాయిరెడ్డికి ముందుగా ఉత్త‌రాంధ్ర ఇన్చార్జిగా త‌ప్పించారు. ఆ త‌రువాత సోష‌ల్మీడియా ఇన్చార్జి నుంచి పీకేశారు. అనుబంధాల సంఘాల ఇన్చార్జి పోస్టూ పీకేశారు. ఢిల్లీలో వైసీపీ వ్య‌వ‌హారాలు చూసే ఈ చివ‌రి బాధ్య‌త‌ని లాగేసుకుని రాజ్య‌స‌భ ఎంపీ, జ‌గ‌న్ కేసులు చూసే లాయ‌ర్ నిరంజ‌న్ రెడ్డికి అప్ప‌గించారు.

నారా లోకేష్ క్లాస్ లుక్‌తో అల‌రిస్తున్నారు. మాస్ అప్పీల్ తో అద‌ర‌గొడుతున్నారు. న‌డ‌క‌లో వేగం, స్పందించే తీరు కూడా ఆక‌ట్టుకుంటోంది. నెల దాటినా విసుగు అన్న‌దే లేకుండా ప్ర‌తీ రోజూ ఫ్రెష్‌గా పాద‌యాత్ర ఆరంభిస్తున్న‌ట్టు ఉన్న లోకేష్ ఎన‌ర్జీ లెవ‌ల్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పాద‌యాత్ర‌లో లోకేష్‌తో న‌డ‌వాలంటే ప‌రుగులు పెట్టాల్సి వ‌స్తోంద‌ని యువ‌నేత‌లు అంటున్నారు. ఇటీవ‌ల యువ‌గ‌ళం యూత్ ఇంట‌రాక్ష‌న్‌లో త‌న లుక్‌, స్టైల్ అన్నీ మార‌డానికి భార్య బ్రాహ్మ‌ణి కార‌ణం అని లోకేష్ చెప్పుకొచ్చారు. డైట్ ప్లాన్‌, ఫిట్నెస్ వ్య‌వ‌హారాల‌న్నీ భార్యే చూస్తోంద‌ని చెప్పారు. తాను ఎక్క‌డ ఏం తిన్నా తెలిసిపోతుంద‌ని న‌వ్వుతూ వివ‌రించారు. లోకేష్ చెప్పినా, ఆ ఎన‌ర్జీ లెవ‌ల్స్ చూసి ఆయ‌న ఏం తింటారు అనే ఆస‌క్తి చాలా మందిలో మొద‌లైంది. దీనిపై ఆయ‌నే క్లారిటీ ఇచ్చారు. ఉద‌యం నుంచి రాత్రి నిద్ర‌పోయేవ‌ర‌కూ యువ‌గ‌ళం పాద‌యాత్రలో త‌న దిన‌చ‌ర్య‌ని తెలియ‌జేశారు.

ఉద‌యం
క్యాంప్ సైటులో ఉద‌యం 6 గంట‌ల‌క‌ల్లా నిద్ర‌లేస్తారు.
6.30కి ఫ్రెష్ అయి బ్లాక్ కాఫీ తాగుతారు
7:00 గంట‌ల వ‌ర‌కూ పేప‌ర్లు, పీఆర్ టీమ్ బ్రీఫింగ్ తీసుకుంటారు.
అర‌గంట పాటు అంటే 7.30 వ‌ర‌కూ వ్యాయామం చేస్తారు
7:50కి స్నానం చేసి రెడీ అవుతారు.
7:50 నుంచి 8:00 వ‌ర‌కూ అల్పాహారం
8:30 వ‌ర‌కూ నాయకుల‌తో స‌మీక్ష స‌మావేశం
9:30 సెల్ఫీ విత్ లోకేష్ కార్య‌క్ర‌మం
పాద‌యాత్ర ప్రారంభం
ఈ టైము వ‌ర‌కూ లీట‌ర్ వాట‌ర్‌ తీసుకుంటారు

మ‌ధ్యాహ్నం
12.00 గంట‌లకు కోకోన‌ట్ వాట‌ర్
1:00- 1:30 మ‌ధ్యాహ్న భోజ‌నం (క్వినోవా విత్ వెజిట‌బుల్స్‌)
అల్లం టీ
1:30-2:00 నాయ‌కుల‌తో భేటీ
పాద‌యాత్ర ప్రారంభం
సాయంత్రంలోగా మ‌రో లీట‌ర్ వ‌ర‌కూ నీరు
5.00 గంట‌ల‌ కోకోన‌ట్ వాట‌ర్
7:00 విడిది కేంద్రం చేరిక
7:30 నాయ‌కుల‌తో స‌మీక్ష
8PM to 8:30PM - చాలా లైట్‌గా ఒక చిన్న క‌ప్పుతో తీసుకుంటారు( ఒక రోజు ఉడ‌క‌బెట్టిన వెజిట‌బుల్స్ మ‌రో రోజు ఉడ‌క‌బెట్టిన గుడ్డు , ఇంకో రోజు ఉడ‌క‌బెట్టిన చికెన్ .

ఇదండీ నారా లోకేష్ యువ‌గ‌ళంలో తాను ప‌రుగులు పెడుతూ, నేత‌ల్ని ప‌రుగులు పెట్టిస్తోన్న డైట్, వ్యాయామం, నిద్ర ప్లాన్‌.

Advertisements

Latest Articles

Most Read