రెండు రోజుల క్రితం, గిద్దలూరు వైసిపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వీడియో ఒకటి వైరల్ అయ్యింది. అందులో ఆయన సమస్య చెప్పుకోవటానికి వచ్చిన జనసేన కార్యకర్తపై బూతులు వర్షం కురిపించారు. ప్రకాశం జిల్లా కొనపల్లికి వచ్చిన ఎమ్మెల్యే రాంబాబుకు రోడ్ల తీరు సరిగా లేదని, ఒకసారి కారు దిగి వచ్చి చూడండి అంటూ జనసేన కార్యకర్త వెంగయ్య అడ్డుకోగా, జనసేన కార్యకర్త వెంగయ్యను బూతులతో తిట్టేసారు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీరుపై జనసేన నేతల ఆగ్రహం వ్యక్తం చేయటం, ఇది మీడియాలో హైలైట్ అవ్వటం తెలిసిందే. అయితే ఎమ్మెల్యేని ఏకవచనంతో సంబోదించారు కాబట్టి, ఎమ్మెల్యే తిట్టారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.అయితే ఈ రోజు వెంగయ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచాలనం సృష్టిస్తుంది. వీడియో బయటకు ఎందుకు విడుదల చేసారు అంటూ, వైసీపీ నేతలు, జనసేన కార్యకర్త వెంగయ్య పై ఒత్తిడి తేవటం, నిన్న గిద్దలూరుకు సంబందించిన ఒక వైసీపీ నేత, ఆ గ్రామ పర్యటనకు వెళ్ళటంతో, గ్రామస్తులు ఆయనతో కూడా రోడ్డులు బాగు చేయకుండా ఎందుకు వచ్చారు అంటూ నిరసన తెలిపారు.

janasena 18012021 2

అయితే, వైసీపీ నేతల ఒత్తిడితోనే వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నారని జనసేన నేతలు ఆరోపిస్తూ ఉండగా, మరో పక్క పోలీసులు మాత్రం, వెంగయ్య మద్యం సేవించి, మానసిక ఒత్తిడితోనే, అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయారని, బంధవులు కూడా అదే చెప్పారని అంటున్నారు. జనసేన నేతలు మాత్రం, పోలీసులు వాదనతో ఏకీభవహించటం లేదు. జనసేన నేతలు మాత్రం, నిజాలు బయటకు రావాలని అంటున్నారు. ఈ ఘటన పై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. గ్రామాల్లో ఉన్న సమస్య తీర్చండి అంటూ, ఒక ఎమ్మెల్యేను అడగటం కూడా తప్పేనా అంటూ, పవన్ ప్రశ్నించారు. జనసేన కార్యకర్త వెంగయ్య మృతి బాధాకరం అని, అతని మరణానికి, అధికార వైసీపీ నేతలు బాధ్యత వహించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. గ్రామాల్లో సమస్యలను అడగటమే తప్పా అని పవన్ ప్రశ్నించారు. ఈ ఘటన పై ఎమ్మెల్యేతో పాటుగా, అతని అనుచరులు పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.

మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు , నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ పై తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ఎస్పీ భాస్కర్ భూషన్‍కు వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాటల్లోనే "ఇటువంటి పోస్టింగ్ పెడితే, ఆ పోలీస్ డిపార్టుమెంటుకు చెందిన జిల్లా అధికారి, ఆయనకు ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ చేసారని, కేసు రిజిస్టర్ చేయవద్దు అని చెప్పేది ఏమిటి నాకు అర్ధం కావటం లేదు ? ఏమనుకుంటున్నాడు ఆయన ? ఎవరనుకుంటున్నాడు ? ఏ గవర్నమెంట్ అనుకుంటున్నాడు ? నాకు అర్ధం కావటం లేదు. బాగుండదు, పద్దతి కాదు, తమాషాలు పడొద్దు, దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం. చేయండి. ముందు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయండి. డీఎస్పీ వచ్చి ఎంక్వయిరీ చేస్తాడు. ఫాల్స్ కేసు అయితే తీస్తాడు. లేకపోతే కేసు రిజస్టర్ చేసి లోపల వేస్తారు. అంతే కదా ? కేసు రిజిస్టర్ చేయవద్దు అని చెప్పటానికి నువ్వు ఎవరివి ? జిల్లా అధికారివి ? నీకేమి సంబంధం ? 13 జిల్లాల్లో ఇదే జరుగుతుందా ? ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. ఎస్పీ అనుమతి లేనిదే పెట్టకూడదా ? ఎక్కడ నుంచి వచ్చావు నువ్వు ? ఎవరు నేర్పించారు నీకు రూల్స్ ? ఎస్సీ ఎస్టీ కేసు ఇచ్చిన తరువాత కేసు రిజస్టర్ చేస్తారు. డీఎస్పీ వచ్చి ఎంక్వయిరీ చేస్తాడు. అంతే కదా ? నీకు ఏమి అధికారం ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయవద్దు అని చెప్పటానికి ? బాగుండదు. ఉన్నన్ని రోజులు జాగ్రత్త. ఇంకో నెల ఉంటావో, రెండు నెలలు ఉంటావో, ఉన్నన్ని రోజులు శుద్ధంగా ఉండి, చివరి రోజులో అయినా మంచి పేరు తెచ్చుకునో పో. తమాషాలు పడుతున్నాడు. ఏమనుకుంటున్నాడో ఏమో. ఎవరు అనుకుంటున్నాడో.

prasanna 180120212

ఎక్కడి నుంచో వచ్చాడు. మన కర్మకు వచ్చాడు ఈ జిల్లాకి. ఏమి పనులు ఇవి ? అందరి మీదే ఇది జరుగుతుంది. జగన్ గారి మీద అయితే ఇష్టం వచ్చినట్టు బాషతో రాస్తున్నారు. ఇన్ని జరుగుతా ఉంటే ఏమి చేస్తున్నారు మీరు అంతా ? ఎవరు కాపాడుతారు నిన్ను ? ఏమైనా విజయవాడలో ఉన్న డీజీపీ కాపాడుతాడు అనుకుంటున్నావా ? బాగుండదు చెప్తున్నా. మీడియాకు చెప్తున్నా. ఎంత దూరం రాసుకుంటారో రాసుకోండి. ఓపెన్ గా, చెప్తున్నా. నువ్వు తెలుగుదేశం పార్టీ అజేంట్ వా ? మా ప్రభుత్వం తరుపున ఈ జిల్లా ఆధికారిగా వచ్చిన వ్యక్తీవా అని నేను అడుగుతున్న ? ఎవడో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మాజీ మంత్రి ఫోన్ చేస్తే, మమ్మల్ని ఇబ్బంది పెడతావా ? ఎన్ని రోజులు ఉంటావు, నువ్వు ఈ నెల్లూరు జిల్లాలో, తరువాత నీ బ్రతుకు ఏమిటి ? వేరే జిల్లాకు పోతావ్ . నువ్వు ఎవరు అసలు ? కేసు పెట్టొద్దు అనటానికి నువ్వు ఎవరు ? బెదిరిస్తావా ? జైల్లో వేయిస్తాను అన్నావు అంటా, కింద పోలీస్ వారిని. నీకుందా దమ్ము ? రా నీకు దమ్ము ఉంటే అరెస్ట్ చేపించు. ఎవరి గవర్నమెంట్ అనుకుంటున్నావ్ ? జాగ్రత్తగా ఉండు, నాతొ పెట్టుకోమాక ?" అంటూ జిల్లా ఎస్పీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి పోలీస్ సంఘం వారు, ఇప్పుడు కూడా మీసాలు మెలేసి, ప్రెస్ మీట్లు పెడతారేమో చూడాలి. ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడిన వీడియో ఇక్కడ చూడవచ్చు https://youtu.be/Qc_qgcWLPHQ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమైన స్థానిక సంస్థల ఎన్నికల పై, నేడు హైకోర్టులో కీలక తీర్పు వచ్చే అవకాసం ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించే విధంగా, రాష్ట్ర ఎన్నికల కమీషనర్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిర్ణయం పై, యధావిధిగానే రాష్ట్ర ప్రభుత్వం ఎదురు తిరిగింది. ఇప్పుడే ఎన్నికలు జరపలేం అంటూ, హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. అప్పటికే హైకోర్టుకు సెలవలు కావటంతో, ఈ కేసుని వెకేషన్ బెంచ్ ముందు, సింగల్ జడ్జి విచారణ జరిపారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తీసుకున్న నిర్ణయం పై, బ్రేక్ వేసారు. ఎన్నికల షెడ్యుల్ ని సస్పెండ్ చేసారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం పై అపీల్ కు వెళ్ళింది. సింగల్ జడ్జి నిర్ణయం పై, డివిజన్ బెంచ్ లో అపీల్ చేసారు. అయితే ఈ పిటీషన్ ని విచారణకు తీసుకున్న డివిజన్ బెంచ్, ఇప్పటికిప్పుడు ఈ కేసు పై విచారణ ఎందుకు, సెలవులు తరువాత ఈ కేసుని రెగ్యులర్ బెంచ్ వాదిస్తే మీకు అభ్యంతరం ఏమిటి అని కోర్టు ఎన్నికల కమీషనర్ ని ప్రశ్నించింది. అయితే 23న షెడ్యుల్ మొదలు అవుతుందని, 18కి వాయిదా వేస్తే, ఒక వేళ కోర్టు అనుకూల నిర్ణయం ఇస్తే, తమకు ఎన్నికల సంనద్ధతకు తక్కవ సమయం ఉంటుందని తెలిపారు.

hc 18012021 2

అందుకే ఇప్పుడే విచారణ చేయమని కోరారు. ఓటర్ల జాబితాలో గందరగోళం ఉంటుందని, ఎన్నికల కమీషనర్ కోర్టుకు తెలిపారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మేరకే, తాము ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ చేపట్టామని, హైకోర్టుకు తెలిపారు. అయితే దీని పై స్పందించిన ప్రభుత్వ తరుపు నయ్యవాది, ఈ పిటీషన్ ఇప్పటికిప్పుడు విచారణ చేయటం అవసరం లేదని, ఎన్నికల ఓటర్ల జాబితా ఆ సమయానికి సిద్ధం అయిపోతుందని, ఈ పిటీషన్ ని 18కి వాయిదా వేయమని కోరటంతో, డివిజన్ బెంచ్ కూడా ఈ వాదనతో ఏకీభవించి, ఈ పిటీషన్ ని,18కి వాయిదా వేసింది. ఈ పిటీషన్ పై ఈ రోజు వాదనలు జరగనున్నాయి. రాష్ట్ర హైకోర్టు, ఈ పిటీషన్ పై ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో చూడాలి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరపవద్దని, మరో పక్క ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరపాలని, ఈ నిర్ణయం గత మూడు నాలుగు నెలల నుంచి సాగుతుంది. అయితే ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు జరపటం లేదో అర్ధం కావటం లేదు. ఎందుకు ఎన్నికలు అంటే వెనకాడుతుందో అర్ధం కావటం లేదు.

ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ ఘాట్ లో, నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ మనకు దూరం అయి 25 ఏళ్ళు అయినా, ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు అంటే, ఆయన చేసిన పనులు శాశ్వతంగా నిలిచి పోయాయి అని చెప్పటానికి నిదర్శనం అని అన్నారు. ఎన్టీఆర్ పేరు వినగానే శత్రువులు గుండెల్లో రైళ్ళు పరిగెత్తేవి అని అన్నారు. సినిమాల్లో కానీ, రాజకీయల్లో కానీ, ఆయన రారాజు అని, ఆయన సృష్టించిన చరిత్ర, భవిష్యత్తులో కూడా ఆయన్ను అందుకోలేరని అన్నారు. ఎన్టీఆర్ లాంటి మహోన్నతమైన వ్యక్తి తీసుకొచ్చిన అనేక పధకాలు, సమాజంలో ఎంతో మార్పు తీసుకుని వచ్చాయని, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా ఆయన నిలిచారని అన్నారు. దేశంలో సంక్షేమం అనే పదానికి నిర్వచనం తెచ్చింది ఎన్టీఆర్ అని, ఇప్పటికీ ఆయన స్పూర్తితోనే పధకాలు ఉన్నాయని అన్నారు. దేశ రాజకీయాల్లో కూడా అయన తన ముద్ర వేసుకున్నారని గుర్తు చేసారు. అయితే ఈ సందర్భంలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఎన్టీఆర్ కు భారతరత్న అనేది, కేవలం అయన జయంతి, వర్ధంతికి ఇచ్చే డిమాండ్ గానే చూడాలా, ఎప్పుడు సాధిస్తారు అని విలేఖరి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పారు.

cbn 18012021 1

"తప్పకుండా సాధించాలి. భారత దేశం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నాన్ కాంగ్రెస్ పార్టీలు అన్నీ ఏకతాటి పైకి తీసుకుని వచ్చి, ఒక స్పూర్తి ఇచ్చిన వ్యక్తీ ఎన్టీఆర్. అదే మారిగా దేశంలో కూడా రాజకీయాలకు వన్నె తెచ్చారు. ఇప్పటికే ఆయనకు భారత రత్న లేట్ అయ్యింది. ఆయన వందో పుట్టిన రోజుకి అయినా భారత రత్న ఇవ్వాలి. దాని కోసం మేము పోరాడతాం, సాధిస్తాం." అని అన్నారు. అదే విధంగా ఎన్టీఆర్ సమాధి కూల్చేస్తాం అంటూ, కొన్ని పార్టీలు చేసిన వ్యాఖ్యల పై స్పందన అడగగా, చంద్రబాబు స్పందించారు. "ఎన్టీఆర్ సమాధి కుల్చేస్తాం అని ఎవడైనా అంటే, అది మన సంస్కృతిని కూలదోసినట్టే. ఆ ఆలోచనే ఎవరికీ రాకూడదు. ఆయన ఏమి చేసారు తెలుగుజాతి అనేది గుర్తు పెట్టుకోవాలి. ఆయన ఎవరికీ వివాదాస్పదం కాదు. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి. రాజకీయాలు కోసం, అలాంటి వ్యక్తిని, వివాదాల్లోకి లాగకండి. ఎవరూ అలాంటి సాహసం చేయవద్దు అని కోరుతున్నా" అని చంద్రబాబు అన్నారు. అలాగే తెలంగాణాలో పార్టీ పరిస్థితి పై అడగగా, తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణాలో, తెలుగువారి కోసం ఎప్పుడూ, ఎక్కడైనా కృషి చేస్తూనే ఉంటాం అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మాట్లాడిన వీడియో ఇక్కడ చూడవచ్చు https://youtu.be/7BuPj85uiIY

Advertisements

Latest Articles

Most Read