జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో, సొంత రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రాలు కూడా తల పట్టుకుంటున్నాయి. సహజంగా ప్రభుత్వాలు ఏ పని చేసినా, ప్రజలకు ఉపయోగపడేలా,అందరికీ సౌకర్యంగా ఉండేలా, నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే మన రాష్ట్రంలో మాత్రం, ఒక ప్రాంతం మీద కక్షతోనో, ఒక కులం మీదో, ఒక వ్యక్తి మీద కక్షతోనే నిర్ణయాలు ఉంటాయని, అమరావతి రాజధాని విషయంలో తేలిపోయింది. రాష్ట్రానికి మధ్యలో, అందరికీ అందుబాటులో కాకుండా, ప్రభుత్వం వైజాగ్ లో పెట్టాలని నిర్ణయం తీసుకోవటం, అన్ని కార్యాలయాలు అక్కడికే తరలించాలనే పట్టుదలతో, సంబంధం లేని శాఖలు కూడా వైజాగ్ తీసుకుని వెళ్ళిపోతాం అని చెప్పటంతో, ఇప్పుడు సొంత రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రాలు కూడా అవాక్కవుతున్నాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంది. అయితే విభజన చట్టం ప్రకారం అది ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో, ఇరు ప్రభుత్వాల సమ్మతితో, విజయవాడలో పెట్టాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా నది పరివాహాక ప్రాంతంలో, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మొత్తం తారుమారు అయ్యింది.

kcr 20012021 2

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుని విజయవాడలో కాకుండా, దాన్ని తీసుకుని వెళ్లి విశాఖపట్నంలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దీని పై సొంత రాష్ట్రంలో విమర్శలు వచ్చాయి. కృష్ణా నది ఉన్న చోట, కాకుండా ఎక్కడో వైజాగ్ లో ఏంటి, మీకు విజయవాడ ఇష్టం లేకపోతే, కనీసం రాయలసీమలో, కర్నూల్ లో అయిన పెట్టండి అంటూ, డిమాండ్ లు సొంత రాష్ట్రం నుంచి వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం పై కేసీఆర్ సర్కార్ కూడా ఆగ్రహం వ్యాక్తం చేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే ఒప్పుకున్నాం అని, అసలు సంబంధం లేని వైజాగ్ లో, కృష్ణా నదికి 300 కిమీ అవతల ఎలా పెడతారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తెలంగాణ సాగునీటి శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఘాటుగా లేఖ రాసారు. అయితే విజయవాడ అయితే ఒప్పుకుంటాం అని, లేకపోతే హైదరాబాద్ లోనే ఉంచేయండి అంటూ లేఖలో తెలిపారు. దీంతో ఇప్పుడు వైజాగ్ కాదు, విజయవాడ కాదు, అసలు రాష్ట్రానికి రాకుండా, బోర్డు కార్యాలయం హైదరాబాద్ లోనే ఉండి పోయే అవకాసం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టు వీడి, విజయవాడలో కానీ, కర్నూల్ లో కానీ పెట్టటానికి ఒప్పుకుంటే, సమస్య పరిష్కారం అయ్యే అవకాసం ఉంది.

నెల్లూరు జిల్లా ఎస్.పి భాస్కర్ భూషణ్ కు జనవరి 18, 2021 న వైకాపా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన బహిరంగ బెదిరింపుల నేపధ్యంలో తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి డిజిపికి లేఖ రాసారు. ఒకవైపు రాష్ట్రంలో రోజురోజు శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని మరోవైపు అధికార పార్టీ వైకాపా నాయకులు పేట్రేగిపోతూ నేరాలు-ఘోరాలకు పాల్పడుతున్నారని, ఇంకోవైపు దళితులు, మైనారిటీలు, మహిళలు, దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతన్న అనేక సంఘటనలు డిజిపీ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు లేవన్నారు. తెలుగుదేశం కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అక్రమ కేసులు నమోదు చేయనందున జనవరి 18, 2021 న నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్ ను బహిరంగంగా పబ్లిక్ మీటింగ్ లో వైకాపా ఎమ్మల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బెదిరించారని పేర్కొన్నారు. వైకాపా నాయకులతో ఒక వర్గం పోలీసులు కుమ్మక్కై రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారనడానికి ఇదే సాక్ష్యమని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పై డిజిపి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ప్రస్థుతం ఆంధ్రప్రదేశ్ పోలీసులలో ఆత్మస్థైర్యం దెబ్బతిందని నల్లపరెడ్డి లాంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులలో ఆత్మస్తైర్యం నింపడంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా మెరుగుపడుతాయి ప్రస్తావించారు.

అమరావతి ఉద్యమం సమయంలో, కృష్ణాయపాలెంలోని, పదకొండు మంది రైతులు పై, పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసుని కొట్టివేస్తూ, కొద్ది సేపటి క్రితం హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలోకి, మూడు రాజధానుల ఉద్యమం పేరుతో బయట నుంచి వస్తున్నారని, అమరావతి ప్రాంత రైతులు ముందు నుంచి ఆందోళన చేస్తూ వచ్చారు. అయితే, అమరావతికి శంకుస్థాపన చేసి 5 ఏళ్ళు అయిన నేపధ్యంలో, బయట వాళ్ళు ఎవరైనా అమరావతి గ్రామాల్లోకి వస్తే, వెంటనే తమకు తెలియచేయాలి అంటూ, పోలీసులు, అక్కడ ఉన్న గ్రామాల ప్రజలందరికీ నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ సందర్భంగానే, కొంత మంది కృష్ణాయపాలెంకి చెందిన, ఎస్సీ, బీసీ సామాజికవర్గానికి చెందిన రైతులు, పోలీసుల నోటీసులు దృష్టిలో పెట్టుకుని, వేరే గ్రామాల నుంచి ఆటల్లో తోలుకుని మూడు రాజధానుల శిబిరానికి తీసుకుని వస్తున్న వారిని ఆడ్డుకున్నారు. మీరు ఎందుకు వస్తున్నారు, మా గ్రామాల్లో శాంతిభద్రతల సమస్య వస్తుంది, బయట వాళ్ళు వస్తే సమాచారం ఇవ్వండి అని పోలీసులు తమకు చెప్పారని వారిని అడ్డుకున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన వ్యక్తీ, తమ వారిని ఆడుకున్నారు అంటూ కేసు పెట్టగా, పోలీసులు అత్యుత్సాహంతో, వారి పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసారు.

hc 20012021 2

అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఎస్సీలుగా ఉన్న వారి పైన కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసే దాకా వ్యవహారం వెళ్ళింది. అయితే కేసు పెట్టిన వ్యక్తి, తాను ఎస్సీ ఎస్టీ కేసు కింద కేసు పెట్టమని చెప్పలేదని, ఈ కేసుని వెనక్కు తీసుకుంటున్నా అని చెప్పినా, పోలీసులు మాత్రం కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పారు. అయితే ఇదే సందర్భంలో రైతులకు బేడీలు కూడా వేసారు. మొత్తంగా ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ కేసు దేశ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అయితే అప్పట్లోనే రైతులకు బెయిల్ వచ్చింది. ఆ సందర్భంలోనే హైకోర్టు పోలీసులు పై అక్షింతలు వేసింది. అయితే ఇప్పుడు ఈ కేసు తదుపరి విచారణ రాగా, ఈ కేసు చెల్లదు అంటూ, హైకోర్టు ఈ కేసుని కొట్టేసింది. రైతులు పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టటానికి వీలు లేదు అంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు ఎలా పని చేస్తున్నారో చెప్పటానికి, ఇది ఒక ఉదహరణ అని అమరావతి జేఏసి, విపక్షాలు వాపోతున్నాయి. ఎన్ని సార్లు హైకోర్టులో ఎదురు దెబ్బలు తగిలినా, చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారని వాపోయారు.

విశాఖపట్నం వాల్తేరు క్లబ్ కు సంబంధించి, ఈ రోజు హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. కొంత మంది విశాఖ వాల్తేరు క్లబ్ పై కన్నేసారని, గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అది ప్రభుత్వానిదా, ప్రైవేటుదా అంటూ వివాదం గత కొన్ని నేలలుగా నడుస్తుంది. గతంలో 1964లో వాల్టర్ క్లబ్ కు ఉన్న పట్టాకు సంబంధించి, కావాలని ఇప్పుడు వివాదం తెచ్చారని, ఆ భూములు కొట్టేసే ప్లాన్ వేసారని, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని పై ప్రభుత్వం ఒక సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ మొత్తం వ్యవహారం పై విచారణ చేయాలని ఆదేశించింది. అయితే ఈ కేసు హైకోర్టుకు చేరింది. దీని పై ఈ రోజు విచారణ జరిగింది. అయితే ఈ మొత్తం అంశం పై, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై కోర్టుకు వెళ్ళారు. అయితే ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఈ అంశం పై స్టే విధించింది. సిట్ విచారణ పై కూడా స్టే విధించింది. వాల్తేరు క్లబ్  వివాదం పై, సిట్ ఎటువంటి చర్యలు ఇక ఈ వ్యవహారంలో ముందుకు వెళ్ళకూడదు అని, మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు, ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అని, ఇది సివిల్ వివాదం కాబట్టి, సిట్ జోక్యం చేసుకోకూ డదు అని, తదుపరి విచారణ పై స్టే విధించింది.

Advertisements

Latest Articles

Most Read