ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ మహేశ్వరీ, ఈ రోజు బదిలీ పై సిక్కిం వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు హైకోర్టులో వీడ్కోల సభ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా జస్టిస్ మహేశ్వరి స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాటల్లో "నేను చాలా చిన్న కుటుంబంలో పుట్టాను. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. ఎంతో కష్టపడి ఈ స్థానానికి వచ్చాను. తాన పై ఎంతో మంచి అభిప్రాయం వ్యక్తం చేసారని, నేను ఈ సన్మానానికి అర్హుడినో కాదో కానీ, నేను కొన్ని చెప్పాలని అనుకుంటున్నాను. ఇక్కడకు వచ్చిన తరువాత, ఎంతో మంది సహచరులతో కలిసి, ఎన్నో ఉత్తమ నిర్ణయాలు తీసుకున్నాం. అందరి అభిప్రాయాలతో ముందుకు వెళ్ళాం. ఆ ఫలితాలే, మన పై వస్తున్న ప్రశంసలు. ఇక్కడ అందరూ నాకు బలం. నేను అనుకున్నదాని కంటే, ఎక్కువగా పని చేసారు. నాతో పాటు పని చేసిన అందిరకీ కృతఙ్ఞతలు. నేను ఎప్పుడైనా కోప్పడినా, ఏమి పట్టించుకోకుండా పని చేసే వారు. ఉదయం నుంచి రాత్రి దాకా నాతో కలిసి కష్టపడ్డారు. ఒక్కోసారి 10 గంటల దాకా పని చేసాం. నేను ఒక్కడినే పని చేస్తే ఏమి అవ్వదు. అందరూ కలిసి చేస్తేనే ఆ పని అవుతుంది. నాలాంటి జడ్జీలు ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు, కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం చిరస్థాయిగా నిలిచి పోతాయి. ఈ వ్యవస్థ కోసం పని చేసే మనస్తత్వం ఉంటే, ప్రతి ఒక్కరి పనికి గుర్తింపు ఉంటుంది, ఈ వ్యవస్థకు మరింత గౌరవం పెరుగుతుంది. అయితే ఈ సందర్భంలో హైకోర్టు రిజిస్టార్ రాజశేఖర్ గారిని మాత్రం మర్చిపోలేను.

justice 04012021 2

"ఆయన ఎంతో కష్టపడి పని చేసేవారు. నేను ఒకటి అయితే చెప్పగలను, ఆయన ఏదైనా చెప్పారు అంటే, అది కరెక్ట్ అయి తీరుతుంది. రిజిస్టార్ జనరల్ ఎలా ఉండాలో ఆయన ఒక ఉదాహరణ. ఆయన క-రో-నాతో మృతి చెందటం బాధకారం. ఈ సందర్భంగా అయన సేవలు గుర్తు చేసుకోవాలి. కొత్త రాష్ట్రం కావటంతో, ఎన్నో సెట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి అధిగమిస్తూ వచ్చాం, కొన్ని ఇంకా జరుగుతున్నాయి. కొన్ని ఇబ్బందులు ఉన్నా, అవి పట్టించుకో దలుచుకోలేదు. అందరం కలిసి ముందుకు వెళ్లాం. నిష్క్రమణ ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. నేను ఈ ప్రాంతం విడిచి వెళ్తున్నాను. ఇక్కడ నా పై చూపించిన ప్రేమ, నాకు ఇక్కడ అందరి నుంచి లభించిన సహకారం, నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. నా గుండెల్లో దాచుకుంటాను. నా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే, నన్ను క్షమించండి. నా తోటి జడ్జిలకు బెస్ట్ అఫ్ లక్." అంటూ తన ప్రసంగం ముగించారు. ఇక అమరావతిలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున వీడ్కోలు పలకటం కోసం వచ్చారు. రోడ్డుకు ఇరు వైపులా నుంచున్నారు. దారి పొడుగూతూ పూలు చల్లారు. జాతీయ జెండాలు పట్టుకుని, ఆయనకు ఘనమైన వీడ్కోలు పలకటానికి సిద్ధం అయ్యారు. ఈ రాష్ట్రంలో న్యాయం ఇంకా బ్రతికే ఉందని చాటి చెప్పిన మహేశ్వరి గారికి, ఘనమైన వీడ్కోలు పలకటానికి వచ్చాం అని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతి రైతుల గురించి ఆలోచించకుండా, గతంలో ప్రభుత్వం వారితో కుదుర్చుకున్న ఒప్పందం తుంగలోకి తొక్కి, జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, అమరావతి రైతులు నిరసన బాట పట్టారు. అయితే ఇదే సందర్భంలో న్యాయ పోరాటం కూడా చేసారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన మూడు రాజధానుల జీవో పై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసు పై పూర్తి స్థాయిలో వాదనలు వింటుంది. ఈ కేసు పై ఇప్పటికే నెల రోజులు పాటు హోరాహోరీగా వాదనలు కూడా జరిగాయి. త్వరలోనే ఈ కేసు పై హైకోర్టులో తీర్పు వచ్చే అవకాసం ఉందని అందరూ భావిస్తున్న తరుణంలో, హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వచ్చే కొత్త చీఫ్ జస్టిస్, అమరావతి కేసు పై ఏమి చేస్తున్నారు అనే సస్పెన్స్ నెలకొంది. అమరావతి కేసుని మొదటి నుంచి మళ్ళీ వాదనలు వింటారా ? లేక ఇప్పటికే జరిగిన విచారణ గమనించి, ఆ కేసుని కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. సహజంగా ఇలాంటి పెద్ద కేసులు విషయంలో, జడ్జి మారితే మళ్ళీ మొదటి నుంచి వదానలు వింటారనే అభిప్రాయం ఉంది. ఇవన్నీ ఇలా ఉంచితే, అమరావతి పై హైకోర్టు స్టే ఎత్తేయించటానికి, అనేక ప్రయత్నాలు కూడా జరుగుతన్నాయి.

sc 04012021 2

వివిధ పిటీషన్లు హైకోర్టులో, సుప్రీం కోర్టులో వేస్తున్నారు. ఇదే కోవలో జి.శ్రీనివాస్‍రెడ్డి అని రాయలసీమకు చెందిన వ్యక్తితో పాటుగా మరి కొందరు, మూడు రాజధానులు విషయంలో హైకోర్టు ఇచ్చిన స్టే ని ఎత్తివేయాలి అంటూ, సుప్రీం కోర్టులో పిటీషన్ వేసారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమ వాదనలు వినలేదని, పిటీషన్ లో తెలిపారు. ఈ కేసు పై ఈ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు, పిటీషన్ వేసిన వారికి షాక్ ఇచ్చింది. హైకోర్టు స్టే ఎత్తివేయటం కుదరదని సుప్రీం కోర్టు చెప్పింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తులుగా మీరు పిటీషన్ ఎలా వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఎదింగా సంఘంగా పిటీషన్ వేస్తే, దాని గురించి ఆలోచించాలని, చెప్తూ, హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయటానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు హైకోర్టు మీదే ఉన్నాయి. ఇప్పటికే రాజధాని విషయంలో, వాదనలు దాదాపుగా విన్న హైకోర్టు, త్వరలోనే తీర్పు ఇస్తుంది అనుకున్న తరుణంలో, చీఫ్ జస్టిస్ బదిలీతో, నెక్స్ట్ ఏమి జరుగుతుంది అనే సస్పెన్స్ నెలకొంది.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన కార్యక్రమం ఇళ్ల పట్టాల పంపిణీ. తన ప్రభుత్వం పై అన్ని వైపుల నుంచి వస్తున్న వ్యతిరేకత, ప్రజల్లో వస్తున్న అసహనం అణిచివేయటానికి జగన్ ఈ కార్యక్రమాన్ని ఎంతో నమ్ముకున్నారు. అమ్మఒడి కూడా లబ్దిదారులను తగ్గించేస్తున్నారని, అందుకే ఇళ్ల పట్టాల పంపిణీనే తన ప్రభుత్వానికి లైఫ్ లైన్ గా జగన్ భావించారు. అందుకే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకుని వెళ్ళటానికి, 15 రోజులు పాటు కార్యక్రమం పెట్టారు. ప్రతి రోజు హడావిడి చేయాలని పిలుపు ఇచ్చారు. అంతే కాదు, ఎప్పుడూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాని జగన్, ఏకంగా నాలుగు నుంచి అయుదు సార్లు, ఈ కార్యక్రమంలో తానే స్వయంగా పాల్గునేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే రామతీర్ధం ఘటనలో, విజయసాయి రెడ్డి చేసిన ఓవర్ ఆక్షన్ తో, మొత్తం పోయిందని, చర్చ మొత్తం అటు వెళ్ళిపోయిందని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు పర్యటనను అసలు పట్టించుకోకుండా వదిలేసి ఉంటే, ఆయన ఏదో పర్యటన చేసి వెళ్ళిపోయాడు వాడు, కేవలం తన అనుకూల మీడియా ఒక గంట చూపించేది, అంతటితో ఈ అంశం సమసిపోయేదాని, విజయసాయి రెడ్డి ఓవర్ ఆక్షన్ చేసి, మధ్యలో దూరటంతో, తమ అనుకూల చానల్స్ సహా అన్ని చానల్స్ మూడు రోజులుగా అదే చుపించాయని, చివరకు చంద్రబాబుదే పై చేయి అయ్యిందని వైసీపీ అధిష్టానం భావిస్తుంది.

vellampalli 03012021 2

అసలు విజయసాయి రెడ్డికి ఏమి సంబంధం అని కొంత మంది సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రులను పంపించి ఉంటే సరిపోయేదని, విజయసాయి రెడ్డి ఏదో చేయబోయి, మొత్తం చర్చ చంద్రబాబు మీదకు వెళ్ళేలా చేసారని అంటున్నారు. చంద్రబాబు వస్తుంటే, విజయసాయికి ఉలికి పాటు ఎందుకు అనే భావన ప్రజల్లోకి వెళ్లిందని, వైసీపీ వద్ద సమాచారం ఉంది. ఇక విజయసాయి రెడ్డి చేసిన డ్యామేజ్ అటు ఉంచితే, వెల్లంపల్లి, రఘురామ రాజు పై చేసిన వ్యాఖ్యలకు, రాజులు మొత్తం ఈ రోజు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు. క్షత్రియ సంఘాలు అన్నీ ఆక్టివ్ అయ్యాయి. విజయనగరంలో ఒక్క సీటు కూడా లేని టిడిపికి, ఈ దెబ్బతో మంచి ఊపు వచ్చందని, రాజులు మొత్తం మనకు ఓటు వేసారు, ఆ ఓటు బ్యాంకు మొత్తం టిడిపి వైపు వెళ్ళేలా వెల్లంపల్లి వ్యాఖ్యలు చేసారని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. అందుకే రాబోయే వారం రోజుల్లో ఇళ్ళ పట్టాల మీదే ఫోకస్ ఉండాలని నాయకులకు సంకేతాలు ఇచ్చింది. ఈ రోజు సజ్జల కంకిపాడులో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గున్నారు. అలాగే రాబోయే వారం రోజుల్లో, సీనియర్ నేతలు అందరూ బయటకు వచ్చి, ఇళ్ల పట్టాల మీదే ఫోకస్ చేయాలని, ప్రతిపక్షానికి రియాక్ట్ అవ్వద్దని చెప్పినట్టు తెలుస్తుంది.

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో పేకాట పాపాలు బయట పడ్డాయి. ఓపెన్ సీక్రెట్ గా , గత కొన్ని నెలలుగా ఇక్కడ కోట్ల రూపాయల పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఒక ప్రముఖ అధికార పార్టీ నేత, ఈ దందా నడిపిస్తున్నాడని, అందరికీ తెలిసిందే. అనేక సార్లు ప్రతిపక్షాలు కూడా ఈ విషయం ఎత్తి చూపాయి. అయితే అప్పట్లో ప్రతిపక్షాలు మాట్లాడితే ఎదురు దారి చేసేవారు. అయితే ఇప్పుడు ఎందుకో కానీ, పోలీసులు ఒకేసారి మెరుపు దా-డు-లు చేసారు. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, లోకల్ పోలీసులకు సమాచారం లేకుండా, ఎస్ఈబీ పోలీసులు ఈ దాడులు చేయటం గమనార్హం. కృష్ణా జిల్లా, గుడివాడ నియోజికవర్గం, నందివాడ మండలం, తమిరశలో నిన్న రాతి ఒక అతి పెద్ద పేకాట శిబిరం పై మెరుపు దాడి చేసారు. అయితే ఈ దాడులకు లోకల్ పోలీసులు కాకుండా, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, మెరుపు దా-డి చేయటం గమనార్హం. ప్రత్యెక అధికారి జిందాల్ ఈ రైడ్ లో స్వయంగా పాల్గున్నారు. దాదాపుగా 40 మంది స్టాఫ్ తో వచ్చారు. నందివాడ మండలంలో చంద్రయ్య కాలువ గట్టు, చేపల చేరువులు మాటున ఆడుతున్నట్టు పక్కా సమాచారంతో, చుట్టు ముట్టారు. అయితే అక్కడ సీన్ చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు.

police 04012021 2

పెద్ద ఎత్తున ప్రముఖులు అక్కడ ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 42 లక్షల క్యాష్ పట్టుకున్నారు. 30 పైగా కార్లు పట్టుకున్నారు. అయితే ఒక మంత్రి అనుచురులు ఈ శిబిరం నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇక్కడ పోలీసులు షాక్ అయిన మరో విశేషం ఏమిటి అంటే, పెద్ద ఎత్తున కాయిన్స్/టోకెన్స్ దొరికాయి. 42 లక్షలే ఎక్కువ అనుకుంటే, ఆ టోకెన్స్ చూసి షాక్ అయ్యారు. గుడివాడలోనే డబ్బులు తీసుకుని, డబ్బుల బదులు, టోకెన్స్ ఇచ్చి, నిర్వాహకులు ఇక్కడకు తీసుకుని వస్తున్నారని తెలుసుకున్నారు. ఆ టోకెన్స్ ఖరీధు చెప్పటం లేదు కానీ, మొత్తంగా ఒక 10 కోట్ల పైనే ఉంటుందని అనధికార సమాచారం. ఈ మొత్తం పెకటా శిబిరం ఇంత పక్కాగా, నిర్వహించటం చూసి, పోలీసులే షాక్ అయ్యారు. అందుకే పై నుంచి ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ముందుగా మీడియాకు లీక్ చేసారు. దీంతో ఈ విషయం రచ్చ రచ్చ అయ్యింది. అయితే ఇందులో ప్రముఖులను, ప్రముఖ నాయకుడి పాత్రను తప్పించే పని అయితే జరుగుతుందని, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాత్రి పిచ్చ పాటీగా మీడియాతో చెప్పటమే కానీ, ఇప్పటి వరకు పోలీసులు కూడా పక్కా సమాచారం చెప్పలేదు. చూద్దాం, ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.

Advertisements

Latest Articles

Most Read