ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల ముందు, బీజేపీని ఉత్తరాది పార్టీ అని చెప్పిన జనసేన పార్టీ, ఎన్నికలు అయిన తరువాత, మారిన రాజకీయ పరిస్థితిలో బీజేపీతో కలిసింది. బీజేపీ, జనసేన కలిసి రాజకీయ శక్తిగా ఏర్పడ్డారు. అయితే ఇక్కడ వరకే కానీ, ఎదో ఒకటి రెండు సందర్భాలు తప్పితే, ఎవరి పర్యటనలు వాళ్ళు, ఎవరి నిరసనలు వాళ్ళు తెలుపుతున్నారు. మిత్రపక్షాలు రెండు కలిసి చేసిన కార్యక్రమాలు చాలా తక్కువ అనే చెప్పాలి. జనసేన తమ కార్యక్రమాలు తాము చేసుకుని పోతుంటే, బీజేపీ తనదైన శైలిలో వెళ్తుంది. ముఖ్యంగా సోము వీర్రాజు అధ్యక్ష్యుడు అయిన తరువాత, ఆయన వైఖరి జగన్ కు అనుకూలంగా బయటకు కనిపించటంతోనే, పవన్ కొంచెం దూరంగా ఉన్నారనే వైఖరి కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే, ఎన్నికల విషయంలో కూడా జనసేనను బీజేపీ పట్టించుకోవటం లేదనేది అర్ధం అవుతుంది. హైదరాబాద్ జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఇదే వైఖరితో, పవన్ కళ్యాణ్ కు విసుగు పుట్టి, తమ అభ్యర్ధుల జాబితా కూడా ఇచ్చేసారు. అయితే తరువాత రంగంలోకి దిగిన బీజేపీ పెద్దలు, జనసేనను పోటీ నుంచి తప్పించేలా చేసారు. ప్రతి సందర్భంలో జనసేనను దూరంగానే పెట్టారు తెలంగాణా బీజేపీ నేతలు. అయితే ఈ సంఘటనలు తరువాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి, బీజేపీ అధ్యక్షుడు నడ్డాని కలిసి, తిరుపతి ఎంపీ సీటు జనసేనకు ఇవ్వాలని కోరారు.

jansena 21122020 2

దీని పై కమిటీ వేద్దాం అని నడ్డా చెప్పటంతో, పవన్ వచ్చేసారు. అయితే కమిటీ ఏమి చెప్పకుండానే, సోము వీర్రాజు బీజేపీ అభ్యర్దే తిరుపతి ఎంపీ సీటు పోటీ చేస్తున్నారని చెప్పేసారు. దీంతో జనసేన కౌంటర్ స్ట్రాటజీ ప్రారంభించింది. జనసేన పార్టీ తమ పార్టీ తరుపున ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. బీజేపీకి గతంలో నోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయని, జనసేన బలంగా ఉందని తేల్చారు. గతంలో ఇక్కడ చిరంజీవి గెలిచిన విషయాన్ని గుర్తు చేసారు. అలాగే కేంద్రం పై తిరుపతి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఇక్కడే ప్రత్యెక హోదా ప్రకటించి ఇవ్వలేదని, అలాగే ఒక్క అంతర్జాతీయ విమానం కూడా ఇక్కడకు తీసుకు రాలేదని, ఐఐటీకి ఇప్పటికీ సొంత భవనాలు లేవని, అందుకే కేంద్రం పై తిరుపతి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తేల్చారు. ఇక తిరుపతి స్థానిక జనసేన నేతలు కూడా మీడియా ముందుకు వచ్చి, బీజేపీని కౌంటర్ చేస్తున్నారు. జనసేన నేత కిరణ్‌ మాట్లాడుతూ, సోము వీర్రాజు ఏకపక్షంగా మాట్లాడారని, అభ్యర్ధి ఎవరు అనేది, జేపీ నడ్డా, పవన్‌ చర్చించి ప్రకటిస్తారని చెప్పారు. ఆ అభ్యర్ధి ఎవరో వీర్రాజు కూడా తెలియదని అన్నారు. దీంతో ఇప్పుడు బీజేపీ, జనసేన మధ్య సయోధ్య కుదురుతుందా, ఎవరు తగ్గుతారు అనేది చూడాలి.

దేశంలోని ఎంపీల పని తీరు ఆధారంగా, ప్రముఖ మీడియా పార్లమెంట్ ర్యాంకులు కేటాయించింది. అయితే ఈ ర్యాంకులు చూసుకుంటే, 22 ఎంపీలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, లోక్ సభ పెర్ఫార్మన్స్ లో టాప్ 100లో కేవలం ఒక్కరే నిలిచారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు. తాజాగా విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్ లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అందరికంటే నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఓవరాల్ గా రఘురామకృష్ణం రాజు పెర్ఫార్మన్స్ కి ఆయనకు 40వ స్థానం లభించింది. అలాగే లోక్ సభ పెర్ఫార్మన్స్ లో 53వ ర్యాంకు రాగా, నియోజవర్గం పెర్ఫార్మన్స్ లో ఆయనకు 72వ ర్యాంకు వచ్చింది. ఇక లోక్ సభ పెర్ఫార్మన్స్ లో తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రెండో వ్యక్తిగా, మొత్తంగా లోక్ సభ పెర్ఫార్మన్స్ లో 57వ ర్యాంకు తెచ్చుకున్నారు. అలాగే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, మన రాష్ట్రం నుంచి, మూడో వ్యక్తిగా లోక్ సభ పెర్ఫార్మన్స్ లో నిలిచారు. మొత్తంగా లోక్ సభ పెర్ఫార్మన్స్ లో 98వ ర్యాంకు తెచ్చుకున్నారు. టాప్ 100 లోక్ సభ పెర్ఫార్మన్స్ లో, వైసీపీ రెబెల్ ఎంపీ తప్పితే ఎవరూ లేరు. ఇక తెలుగుదేశం పార్టీలో మాత్రం, ఉన్న ముగ్గురిలో ఒకరికి 57వ ర్యాంకు, మరొకరికి 98వ ర్యాంకు వచ్చింది.

mp 20122020 2

మరో ఎంపీ అయిన కేశినేని నానికి, లోక్ సభ పెర్ఫార్మన్స్ లో 198వ ర్యాంకు వచ్చింది. ఇక వైసీపీ గురించి చూస్తే, లోక్ సభ పెర్ఫార్మన్స్ లో టాప్ 100లో రఘురామకృష్ణం రాజుని తీసేస్తే ఎవరూ లేరు. 147వ ర్యాంకుతో వంగా గీతా ఉన్నారు. ఆ తరువాత 166 వ ర్యాంకుతో లావు కృష్ణదేవరాయులు ఉన్నారు. ఆ తరువాత 181 స్థానంలో బాలసౌరి ఉన్నారు. 188 వ ర్యాంకులో తలారి రంగయ్య, 192వ ర్యాంకులో కోటగిరి శ్రీధర్ ఉన్నారు. ఇక అతి దారుణమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిన వారిలో, నందిగం సురేష్, 427వ స్థానంలో ఉన్నారు. ఆ తరువాత అతి దారుణమైన ర్యాంకు, 413తో చింతా అనురాధ, ఆ ఆతరువాత 400వ ర్యాంకుతో వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. మొత్తంగా చెప్పాలి అంటే, లోక్ సభ పెర్ఫార్మన్స్ లో వైసీపీ అతి దారుణంగా పెర్ఫాం చేసింది. తమ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు లేకపోతే, అసలు టాప్ 100లో చోటు కూడా దక్కేది కాదు. అలా మిగతా 21 మంది పరువు, రఘురామకృష్ణం రాజు కాపాడారు అనే చెప్పాలి. ఇక తెలుగుదేశం నుంచి ముగ్గురిలో, ఇద్దరు టాప్ 100లో ఉన్నారు. ఇలా ఉంది మన ఎంపీల పని తీరు. అనేక విభజన హామీలు పెండింగ్ లో ఉన్నాయి, ప్రత్యేక హోదా, పోలవరం, అమరావతి లాంటి విషయాలు పెండింగ్ లో ఉన్నాయి. అయినా మన ఎంపీలు, ఇలా పని చేస్తున్నారు.

రాజకీయ నాయకులు ఒక మాట మీద ఉండరు అనేది అందరికీ తెలిసిందే. అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి మాటలు మారుస్తూ ఉంటారు. అయితే మన రాష్ట్రంలో మాత్రం మరీ పది రోజులు కూడా ఒక మాట మీద ఉండటం లేదు అధికార పార్టీ నేతలు. మళ్ళీ మాట తప్పం, మడమ తిప్పం అంటూ,బ్రాండింగ్ చేసుకుంటూ ఉంటారు. విషయానికి వస్తే కేంద్రం తెచ్చిన రైతు చట్టాల విషయంలో దేశ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉందో అందరికీ తెలిసిందే. ఏకంగా ప్రధాని మోడీ, అమిత్ షా డైరెక్ట్ గా రంగంలోకి దిగి, పరిస్థితి చక్క దిద్దే పరిస్థితి వచ్చింది. సహజంగా మోడీ, షా అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరి మాట వినరు. ఎవరు వద్దు అని చెప్పినా, వారు చెయ్యాలి అనుకున్నదే చేస్తారు. అయితే మొదటి సారి వాళ్ళు కూడా ఒక మెట్టు దిగి రావాల్సి వచ్చింది. అంతటి సీరియస్ సబ్జెక్ట్ ఇది. రైతులు గట్టిగా నిరసనలు తెలిపితే, బీజేపీ ప్రభుత్వం షేక్ అవ్వటానికి కూడా ఎక్కువ సమయం పట్టదు అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు అంటే, అర్ధం చేసుకోవచ్చు. ఈ వ్యతిరేకత అర్ధం అయ్యే మొన్న రైతులు ఇచ్చిన భారత్ బంద్ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పార్టీ కూడా మాట మార్చి, రైతుల బంద్ కు మద్దతు తెలిపింది. పార్లమెంట్ లో బిల్లుకు వైసిపీ బేషరతుగా మద్దతు ప్రకటించింది. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అయితే, బీజేపీని ప్రసన్నం చేసుకోవటానికి, ఏకంగా కాంగ్రెస్ పార్టీని దళారీ అంటూ టార్గెట్ చేసారు.

amitshah 20122020 2

అంతలా భజన చేసి, చివరకు రైతులు భారత్ బంద్ కు మద్దతు ఇచ్చారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అమిత్ షా, జగన్ ను ఢిల్లీ రమ్మన్నారు అని వార్తలు వచ్చయి. వ్యవసాయ చట్టాల విషయంలో ప్రజలకు అవగాహన కలిగిచటంలో మద్దతు కావాలని కోరినట్టు వార్తలు వచ్చాయి. అంతే జగన్ ఢిల్లీ నుంచి వచ్చారో లేదో, బీజేపీ కంటే ఎక్కువగా వ్యవసాయ బిల్లులకు మద్దతుగా వైసీపీ ప్రచారం మొదలు పెట్టింది. రైతులు బంద్ కు మద్దతు ఇచ్చి, పట్టుమని పది రోజులు కూడా అవ్వకుండానే, ఇప్పుడు మళ్ళీ మాట మార్చేసారు. గుంటూరు జిల్లా రొంపిచర్లలో వైసీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు మాట్లాడుతూ, కేంద్రం తీసుకుని వచ్చిన వ్యవసాయ చట్టాల విషయంలో అపోహలు వద్దని, ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని, కొత్త వ్యవసాయ చట్టాలతో ఎంతో మేలని, ఇప్పుడున్న మార్కెట్ యార్డులకు వచ్చే ఇబ్బందులు ఏమి లేవని, అపోహలు మానుకోవాలి అంటూ, వ్యవసాయ చట్టాల పై రైతులకు అవగహన కల్పించారు. ఇలా రోజుకి ఒక విధంగా వైసీపీ మాట్లాడటంతో, అసలు వీళ్ళ స్టాండ్ ఏమిటో అర్ధం కావటం లేదు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు జగన్ పై విరుచుకు పడ్డారు, ఆయన మాటల్లోనే, "జనాన్ని తాకట్టు పెట్టి రుణాలు తెచ్చేందుకు జగన్ రెడ్డి సిద్ధమయ్యారు. మున్సిపల్ పన్నులు పెంచి సామాన్యుల నడ్డి విరిచేందుకు పూనుకున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టేందుకు మీరు ఒప్పుకోబట్టే కేంద్రం రుణాలకు అనుమతి ఇచ్చింది. రేషన్ సరుకుల ధరల పెంచి పేదల నోటి దగ్గర కూడు లాగేశారు. రూ.2,525 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు ప్రజల మెడలకు ఉరితాళ్లు బిగిస్తారా? మీటర్లు అమర్చి రైతులు గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అసలే తీవ్ర నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని మీటర్ల బిగింపుతో కోలుకోలేని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాగ్ రిపోర్టు ప్రకారం ఆరు నెలల్లో చేయాల్సిన అప్పుకుంటే 14 శాతం అధికంగా జగన్ రెడ్డి అప్పులు చేశారు. దేశంలో ఏ రాష్ట్రమూ చేయనంత అప్పులు చేశారు. గత ఏడాది 39 శాతం మద్యంపై ఆదాయం వస్తే ఈ ఏడాది 59 శాతం ఆదాయం వచ్చింది. ఇంత ఆదాయం వచ్చినా అప్పులెందుకు పెరిగాయి? పెట్రోల్, లిక్కర్, డీజల్ పెంచడం వల్ల రూ.20 వేల కోట్లు అదనపు ఆదాయం వచ్చింది. కేంద్రం ఇచ్చే డబ్బులు, అప్పులు మీద, ప్రజలపై వేసే పన్ను భారాల మీద ఆధారపడి జగన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. 18 నెలలైనా ఇంకా ఆదాయాన్ని పెంచలేక ప్రజలపై పన్నులు వేసి ఆదాయాన్ని పిండుతున్నారు. ఆదాయం పెంచడానకి మీకు ప్రజలు తప్ప మరో ప్రత్యామ్నాయం కనబడకపోవడం దురదృష్టకరం. రుణాల మీద ఉన్న మోజు ఆదాయన్ని పెంచడంపై ఎందుకు లేదు?"

"మీరు చేసే అప్పులు రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో గుదిబండగా మారనున్నాయి. పాలన చేతకాక ఇంట్లో కూర్చుని రుణాలు మరిగి పన్నుల రూపంలో ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. జగన్ మాఫీయా రాష్ట్రాన్ని కొండశిలువల్లా చుట్టేసి ప్రజలను లూటీ చేస్తున్నారు. ఒక పక్కన అడ్డగోలుగా పన్నులు పెంచుతూ ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతీస్తున్నారు. ఇంకో పక్క ఆర్ధిక వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తూ ఆర్థిక వ్యవస్థ పతనానికి మూలకారకుడు జగన్ వ్యవహరిస్తున్నారు. ప్రజల చెమటోడ్జి సంపాదించుకున్న డబ్బును శిస్తుల రూపంలో గుంజుకోవడం పద్దతి కాదు. ప్రజల కడుపుమాడ్చి వైసీపీ నేతల జేబులను జగన్ నింపుతున్నారు. మీ స్థానంలో సామాన్యులను కూర్చోబెట్టినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దిగజారి ఉండేది కాదు. దశ, దిశ లేక రాష్ట్రాన్ని దివాళా తీయించారు. 18 నెలల్లో లక్షా 40 వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రాష్ట్రంలో ఎక్కడా ఒక్క తట్ట మట్టి తీయలేదు. ఒక్క బొచ్చెడు కాంక్రీట్ వేయలేదు. సృష్టించిన ఆస్తి ఒక్కటీ లేదు. ఒక్క ప్రాజెక్టు నిర్మాణంకానీ, ఒక రోడ్డు నిర్మాణం కానీ చేసింది లేదు. లక్ష40 వేలకోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లింది.?ప్రజల రోజు వారి ఆదాయం దారుణంగా పడిపోయి ప్రజల జీవనం దుర్భరంగా మారింది" అని అచ్చెన్నాయుడు
అన్నారు.

Advertisements

Latest Articles

Most Read