ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు మలుపులు మీద మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం కుదరదని, కోర్టుకు ఎక్కాయి. అయితే మొన్నటి దాకా క-రో-నా అధికంగా ఉంది అంటూ, అందుకే ఎన్నికలు పెట్టలేం అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ రోజు మరో కొత్త కారణంతో, కోర్టు ముందుకు వచ్చి, వాదన వినిపించింది. దీని పై ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, ఫిబ్రవరిలో జరిగే స్థానిక ఎన్నికల పై విచారణ జరిగింది. ఈ పిటీషన్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వారల కిందట దాఖలు చేసింది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు ఆపేయాలని, ఎన్నికల నిర్వహణ పై స్టే ఇవ్వలేని కోరింది. అయితే తాము ఎన్నికల తేదీల పై జోక్యం చేసుకోలేమని కోర్టు తెలిపింది. ఈ కేసు ఈ రోజు మళ్ళీ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కేసు విచారణలో అనేక అంశాలను రాష్ట్ర ప్రభుత్వం, అడిషనల్ అఫిడవిట్ రూపంలో దాఖలు చేసింది. ఈ అడిషనల్ అఫిడవిట్ లో ఈ సారి తెర మీదకు కొత్త విషయం తీసుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కో-వి-డ్ వాక్సిన్ మార్గదర్గశక సూత్రాలను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఇందులో మూడు అంశాలను ప్రధానంగా ప్రభుత్వం ప్రస్తావించింది. మొదటిది, వాక్సిన్ వేయటానికి, పోలీస్ తో పాటు, అన్ని డిపార్టుమెంటు సిబ్బంది పాల్గునాల్సి ఉందని, వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో వాక్సిన్ వేయబోతున్నాం అని తెలిపింది.

hc 1512020 2

దీనికి సంబంధించి, కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చిందని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అడిషనల్ అఫిడవిట్ లో పేర్కొంది. పైగా జనవరి, ఫిబ్రవరిలో జరగనున్న వాక్సినేషన్ కు, పోలీస్ సిబ్బందితో పాటు, అన్ని డిపార్టుమెంటు ల సహాయం కావాలని, తెలిపింది. మొదటి డోస్ వేసిన తరువాత, నాలుగు వారాలకు రెండో డోస్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అందు వల్ల ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు సాధ్యం కాదని, ముఖ్యంగా ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని, ఎన్నికల కంటే, ఈ వాక్సినేషన్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని, ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా చేయాలో, అదే విధంగా వాక్సిన్ ప్రక్రియ కూడా చేయాలని కోర్టుకు తెలిపింది. అయితే దీనికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అడిషనల్ అఫిడవిట్ రాత్రి అందింది అని, పరిశీలించి కౌంటర్ వేయటానికి సమయం కావాలని ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేయగా, ఈ కేసుని వచ్చే శుక్రవారానికి హైకోర్టు వాయిదా వేసింది. మరి దీని పై ఈసి ఏమి చెప్తుందో, కోర్టు ఏమి అంటుందో చూడాలి.

జగన్ మోహన్ రెడ్డి, ఆకస్మికంగా ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. నిన్న సాయంత్రం జగన్ ఢిల్లీ వెళ్తున్నట్టు మీడియాకు చెప్పారు. ఈ రోజు మూడు గంటల ప్రాంతంలో జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఈ రోజు రాత్రికి కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షాని జగన్ కలవనున్నారు. రేపు ఉదయమే మళ్ళీ తిరిగి అమరావతి వచ్చేస్తారు. జగన్ మోహన్ రెడ్డి ప్రధానిని కానీ, మరే ఇతర కేంద్ర మంత్రిని కలిసేది లేదని సమాచారం. అయితే అసలు ఈ పర్యటన ఎందుకో ? అమిత్ షాని ఎందుకు కలుస్తున్నారో మీడియాకు మాత్రం చెప్పలేదు. వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జగన్, అమిత్ షా ని కలుస్తున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇక జగన్ మీడియా యధావిధంగా ప్రత్యెక హోదా, పోలవరం, ఇది అదీ అంటూ ఊదరగొడుతుంది. జగన్ మోహన్ రెడ్డి, ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా, ఆయన ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారో, ఏమి కోరుతున్నారో, బయటకు చెప్పరు. జగన్ సొంత మీడియా మాత్రం, ఏపి ప్రయోజనాల కోసం, కేంద్రం మెడలు వంచేసారు అనే విధంగా చెప్తే, మరో మీడియా కేంద్రం జగన్ చేస్తున్న పనులకు అక్షింతలు వేసారని చెప్తారు కానీ, అసలు ఏమి జరిగిందో తెలియదు. జగన్ పోయినసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఇదే జరిగింది. చివరకు ప్రధానిని కలసినా ఎందుకు కలిసారో మీడియాకు చెప్పలేదు.

jagan delhi 15122020 2

ఆ తరువాత వారం రోజులుకు, సుప్రీం కోర్టు కాబోయే చీఫ్ జస్టిస్ తో పాటుగా, మరో ఏడుగురు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిల పై ఫిర్యాదు ఇచ్చినట్టు, ప్రభుత్వం పెట్టిన మీడియా సమావేశం ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు జగన్ ఇంత సడన్ గా ఎందుకు ఢిల్లీ వెళ్లారు అనే దాని పై చర్చ జరుగుతుంది. బీజేపీ వర్గాలు మాత్రం, కేంద్రం పిలుపించుకుందని చెప్తున్నారు. రైతు బిల్లుల విషయంలో, బీజేపీ దేశ వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది, దానికి ఏపిలో సహకారం కావాలని కోరనున్నట్టు తెలుస్తుంది. ఇక మరో వాదన మాత్రం, జగన్ ఈ సారి కూడా కోర్టుల విషయంలోనే ఢిల్లీ వెళ్ళారని, హైకోర్టు చీఫ్ జస్టిస్ మార్పు వార్తలు వస్తున్న తరుణంలో, జగన్ ఢిల్లీ పర్యటన అందుకే అని అంటున్నారు. ఇక మరో వాదనగా, మూడు రోజులు క్రితం కేసీఆర్ చేసిన ఢిల్లీ పర్యటనకు, వెంటనే జగన్ ఢిల్లీ వెళ్తున్న దానికి సంబంధం ఉందని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇంత జరుగుతున్నా, ప్రభుత్వం వైపు నుంచి మాత్రం, ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారో చెప్పే వాళ్ళే లేరు. చూద్దాం ఈ సారైనా, అధికారిక ప్రకటన ఇస్తారేమో.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. వివాదాస్పదం కూడా కాదు, ఈ నిర్ణయం పై, అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సహజంగా ప్రభుత్వాలు అన్ని వర్గాలని, అన్ని ప్రాంతాలని, అన్ని మతాలను సమానంగా చూస్తూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వాలు అయినా, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అయినా, ఇంతే. తాము ఒక మతానికి దగ్గరగా, ఒక మతానికి దూరంగా చేసే పనులు చేయరు. మతాలకు సంబంధించి, ఎలాంటి నిర్ణయాలు అయినా ఆయా మత గురువులు, ట్రస్ట్ లు చేస్తూ ఉంటాయి. అవి ప్రభుత్వం పాటిస్తూ ఉంటుంది తప్ప, ప్రభుత్వం నేరుగా కలుగు చేసుకోరు. ఉదాహరణకు తిరుమల ఉంది. ప్రభుత్వం నేరుగా తిరుమల వ్యవహారాల్లో కలుగ చేసుకోదు. తిరుమల తీరుపతి బోర్డు, కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే రాజకీయ ప్రమేయం ఉన్న వాళ్ళను నియమిస్తారు అనుకోండి అది వేరే విషయం. ఎక్కడ ప్రభుత్వం నేరుగా వేలు పెట్టదు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఒక చర్చి నిర్మాణం కోసం టెండర్లు పిలుస్తున్నారు అని, ఇప్పటికే టెండర్ పిలిచారు అంటూ, వైసీపీ ఎంపీ రఘురాంకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం ఇలా చేయలేదని గుర్తు చేసారు.

secretariat 14122020 1

గుంటూరు జిల్లాలోని, రొంపిచర్ల మండల కేంద్రంలో, ఒక కొత్త చర్చి నిర్మాణం కోసం అని, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటు టెండర్ పిలిచిందని అన్నారు. ఈ చర్చి నిర్మాణం కోసం ప్రభుత్వం, 8లక్షల 72వేల 663 రూపాయలు కేటాయించింది. అంతే కాకుండా, ఈ నిర్మాణం ఆరు నెలల్లో పూర్తి చేయాలని కోరారు. అయితే ఇక్కడ చర్చి నిర్మాణం విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు కానీ, ప్రభుత్వం ఈ పని చేయటం పై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు స్వయంగా ఏ దేవాలయం కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ నిర్మాణం చేయదు. దేవాలయాలు అయితే తిరుమల లాంటి బోర్డులు, దాతలు నిర్మిస్తారు. చర్చిలు, మసీదులు కూడా వివిధ దాతలు ఇచ్చిన నిధులతో నిర్మిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం ఒక మతం వైపు మొగ్గు చూపుతుందని, విమర్శలు వస్తున్న వేళ, ఈ చర్యను ప్రభుత్వం ఎలా సమర్దిస్తుందో చూడాలి. గతంలో ప్రభుత్వం మూడు చర్చిల నిర్మాణం కోసం, జీవోలు విడుదల చేసింది. అయితే ఇప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మాత్రం, టెండర్ పిలిచారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు వాడీ వేడిగా వాదనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసిన వివిధ హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, అరెస్ట్ చూపించలేదు అంటూ, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేసులు నమోదు అయ్యాయి. గతంలో ఈ కేసులు విచారణ సమయంలో, హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూల్ అఫ్ లా లేదు అంటూ, ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పరిణామాలు జరుగుతుంటే, రాజ్యాంగ ప్రకారం ఏమి చేయాలో చెప్పాలి అంటూ, న్యాయవాదులని కూడా అడిగిన సందర్భం ఉంది. ఇక ఈ కేసులోనే రాష్ట్ర డీజీపీని కూడా హైకోర్టుకు పిలిచారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, జగన మోహన్ రెడ్డి పాలనలో హైకోర్టులో నమోదు అయిన అన్ని కేసులు కంటే, ఈ కేసు చాలా తీవ్రమైనది. ఈ కేసు విచారణ చేస్తున్న జస్టిస్ త్వరలోనే రిటైర్ కూడా అవుతున్నారు. ఆ లోపు ఈ కేసు పూర్తి చేయలేకపోతే, నేను జీవితాంతం ఫీల్ అవ్వాలి అంటూ, ఆయన వ్యాఖ్యలు కూడా చేసారు. ఈ కేసు ఇప్పుడు విచరణకు వచ్చింది. ఈ రోజు ఈ కేసు హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ జరిగింది. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపు న్య్యావడి స్పందిస్తూ హైకోర్టుకి తమ అభిప్రాయం చెప్పారు.

herbious 14120200 2

తాము ఈ కేసులు పై సుప్రీం కోర్టుకు వెళ్తామని, తమకు రెండు వారాల గడవు కావాలని హైకోర్టుని కోరారు. అయితే దీని పై స్పందించిన హైకోర్టు, మీరు సుప్రీం కోర్టుకు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళవచ్చని చెప్తూనే, మేము మాత్రం రెండు వారల సమయం ఇవ్వం అని, దీని పై విచారణ కొనసాగుతుంది అంటూ, ఈ కేసుని బుధవారానికి వాయిదా వేసారు. దీంతో ప్రభుత్వం, ఈ కేసుపై హైకోర్టు తీర్పు తప్పించుకుని, సుప్రీం కోర్టులో తేల్చుకోవాలనే ఎత్తుగడ కుదరలేదు. ఈ సమయంలో సుప్రీం కోర్టుకు వెళ్ళినా, ముందు హైకోర్టులో తేల్చుకుని రమ్మని, సుప్రీం కోర్టు చెప్పే అవకాసం ఉంటుంది. ఇక మరో కేసులో ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. జడ్జిల పై ఇష్టం వచ్చినట్టు వైసీపీ నాయకులు, సోషల్ మీడియాలో క్యాడర్ తిట్టిన కేసు, సిబిఐకి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని పై సిబిఐ, కోర్టుకు తెలుపుతూ, ఎఫ్ఐఆర్ నమోదు చేసామని, ఇక్కడ విచారణ జరిపామని, విదేశాల్లో ఉన్న వారిని విచారణ చేయాలి కాబట్టి, నాలుగు వారల సమయం హైకోర్టుని కోరటంతో, హైకోర్టు ఒప్పుకుని, కేసుని వాయిదా వేసింది.

Advertisements

Latest Articles

Most Read